
దుర్గా పూజ హిందూ పండుగ అని తెలిసిందే. అయితే, ఇక్కడ మాత్రం హిందూ–ముస్లిం మత సామరస్యంతో జరుపుకోవడంలో ప్రసిద్ధి చెందింది. పశ్చిమ బెంగాల్ తూర్పు మిడ్నాపూర్ జిల్లా కొంటైలోని కిషోర్‌నగర్ గర్ రాజ్‌బరి వద్ద జరుపుకుంటున్న స్వర్ణదుర్గాదేవి పూజలో అమ్మవారికి సమర్పించిన నైవేద్యాన్ని మొదటగా అక్కడి పీర్లకు ఇస్తారు. ఆ తర్వాతే రాజకుటుంబీకులు స్వీకరిస్తారు. భక్తులకు పంచిపెడతారు. ఇలా దాదాపు 300 సంవత్సరాలుగా జరుగుతోంది.
ఈ పూజకు దూర్రప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. హిందూ–ముస్లిం సామరస్యం ఒక ప్రధాన లక్షణం, ఇక్కడ విగ్రహ నిమజ్జనానికి ముందు ముస్లిం పీర్లకు దేవత ప్రసాదాన్ని అందిస్తారు. ముందుగా పూజ సమయంలో ఒక ఉత్సవం జరుగుతుంది, ఈ ఉత్సవంలో కూడా స్థానిక హిందువులతోపాటు ముస్లింలు కూడా పాల్గొంటారు.
వీరితోపాటు ఇతర మతాల వారు కూడా పూజలోపాలు పంచుకుంటారు, స్వర్ణదుర్గమ్మకు జీడిపప్పు భోగంపూజ సమయంలో అమ్మవారికి పండ్లు, తీపి పదార్థాలను నివేదిస్తారు. వీటితోపాటు వేయించిన జీడిపప్పు, ఇంట్లో తయారు చేసిన జున్ను, చక్కెరతో వండిన ప్రత్యేక భోగాన్ని నివేదిస్తారు.
(చదవండి: ‘విరామ భోగ్‘: అక్కడ నైవేద్యాన్ని అమ్మవారే స్వయంగా..!)