breaking news
dassera season
-
96 ఏళ్లుగా కళాప్రదర్శన
ముంబైలో జరిగే దుర్గా పూజ సాంస్కృతిక వైభవానికి, భక్తికి చిహ్నంగా నిలుస్తోంది. బొంబాయి దుర్గా బారి సమితి ప్రారంభం 1930ల నాటిది. అప్పట్లో బెంగాలీల చిన్న సమావేశంగా ప్రారంభమైన ఈ ఉత్సవం ఇప్పుడు గొప్ప కళా ప్రదర్శనగా నిలుస్తోంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే, ఈసారి కూడా వారు మట్టి, ఎండుగడ్డితో చేసిన పర్యావరణ అనుకూలమైన విగ్రహాన్ని తయారు చేశారు. అక్టోబర్ 1చ మహానవమి నాడు కుమారీపూజ జరుగుతుంది. అదేరోజు సాయంత్రం ధునుచి నాచ్, 2న మహాదశమి నాడు సిందూర్ ఉత్సవ్ జరుగుతుంది, తరువాత గిర్గామ్ చౌపట్టిలో విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. ‘ఇది మతపరమైన వేడుక మాత్రమే కాదు, సాంస్కృృతిక కళా ప్రదర్శన కూడా‘ అని చైర్పర్సన్ మితాలి పోద్దార్ అన్నారు. ‘కోల్కతాకు చెందిన ప్రఖ్యాత కళాకారులు స్థానిక యువతతో కలిసి ప్రదర్శనలు ఇస్తారు. ఇది భవిష్యత్ తరాలకు కళాత్మక, సాంస్కృతిక వారసత్వాన్ని అందించడం కోసం కూడా. అందుకే మేం ప్రతి సంవత్సరం, పర్యావరణ అనుకూల విధానంతో సంప్రదాయాన్ని పాటిస్తాం–‘ అని చెబుతున్నారామె. వేడుకలతోపాటు పేదపిల్లలకు స్కాలర్షిప్లు, ఆసుపత్రులకు వైద్యపరికరాల విరాళాలు – వంటివి కూడా ఉంటాయి‘ అని మితాలి పేర్కొన్నారు.(చదవండి: వెయ్యేళ్ల నాటి ఆలయం..! ఇక్కడ దుర్గమ్మకు రక్తం చిందించని బలి..) -
దసరా సందడి
దసరా పండుగ దగ్గర పడుతోంది. నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, వివిధ నిత్యావసర సరుకుల కొనుగోళ్లలో ప్రజలు నిమగ్నమయ్యారు. అనంతపురం నగరంలోని ప్రధాన వీధులు, కూడళ్లలోని బంగారు, వస్త్ర దుకాణాలు, కిరాణా షాపులు వినియోగదారులతో కిటకిటలాడుతున్నాయి. ఆఫర్లు, డిస్కౌంట్లతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు దుకాణాదారులు పోటీపడుతున్నారు. ఫుట్పాత్ వ్యాపారులు కూడా భారీ తగ్గింపు ధరలతో వస్త్రాలు విక్రయిస్తుండటంతో పేదలు ఎగబడ్డారు. కొనుగోళ్ల నేపథ్యంలో ఏటీఎం సెంటర్ల వద్ద కూడా డబ్బు డ్రా చేయడానికి వినియోగదారులు క్యూ కట్టడం కనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం