
క్రమశిక్షణ కోసమేనంటున్న గురుకుల అధ్యాపకులు
వేములవాడఅర్బన్: దసరా సెలవులు ముగిసిన తర్వాత విద్యాసంస్థలు శనివారం పున ప్రారంభమయ్యాయి. ఈక్రమంలోనే పలువురు విద్యార్థులు ఆలస్యంగా రావడంతో కళాశాల అధ్యాపకులు వారికి ఫైన్ వేశారు. పట్టణంలోని రెండో బైపాస్ రోడ్డులోని బాలికల గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థులు ఆలస్యంగా బుధవారం రావడంతో ఒక్కొక్కరికి ఒక్కో రంగుడబ్బా కొని అప్పగించాలని హుకూం జారీ చేశారు.
దూరం నుంచి వచ్చామని తమ వద్ద డబ్బులు లేవని చెప్పినా అధ్యాపకులు వినిపించుకోకపోవడంతో వారు ఇబ్బంది పడ్డారు. ఈ విషయంపై కళాశాల వైస్‌ప్రిన్సిపాల్ అనురాధను ‘సాక్షి’ వివరణ కోరగా కళాశాల ప్రారంభమై ఐదు రోజులు గడుస్తున్నా విద్యార్థులకు ఫోన్ చేస్తే స్పందించడం లేదన్నారు. పరీక్షలు దగ్గర పడుతున్నందునా వారిలో క్రమశిక్షణ పెంచాలని తాము రంగుడబ్బాలు తీసుకురావాలని ఫైన్‌గా వేసినట్లు తెలిపారు. విద్యార్థులు కొనుగోలు చేసి తెచ్చిన రంగు డబ్బాలతోనే కళాశాల, పాఠశాల ఆవరణలో పెయింటింగ్ వేయిస్తామని స్పష్టం చేశారు.