ది రాజాసాబ్‌ హీరోయిన్‌కు ప్రభాస్‌ సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా? | Tollywood Hero Prabhas Sends Food To Actress Nidhhi Agerwal | Sakshi
Sakshi News home page

Nidhhi Agerwal: నిధి అగర్వాల్‌కు ప్రభాస్‌ సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా?

Aug 13 2025 4:19 PM | Updated on Aug 13 2025 4:52 PM

Tollywood Hero Prabhas Sends Food To Actress Nidhhi Agerwal

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆహార ప్రియుడని మనకు తెలిసిందే. అంతేకాదు.. అతిథులకు మర్యాద చేయడంలో ఇంకా ముందుంటారు. అది సెట్లో అయినా.. ఇంట్లో అయినా సరే కడుపునిండా భోజనం పెట్టే పంపిస్తాడు. అలా ఇప్పటికే షూటింగ్స్తో పాటు పలువురు సెలబ్రిటీలకు సైతం భోజనాలు ఏర్పాటు చేస్తుంటారు.

తాజాగా హరిహర వీరమల్లు హీరోయిన్‌ నిధి ‍అగర్వాల్‌కు భోజనం పంపించారు మన ప్రభాస్. విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. సందర్భంగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. అలాగే ప్రభాస్తో పాటు వంశీకి ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేసింది. ఆంధ్ర వంటకాలతో పాటు అద్భుతమైన మీల్స్ దొరికాయని సంతోషం వ్యక్తం చేసింది.

ది రాజాసాబ్‌లో నిధి..

ప్రభాస్ హీరోగా వస్తోన్న రొమాంటిక్ హారర్ ఫిల్మ్ ది రాజాసాబ్‌లో నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ పలుసార్లు వాయిదా పడుతూ వస్తోంది. ఇటీవల టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్.. ది రాజాసాబ్‌ విడుదల తేదీని ఫిక్స్ చేశారు. ఈ  ఏడాది డిసెంబర్ 5 థియేటర్లలో సందడి చేయనుందని ప్రకటించారు.  ఈ చిత్రంలో నిధి అగర్వాల్‌తో పాటు రిద్ధి కుమార్‌, మాళవిక మోహన్ కథానాయికలుగా నటిస్తున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

ప్రభుత్వ కారులో నిధి అగర్వాల్?

ఇటీవలే ఏపీకి ప్రభుత్వ కారులో నిధి అగర్వాల్ప్రయాణించారు. ప్రైవేట్ ఈవెంట్కు వెళ్లిన నిధి అగర్వాల్కు ఏకంగా ఆన్ గవర్నమెంట్డ్యూటీ అని బోర్డ్ ఉన్న కారులో వెళ్లారు. వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వంపై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. తర్వాత కారు ఏర్పాటులో తన ప్రమేయం లేదంటూ క్లారిటీ ఇస్తూ లేఖను పోస్ట్ చేసింది. గతనెల రిలీజైన హరిహర వీరమల్లులో హీరోయిన్గా నిధి అగర్వాల్ కనిపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement