
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం పెద్దగా సినిమాలేవీ చేయట్లేదు. ఈ ఏడాది ఓదెల-2 మూవీతో మెప్పించిన ముద్దుగుమ్మ.. కేవలం బాలీవుడ్కే పరిమితమైంది. అడపా.. దడపా సినిమాలు చేస్తూ ఐటమ్ సాంగ్స్‌తోనూ అలరిస్తోంది. టాలీవుడ్లో సూపర్ హిట్ సినిమాల్లో మెప్పించిన తమన్నా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రంలో నటించింది. ఈ మూవీలో అవంతిక పాత్రలో అభిమానులను ఆకట్టుకుంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన తమన్నా బాహుబలిలోని ఓ సీన్ గురించి స్పందించింది. ప్రభాస్.. తమన్నా మధ్య జరిగిన రొమాంటిక్ ఫైట్ సీన్పై వచ్చిన అభ్యంతరాలపై క్లారిటీ ఇచ్చింది. ఈ సీన్‌పై అప్పట్లో ఏకంగా ది రేప్ ఆఫ్ అవంతిక అనే టైటిల్స్లో కథనాలు రావడంపై మిల్కీ బ్యూటీ మాట్లాడింది. ఇది తనపై జరిగిన అత్యాచారం కాదని.. ఒక పురుషుడిగా తనలోని మహిళతత్వాన్ని కనుగొన్న సీన్ అని చెప్పుకొచ్చింది. కానీ కొందరు అదే దృష్టితో ఆలోచించే వారికి ఈ విషయం అర్థం కాదని తెలిపింది.
తమన్నా మాట్లాడుతూ.. "ఎవరైనా ఆ సీన్ చెడుగా భావించేవారు నా శరీరాన్ని అదే కోణంలోనే చూస్తారు. ఎందుకంటే అది వారి దృక్పథం. ఒక చిత్రనిర్మాత మిమ్మల్ని చాలా అందమైన వ్యక్తిగా చూపించాలనుకుంటాడు. కానీ మీరేమో అందులో మరో అర్థాన్ని వెతుక్కుంటారు. అది అలాంటి వారి ఆలోచన. నేను ఇలాంటి వాటిని పట్టించుకోను. ఎందుకంటే ఒక సృజనాత్మక కలిగిన వ్యక్తిగా ఆ సీన్ అవంతికపై జరిగిన అత్యాచారమని నేను అనుకోను. అవంతికతో ఒక పురుషుడు కనుగొన్న అందంగానే భావిస్తా. ఇందులో ఓ యువకుడు ఆమె ఎంత అందంగా ఉందో చూపించడానికి ప్రయత్నించాడు' అని తెలిపింది. ఇక సినిమాల విషయానికొస్తే తమన్నా ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రా నటిస్తోన్న వ్వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్‌లో కనిపించనుంది.