కాన్స్ ఫెస్టివల్‌లో సతీమణి.. భార్యను చూసి మురిసిపోతున్న హీరో! | Husband Siddharth On Aditi Rao Hydari Wore Sindoor, Red Saree Look At Cannes | Sakshi
Sakshi News home page

Siddharth: కాన్స్ ఫెస్టివల్‌లో సతీమణి అదితి.. సిందూర్ అంటూ హీరో ప్రశంసలు!

May 22 2025 12:24 PM | Updated on May 22 2025 1:39 PM

Husband Siddharth On Aditi Rao Hydari Wore Sindoor, Red Saree Look At Cannes

ఫ్రాన్స్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో హీరో సిద్ధార్థ్ సతీమణి అదితి రావు హైదరీ సందడి చేసింది. ఎరుపు రంగు చీరలో కనిపించి అభిమానులను మెప్పించింది. నుదుటన సిందూరం ధరంచి శారీ లుక్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. తన భార్యను అలా చూసిన సిద్ధార్థ్ ప్రశంసలు కురిపించారు. మై లవ్ ‍ఎట్ కేన్స్‌ అంటూ సోషల్ మీడియా వేదికగా ఆమె ఫోటోను షేర్ చేశారు. ఫ్రెంచ్ రివేరాలో జరిగిన ప్రతిష్టాత్మక వేడుకలో అదితిరావు హైదరీ ప్రత్యేకమైన శారీలో అందరి దృష్టిని ఆకర్షించింది.

సిద్ధార్థ్ తన సతీమణి ఫోటోను  పోస్ట్ చేసి  అద్భుతంగా ఉందంటూ కొనియాడారు. ఆమె ధరించిన 'సిందూర్'ను కూడా ప్రస్తావించాడు. సిందూర్‌ అంటూ హైలెట్‌ చేశాడు. సిద్ధార్థ్‌ను వివాహం చేసుకున్న తర్వాత అదితి  కేన్స్‌లో కనిపించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. కాగా.. ఇటీవల భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మన కేంద్రం ప్రభుత్వం ఆపరేషన్‌ సిందూర్ పేరిట ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. కేన్స్ ఫెస్టివల్‌లో సినీ తారలు ఆపరేషన్‌ సిందూర్‌కు మద్దతు ప్రకటిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ సైతం నదుటన సిందూరం ధరించిన వైట్ శారీలో మెరిసింది.

c

కాగా.. హీరో సిద్ధార్థ్, హీరోయిన్  అదితరావు హైదరీతో కలిసి 2021లో మహా సముద్రం చిత్రంలో నటించారు. ఈ మూవీ సెట్స్‌లోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత దాదాపు మూడు సంవత్సరాలుగా డేటింగ్‌లో ఉన్నారు. ఆ తర్వాత వారు తెలంగాణ వనపర్తిలోని ఒక ప్రాచీన ఆలయంలో వివాహం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement