breaking news
Sridevi Vijaykumar
-
కాబోయే సతీమణితో వేడుకలో పాల్గొన్న నారా రోహిత్ (ఫోటోలు)
-
కామెడీ రాయడం కష్టం
నారా రోహిత్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘సుందరకాండ’. ఈ చిత్రంలో వృతి వాఘాని, శ్రీదేవి విజయ్ కుమార్ హీరోయిన్లుగా నటించారు. వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకత్వంలో సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేశ్ మహంకాళి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో వెంకటేశ్ నిమ్మలపూడి మాట్లాడుతూ– ‘‘దర్శకుడిగా నాకు ‘సుందరకాండ’ తొలి చిత్రం. పూర్తి వినోదాత్మక చిత్రం ఇది. ఈ రోజుల్లో ఓ అబ్బాయికి 30 ఏళ్ల వయసు దాటాక పెళ్లి కాకపోవడమే పెద్ద పంచాయితీ అనుకుంటే, ఆ అబ్బాయి నాకు ఫలానా ప్రత్యేక లక్షణాలు ఉన్న అమ్మాయే కావాలని పట్టుబడితే ఏంటి? అన్నదే ఈ సినిమా కథ. రెండు డిఫరెంట్ ఏజ్ గ్రూపు ఉన్న లవ్ స్టోరీ ఇది. హీరో పాత్రకు ఎక్కువ వయసు ఉన్న అమ్మాయి పాత్ర కోసం శ్రీదేవి విజయ్కుమార్గారిని, హీరో కంటే తక్కువ వయసున్న పాత్ర కోసం వృతి వాఘానిని తీసుకున్నాం. నాకు కామెడీ కథలంటే ఇష్టం. అయితే కామెడీ రాయడం కష్టం. ఈ సినిమాలో క్లీన్ కామెడీ ఉంటుంది. లక్కీగా ఈ సినిమాలో అందరూ కామెడీ బాగా చేయగలిగినవారే ఉన్నారు. బాగా చేశారు’’ అని అన్నారు. -
ప్రభాస్ ఫస్ట్ హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ (ఫోటోలు)
-
ప్రభాస్ ఈ రేంజ్‌కు వెళ్తాడని అస్సలు ఊహించలేదు: హీరోయిన్
టాలీవుడ్లో ప్రభాస్ తొలి సినిమా ఈశ్వర్లో మెప్పించిన కోలీవుడ్ ముద్దుగుమ్మ శ్రీదేవి విజయ్ కుమార్. అంతకుముందే తమిళంలో చాలా చిత్రాలు చేసిన శ్రీదేవి.. రుక్మిణి మూవీతో తెలుగులో అడుగుపెట్టింది. టాలీవుడ్‌లోనూ చాలా సినిమాల్లో తనదైన నటనతో మెప్పించింది. తెలుగులో చివరిసారిగా వీర చిత్రంలో కనిపించిన శ్రీదేవి.. చాలా ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తోంది. నారా రోహిత్ హీరోగా వస్తోన్న సుందరకాండ మూవీలో కనిపించనుంది.ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన శ్రీదేవి విజయ్ కుమార్ ప్రభాస్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ప్రభాస్ కెరీర్లోనే బెస్ట్ సినిమాల్లో ఒకటని.. తొలి సినిమాతోనే మాస్ హీరోగా మెప్పించారని అన్నారు. ఆ సినిమా సమయంలోనే ప్రభాస్ స్టార్ అవుతాడని మేము అనుకున్నామని తెలిపింది. కానీ ఈ రేంజ్‌కు వెళ్తాడని ఎవరు కూడా ఊహించలేదని శ్రీదేవి వెల్లడించింది. ప్రభాస్ చాలా మంచి వ్యక్తి అని.. ఒకరికి చెడు జరగాలని అస్సలు అనుకోరని అన్నారు. ఆయనది చిన్నపిల్లాడి మనస్తత్వమని శ్రీదేవి పేర్కొంది.కాగా. సుందరకాండ చిత్రాన్ని వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ కామెడీ ఎంటర్టైనర్లో శ్రీదేవి కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలో వృతి వాఘాని హీరోయిన్గా నటించారు. సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది.We all know that #Prabhas is definitely going to be a Big Star but yiii range ki veltharu ani evvaru expect cheyyaledhu 😎💥I think he deserves all this success.. - #SrideviVijayakumar about #PRABHAS pic.twitter.com/3MleMOPE6I— Prabhas RULES (@PrabhasRules) August 19, 2025 -
ఆ ఫోటోలు నాకు మంచి జ్ఞాపకాలు: శ్రీదేవి విజయ్‌కుమార్
‘‘సుందరకాండ’ మంచి వినోదాత్మక చిత్రం. కథ వినగానే షాక్ అయ్యాను. ఈ చిత్రంలో నేను చాలా మంచి బలమైనపాత్ర చేశాను. అందరూ థియేటర్స్‌కి వెళ్లిచూడొచ్చు’’ అని హీరోయిన్ శ్రీదేవి విజయ్‌కుమార్ తెలిపారు. నారా రోహిత్ హీరోగా వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘సుందరకాండ’. శ్రీదేవి విజయ్ కుమార్, వృతి వాఘాని హీరోయిన్లుగా నటించారు. సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీదేవి విజయ్‌కుమార్ విలేకరులతో మాట్లాడుతూ–‘‘కొంత గ్యాప్ తర్వాత మళ్లీ వెండితెరపై నన్ను నేను చూసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను హీరోయిన్ గా చేస్తున్న రోజుల్లోనే పెళ్లి చేసుకుని, ఓపాపకి జన్మనిచ్చాను. ఆ తర్వాత కొన్ని టీవీ ప్రోగ్రామ్స్ చేశాను. ఇప్పుడు నా కుమర్తె స్కూల్‌కు వెళుతోంది. సో.. నేను మళ్లీ సినిమాలతో బిజీ అవ్వాలనుకుంటున్నాను.ఈ సినిమాలో నేను స్కూల్ డ్రెస్‌లో కనిపించే సన్నివేశం ఉంది. ఈ సీన్ కోసం చాలా కష్టపడ్డాను. డైట్ ఫాలో అయ్యాను. నా కుమార్తె, నేను స్కూల్ డ్రెస్‌లో ఉన్న ఫోటోలు నా దగ్గర ఉన్నాయి.. ఇవి నాకు మంచి జ్ఞాపకాలుగా ఉండిపోతాయి. ప్రభాస్‌గారి తొలి సినిమా ‘ఈశ్వర్’లో నేను హీరోయిన్ గా చేశాను.. తను పెద్ద స్టార్ అవుతాడని మేం అప్పుడే ఊహించాం.. మేం ఊహించినదాని కన్నా పెద్ద స్టార్ అయ్యారు’’ అని చెప్పారు. -
దేవకన్యలా మెరిసిపోతున్న శ్రీదేవి విజయ్ కుమార్.. (ఫోటోలు)
-
హీరోయిన్ శ్రీదేవి భర్త - కూతురిని చూశారా? క్యూట్ ఫ్యామిలీ (ఫొటోలు)