టెన్ పిన్ చాంప్స్ జగన్, సింధూర | Sakshi
Sakshi News home page

టెన్ పిన్ చాంప్స్ జగన్, సింధూర

Published Wed, Aug 31 2016 12:58 PM

tenpin tournament champions are jagan rao and sindhura

హైదరాబాద్: కార్పొరేట్ టెన్‌పిన్ బౌలింగ్ టోర్నమెంట్‌లో జగన్ రావు (కాగ్నిజెంట్), సింధూర జ్యోతి (సింక్రొని ఫైనాన్సియల్) టైటిల్స్ చేజిక్కించుకున్నారు. మంగళవారం ఇనార్బిట్‌మాల్‌లోని స్మాష్ బౌలింగ్ సెంటర్‌లో జరిగిన ఈ పోటీల్లో పురుషుల విభాగంలో జగన్ రెండు గేముల్లో కలిసి 367 పాయింట్లు సాధించాడు. రమేశ్ మణికంఠ (ఇన్ఫోసిస్) 361 పాయింట్లతో రన్నరప్‌గా నిలిచాడు. అనిల్ తుడు (ఇన్ఫోసిస్, 327 పాయింట్లు)కు మూడో స్థానం దక్కింది. మహిళల విభాగంలో సింధూర జ్యోతి రెండు గేముల్లో కలిసి 277 పాయింట్లతో అగ్రస్థానం పొందింది.

డెలాయిట్‌కు చెందిన జ్యోతి హెగ్డే (257 పాయింట్లు), శష్వి యాదవ్ (249 పాయింట్లు) వరుసగా రెండు మూడు స్థానాల్లో నిలిచారు. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో నిర్వాహకులు తొలి మూడు స్థానాల్లో నిలిచిన వారికి ట్రోఫీలు అందజేశారు. ఇందులో 16 కార్పొరేట్ కంపెనీలకు చెందిన 50 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. 33 మంది పురుషుల కేటగిరీలో, 17 మంది మహిళల కేటగిరీలో తలపడ్డారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement