
దసరా వేడుక కొన్ని చోట్ల విశేషమైన ప్రత్యేకతను సంతరించుకుంటాయి. ఆ సంప్రదాయలకు అనుగుణంగా జరిగే పూజ ఆచారాల కారణంగానే అవి వార్తల్లో నిలుస్తాయి. కొన్ని చోట్ల గర్భా, దాండియా వంటి నృత్యాలతో జరుపుకుంటే..మరికొన్ని చోట్ల నైవేద్యాల పరంగా విశిష్టతను కలిగి ఉంటాయి. జనసందోహంతో ఘనంగా జరుపుకుంటున్న పండుగ సమయంలో అనుకోని అతిథిలా వర్షం వస్తే..అబ్బా ఎంత పనిచేసిందంటూ..తల తడవకుండా ఏదో ఒకటి అడ్డు పెట్టుకుని సమీపంలోని చెట్ల వద్దకు, లేదా ఇళ్లు/షెడ్డు వద్దకు వస్తాం.
కానీ ఈ వ్యక్తి పండుగ సంబరం ఆగకూడదు..ఆ సరదా పోకూడదనుకున్నాడేమో అంతటి జోరు వర్షంలోనూ అలా గర్భా నృత్యం చేస్తూనే ఉన్నాడు. ఎంత అద్భుతంగా ఉందంటే దటీజ్ గర్భా పవర్ అన్నట్లుగా ఉంది. అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడమే కాదు, నెటిజన్లను తెగా ఆకర్షించింది. ఆ వీడియోలో చత్తీస్‌గఢ్‌కు చెందిన వ్యక్తి సంప్రదాయ బ్లాక్ కలర్ డ్రస్ ధరించి, కుండపోత వర్షంలో కూడా ఆగకుండా గర్భా నృత్యం చేస్తున్న కమనీయ దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది.
కాగా, గుజరాత్ నవరాత్రి వేడుకలకు పెట్టింది పేరు. పైగా ఇక్కడ జరిగే గర్భా రాత్రులు అత్యంత ప్రజాదరణ కలిగినవి. రంగురంగుల సంప్రదాయ దుస్తులతో చేసే గర్భా నృత్యాలు ప్రజలందర్నీ అమితంగా ఆకర్షిస్తాయి. అందులోనూ ఈ ఏడాది పదిరోజులు కాకుండా పదకొండు రోజుల కావడంతో మరింత వైభవోపేతంగా చాలాపెద్ద పెద్ద గర్భారాత్రులు నిర్వహిస్తున్నారు కొందరు.
(చదవండి: ఫస్ట్ డే డ్యూటీ హైరానా..! వైరల్‌గా బస్సు కండక్టర్ స్టోరీ..)