breaking news
sindhura
-
కాన్స్ ఫెస్టివల్లో సతీమణి.. భార్యను చూసి మురిసిపోతున్న హీరో!
ఫ్రాన్స్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో హీరో సిద్ధార్థ్ సతీమణి అదితి రావు హైదరీ సందడి చేసింది. ఎరుపు రంగు చీరలో కనిపించి అభిమానులను మెప్పించింది. నుదుటన సిందూరం ధరంచి శారీ లుక్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. తన భార్యను అలా చూసిన సిద్ధార్థ్ ప్రశంసలు కురిపించారు. మై లవ్ ఎట్ కేన్స్ అంటూ సోషల్ మీడియా వేదికగా ఆమె ఫోటోను షేర్ చేశారు. ఫ్రెంచ్ రివేరాలో జరిగిన ప్రతిష్టాత్మక వేడుకలో అదితిరావు హైదరీ ప్రత్యేకమైన శారీలో అందరి దృష్టిని ఆకర్షించింది.సిద్ధార్థ్ తన సతీమణి ఫోటోను పోస్ట్ చేసి అద్భుతంగా ఉందంటూ కొనియాడారు. ఆమె ధరించిన 'సిందూర్'ను కూడా ప్రస్తావించాడు. సిందూర్ అంటూ హైలెట్ చేశాడు. సిద్ధార్థ్‌ను వివాహం చేసుకున్న తర్వాత అదితి కేన్స్‌లో కనిపించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. కాగా.. ఇటీవల భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మన కేంద్రం ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ పేరిట ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. కేన్స్ ఫెస్టివల్లో సినీ తారలు ఆపరేషన్ సిందూర్‌కు మద్దతు ప్రకటిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ సైతం నదుటన సిందూరం ధరించిన వైట్ శారీలో మెరిసింది.కాగా.. హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితరావు హైదరీతో కలిసి 2021లో మహా సముద్రం చిత్రంలో నటించారు. ఈ మూవీ సెట్స్‌లోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత దాదాపు మూడు సంవత్సరాలుగా డేటింగ్లో ఉన్నారు. ఆ తర్వాత వారు తెలంగాణ వనపర్తిలోని ఒక ప్రాచీన ఆలయంలో వివాహం చేసుకున్నారు. View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) -
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్.. ఆపరేషన్ సిందూర్‌కు మద్దతుగా ఐశ్వర్యరాయ్
ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ సందడి చేసింది. భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా వైట్ శారీలో మెరిసింది. నుదుటన సింధూరం ధరించిన కేన్స్ ఫెస్టివల్లో పాల్గొనడం మరింత ఆసక్తిగా మారింది. ఇటీవల పాకిస్తాన్‌పై చేపట్టిన ఆపరేషన్‌కు భారత ప్రభుత్వం సింధూర్ అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే. దానికి ప్రతీకగానే ఐశ్వర్య కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సింధూరం పెట్టుకుని కనిపించింది. గత నెలలో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు కేన్స్ వేదికగా తన లుక్‌తో మద్దతుగా నిలిచారు ఐశ్వర్య. ఈ సందర్భాన్ని చాటిచెప్పేలా ఐశ్వర్య సిందూరం పెట్టుకుని బలమైన సందేశం ఇచ్చారని ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.ప్రస్తుతం 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో జరుగుతోంది. ఈ సారి వేడుకల్లో చీరకట్టులో మెరిసిన ఐశ్వర్యరాయ్ ఆమె నటించిన దేవదాస్ సినిమాను గుర్తుకు తెచ్చారు. 2002లో తొలిసారి ఐశ్వర్య కేన్స్ ఫెస్టివల్‌కు చీరకట్టులో హాజరయ్యారు. సంజయ్ లీలా భన్సాలీ దేవదాస్ చిత్రం కోసం ఈ వేడుకల్లో చీరలో కనిపించారు. కొత్త లుక్‌ను చూసిన తర్వాత అభిమానులు దేవదాస్ చిత్రంలోని పార్వతిని గుర్తు చేసుకుంటున్నారు.ఎందుకంటే ఐశ్వర్యరాయ్ ఎప్పుడూ కనిపించినా ఫ్యాషన్ దుస్తుల్లోనే మెరిశారు. సినీ వేడుకల్లో ఐశ్వర్య లుక్ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. ఈ ఏడాది ఆమె లుక్ మాత్రం అద్భుతమంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రముఖ ష్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఆె చీరను డిజైన్ చేశారు. ఆమె ధరించిన నెక్లెస్‌ను 500 క్యారెట్ల మొజాంబిక్ కెంపులు, వజ్రాలతో తయారు చేశారు. View this post on Instagram A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) -
సింధూర..
‘జయం’ రవి, అరవింద్ స్వామి హీరోలుగా, హన్సిక హీరోయిన్గా తెరకెక్కిన తమిళ చిత్రం ‘బోగన్’. లక్ష్మణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ చిత్రాన్ని అదే పేరుతో ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి తెలుగు ప్రేక్షకులకి అందిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘సింధూర..’ పాటను శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా రామ్ తాళ్లూరి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా తెలుగు ట్రైలర్‌కు విశేషమైన స్పందన రావడం మా టీమ్‌కి సంతోషంగా అనిపించింది. తమిళ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ డి. ఇమ్మాన్ ట్యూన్ చేసిన ‘సింధూర..’ పాటను తెలుగులో సమీర భరధ్వాజ్ ఆలపించారు. భువనచంద్రగారు ఈ పాటకు లిరిక్స్ అందించారు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. -
ఇప్పటివరకూ నెగిటివ్... ఇప్పుడు పాజిటివ్
ప్రస్తుతం సమాజంతో పాటు మహిళలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రానున్న రోజుల్లో నేరాలు, ఘోరాలు, అత్యాచారాలు మన దేశంలో కనుమరుగవుతాయనే కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘మరో దృశ్యం’. గౌతమ్, అవంతిక, సింధూర ముఖ్య తారలు. కట్ల రాజేంద్రప్రసాద్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్ఎమ్ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘ఉత్కంఠగా సాగుతూనే వినోదం పంచుతుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ‘రెడీ రా రెడీ.. రగులుతున్న వయసే ఇదిరా’ పాట చిత్రీకరిస్తున్నాం’’ అన్నారు. ‘‘ఇప్పటి వరకూ నెగిటివ్ రోల్స్‌లో కనిపించిన నేను ఫస్ట్ టైమ్ ఓ బాధ్యతగల సీఐగా పాజిటివ్ పాత్రలో కనిపిస్తా. ఈ చిత్రంలో నాలోని కొత్త కోణాన్ని ప్రేక్షకులు చూస్తారు. తప్పకుండా నాకు మంచి బ్రేక్ అవుతుంది’’ అని నటుడు షఫీ అన్నారు. -
టెన్ పిన్ చాంప్స్ జగన్, సింధూర
హైదరాబాద్: కార్పొరేట్ టెన్‌పిన్ బౌలింగ్ టోర్నమెంట్లో జగన్ రావు (కాగ్నిజెంట్), సింధూర జ్యోతి (సింక్రొని ఫైనాన్సియల్) టైటిల్స్ చేజిక్కించుకున్నారు. మంగళవారం ఇనార్బిట్‌మాల్‌లోని స్మాష్ బౌలింగ్ సెంటర్లో జరిగిన ఈ పోటీల్లో పురుషుల విభాగంలో జగన్ రెండు గేముల్లో కలిసి 367 పాయింట్లు సాధించాడు. రమేశ్ మణికంఠ (ఇన్ఫోసిస్) 361 పాయింట్లతో రన్నరప్‌గా నిలిచాడు. అనిల్ తుడు (ఇన్ఫోసిస్, 327 పాయింట్లు)కు మూడో స్థానం దక్కింది. మహిళల విభాగంలో సింధూర జ్యోతి రెండు గేముల్లో కలిసి 277 పాయింట్లతో అగ్రస్థానం పొందింది. డెలాయిట్‌కు చెందిన జ్యోతి హెగ్డే (257 పాయింట్లు), శష్వి యాదవ్ (249 పాయింట్లు) వరుసగా రెండు మూడు స్థానాల్లో నిలిచారు. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో నిర్వాహకులు తొలి మూడు స్థానాల్లో నిలిచిన వారికి ట్రోఫీలు అందజేశారు. ఇందులో 16 కార్పొరేట్ కంపెనీలకు చెందిన 50 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. 33 మంది పురుషుల కేటగిరీలో, 17 మంది మహిళల కేటగిరీలో తలపడ్డారు. -
కొత్తవాళ్లతో ఎంటర్టైనర్
అశోక్ రాయల్, అవంతిక, కీర్తికలను హీరో, హీరోయిన్లుగా పరిచయం చేస్తూ సింధు క్రియేషన్స్ పతాకంపై పులి అమృత్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించ నున్న చిత్రం ‘సింధూర’. ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి మామిడి హరికృష్ణ కెమేరా స్విచ్చాన్ చేయగా, తెలంగాణ రాష్ట్ర శాసనపరిషత్ చైర్మన్ కె.స్వామిగౌడ్ క్లాప్ ఇచ్చారు. దర్శక-నిర్మాత మాట్లాడుతూ- ‘‘చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న చిత్రమిది. సినిమాటోగ్రాఫర్స్‌గా అమర్నాథ్, విశ్వనాథ్‌లను పరిచయం చేస్తున్నాం’’ అని తెలిపారు. సంగీత దర్శకుడు సాకేత్ సాయిరామ్ తదితరులు పాల్గొన్నారు. -
కొత్తజంటకు బెదిరింపులు
-
చంపేస్తామంటూ ప్రేమజంటకు బెదిరింపులు
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలో కులాంతర ప్రేమవివాహం చేసుకున్నందుకు ఓ జంటను చంపేస్తామంటూ బంధువులు బెదిరిస్తున్నారు. నవ వధువు మాజీ ఎమ్మెల్యే మేనకోడలు. పెళ్లికి అమ్మాయి తరపు వారు వ్యతిరేకిస్తున్నారు. దీంతో ప్రేమజంట తమకు రక్షణ కల్పించాల్సిందిగా కోరుతూ పోలీసులను ఆశ్రయించారు. వివరాలిలా ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు మేనకోడలు అయిన సింధూర, వంశీ ఈ నెల 8న సింహాచలం అప్పన్న సన్నిధిలో పెళ్లి చేసుకున్నారు. అయితే సింధూర మైనరని, ఇప్పుడు పెళ్లి చేసుకుంటే సహించేదిలేదని, పురుగుల మందు కలిపి ఇద్దరినీ చంపేస్తామంటూ అమ్మాయి తరపు బంధువుల నుంచి బెదిరింపులు వచ్చాయి. నవ వధూవరులు మహిళా సంఘాల సాయంతో డీసీపీ శ్రీనివాసులును కలిశారు. తమకు రక్షణ కల్పించాల్సిందిగా అభ్యర్థించారు.