chilkur temple
-
అర్చకులు సౌందర్ రాజన్ కన్నుమూత.. వైఎస్ జగన్ సంతాపం
సాక్షి, తాడేపల్లి: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు సౌందర్ రాజన్ మృతిపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. సౌందర్ రాజన్ దశాబ్దాల పాటు చిలుకూరు బాలాజీ సేవలో అంకితభావంతో పనిచేశారని.. భక్తుల విశ్వాసాన్ని నిలబెట్టిన గొప్ప ఆధ్యాత్మిక వేత్త అంటూ వైఎస్ జగన్ పేర్కొన్నారు.సంప్రదాయాలను కాపాడుతూ ఆలయ పరిపాలనలోనూ, భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం అందించడంలోనూ ఆయన విశిష్ట పాత్ర పోషించారన్న వైఎస్ జగన్.. సౌందరరాజన్ మృతి ఆధ్యాత్మిక రంగానికి తీరని లోటు అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నానని వైఎస్ జగన్ అన్నారు. -
గరుడ ప్రసాదం కోసం చిలుకూరుకు.. కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)
-
కేటీఆర్ కోసం మోకాళ్లపై ఆలయ మెట్లెక్కిన రాజయ్య
చిల్పూరు: కాలికి గాయమైన మంత్రి కేటీఆర్ త్వరగా కోలుకోవాలని జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆదివారం మోకాళ్లపై నడుస్తూ చిల్పూరు ఆలయ మెట్లు ఎక్కారు. ఆయన వెంట జెడ్పీ, ఆలయ చైర్మన్లు సంపత్‌రెడ్డి, శ్రీధర్‌రావు, ఎంపీపీ సరిత బాలరాజు, పార్టీ మండల అధ్యక్షుడు రమేశ్‌నాయక్, పోలేపల్లి రంజిత్‌రెడ్డి, పీఏసీఎస్ వైస్‌చైర్మన్ చిర్ర నాగరాజు తదితరులున్నార. -
భక్తులతో పోటెత్తిన చిలుకూరు
చిలుకూరు: ముక్కోటి ఏకాదశ పర్వదినాన్ని పురస్కరించుకుని చిలుకూరు బాలాజీ దేవాలయం కిటకిటలాడుతోంది. వెంకన్న దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావడంతో చిలుకూరు భక్తుల కోలాహలంతో సందడిగా మారింది. స్వామి వారి దర్శనానికి ఎనిమిది గంటలకు పైగా సమయం పడుతోంది. భక్తులు మూడు కి.మీ మేర బారలు తీరి స్వామి దర్శనానికి క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆలయ ప్రధాన అర్చకులు సౌందర రాజన్.. చిలుకూరు తెలంగాణ తిరుపతిగా పేర్కొన్నారు. ఈ రోజు స్వామివారిని దర్శించుకోవడం చాలా పవిత్రమైనదని ఆయన అన్నారు.


