
ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ వాడకం చాలా సాధారణంగా మారిపోయింది. దీని వల్ల కలిగే దుష్ర్పభావాలు అన్నీ ఇన్నీకావు. తాజా పరిశోధనల ప్రకారం రోజుకు రోజుకు ఇవి మరింత మానవుల ఆరోగ్యాన్ని, పర్యావరణానికి మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి. మరికొన్ని రకాల ప్లాస్టిక్‌లు ఆరోగ్యంపై వాటి దుష్ప్రభావాల గురించి తెలుసుకుందాం.
ప్లాస్టిక్‌లు ఆరోగ్యంపై వాటి దుష్ప్రభావాలు
మనం అన్నింటినీ కలిపి (బ్రాడ్‌గా) ప్లాస్టిక్ అని పిలిచే వాటిల్లో ఎన్నో రకాలున్నాయి. ఉదాహరణకు...
పాలీ ఇథిలీన్ టెరెథాలేట్ (పీఈటీ) ఈ పదార్థంతో తయారైన సీసాలను మనం ‘పెట్ బాటిల్స్’ అంటాం. వీటిల్లో సాఫ్ట్‌డ్రింక్స్, జ్యూస్‌లు, నీళ్లు, మౌత్‌వాష్‌లు వంటివి ప్యాక్ చేస్తుంటారు. దీనివల్ల దీర్ఘకాలంలో శ్వాస సమస్యలు, చర్మంపై ఇరిటేషన్, మహిళల్లో రుతుసంబంధ వ్యాధులు కనిపిస్తంటాయి. కొన్నిసార్లు గర్భస్రావాలూ జరగవచ్చు. వీటితో మనకు ఏర్పడే దుష్ప్రభావాలూ / సమస్యలపై పరిశోధనలింకా సాగుతూనే ఉన్నాయి.
హై డెన్సిటీ పాలీ ఇథిలీన్ (హెచ్‌డీపీఈ)
పాల సీసాలు, బ్లీచ్‌లు, షాంపూసీసాలు, వంటనూనెలు, కిటికీల్ని శుభ్రపరిచే ద్రవాలు (విండోక్లీనర్స్), కొన్ని రకాల మందులను ప్యాకింగ్ ట్యూబ్‌ల తయారీలో ‘హెచ్‌డీపీఈ’ ఉపయోగిస్తారు. వీటితో చాలామందిలో అలర్జీలు, ఆస్తమా సమస్యలు వస్తున్నట్లుగా గుర్తించారు. కొందరిలో కాలేయం, కిడ్నీలు, స్ల్పీన్, ఎముకలపై దుష్ప్రభావాన్ని చూపుతాయి.
లో–డెన్సిటీ పాలీ ఇథిలీన్ (ఎల్‌డీపీఈ)
చాలా రకాల కిరాణా వస్తువుల ప్యాకింగ్‌లలో, బ్రెడ్, ఫ్రోజెన్ ఫుడ్ ఐటమ్స్ నిల్వ కోసం ఈ పదార్థాన్ని ఉపయోగిస్తుంటారు. దీన్నే సాఫ్ట్ ప్లాస్టిక్’ అని కూడా అంటరు. దీంతో చేసిన ప్యాకింగ్‌లోని పదార్థాలను తొలగించగానే ఇవి తేలిగ్గా ముడుచుకు పోతాయి.
పాలీస్టైరీన్ (పీఎస్)
వీటిని గుడ్లను నిల్వచేసే కార్టన్లు, డిస్పోజబుల్ కప్పులు, ప్లాస్టిక్‌తో చేసే స్పూనులు, ఫోర్కులు (కట్లెరీ), కాంపాక్ట్ డిస్కుల వంటి వాటి తయారీలో వాడుతారు. వీటితో నాడీవ్యవస్థపై, ప్రత్యుత్పత్తి వ్యవస్థపై, ఎర్రరక్తకణాలపైన ప్రభావం పడుతుంది.
పాలీ ప్రొపిలీన్ (పీపీ)
కెచప్ సీసాలు, పెరుగు ప్యాకింగ్, మార్జరిన్ అనే వంటనూనెలు, మందులు, సిరప్‌లు, పరాదర్శకం కాని కొన్ని మందుల్ని నిల్వ చేసే సీసాల తయారీకి వీటిని ఉపయోగిస్తుంటారు. మిగతా ప్లాస్టిక్‌లతో పోలిస్తే దీన్ని చాలావరకు సురక్షితమని అంటారుగానీ... దీనివల్ల కలిగే దుష్ప్రభావాలపై ఇంకా పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. అంతమాత్రాన ఇది పూర్తిగా సురక్షితమని చెప్పడానికి వీలు లేదు.
చదవండి: బరువు తగ్గడం కష్టంగా ఉందా? షాకింగ్ రీజన్ ఇదే కావచ్చు!
థాలేట్స్‌తో తయారయ్యే వాటిల్లో కొన్ని...
ఆహారంలో కలిసేందుకు అవకాశం ఉన్న మరో ప్లాస్టిక్ ఉపకరణాలు థాలేట్స్. (ఇంగ్లిష్‌లో థాలేట్స్ స్పెల్లింగ్‌కు ముందర ఉండే ‘పీ’ అక్షరం సైలెంట్ కాగా... కొందరు దీన్నే ఫ్తాతలేట్స్’ అని కూడా ఉచ్చరిస్తుంటారు). ప్లాస్టిక్‌ను ఎటుపడితే అటు ఒంచేందుకు (ఫ్లెక్సిబిలిటీ కోసం) ఉపయోగించే ΄ పాలీ వినైల్ క్లోరైడ్ (పీవీసీ) ఆహారంలో కలిసి దుష్ప్రభావాలను చూపుతాయి.
థాలేట్స్‌ను ఏయే తయారీల్లో ఉపయోగిస్తారంటే...?
ఆహారాన్ని ΄ ప్యాక్ చేసేందుకు వాడే బాక్స్‌ల కోసం.
కూల్‌డ్రింక్స్ లేదా మంచినీటి సీసాల తయారీలో. ∙వాటర్‌ప్రూఫ్ కోట్లు, జాకెట్స్ వంటి దుస్తుల తయారీలో
నీళ్ల పైపుల తయారీలో.
పైకి తోలులా కనిపించే కొన్ని రకాల దుస్తుల తయారీలో.
విద్యుత్ వైర్లపై ఉండే ఇన్సులేటింగ్ పదార్థాలలో
ఎలక్ట్రానిక్ వస్తువుల్లో, వినైల్ ఫ్లోరింగ్స్‌లో
వాటర్‌బెడ్స్, పిల్లల ఆటవస్తువుల్లో
ఆరోగ్యంపై థాలేట్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలు
బైస్ఫినాల్ ఏ (బీపీఏ) లాగే ధాలేట్స్ కూడా టెస్టోస్టెరాన్ వంటి పురుష సెక్స్ హార్మోన్‌పై దుష్ప్రభావం చూపుతాయి. వీటి వల్ల పురుషుల్లో వీర్యం నాణ్యత (స్పెర్మ్ క్వాలిటీ) కూడా దెబ్బతింటుంది. ప్లాస్టిక్‌తో కలిసిన ఆహారం వల్ల అలర్జీలు, ఆస్తమా, పిల్లికూతలు రావచ్చు.
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడానికి లేదా ఒకవేళ వాడుతున్నప్పటికీ... చాలావరకు వాటిని సురక్షితంగా మలచుకోడానికి కొన్ని సూచనలివే... ప్లాస్టిక్ వస్తువుల తయారీలో బైస్ఫినాల్ ఏ లేనివి (బీపీఏ ఫ్రీ) అని రాసి ఉన్న వాటిని మాత్రమే వాడాలి.
ఇదీ చదవండి: ఈ టిప్స్ పాటిస్తే పండగ వేళ మెరిసిపోవడం ఖాయం!
నిర్వహణ : యాసీన్