అర్చకులు సౌందర్‌ రాజన్‌ కన్నుమూత.. వైఎస్‌ జగన్‌ సంతాపం | Ys Jagan Condoles Death Of Chilkur Temple Chief Priest Soundararajan | Sakshi
Sakshi News home page

అర్చకులు సౌందర్‌ రాజన్‌ కన్నుమూత.. వైఎస్‌ జగన్‌ సంతాపం

Feb 27 2026 4:03 PM | Updated on Feb 27 2026 5:24 PM

Ys Jagan Condoles Death Of Chilkur Temple Chief Priest Soundararajan

సాక్షి, తాడేపల్లి: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు సౌందర్ రాజన్ మృతిపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. సౌందర్ రాజన్ దశాబ్దాల పాటు చిలుకూరు బాలాజీ సేవలో అంకితభావంతో పనిచేశారని.. భక్తుల విశ్వాసాన్ని నిలబెట్టిన గొప్ప ఆధ్యాత్మిక వేత్త అంటూ వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

సంప్రదాయాలను కాపాడుతూ ఆలయ పరిపాలనలోనూ, భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం అందించడంలోనూ ఆయన విశిష్ట పాత్ర పోషించారన్న వైఎస్‌ జగన్‌.. సౌందరరాజన్ మృతి ఆధ్యాత్మిక రంగానికి తీరని లోటు అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నానని వైఎస్‌ జగన్‌ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement