
డ్రాగన్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన తాజా చిత్రం డ్యూడ్(Dude Collections). కోలీవుడ్ హీరో నటించిన ఈ సినిమాకు తెలుగులోనూ రిలీజైంది. లవ్ టుడే, డ్రాగన్ చిత్రాలకు తెలుగు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కీర్తీశ్వరన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు. ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 17న థియేటర్లలో విడుదలైంది.
అయితే తొలి రోజు నుంచే ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా అదరగొట్టింది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 22 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. గతంలో రిలీజైన డ్రాగన్ కంటే ఎక్కువగానే వసూళ్లు రాబట్టింది. రిలీజైన నాలుగు రోజుల్లోనే రూ.83 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. ఐదు రోజుల్లోనే సెంచరీకి చేరువలోకి వచ్చేసింది. వరల్డ్ వైడ్‌గా ఐదు రోజుల్లో రూ.95 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ పోస్టర్ ద్వారా వెల్లడించింది. కాగా.. ఈ చిత్రంలో ప్రేమలు బ్యూటీ మమిత బైజు హీరోయిన్‌గా కనిపించగా.. ఆర్. శరత్‌కుమార్ కీలక పాత్రలో నటించారు.
DUDE continues the festivities at the box office 💥💥✨#DUDE grosses over 95 CRORES in 5 days worldwide ❤🔥
Book your tickets now and celebrate #DudeDiwali 🔥
🎟️ https://t.co/JVDrRd4PZQ
🎟️ https://t.co/4rgutQNl2n
⭐ing 'The Sensational' @pradeeponelife
🎬 Written and… pic.twitter.com/Jo9f1ukrW8— Mythri Movie Makers (@MythriOfficial) October 22, 2025