
మోకాళ్లపై చిల్పూరు ఆలయ మెట్లు ఎక్కుతున్న ఎమ్మెల్యే రాజయ్య
చిల్పూరు: కాలికి గాయమైన మంత్రి కేటీఆర్ త్వరగా కోలుకోవాలని జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆదివారం మోకాళ్లపై నడుస్తూ చిల్పూరు ఆలయ మెట్లు ఎక్కారు. ఆయన వెంట జెడ్పీ, ఆలయ చైర్మన్లు సంపత్‌రెడ్డి, శ్రీధర్‌రావు, ఎంపీపీ సరిత బాలరాజు, పార్టీ మండల అధ్యక్షుడు రమేశ్‌నాయక్, పోలేపల్లి రంజిత్‌రెడ్డి, పీఏసీఎస్ వైస్‌చైర్మన్ చిర్ర నాగరాజు తదితరులున్నార.