96 ఏళ్లుగా కళాప్రదర్శన | Mumbai Durga Puja 2025: Cultural Grandeur, Eco-Friendly Idols & Traditions | Sakshi
Sakshi News home page

96 ఏళ్లుగా కళాప్రదర్శన

Sep 30 2025 9:29 AM | Updated on Sep 30 2025 11:54 AM

Dussehra 2025: Sindoor Utsav Khela Meerapur Durga Puja

ముంబైలో జరిగే దుర్గా పూజ సాంస్కృతిక వైభవానికి, భక్తికి చిహ్నంగా నిలుస్తోంది. బొంబాయి దుర్గా బారి సమితి ప్రారంభం 1930ల నాటిది. అప్పట్లో బెంగాలీల చిన్న సమావేశంగా ప్రారంభమైన ఈ ఉత్సవం ఇప్పుడు గొప్ప కళా ప్రదర్శనగా నిలుస్తోంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే, ఈసారి కూడా వారు మట్టి, ఎండుగడ్డితో చేసిన పర్యావరణ అనుకూలమైన విగ్రహాన్ని తయారు చేశారు. 

అక్టోబర్‌ 1చ మహానవమి నాడు కుమారీపూజ జరుగుతుంది. అదేరోజు సాయంత్రం ధునుచి నాచ్, 2న మహాదశమి నాడు సిందూర్‌ ఉత్సవ్‌ జరుగుతుంది, తరువాత గిర్గామ్‌ చౌపట్టిలో విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. ‘ఇది మతపరమైన వేడుక మాత్రమే కాదు, సాంస్కృృతిక కళా ప్రదర్శన కూడా‘ అని చైర్‌పర్సన్‌ మితాలి పోద్దార్‌ అన్నారు. ‘కోల్‌కతాకు చెందిన ప్రఖ్యాత కళాకారులు స్థానిక యువతతో కలిసి ప్రదర్శనలు ఇస్తారు. 

ఇది భవిష్యత్‌ తరాలకు కళాత్మక, సాంస్కృతిక వారసత్వాన్ని అందించడం కోసం కూడా. అందుకే మేం ప్రతి సంవత్సరం, పర్యావరణ అనుకూల విధానంతో సంప్రదాయాన్ని పాటిస్తాం–‘ అని చెబుతున్నారామె. వేడుకలతోపాటు పేదపిల్లలకు స్కాలర్‌షిప్‌లు, ఆసుపత్రులకు వైద్యపరికరాల విరాళాలు – వంటివి కూడా ఉంటాయి‘ అని మితాలి పేర్కొన్నారు.

(చదవండి: వెయ్యేళ్ల నాటి ఆలయం..! ఇక్కడ దుర్గమ్మకు రక్తం చిందించని బలి..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement