
ఫస్ట్‌డే డ్యూటీ ఎవ్వరికైనా భయంగానే ఉంటుంది. ఆరోజు కొత్తగా విధుల్లోకి రావడం..ఎలా ప్రవర్తించాలి, ఉండాలి వంటి వాటి గురించి చాలా ఆందోళనగా ఉంటుంది. ఆ ఒత్తిడి మొత్తం.. అవతలి వ్యక్తి ఆ రెండు అక్షరాలకు కట్టుబడి స్పందించిన తీరుతోనే ఉఫ్‌మని ఎగిరిపోతుంది. అలాంటి సమయంలోనే ఆ పదం అర్థం, విలువ తెలుసొస్తుంది. నెట్టింట వైరల్‌గా మారిన కండక్టర్ ఫస్ట్ డే డ్యూటీ స్టోరీ..ఓ గొప్ప పాఠాన్ని నేర్పిస్తోంది.
చూడటానికి మనకు సామాన్యంగా కనిపించే కొన్ని పదాలు, గొప్ప అర్థాన్ని, అమూల్యమైన పాఠాలను బోధిస్తాయి. అలాంటి ఘటనే బెంగళూరులో చోటుచేసుకుంది. బెంగళూరు బీఎంటీసీ వజ్ర బస్సులో కొత్తగా కండక్టుర్ జాయిన్ అయ్యాడు ఒక వ్యక్తి. తొలిరోజు డ్యూటీ కావడంతో చాలా ఆందోళనకు గురయ్యాడు. ఆ రూట్ వైపు టిక్కెట్లు ఇచ్చే విషయమై చాలా కన్ఫ్యూజ్ అయ్యాడు. అయితే కొత్తగా వచ్చిన ఈ కండక్టర్‌కి మద్దతు తెలుపుతూ..సైలెంట్‌గా ప్రోత్సహించాడు ఆ బస్సు డ్రైవర్.
ఎక్కిన జనాలందరికి టికెట్లు ఇచ్చేంతవరకు ఆపి..పోనిచ్చేవాడుడ డ్రైవర్. అలాగే ఎక్కిన ప్రయాణికులు కూడా అతడు ఆలస్యంగా టికెట్లు ఇస్తున్నాడని, ఓకింత అసహనానికి గురైనా..అతడి బాధను అర్థం చేసుకుని సహకరించారు. పైగా వచ్చే తదుపరి స్టాప్‌లలో జనం ఎక్కుతారని..ఇక్కడ నుంచి ఇంత ఖరీదంటూ కండెక్టర్‌కి సహాయం చేశారు కొందరు ప్రయాణికులు.
నిశబ్దంగా వారంతా అందించిన ప్రోత్సాహం..అతడిలో నూతన ఉత్సాహాన్ని నింపి, మొత్తం టెన్షన్ ఉఫ్‌మని ఎగిరిపోయేలా చేశారు. ఏ వ్యక్తిలో అయినా ఆందోళన పోగొట్టాలంటే దయతో కూడిన సానుభూతి, ఓర్పుగా వ్యవహరించడమే అని ఆ ప్రయాణికులు, బస్సు డ్రైవర్ తమ చేతలతో తెలియ చెప్పారు. అక్కడకి ఓ ప్రయాణికుడు కొత్తగా డ్యూటీలోకి జాయిన్ అయ్యావా..? అని ప్రశాంతంగా అడిగిన తీరు కూడా అతనిలో ఆందోళన మొత్తం ఎగిరిపోయేలా చేసింది.
పైగా ఆ వ్యాఖ్య కాస్త దయతో మిగతావారందరు సహాయం చేసేందుకు ఉపకరించింది. మనం నిశబ్దంగా అందించే ప్రోత్సాహం, ఓర్పు నుంచి కరుణ పుట్టుకొస్తుందని అవగతమయ్యేలా చేశారు. నిజానికి నటనతో కరుణను వ్యక్తపరచడం అనేది అసాధ్యమని ఈ ఘటన చెప్పకనే చెబుతోంది. అంతా క్షణాల్లో జరిగిపోవాలనే ఏఐ టెక్నాలజీ యుగంలో ప్రతి ఒక్కరికి అయ్యిందానికి, కానిదానికి కస్సుబుస్సులాడటం అలవాటైపోయింది. ఓపిక అనే పదం ఎగిరిపోయింది.
తరుణంలో ఈ ఘటన అందరిని ఆలోచింపచేసేలా పాత రోజుల్లోకి తీసుకెళ్లిందంటూ నెటజన్లు ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. ఒక ప్రముఖ సంస్థలో జాయిన్ అయ్యిన కొత్త ఉద్యోగైనా.. అతడికి నిశబ్దంగా ఇలాంటి ప్రోత్సాహం అందిస్తే..అద్భుతాలు చేస్తారు, వాళ్ల టాలెంట్‌ని వెలికితీయగలుగుతారు అనేందుకు నిదర్శనమే ఈ అరుదైన ఘటన.
(చదవండి: ఆక్సిజన్ సిలిండర్ లేకుండా ఎవరెస్టుని అధిరోహించిన తొలి వ్యక్తి..! రెండుసార్లు ఫెయిలైనా..)