
వంటను రుచికరంగా వండటం కూడా ఓ ఆర్ట్. అయితే పోషకాలు కోల్పోకుండా, రుచికరంగా వండటం అంటే.. అది అందరికి సాధ్యం కాకపోవచ్చు. ఒకవేళ విటమిన్లు పోకూడదన్న ఆత్రుతలో తక్కువగా ఉడకిస్తే..టేస్ట్ లేదనిపిస్తుంది. అలా కాకుండా అన్ని సరిపడేలా టేస్ట్ ఏ మాత్రం తగ్గకుండా వండాలంటే ఈ టెక్నీక్ ఫాలో అవ్వాల్సిందే. ఇలా ఈ రూల్‌లో వంట చేస్తే..రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడాను. మరి ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయలా చూసేద్దామా మరి..!.
రుచికంగా రెస్టారెంట్‌లో కనిపించినట్లుగా కలర్‌ఫుల్‌గా వండాలంటే ఈ పద్ధతే మేలంటున్నారు నిపుణులు కూడా. పైగా ఈ విధానం ఎక్కువసేపు ఉడకించడాన్ని నివారించడం తోపాటు, విటమిన్లు కూడా పోవని చెబుతున్నారు. అందుకోసం వండేటప్పుడూ 3-3-2-2 రూల్‌ని అనుసరించడం మేలని చెబుతున్నారు నిపుణులు. ఆహార ప్రియులు రుచికరమైన భోజనంతోపాటు, పోషకాలని కూడా కోల్పోరట. మరి ఈ రూల్‌లో ఎలా వండాలంటే..
ఆ రూల్‌లోని మ్యాజిక్..
ఒక గిన్నెలో రెండు స్పూన్ల నూనెని పోసి వండాల్సిన కూరగాయలు లేదా నాన్‌వెజ్‌ని వేయాలి. ఆ తర్వాత ఒక వైపు మూడు నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత ఒకసారి గరిటతో తిప్పి మరో మూడు నిమిషాలు ఉడికించాలి. ఇంకోసారి తిప్పి ఓ నిమిషాలు ఉడికించాలి. చివరగా ఇంకొక్కసారి తిప్పి మరో రెండు నిమిషాలు ఉడికిస్తే చాలట, రుచి కోల్పోకుండా పోషకవంతంగా ఉంటుందంట.
అతిగా ఉడికించడాన్ని నిరోధించడం అనే సమస్య ఈ పద్ధతితో నివారించగలుగుతామట. ఇలా గ్రిల్ చేసేవాటికి, మంటపై గిన్ని పెట్టి కూర వండే వాటికి చాలా బాగా ఉపయోగపడుతుందట. పైగా రెస్టారెంట్‌లో కనిపించినట్లు ముక్కలనేవి వడలిపోవు, చూసేందుకు అందంగానూ, రుచికరంగానూ ఉంటుందట.
ఇది మంచిదేనా..?
ఈ పద్ధతిలో తక్కువ సమయంలోనే వంట పూర్తి అయిపోవడమే కాకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా సునాయాసంగా వండేయొచ్చట. అలాగే ముక్కలు లేదా మాంసం ముక్కల్లోని మృదుత్వం పోకుండా రుచికరంగా ఉంటుందట. పైగా కొత్తగా వంట చేసేవారికి మరింత హెల్ప్ అవుతుందట. అదీగాక ఇలా వండితే సమయానికి సమయం, ఆరోగ్యానికి ఆరోగ్యం రెండు సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు.
(చదవండి: ఫస్ట్ డే డ్యూటీ హైరానా..! వైరల్‌గా బస్సు కండక్టర్ స్టోరీ..