plastic bags
-
Ashay Bhave: షూట్ ఎట్ ప్లాస్టిక్స్! నీవంతుగా ఒక పరిష్కారం..
ప్లాస్టిక్ వ్యర్థాలను చూసి నిట్టూర్చడం కంటే.. ‘నీవంతుగా ఒక పరిష్కారం’ సూచించు అంటున్నాడు ముంబైకి చెందిన ఆశయ్ భవే. ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి స్నీకర్స్ తయారుచేసే ‘థైలీ’ అనే స్టార్టప్‌కు శ్రీకారం చుట్టి విజయం సాధించాడు..మన దేశంలో ప్రతిరోజూ టన్నుల కొద్ది ప్లాస్టిక్ వ్యర్థాలు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘థైలీ’ అనే కంపెనీ ప్లాస్టిక్ వ్యర్థాలు కొండలా పేరుకుపోకుండా తనవంతు కృషి చేస్తోంది. వ్యాపారపరంగా పెద్ద కంపెనీలతో పోటీ పడుతోంది.‘థైలీ’ అంటే హిందీలో సంచి అని అర్థం.‘ప్లాస్టిక్ సంచులను సరిగ్గా రీసైకిల్ చేయకపోవడం వల్ల పర్యావరణ కాలుష్యం గణనీయంగా పెరుగుతుందనే విషయం తెలుసుకున్నాను. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి థైలీ స్టార్టప్‌కు శ్రీకారం చుట్టాను. పారేసిన ప్లాస్టిక్ సంచుల నుండి ప్రత్యేకంగా సృష్టించిన వినూత్న లెదర్‌ను స్నీకర్స్ కోసం వాడుతున్నాం’ అంటున్నాడు ఆశయ్ భవే.షూస్‌కు సంబంధించిన సోల్‌ను ఇండస్ట్రియల్ స్క్రాప్, టైర్ల నుండి రీసైకిల్ చేసిన రబ్బరుతో తయారుచేస్తారు. షూబాక్స్ను రీసైకిల్ చేసిన జతల నుండి కూడా తయారుచేస్తారు. వాటిలో విత్తనాలు నిక్షిప్తం చేస్తారు. మొక్కలు పెంచడానికి ఇవి ఉపయోగపడతాయి. 2000 సంవత్సరంలో బాస్కెట్‌బాల్ స్నీకర్ ఫ్యాషన్‌ను దృష్టిలో పెట్టుకొని ‘థైలీ’ స్నీకర్ డిజైన్ చేశారు. డిస్కౌంట్ కావాలనుకునేవారు పాత స్నీకర్లు ఇస్తే సరిపోతుంది. షూ తయారీ ప్రక్రియలో ప్రతి దశలో పర్యావరణ స్పృహతో వ్యవహరించడం అనేది ఈ స్టార్టప్ ప్రత్యేకత. ఆశయ్ శ్రమ వృథా పోలేదు. కంపెనీకి ‘పెటా’ సర్టిఫికేషన్‌తో పాటు ఆ సంస్థ నుంచి ప్రతిష్ఠాత్మక ఉత్తమ స్నీకర్ అవార్డ్ లభించింది. పర్యావరణ స్పృహ మాట ఎలా ఉన్నా బడా కంపెనీలతో మార్కెట్లో పోటీ పడడడం అంత తేలిక కాదు.లాభ, నష్టాల మాట ఎలా ఉన్నా... ‘డోన్ట్ జస్ట్ డూ ఇట్ డూ ఇట్ రైట్’ అనేది కంపెనీ నినాదం.‘మా కృషికి గుర్తింపు లభించినందుకు సంతోషంగా ఉంది. ప్లాస్టిక్ వ్యర్థాలు లేని ప్రపంచం నా కల’ అంటున్నాడు 24 సంవత్సరాల ఆశయ్ భవే. న్యూయార్క్‌లోని ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీలో ఫుట్‌వేర్ డిజైన్ కోర్సు చేశాడు ఆశయ్. ఈ స్టార్టప్ పనితీరు, అంకితభావం పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రకు బాగా నచ్చింది. ‘థైలీ ఇన్స్పైరింగ్ స్టార్టప్. యూనికార్న్‌ల కంటే పర్యావరణ బాధ్యతతో వస్తున్న ఇలాంటి స్టార్టప్‌ల అవసరం ఎంతో ఉంది’ అంటూ ఆశయ్ భావేను ప్రశంసించాడు ఆనంద్ మహీంద్ర.ఆ పోటీని తట్టుకొని నిలబడింది ‘థైలీ’ కంపెని..‘మేడ్ ఇన్ ఇండియా’ ప్రాడక్ట్‌గా గుర్తింపు పొందిన ‘థైలీ’ ఇప్పుడు గ్లోబల్ మార్కెట్‌పై కూడా దృష్టి సారించింది. ఇప్పటి వరకు కంపెనీ వేలాది ప్లాస్టిక్ బాటిల్స్, బ్యాగులను రీసైకిల్ చేసింది.ఇవి చదవండి: ముగ్గురు పాక్ హాకీ ఆటగాళ్లపై జీవితకాల నిషేధం -
International Plastic Bag Free Day అందమైన డిజైన్లు, ఆకృతుల్లో ముద్దొచ్చే బ్యాగ్స్ ఇవే!
ఇంటి నుంచి మార్కెట్‌కు, షాపింగ్, ఆఫీసు ఇలా ఏ పనిమీద వెళ్లినా చేతి సంచిలేనిదే పని జరగదు. పాలు, పెరుగు, కూరగాయలు, కిరాణా సరుకులు ఏది తేవాలన్నా ఉండాల్సిందే.కానీ గత కొన్ని దశాబ్దాలుగా చేతి సంచి తీసుకెళ్లే పని లేకుండా చవకగా దొరికే ప్లాస్టిక్ బ్యాగులకు అలవాడి పడి పోయాం. ఈ అలవాటే ప్రకృతికి, పర్యావరణానికి తీరని నష్టాన్ని మిగుల్చుతోంది. గుట్టలు, గుట్టలుగా పేరుకుపోతున్న ప్లాస్టిక్ బ్యాగ్స్ వర్థాలు పెను ముప్పుగా పరిణమిస్తున్నాయి. అందుకే జూలై 3వ తేదీన అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవంగా జరుపుకుంటారు. ప్లాస్టిక్ కాలుష్యంపై అవగాహన కల్పించి, ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించేలా ప్రజలను చైతన్యవంతం చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. ఈ క్రమంలో ప్లాస్టిక్ సంచుల ప్లేస్‌లో పర్యావరణ అనుకూల, బయో-డిగ్రేడబుల్ , కాల్చినా కూడా ఎలాంటి విషపూరిత పొగలు లేదా వాయువులను విడుదల చేయని ప్రత్యామ్నాయ బ్యాగులపై ఓ లుక్కేద్దాం.ప్లాస్టిక్ బ్యాగ్‌లు అత్యంత తక్కువ ఖర్చులో, అనుకూలంగా లభించేవే అయినప్పటి అవి మన పర్యావరణానికి చాలా చేటు చేస్తున్నాయి. అందులోనూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాకులు పర్యావరణానికి తీరని నష్టాల్ని మిగులుస్తున్నాయి. ఈ తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, ప్లాస్టిక్ బ్యాగ్‌లను నిషేధిద్దాం. పర్యావరణాన్ని కాపాడుకుందాం.ప్లాస్టిక్ సంచులకు పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలువివిధ రంగులు డిజైన్లలో లభించే కాగితపు సంచులను వాడదాంరీసైకిల్ చేయడానికి సులభమైనవి కాగితం సంచులుసహజమైన ఫైబర్‌తో తయారయ్యే జనపనార సంచులుప్లాస్టిక్ బ్యాగ్‌లకు మరో చక్కటి ప్రత్యామ్నాయం క్లాత్ బ్యాగ్‌లు మస్లిన్ నుండి డెనిమ్ వరకు పాత బట్టలతో చక్కటి బ్యాగులను తయారు చేసుకోవచ్చు ఎకో-ఫ్రెండ్లీ, డబ్బు ఆదా కూడా స్టైలిష్ ఆఫీస్ బ్యాగ్‌ల నుండి సాధారణ కిరాణా సంచుల వరకుకాన్వాస్తో తయారైన టోట్ బ్యాగ్స్ బెస్ట్ ఆప్షన్అందమైన డిజైన్లతో ఆకట్టుకునే వెదురు సంచులు, మన్నుతాయి కూడా -
హత్య చేసి.. ప్లాస్టిక్ కవర్లో కట్టి పడేసి..
మెదక్: కుటుంబ కలహాలతో బంధువులే వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. నేరం ఎక్కడ బయటపడుతుందో అని మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్లో కట్టి ఓ రహదారి కల్వర్టు కింద పడేశారు. ఐదు నెలల నుంచి కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు బుధవారం మృతుడి అస్థి పంజరాన్ని గుర్తించారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జిన్నారంలో అలస్యంగా వెలుగులోకి వచ్చింది. బొల్లారం సీఐ నయీముద్దీన్ కథనం ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బ్రిజేష్ గోస్వామి(26) జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ పరిధిలోగల పోచమ్మ బస్తీలో నివాసం ఉంటూ ఓ పరిశ్రమలో పనులు చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నాడు. గతేడాది ఆగస్టు 6న గోస్వామి కనబడటం లేదని అతని భార్య ఆర్తిదేవీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే.. గోస్వామి హత్యకు గురయ్యాడని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. గోస్వామి బంధువులను తమదైన శైలిలో విచారించారు. దీంతో గోస్వామిని తామే హత్య చేసినట్లు బంధువులు అజయ్, సీతు, రాజన్, విజయ్ అంగీకరించారు. మృతదేహాన్ని ఖాజీపల్లి ప్రధాన రహదారి కల్వర్టు కింద ఓ ప్లాస్టిక్ సంచిలో పడేసినట్లు నిందితులు వెల్లడించారు. ఎస్సీ రూపేశ్, డీఎస్పీ పురుషోత్తంరెడ్డి, సీఐ నయీముద్దీన్ తోపాటు పోలీ సులు బుధవారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గోస్వామి మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి, అస్థిపంజరం మాత్రమే కనిపించింది. మృతదేహంపై ఉన్న బట్టల ఆధారంగా కుటుంబ సభ్యులు గోస్వామి మృతదేహంగా గుర్తించారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కొన్ని కారణాల వల్ల గోస్వామి తన చెల్లిని కాపురం చేసేందుకు పంపకపోవడంతో కక్ష కట్టి అత్తారింటికి చెందిన బంధువులే హత్య చేసినట్లు సీఐ వివరించారు. -
‘మిషన్ లైఫ్ అమలులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ది అగ్రస్థానం’
విజయవాడ: ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రిస్తాం, పర్యావరణాన్ని కాపాడుకుంటామని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞపూనాలని పర్యావరణ దినోత్సవం-2023 సందర్భంగా రాష్ట్ర ఇంధన, పర్యావరణ, శాస్త్ర-సాంకేతిక, అటవీ, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలోని ది వెన్యూ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను మంత్రి సందర్శించారు. అనంతరం ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తరువాత ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ లకు ప్రత్యామ్నాయంగా క్లాత్ తో రూపొందించిన బ్యాగ్ ను అందించే ఎనీ టైం బ్యాగ్ (ఎటిబి) వెండింగ్ మిషన్‌ను మంత్రి ఆవిష్కరించారు. ప్లాస్టిక్ వినియోగంను నివారించడం, కాలుష్యాన్ని నియంత్రించాలంటూ పర్యావరణ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం పర్యావరణహిత కార్యక్రమాలను అమలు చేస్తున్న పరిశ్రమలు, ఆస్పత్రులు, స్థానిక సంస్థలను ప్రోత్సహిస్తూ అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, 1975 నుంచి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జూన్ 5వ తేదీన పర్యావరణ దినోత్సవంను జరుపుకుంటున్నామని గుర్తచేశారు. అందరిలోనూ పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు, పర్యావరణంకు ముప్పు లేని జీవన విధానంను అలవర్చుకునేందుకు ఐక్యరాజ్యసమతి ఈ దినోత్సవంను ప్రకటించిందని వివరించారు. ఈ ఏడాది ప్లాస్టిక్ వినియోగం వల్ల ఏర్పడుతున్న కాలుష్యం, దానికి పరిష్కారాలు అనే అంశంపై ప్రపంచం అంతా పర్యావరణ దినోత్సవంను జరుపుకుంటోందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ గతంలో విశాఖపట్నంలో పర్యటించిన సందర్భంగాగ ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ చేసిన విషయాన్నిమంత్రి గుర్తుచేస్తూ తిరుమలలో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్‌ను పూర్తి స్థాయిలో నిషేధించడం జరిగిందన్నారు. ఇదే మాదిరిగా పలు దేవాలయాలు, మున్సిపల్ కార్పోరేషన్లలో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ను నిషేదించామని చెప్పుకొచ్చారు. కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన మిషన్ లైఫ్ ప్రోగ్రాంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణపై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ది, అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతోనే ఈ ఘనతను సాధించగలిగామన్నారు. అంతేగాక ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్రప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఆంధ్రప్రదేశ్ లో నీటి ఆదా, విద్యుత్ పొదుపు, సరైన ఆహార విధానంను అలవరుచుకోవడం, వ్యర్థాలను తగ్గించుకోవడం, స్వచ్ఛతా కార్యకలాపాల్లో పాల్గొనడం, ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడం, ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తగ్గించుకోవడం అనే ఏడు అంశాలపై ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నామన్నారు. అంతేకాదు మిషన్ లైఫ్ ప్రోగ్రాంలో భాగంగా మన రాష్ట్రంలోని సముద్రతీరాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే కార్యక్రమాన్ని 15 రోజుల పాటు ప్రజాభాగస్వామ్యంతో చేపట్టామని పేర్కొన్నారు. అలాగే అన్ని పట్టణాలు, నగరాల్లో కాలువలు, చెరువుల్లో క్లీనింగ్ కార్యక్రమాలు, పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే బైక్ ర్యాలీలు, ప్రధాన ట్రాఫిక్ కూడళ్ళ వద్ద పర్యావరణ అంశాలపై ప్రదర్శన బోర్డులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్యుత్ పొదుపు చర్యలు, నీటి పరిరక్షణ విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. కాలుష్యరహిత విద్యుత్ ఉత్పత్తికి సీఎం జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. సౌర విద్యుత్ ఉత్పత్తికి గానూ గత మార్చి 3,4 తేదీల్లో విశాఖలో జరిగిన పెట్టుబడిదారుల సదస్సుకు ప్రముఖ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించి, వారితో సౌరవిద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు అవగాహన కుదుర్చుకున్నామన్నారు. ఈ సదస్సులో మొత్తం రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా, రూ. 9 లక్షల కోట్లు సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి రంగంలో వచ్చాయని వివరించారు. విద్యుత్ ఉత్పత్తిలో సంప్రదాయేతర వనరులకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో ఘన వ్యర్థాల నిర్యూలన కోసం 'ఏపీ ఎన్విరాన్ మెంట్ మేనేజ్ మెంట్ కార్పోరేషన్' ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఘన వ్యర్థాలను సురక్షితంగా నిర్మూలన చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గతంలో తాను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్దిశాఖ మంత్రిగా రాష్ట్రంలో జగనన్న పచ్చతోరణం కింద కోటి మొక్కలను నాటించడం జరిగిందన్నారు. వాటిని పర్యవేక్షించేందుకు కూడా నరేగా నుంచి నిధులను వినియోగించామని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద మొక్కలను తీసుకువచ్చి 16 వేల కిలోమీటర్ల పరిధిలో అవెన్యూ ప్లాంటేషన్ కింద 65 లక్షల మొక్కలను నాటడం జరిగిందన్నారు.. ప్రస్తుతం అటవీశాఖ మంత్రిగా ఈ రాష్ట్రంలోని 120 అర్బన్ ప్రాంతాల్లో నగర వనాలను ఏర్పాటు చేయడంతో పాటు ఎకో పార్క్ లను అభివృద్ది చేయడానికి కృషి చేస్తున్నానని తెలిపారు. మన రాష్ట్రంలో 37,392 చదరపు కిలోమీటర్ల మేర అడవులు విస్తరించి ఉన్నాయి అంటే 23 శాతంగా ఉన్న అడవులను 33 శాతంకు పెంచాలనే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్ పని చేస్తున్నారన్నారు. కమ్యూనిటీ ఫారెస్ట్ వంటి కార్యక్రమాలు, రైతులకు బీడు భూముల్లో ఉద్యానవనాల పెంపకంను ప్రోత్సహించేలా చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్రంలో చాలా పరిశ్రమలు ఉన్నాయని, రెడ్, ఆరెంజ్ కేటగిరి పరిశ్రమల నుంచి సిఎస్ఆర్ నిధుల ద్వారా పచ్చదనంను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పచ్చదనంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యపడుతుందని భావిస్తున్నామన్నారు. పర్యావరణం సురక్షితంగా ఉంటేనే మానవాళితో పాటు అన్ని జంతు, జీవజాలాల మనుగడ సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.పర్యావరణంను కాపాడుకోవడం, కాలుష్యాన్ని నియంత్రించుకోవడం ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా గుర్తించాలని కోరుకుంటున్నానన్నారు. పర్యావరణహితం కోసం కృషి చేస్తున్న వ్యక్తులు, సంస్థలను ప్రతిఏటా పర్యావరణ పరిరక్షణ దినోత్సవం నాడు సన్మానిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. పర్యావరణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచానికి ఒకే భూమి ఉందని, దీనిని ప్రతి ఒక్కరూ విధిగా కాపాడుకోవాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారనే విషయం గుర్తుచేశారు. ఏపి పిసిబి ద్వారా గాలి, నీటి కాలుష్యంను తగ్గించుకునేందుకు పలు చర్యలు తీసుకున్నామన్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ ను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు. ప్రతి జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లకు మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ను జాగ్రత్తగా నిర్వీర్యం చేసేందుకు ప్రత్యేకమైన కార్యాచరణను నిర్ధేశించామన్నారు. పర్యావరణంను కాపాడేందుకు బొగ్గుతో జరిగే విద్యుత్ ఉత్పత్తికి ప్రత్యామ్నాయంగా సంప్రదాయేతర ఇంధన వనరులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. ఆలాగే పెట్రో ఇంధనంతో నడిచే వాహనాలకు బదులుగా ఎలక్ట్రిక్ వాహనాలను కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపారు. అంతర్జాతీయంగా యుఎన్ నిర్వహించిన మిషన్ లైఫ్ లో ప్రధానమంత్రి పాల్గొని కాలుష్య కారకమైన ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించేందుకు తమ వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పటికే సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ను నిషేధించడం జరిగిందని, ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నియంత్రించడం, సరైన విధానంలో ప్లాస్టిక్ ను సేకరించి, వాటిని రీసైకిల్ చేసేందుకు తగు చర్యలు చేపట్టామని నీరబ్ కుమార్ ప్రసాద్ అన్నారు. కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ బి.శ్రీధర్ మాట్లాడుతూ, ప్లాస్టిక్ వినియోగం మన దైనందిన జీవనంలో భాగమైందని పేర్కొన్నారు. కాలుష్య నియంత్రణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ వినియోగం 80 కోట్ల మెట్రిక్ టన్నులు ఉంటే, దీనిలో 9 శాతం మాత్రమే రీసైక్లింగ్ అవుతోందని గణాంకాలతో సహా వివరించారు. మిగిలిన ప్లాస్టిక్ నదులు, సముద్రాలు, భూమిలో కలిసి విపరీతంగా కాలుష్యం పెరుగుతోందన్నారు. ప్లాస్టిక్ ను నిర్వీర్యం చేసేందుకు దానిని తగులబెట్టడం ద్వారా పర్యావరణానికి విఘాతం కలిగించే విష వాయువులు గాలిలో కలుస్తున్నాయని, ఇది మానవాళికే ప్రమాదకరమన్నారు. ప్లాస్టిక్ వినియోగంపై వచ్చిన కొత్త నిబంధనలను అమలు చేయబోతున్నామని తెలిపారు. గాలి, నీటి,భూ కాలుష్యంను తగ్గించడం ద్వారా భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణాన్ని అందిచగలుగుతామని శ్రీధర్ అన్నారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ మల్లాది విష్ణు మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం వల్ల ఏర్పడుతున్న హాని నుంచి బయటపడాలంటే, నిపుణులు చేస్తున్న సూచనలను ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. విజయవాడ నగర పాలకసంస్థ ప్లాస్టిక్ ను నిషేదించిందని, సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ పై పూర్తి స్థాయిలో కట్టడి చేస్తున్నామన్నారు. పర్యావరణంను పరిరక్షించేందుకు నగరంలోని కాలువలను శుద్ధి చేస్తున్నామన్నారు. దాదాపు 5000 టన్నుల చెత్తను వెలికితీసిన విషయాన్ని మల్లాది విష్ణు గుర్తు చేశారు.అర్భన్ ఫారెస్ట్రీ కింద విజయవాడ నగరంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కోరారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా ఎపి పిసిబి ఆధ్వర్యంలో కాలుష్య నియంత్రణను వివరిస్తూ వేదికపై భాగవతుల వెంకట రామశర్మ శిష్య బృందం ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ప్లాస్టిక్ సంచులు వాడొద్దు.. నార సంచులు, గుడ్డ సంచులు వినియోగించాలని ప్లాస్టిక్ భూతంపై పాడిన పాట, వివిధ రకాల కాలుష్యాలను వివరిస్తూ, భూమిని కాపాడుకుందాం అని పాడిన పాట, పర్యావరణం కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అంటూ రాజమహేంద్రవరానికి చెందిన విభూది దళం బ్రదర్స్ ప్రదర్శించిన బుర్రకథ ఆద్యంతం ఆలోచింపజేశాయి. ఈ సందర్భంగా పర్యావరణ హిత కార్యక్రమాలు నిర్వహిస్తున్న పారిశ్రామిక సంస్థలు, ఆస్పత్రుల ప్రతినిధులకు, స్థానిక సంస్థలకు కలిపి మొత్తం 13 అవార్డులను మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేశారు. డాక్టర్ రెడ్డీస్ లేబరేటరీస్, లావురుస్ లేబరేటరీస్, జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్ మెంట్ లిమిటెడ్, కియా మోటార్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, భారతీ సిమెంట్స్ కార్పోరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులకు మంత్రి అవార్డులను అందజేశారు. ఆసుపత్రుల విభాగంలో విశాఖపట్నం అపోలో హాస్పిటల్స్, విజయవాడ సెంట్రల్ రైల్వే హాస్పిటల్, విజయవాడ ఆయూష్ హాస్పిటల్, సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైయ్యర్ మెడికల్ సైన్సెస్, తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రతినిధులకు అవార్డులను అందజేశారు. అలాగే అర్బన్ లోకల్ బాడీస్ కేటగిరిలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్, విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్, తిరుపతి మున్సిపల్ కార్పోరేషన్ అధికారులకు అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే శ్రీ. మల్లాది విష్ణు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ. నీరబ్ కుమార్ ప్రసాద్, పిసిబి మెంబర్ సెక్రటరీ బి.శ్రీధర్, తిరుపతి మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ డాక్టర్ శిరీషా యాదవ్, జెఎన్టియు డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్.జె. మురళీకృష్ణ, ప్రొఫెసర్ రామకృష్ణ, ఏపీ పీసీబీ మెంబర్ శివకృష్ణారెడ్డి, ఎన్విరాన్ మెంట్ చీఫ్ ఇంజనీర్ ఎన్.వి.భాస్కర్ రావు, పలువురు పారిశ్రామికవేత్తలు, తదితరులు పాల్గొన్నారు. -
వెరైటీ వంట: ప్లాస్టిక్ కవర్లో చేపల పులుసు, ఈ బామ్మ ఎలా చేసిందో చూడండి!
ఇటీవల స్మార్ట్‌ఫోన్ వాడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. మొబైల్ చేతిలో ఉంటే చాలు ప్రపంచం నలుమూలలా ఏం జరుగుతున్నా క్షణాల్లో తెలిసిపోతోంది. ఈ క్రమంలో సోషల్ మీడియా వాసుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏం చేసినా వెరైటీగా ప్రయత్నిస్తూ ఆ వీడియోలను నెట్టింట షేర్ చేస్తున్నారు. ఇవి యూజర్లకు నచ్చితే లక్షల్లో లైకులు, వ్యూస్‌తో వైరల్‌గా మారుతుంది. ప్రస్తుతం ఇదొక ట్రెండ్‌గా మారిందనే చెప్పాలి. కట్టెల మంటపై చేపల పులుసు వండుతున్న ఓ పెద్దావిడ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో.. ఒక బామ్మ కట్టెల మంట మీద నీటితో నిండిన ప్లాస్టిక్ బ్యాగ్‌ను ఉంచి వంట చేయడం ప్రారంభించింది. అయితే ఈ వీడియో చూస్తున్న వారంతా మంటపై పెట్టిన ప్టాస్టిక్ కవర్ వెంటనే కరిగిపోతుందని అనుకున్నారు. అయితే అలా జరగలేదు. వేడి ప్రభావం దాని మీద ఏ మాత్రం చూపించ లేదు. కాసేపు తర్వాత ఆ పెద్దావిడ కవర్లో ఉన్న నీటిలో పలు దినుసులు వేస్తూ చేప, కొద్దిగా మిర్చిని జోడిస్తుంది. ఈ వీడియోని ది ఫైజెజ్ అనే ట్విటర్ యూజర్ షేర్ చేయగా ఇప్పటివరకూ 5 లక్షల మందిపైగా వీక్షించారు. దీన్ని చూసిన నెటిజన్ల మదిలో పలు ప్రశ్నలను లేవనెత్తింది. కొంతమంది వినియోగదారులు ప్లాస్టిక్‌లో వంట చేయడం వల్ల క్యాన్సర్ వస్తుందని చెప్పగా, మరికొందరు ప్లాస్టిక్ నిప్పు వేడి తాకగానే కరిగిపోతుంది కదా అయినా ఇది ఎలా సాధ్యమైందని కామెంట్ చేస్తున్నారు. An elementary physics.pic.twitter.com/aqDuNa0Y5G — The Figen (@TheFigen_) February 23, 2023 చదవండి: మిస్టరీగా వైట్‌బాల్.. గాడ్జిల్లా గుడ్డేం కాదు! -
దారుణం: శస్త్ర చికిత్స చేసినట్లు చేసి..అవయవాలు దొంగలించారు
శస్త్ర చికిత్స కోసం వెళ్లిన ఓ బాలిక శరీరంలో ఏకంగా అవయవాలనే తొలగించేశారు వైద్యులు. దీంతో సదరు బాలిక డిశ్చార్జ్ అయ్యి వెళ్లిన రెండు రోజులకే చనిపోయింది. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో 15 ఏళ్ల బాలిక పేగు సంబంధిత వ్యాధితో జనవరి 21న అడ్మిట్ అయ్యింది. దీంతో ఆమెకు జనవరి 24న శస్త్ర చికిత్స చేశారు. చికిత్స చేసిన అనంతరం రెండు రోజుల తర్వాత అంటే జనవరి 26న ఆమె చనిపోయింది. తొలుత బాలిక కుటుంబ సభ్యులు సదరు ఆస్పత్రిపై ఎలాంటి ఫిర్యాదు చేయకుండానే మృతదేహాన్ని ఇంటికి తీసుకుపోయారు. అంతిమ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా.. ఆమె మృతదేహంపై చిల్లులు చిల్లులుగా ఉండి ఏవో సంచులుగా కనిపించాయి. అప్పుడే అనుమానం వచ్చింది మృతదేహం నుంచి అవయవాలు తొలగించి వాటి స్థానంలో ప్లాస్టిక్ సంచులు ఉంచినట్లు అనిపించి వెంటనే వారు ఆ కార్యక్రమాలను నిలిపేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మెడికల్‌కి సంబంధించిన కేసుగా నమోదు చేశారు. ఆ బాలికకు శస్త్ర చికిత్స చేసిన హిందూ రావు ఆస్పత్రిపై కూడా కేసు నమోదు చేశారు. ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని గురుతేగ్ బహుదూర్ ఆస్పత్రి వద్ద ఉంచారు. ఆ బాలికకు పోస్ట్‌మార్టం చేసేందుకు ప్రత్యేక మెడికల్ బోర్డును నియమించాలని పోలీసులు ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు డీసీపీ కల్సి ఈ కేసును పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. (చదవండి: ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హత్యలు కేవలం ప్రమాదాలే: ఉత్తరాఖండ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు) -
Andhra Pradesh: ‘ప్లాస్టిక్’పై నిషేధం పక్కాగా అమలు
సాక్షి, అమరావతి: పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్‌పై రాష్ట్ర ప్రభుత్వం నిఘాను తీవ్రం చేసింది. నిషేధించిన ప్లాస్టిక్ సంచుల తయారీదారులు, స్టాకిస్టులు, వినియోగదారులపై చర్యలు చేపడుతోంది. 75 మైక్రాన్లు, అంతకంటే తక్కువ మందం గల ప్లాస్టిక్ సంచులను గతేడాది జూలై నుంచి ప్రభుత్వం నిషేధించింది. దీనిపై తయారీదార్లు, స్టాకిస్టులకు ముందుగానే కాలుష్య నియంత్రణ మండలి, మున్సిపల్ శాఖ అధికారులు అవగాహన కల్పించారు. స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక సంఘాల ప్రతినిధుల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. తయారీదార్ల విజ్ఞప్తి మేరకు గత డిసెంబర్ 31 వరకు 75 మైక్రాన్ల మందం గల ప్లాస్టిక్ సంచుల వాడకానికి అనుమతించారు. అంతకంటే తక్కువ మందం గల ప్లాస్టిక్‌పై నిషేధాన్ని కొనసాగించారు. గతేడాది జూలై నుంచి నవంబర్ వరకు ఐదు నెలల్లో రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 964 బృందాలు 39,242 చోట్ల తనిఖీ చేశాయి. 75 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల ప్లాస్టిక్ సంచులను నిల్వ చేసిన వ్యాపారుల నుంచి 117.57 టన్నుల సరుకును సీజ్ చేశారు. స్టాకిస్టులు, వాడకందారుల నుంచి రూ.1.80 కోట్లు జరిమానాగా వసూలు చేశాయి. పర్యావరణానికి హానికలిగించే రీతిలో బహిరంగ ప్రదేశాల్లో ప్లాస్టిక్ చెత్తను తగులబెట్టిన వారి నుంచి అధికారులు రూ.6,53,643 జరిమానా వసూలు చేశారు. ఇకపై 120 మైక్రాన్ల సంచులకే అనుమతి గత ఏడాది డిసెంబర్ 31 నుంచి ప్లాస్టిక్ వాడకంపై కొత్త నిబంధనలను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. తయారీ నుంచి వాడకం వరకు అన్ని స్థాయిల్లోనూ పునర్వినియోగానికి అనువైన 120 మైక్రాన్ల మందం గల ప్లాస్టిక్ సంచులకే అనుమతినిచ్చింది. అంతకంటే తక్కువ మందం ఉంటే తయారీ, అమ్మకంతో పాటు వాడకంపైనా భారీ జరిమానాలు విధించేందుకు కార్యాచరణ రూపొందించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్‌లోని ప్లాసిŠట్క్ తయారీ సంస్థల నుంచి వచ్చే సరకు లెక్కలున్నాయి, యూపీ, బిహార్ నుంచి అనుమతి లేకుండా వస్తున్న దిగుమతులపై అధికారులు నిఘా పెట్టారు. వ్యాపారులు, నిల్వదారులు ఇకపై 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న సంచులను ఉంచుకుంటే భారీ జరిమానా విధించడంతో పాటు చట్టపరంగా కేసులు నమోదు చేస్తారు. -
వైరల్ వీడియో: ప్లాస్టిక్ కవర్లలో ‘వంట గ్యాస్’.. ప్రమాదమని తెలిసినా తప్పట్లే!
-
ప్లాస్టిక్ కవర్లలో ‘వంట గ్యాస్’.. ప్రమాదమని తెలిసినా తప్పట్లే!
ఇస్లామాబాద్: మన పొరుగు దేశం పాకిస్థాన్‌లో ప్రజల జీవితంపై ఆర్థిక సంక్షోభం ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు ఈ దృశ్యాలే నిదర్శనం. సంక్షోభం తలెత్తడం వల్ల రాయితీపై అందించే నిత్యావసర వస్తువులపై పాక్ ప్రభుత్వం కోత పెడుతోంది. మరోవైపు ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ దుర్భర పరిస్థితుల్లో ధరల పెరుగుదల భారాన్ని తగ్గించుకునేందుకు ఆ దేశ ప్రజలు వంటగ్యాస్‌ను ప్లాస్టిక్ కవర్లలో నిల్వ చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. పాకిస్థాన్‌లోని వాయస్వ ఖైబెర్ పఖ్తుంఖ్వా రాష్ట్రంలో స్థానికులు ఎల్పీజీ గ్యాస్‌ను నిల్వ చేసుకునేందుకు పెద్ద పెద్ద ప్లాస్టిక్ బ్యాగులను తీసుకెళ్తున్న దృశ్యాలు వీడియోల్లో కనిపిస్తున్నాయి. దేశ గ్యాస్ పైపులైన్ నెట్‌వర్క్‌కు అనుసంధానమైన దుకాణల వద్దకు ప్లాస్టిక్ బ్యాగులను తీసుకెళ్లి అందులో వంట గ్యాస్‌ను నింపించుకుంటున్నారు. అందులోంచి లీకేజీ లేకుండా విక్రయదారులు బ్యాగులకు బిగుతుగా నాజల్, వాల్వ్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ తర్వాతే వాటిని ప్రజలకు విక్రయిస్తున్నారు. ప్లాస్టిక్ బ్యాగుల్లో 3-4 కేజీల గ్యాస్ నింపేందుకు ఒక గంట సమయం పడుతోంది. ఈ వీడియోను ఓ వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. ‘పాకిస్థాన్‌లో సిలిండర్లలో కాకుండా ప్లాస్టిక్ బ్యాగుల్లో వంట గ్యాస్ నింపుతున్నారు. గ్యాస్ పైపులన్ నెట్‌వర్క్‌తో అనుసంధానమైన దుకాణాల్లో ప్లాస్టిక్ బ్యాగుల్లో గ్యాస్ నింపుతున్నారు. చిన్న ఎలక్ట్రిక్ సక్షన్ పంప్ సాయంతో వీటిని వంట గదిలో వినియోగిస్తున్నారు.’అని రాసుకొచ్చారు. అత్యంత ప్రమాదకరమైన రీతిలో వీటిని ఉపయోగిస్తున్నారని వస్తోన్న వార్తలను అధికారులు కొట్టిపారేశారు. ప్లాస్టిక్ బ్యాగుల వినియోగంపై ఆంక్షలు విధించినట్లు స్థానిక మీడియాతో వెల్లడించారు. In Pakistan, the practice of using gas packed in plastic bags instead of cylinders for cooking has increased. Gas is sold by filling bags inside the shops connected to the gas pipeline network. People use it in the kitchen with the help of a small electric suction pump.#pkmb pic.twitter.com/e1DpNp20Ku — R Singh...🤸🤸 (@lonewolf_singh) December 31, 2022 ఇదీ చదవండి: ఆకాశంలో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. ముగ్గురు మృతి -
ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌లకు చెక్.. అమల్లోకి నిషేధం
సాక్షి, అమరావతి: ఒక్కసారి వాడి పారవేసే ప్లాస్టిక్ సంచుల తయారీ, వినియోగంపై కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధం అమల్లోకి వచ్చింది. ఇకపై దేశవ్యాప్తంగా 120 మైక్రాన్లు లేదా ఆపై మందం గల ప్లాస్టిక్ సంచులను మాత్రమే వినియోగించాలి. ఈ మేరకు కేంద్ర పర్యావరణ శాఖ జారీ చేసిన ఆదేశాలు డిసెంబర్ 31 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇకపై 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల క్యారీ బ్యాగ్‌లు తయారు చేసినా, దిగుమతి చేసుకున్నా, అమ్మినా, వినియోగించినా కఠిన చర్యలు తీసుకుంటారు. ఇప్పటివరకు 75 మైక్రాన్ల మందం గల క్యారీ బ్యాగులను వినియోగించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇకపై పునర్ వినియోగానికి అవకాశమున్న 120 మైక్రాన్ల ప్లాస్టిక్ సంచులను మాత్రమే వినియోగించాలని రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీలతో పాటు జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిబంధనల అమలు, పర్యవేక్షణను వార్డు శానిటేషన్ కార్యదర్శులు చూడాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ సంచులు పర్యావరణానికి ఎంత ప్రమాదకరంగా మారుతున్నాయో ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. కాగా, వీధుల్లో ఏర్పాటు చేసే ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై విధించిన నిషేధం కూడా ఈ నెల 26వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. నిబంధనల అమలును తనిఖీ చేసేందుకు ప్రత్యేక ఎన్ఫోర్సుమెంట్ విభాగాలను సైతం ఏర్పాటు చేశారు. ఈ బృందాలు నగరాలు, పట్టణాలు, పంచాయతీల్లో తనిఖీలు చేయనున్నాయి. ఇదీ చదవండి: రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేధం..ప్రజల భద్రత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం -
Plastic: అంతం కావాలంటే పంతం కొనసాగాలి
ప్లాస్టిక్ వాడకం తగ్గించి భయంకర జబ్బులను నియంత్రించే దిశగా జూలై ఒకటో తేదీన ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా అధికారులు అడుగులు వేశారు. కానీ రెండు మాసాలు కూడా గడవక ముందే అధికారులు శ్రద్ధ తగ్గించారు. దీంతో మున్సిపాలిటీల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు మళ్లీ యథాతథంగా పెరిగాయి. ప్లాస్టిక్ వ్యర్థాలకు చిరునామాగా నిలిచిన అనంతపురం నగరపాలక సంస్థలో జూలై నెలకు ముందు ఎంత ఉత్పత్తి అయ్యేవో అంత కంటే ఎక్కువగా ఆగస్టులో పెరిగాయి. దీన్ని బట్టి ప్లాస్టిక్ అంతం కోసం అధికారులు దూకుడు కొనసాగించాల్సిన అవసరం కనిపిస్తోంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఒక కార్పొరేషన్, ఎనిమిది మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇక్కడే ఎక్కువగా ప్లాస్టిక్ వినియోగం జరిగేది. ఈ ఏడాది జూలై ఒకటో తేదీకి ముందు నెలకు సగటున 28.5 టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అయ్యేవి. జూలై ఒకటి తర్వాత అధికారులు ప్లాస్టిక్ నియంత్రణ కోసం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. దీంతో ఆ మాసంలో ఐదు టన్నుల వరకు ప్లాస్టిక్ వ్యర్థాలు తగ్గాయి. అనంతపురంలో టన్నులకొద్దీ... అనంతపురం కార్పొరేషన్ పరిధిలో మరీ దారుణంగా ఉంది. నియంత్రణ చర్యలు తీసుకోకమునుపు నెలకు 12 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తయ్యేవి. జూలైలో రెండు టన్నులు తగ్గి 10 టన్నులకు చేరింది. అధికారులు తనిఖీలు తగ్గించడంతో ఆగస్టులో గతం కంటే ఎక్కువగా 14 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పెరిగాయి. ముఖ్యంగా అనంతపురం పాతూరులోని హోల్‌సేల్ దుకాణాల నుంచి టన్నుల కొద్దీ ప్లాస్టిక్ కవర్లు, కప్పులు ఇలా రకరకాల వస్తువులు ఇతర మున్సిపాలిటీలకు సరఫరా అవుతున్నాయి. చిన్న చిన్న షాపులు మొదలుకొని పెద్ద హోటళ్ల వరకూ మళ్లీ ప్లాస్టిక్ ఉత్పత్తులు వాడుతున్నారు. మున్సిపల్ అధికారుల తనిఖీలు తగ్గడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. అధికారులు దాడులు చేస్తేనే నియంత్రణలోకి రాదని, ప్లాస్టిక్‌పై ప్రజలు కూడా ఆలోచించి వాడకాన్ని తగ్గిస్తేనే ఫలితం ఉంటుందని నిపుణులు అంటున్నారు. ప్రజల్లోనూ మార్పు రావాలి అధికారులు చర్యలు తీసుకోవడంతో పాటు ప్లాస్టిక్ వాడకంతో కలిగే నష్టాలపై ప్రజలూ ఆలోచించాలి. అత్యంత భయంకర జబ్బులకు మూలమైన ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడంలో ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు రావాలి. అందరిలో మార్పు వస్తేనే ప్లాస్టిక్ వినియోగ నియంత్రణ సాధ్యం. – శంకర్రావు, పర్యావరణ ఇంజినీర్, కాలుష్యనియంత్రణ మండలి స్పెషల్ డ్రైవ్ చేపడతాం ప్లాస్టిక్ నివారణ చర్యల్లో భాగంగా మళ్లీ స్పెషల్ డ్రైవ్ చేపడతాం. ఇప్పటికే శానిటేషన్ కార్యదర్శులు వారి పరిధిలోని వ్యాపార సముదాయాల్లో రోజూవారీ తనిఖీలు చేయాలని ఆదేశాలు జారీ చేశాం. నిబంధనలకు విరుద్ధంగా ప్లాస్టిక్‌ను వినియోగిస్తే..అపరాధ రుసుం వసూలు చేస్తాం. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. ప్రజలు సైతం సామాజిక బాధ్యతగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేయాలి. – కె.భాగ్యలక్ష్మి, కమిషనర్, అనంతపురం నగరపాలక సంస్థ -
ప్లాస్టిక్ కొనం.. అమ్మం.. ప్రోత్సహించం
సాక్షిప్రతినిధి, కాకినాడ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న ప్లాస్టిక్ నిషేధాన్ని స్వచ్చందంగా అమలు చేసేందుకు కాకినాడ వ్యాపారస్తులు ముందుకు వచ్చారు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఆజాదీకా అమృత్ మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోన్న సందర్భాన్ని ఇందుకు వేదికగా చేసుకున్నారు. ప్రభుత్వ సంకల్పానికి తాము సైతం అంటూ నిషేధిత ప్లాస్టిక్ వస్తువులను కాకినాడ నగరపాలక సంస్థకు స్వచ్చందంగా అప్పగించారు. తొలి ప్రయత్నంగా 35 మంది వ్యాపారులు తమ వద్ద ఉన్న రూ.7 లక్షలు విలువైన 75 మైక్రానులకన్నా తక్కువ మందం కలిగిన క్యారీబ్యాగ్‌లు, థర్మా కోల్‌ప్లేట్లు, గ్లాసులు, కప్పులు, స్పూన్లు తదితర ప్లాస్టిక్ వస్తువులను కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కమిషనర్ రమేష్‌కు అప్పగించారు. నిషేధిత ప్లాస్టిక్ వస్తువులను ‘కొనేది లేదు–అమ్మేది లేదు–ప్రోత్సహించేది లేదు’ అంటూ వ్యాపారులు బహిరంగంగా ప్రతిజ్ఞ చేసి వ్యక్తిగతంగా రూ.10 స్టాంప్ పేపర్స్‌పై హామీ పత్రాలు రాసి కార్పొరేషన్‌కు అందజేశారు. -
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉంటే చర్యలు
సాక్షి, అమరావతి: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించేందుకు అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో చర్యలు చేపట్టినట్లు ఏపీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నియంత్రణపై కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆదేశాలను శుక్రవారం నుంచి అమలుచేస్తున్నట్లు ప్రకటించారు. వీటి ప్రకారం.. ఒకసారి వినియోగించి పారేసే (సింగిల్ యూజ్) ప్లాస్టిక్ వస్తువులు తయారుచేయడం, దిగుమతి చేయడం, నిల్వచేయడం, పంపిణీ, విక్రయంతో పాటు ఉపయోగించడం చట్ట ప్రకారం నిషేధించినట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా ప్లాస్టిక్ స్టిక్‌లతో కూడిన ఇయర్ బడ్స్, ప్లాస్టిక్ జెండాలు, క్యాండీ స్టిక్స్, బెలూన్లకు కట్టే ప్లాస్టిక్ స్టిక్కులు, ఐస్‌క్రీమ్ స్టిక్స్‌తో పాటు టీ, కాఫీ కలుపుకునేందుకు వాడే ప్లాస్టిక్ స్టిక్స్‌ను పూర్తిగా నిషేధించినట్లు ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు. ఈ మేరకు అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సింగిల్ యూజ్ ప్లాటిక్ నిషేధంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వార్డు వలంటీర్లు ప్రచారం చేయాలని ఆదేశించారు. ఇందులో భాగంగా అన్ని వార్డుల్లోను ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నియమాలపై కరపత్రాలను పంపిణీ చేయాలని, కూడళ్లల్లో హోర్డింగ్స్‌ను ఏర్పాటుచేయాలన్నారు. సినిమా థియేటర్లలో స్లైడ్లను ప్రదర్శించడంతో పాటు, టీవీ స్క్రోలింగ్స్, ర్యాలీలు నిర్వహించాలన్నారు. ఆ వస్తువులు ఉంటే లైసెన్స్ రద్దు వాణిజ్య షాపులు, రిటైలర్లు, అమ్మకందారులు, వీధి వ్యాపారులు, కూరగాయలు, పండ్ల మార్కెట్లు, మాల్స్‌తో పాటు ఇతర సంస్థల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పరికరాలు, క్యారీ బ్యాగులు నిల్వచేయడంతో పాటు వినియోగించినట్లు తేలితే ఆయా దుకాణాలు, షాపుల వాణిజ్య లైసెన్సులు రద్దుచేస్తామని హెచ్చరించారు. దీంతోపాటు భారీగా జరిమానాలు కూడా విధిస్తామన్నారు. ఇక శుక్రవారం నుంచి అమలులోకి వచ్చే నిబంధనలను అమలుచేసేందుకు, దుకాణాలను తనిఖీ చేసేందుకు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 805 టాస్క్ఫోర్సు బృందాలను నియమించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటిదాకా ఈ బృందాలు 75 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల 158 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ బ్యాగులను సీజ్ చేసి, రూ.1.54 కోట్ల జరిమానా వసూలు చేసినట్టు సీడీఎంఏ ప్రవీణ్‌కుమార్ వివరించారు. -
సాక్షి కార్టూన్ 30-06-2022
బయట ప్లాస్టిక్ అయితే ఏదో రకంగా నిషేధిస్తాం.. కానీ...!! -
ప్లాస్టిక్ నిషేధానికి తొలి అడుగు
-
అంతా కవరింగే! ఒట్టి మాటలే తప్ప ప్లాస్టిక్ నిషేధం నై
1 జూన్ 2018. జీహెచ్ఎంసీలో సింగిల్‌యూజ్ ప్లాస్టిక్‌ను 2022 లోగా పూర్తిగా నిషేధిస్తామని 2018లో పర్యావరణ వారోత్సవాల్లో భాగంగా జరిగిన సమావేశంలో మున్సిపల్ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. అప్పటి యూఎన్ఈపీ(యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్సోలెంతో కలిసి ఆమేరకు ప్రతిజ్ఞ చేశారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. అందులో భాగంగా జీహెచ్ఎంసీ అధికారుల కోసం ఆరు ఎలక్ట్రిక్ కార్లను లాంఛనంగా ప్రారంభించారు. 4 జూన్ 2022. నిజంగానే గ్రేటర్లో ప్లాస్టిక్ నిషేధం.. ఈపాటికి సింగిల్‌యూజ్ ప్లాస్టిక్ సంపూర్ణ నిషేధం అమలవుతాయనుకున్న వారి అంచనాలు తప్పాయి. ఏదీ జరగలేదు. నిర్ణీత మైక్రాన్లలోపు ప్లాస్టిక్ నిషేధం అమలు కాలేదు. సింగిల్‌యూజ్ ప్లాస్టిక్ సంపూర్ణ నిషేధం సాధ్యం కాలేదు. ప్రారంభించిన ఎలక్ట్రిక్ కార్లు ఏమయ్యాయో తెలియదు. సాక్షి, హైదరాబాద్: నాలుగేళ్లు గడిచిపోయినా నాలుగడుగులు కూడా ముందుకు పడలేదు. సింగిల్‌యూజ్ ప్లాస్టిక్ నిషేధానికి అప్పటి జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి, అనంతరం కమిషనర్‌గా పనిచేసిన దానకిశోర్ అమలు చర్యలు ప్రారంభించి, కొంతకాలం అమలు చేసినప్పటికీ, అనంతరం పూర్తిగా కనుమరుగైంది. చిరువ్యాపారులు, మాంసం దుకాణాల వారు సైతం చాలావరకు ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన పొంది అమలుకు శ్రీకారం చుట్టినప్పటికీ, తదుపరి అధికారుల అశ్రద్ధతో ఆ కార్యక్రమం కుంటుపడింది. ఆదివారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ కథనం. ఆమోదం సై.. అమలు నై ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో గత మార్చిలో మరోసారి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధానికి, 75 మైక్రాన్లలోపు ప్లాస్టిక్ క్యారీబ్యాగుల నిషేధానికి జీహెచ్ఎంసీ సిద్ధమైంది. అందుకు స్టాండింగ్ కమిటీ సైతం ఆమోదం తెలిపింది. కానీ, దానికి సంబంధించి ఇంతవరకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. కేంద్రప్రభుత్వ నిబంధనల మేరకు గత సంవత్సరమే ఈ కార్యక్రమాలు చేపట్టాల్సి ఉండగా, ఇప్పటి వరకు పట్టించుకోలేదు. ఏళ్ల తరబడి.. జీహెచ్ఎంసీలో దాదాపు దశాబ్దం క్రితమే ప్లాస్టిక్ నిషేధచర్యలు ప్రారంభమైనప్పటికీ, రాజకీయ నేతల జోక్యం.. ప్లాస్టిక్ ఉత్పత్తిదారుల ప్రభావంతో ముందుకు సాగలేదు.జనార్దన్‌రెడ్డి, దానకిశోర్‌లు కమిషనర్లుగా వ్యవహరించే సమయంలో కొంతమేర అమలు జరిగినప్పటికీ, ఆ తర్వాత ఆ విషయమే మరిచిపోయారు.అప్పటి నిబంధనల కనుగుణంగా 50 మైక్రాన్లలోపు ప్లాస్టిక్‌పై నిషేధం అమలయ్యేలా తగిన చర్యలు చేపట్టారు. నాలాల్లోనూ ప్లాస్టికే.. జీహెచ్ఎంసీలో రోజుకు సగటున ఆరున్నరవేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు వెలువడుతుండగా, వాటిల్లో దాదాపు600 మెట్రిక్ టన్నులు ప్లాస్టిక్ వ్యర్థాలే.నాలాల్లోని వ్యర్థాల్లో 40 శాతానికి పైగా ప్లాస్టిక్ వ్యర్థాలే. నాలాల్లో వరదనీరు సాఫీగా సాగకుండా ముంపు సమస్యలకు ఇదీ ఓ ముఖ్య కారణమేనని ఇంజినీర్లు పేర్కొన్నారు. నగరంలో ఏటా 73 కోట్ల ప్లాస్టిక్ క్యారీబ్యాగులు వినియోగిస్తున్నట్లు ఒక అంచనా. ప్లాస్టిక్ వ్యర్థాల్లో కేవలం 14 శాతం మాత్రమే రీసైక్లింగ్ అవుతోంది. ప్లాస్టిక్ క్యారీబ్యాగ్నశించేందుకు 500 సంవత్సరాలకు పైగా పడుతుందని నిపుణులు పేర్కొన్నారు. పెనాల్టీల కోసమేనా..? ప్లాస్టిక్ నిషేధంపై జీహెచ్ఎంసీ కొద్దిరోజులు హడావుడి చేయడం.. చిరువ్యాపారులపై పెనాల్టీలు విధించడం.. అనంతరం మరిచిపోవడం పరిపాటిగా మారింది. ఏళ్ల తరబడి ఇదే తంతు. దీని వల్ల అటు వ్యాపారులు, ఇటు ప్రజలు సీరియస్‌గా తీసుకోవడం లేరు. వారికి డబ్బులు అవసరమైనప్పుడు పెనాల్టీల పేరిట వేధిస్తారని భావిస్తున్నారు. అంతేకాదు.. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయ మార్గాలు చూపనిదే ఎంతకాలమైనా అమలు సాధ్యం కాదు. – మహేశ్, గోల్నాక ఉన్నది భూమి ఒక్కటే.. కాపాడుకోవాలి.. ఈ సంవత్సర పర్యావరణ దినోత్సవ థీమ్ ‘ఉన్నది ఒక్కటే భూమి’. దీన్ని పరిరక్షించుకునేందుకు వివిధ అంశాలతోపాటు ప్లాస్టిక్ వినియోగం మానేయాలి. భూమి, నీటిలో సైతం అంతం కాకుండా ఏళ్ల తరబడి ఉండే ప్లాస్టిక్ ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తుంది. పర్యావరణానికి పెనుముప్పు కలిగిస్తుంది. – అశోక్ చక్రవర్తి, కవి (చదవండి: ‘సన్’ స్ట్రోక్స్! ఆన్లైన్ క్లాస్‌ల పేరిట గేమ్‌లకు బానిసగా...) -
ప్రధాన దేవాలయాల్లో ప్లాస్టిక్ నిషేధం
సాక్షి, అమరావతి: ఇక నుంచి దేవాలయాల్లో ప్లాస్టిక్ వస్తువులకు దేవదాయ శాఖ స్వస్తి పలకనుంది. ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లతోపాటు ప్లాస్టిక్ కవర్లలో పూజా సామగ్రిని ఆలయాల్లోకి అనుమతించరు. అలాగే ఆలయానికి అనుబంధంగా ఉండే దుకాణాల్లో ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల అమ్మకాలను నిషేధించనున్నారు. ప్రసాదాల పంపిణీలోనూ చిన్నచిన్న ప్లాస్టిక్ సంచుల వినియోగానికి పూర్తిగా చెక్ పెడతారు. తొలి దశలో జూలై 1 నుంచి 6 (ఏ) కేటగిరీగా వర్గీకరించిన ప్రధాన ఆలయాలన్నింటిలో ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని పూర్తి స్థాయిలో నిషేధించనున్నారు. ఏడాదికి రూ.25 లక్షలు, ఆపైన ఆదాయం ఉండే ఆలయాలను దేవదాయ శాఖ 6(ఏ) కేటగిరీగా వర్గీకరించింది. దేవదాయ శాఖ పరిధిలో రాష్ట్రంలో మొత్తం 24,699 ఆలయాలు, మఠాలు, సత్రాలు ఉన్నాయి. ఇందులో 174 ఆలయాలు, 28 సత్రాలు, మఠాలు 6 (ఏ) కేటగిరీ కిందకు వస్తాయి. జూలై 1 నుంచి ఆయా ఆలయాలు, మఠాలు, సత్రాలలో ప్లాస్టిక్ వస్తువులను పూర్తిగా నిషేధించేందుకు తగిన చర్యలు చేపట్టాలని దేవదాయ శాఖ ఇప్పటికే ఆయా ఆలయాలు, సత్రాల ఈవోలకు ఆదేశాలిచ్చింది. టీటీడీ తరహాలో మంచినీటి సరఫరా.. తిరుమలలో గత కొద్ది నెలల నుంచి ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో అమలు జరుగుతున్న తరహాలోనే ప్రధాన దేవాలయాల్లో శుభ్రమైన మంచినీటి సరఫరాకు చర్యలు చేపడతారు. అలాగే మంచినీటి సరఫరా పాయింట్ల వద్ద స్టీల్ గ్లాస్‌లను అందుబాటులో ఉంచుతారు. భక్తులు ఇంటి నుంచి మంచినీరు తెచ్చుకున్నా గాజు సీసాలు లేదంటే స్టీల్ బాటిళ్లలో తెచ్చుకునేలా విస్తృత ప్రచారం చేయాలని అధికారులు యోచిస్తున్నారు. పర్యావరణానికి, జీవజాలానికి హాని.. ప్లాస్టిక్ కవర్లు పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. అలాగే ఆలయాల వద్ద సంచరించే గోవులతోపాటు ఇతర జంతువులు కవర్లను తిని మృత్యువాత పడుతున్నాయని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో క్రమంగా అన్ని ఆలయాల వద్ద ప్లాస్టిక్ వస్తువుల వినియోగానికి స్వస్తి పలకాలని దేవదాయ శాఖ నిర్ణయించినట్టు అధికారులు వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేవదాయ శాఖ కార్యక్రమాలపై ఇటీవల సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా టీటీడీలో అమలులో ఉన్న మంచి విధానాలను అన్ని ఆలయాల్లో అమలు చేయాలంటూ స్పష్టమైన ఆదేశాలిచ్చారని అధికారులు తెలిపారు. -
Plastic ban: ప్లాస్టిక్ అమ్మకాలపై ‘మహా’ కొరడా! రూ.75 వేల అపరాధ రుసుం..
Plastic use can lead to fines గాజువాక : ప్లాస్టిక్ అమ్మకాలపై జీవీఎంసీ అధికారులు కొరడా ఝుళిపించారు. ప్లాస్టిక్ సంచులు విక్రయిస్తున్న దుకాణాలపై దాడి చేసి భారీ ఎత్తున పాలిథిన్ సంచులను స్వాధీనం చేసుకున్నారు. విక్రయదారుల నుంచి అపరాధ రుసుం కూడా పెద్ద మొత్తంలో వసూలు చేశారు. టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు గాజువాకలో ప్లాస్టిక్ విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నట్టు ఇటీవల జీవీఎంసీ కమిషనర్‌కు ఫిర్యాదులు అందడంతో ఆయన స్పందించారు. ప్లాస్టిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని జోనల్ అధికారులను ఆదేశించడంతో పాటు గాజువాక జోనల్ కమిషనర్ డి.శ్రీధర్ నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. ప్రజారోగ్య విభాగం అధికారులు గాజువాక మార్కెట్లో ప్లాస్టిక్ సంచులను విక్రయిస్తున్న ఐదు దుకాణాలపై దాడి చేసి 500 కేజీల ప్లాస్టిక్‌ను స్వాధీనం చేసుకున్నారు. విక్రయదారులనుంచి రూ.75వేల అపరాధ రుసుం వసూలు చేశారు. ప్లాస్టిక్ ఎవరు విక్రయించినా చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు. స్వచ్ఛ సర్వేక్షణ్–2022లో భాగంగా స్వచ్ఛ నగరాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని జోనల్ కమిషనర్ కోరారు. ప్లాస్టిక్ వినియోగించవద్దని విజ్ఞప్తి చేశారు. చదవండి: Omicron: జనవరి మూడో వారం నాటికి 2 లక్షల యాక్టివ్ కేసులు! -
మూగజీవి వేదన.. కడుపులో 15 కిలోల ప్లాస్టిక్
టెక్కలి రూరల్: కోటబొమ్మాళి నివాసి తాళాసు కృష్ణకు చెందిన ఆవు కడుపులో 15కిలోల ప్లాస్టిక్ సంచులున్నట్లు వై ద్యులు గుర్తించారు. ఆవుకు పరీక్షలు నిర్వహించిన తిలారు పశువైద్యాధికారి డాక్టర్ లఖినేని కిరణ్‌కుమార్ శుక్రవారం శస్త్రచికిత్స చేసి 15కిలోల ప్లాస్టిక్ సంచులు, దారాలు, ప్లాస్టిక్ తాళ్లను తొలగించారు. అరుదైన శస్త్రచికిత్స చేసి ఆవును రక్షించిన డాక్టర్‌ను పలువురు అభినందించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగిస్తున్న వైద్యుడు దేశీయ పశుజాతులతో లాభాలు శ్రీకాకుళం రూరల్: దేశీయ పశు జాతులతో అ నేక లాభాలు ఉన్నాయని, వాటిని రైతులు అందుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశుగణాభివృద్ధి ముఖ్య కార్యనిర్వహణ అధికారి దామోదరనాయుడు పిలుపు నిచ్చారు. మండల పరిధి లోని తండేవలస గ్రామంలో శుక్రవారం జాతీ య కృత్రిమ గర్భోత్పత్తి పథకంలో భాగంగా పుట్టిన దేశీయ పశు దూడలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశీయ పశుసంపదలైన గర్, సాహివాల్, రెడ్‌సింధి, పుంగనూరు, ఒంగోలు మొదలైన జాతుల ఆవశ్యకతను, లాభాలను పాడి రైతులకు ఆయన వివరించారు. దేశీయ జాతులు రోగనిరోధక శక్తిని కలిగి ఉంటాయని, పాల ఉత్పత్తి అధికంగా ఉంటుందని, రైతులు వీటిని పెంచేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్థానికంగా గల రైతు భరోసా కేంద్రాలను సందర్శించి సిబ్బందికి తగు సూచనలు అందించారు. కార్యక్రమంలో పశుసంవర్దక సంచాలకులు ఎం.కృష్ణ, ఉప సంచాలకులు జగన్నాథం, రాగోలు పశువైద్యాధికారి దిలీప్ తండేవలస సర్పంచ్ పొన్నాన కూర్మారావు, తదితరులు పాల్గొన్నారు. -
ప్లాస్టిక్‌పై మరో సమరం
సాక్షి, హైదరాబాద్: పర్యావరణానికి హాని కలిగిస్తున్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వినియోగంపై పురపాలక శాఖ యుద్ధం ప్రకటించింది. 75 మైక్రాన్లలోపు మందం కలిగిన క్యారీ బ్యాగులు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ క్రయవిక్రయాలు, వినియోగంపై గురువారం నుంచి రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లో నిషేధాన్ని విధించింది. ఈ నెల 14 నుంచి వచ్చే ఏడాది జూన్ 30 వరకు ఈ నిషేధం అమలుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయనుంది. వచ్చే ఏడాది జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు 120 మైక్రాన్లలోపు మందం కలిగిన ప్లాస్టిక్ క్యారీ బ్యాగులపై నిషేధం విధించనుంది. నిషేధం అమల్లోభాగంగా చేపట్టాల్సిన కార్యక్రమాలకు గడువులను ప్రకటిస్తూ పురపాలక శాఖ డైరెక్టర్ ఎన్.సత్యనారాయణ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని పురపాలికలు కూడా నోటిఫికేషన్ జారీ చేశాయి. ఇప్పటివరకు 50 మైక్రాన్లలోపు మందం కలిగిన ప్లాస్టిక్ క్యారీ బ్యాగులపై నిషేధం ఉంది. గత సెప్టెంబర్ 30 నుంచి 75 మైక్రాన్లలోపు, వచ్చే ఏడాది డిసెంబర్ 31 నుంచి 120 మైక్రాన్లలోపు మందం కలిగిన ప్లాస్టిక్ బ్యాగుల వినియోగంపై నిషేధాన్ని కేంద్రం అమల్లోకి తెచ్చింది. టాస్క్‌ఫోర్స్ కమిటీల ఏర్పాటు నిషేధాన్ని కఠినంగా అమలు చేసేందుకు మున్సిపల్ కమిషనర్, హెల్త్ ఆఫీసర్, శానిటరీ సూపర్వైజర్, శానిటరీ ఇన్స్పెక్టర్, పోలీసు కానిస్టేబుల్, ఇద్దరు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో అన్ని పురపాలికల్లో టాస్క్‌ఫోర్స్ కమిటీలు ఏర్పాటయ్యాయి. ఈ నెల 22 నుంచి వారంపాటు దాడులు జరిపి నిషేధిత ప్లాస్టిక్ వినియోగిస్తున్న వారిపై జరిమానా విధించనుంది. 25 నుంచి నెలకోసారి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, పెద్ద సముదాయాలపై దాడులు నిర్వహించనుంది. ఆలోగా నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రచారం నిర్వహించనున్నారు. ఇక చెత్త వేస్తే జరిమానా పురపాలికల్లోని వాణిజ్య ప్రాంతాలను ఈనెల 31 నుంచి చెత్తరహిత ప్రాంతాలుగా పురపాలికలు ప్రకటించనున్నాయి. ఆ తర్వాత వాణిజ్య ప్రాంతాల్లోని రోడ్లపై చెత్తను పడేసే వారిపై జరిమానా విధించనున్నాయి. రోజుకు 100 కిలోలకుపైగా వ్యర్థాలను ఉత్పత్తి చేసే వాణిజ్య సముదాయాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్‌హాళ్లు, కూరగాయాల మార్కెట్లు ఇకపై ఆన్సైట్ కంపోస్టింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. లేని పక్షంలో నవంబర్ 10 నుంచి జరిమానా విధించనున్నారు. కాలనీలు, వెల్ఫేర్ అసోసియేషన్లు, అపార్ట్మెంట్లు సైతం విధిగా తడి, పొడి చెత్తను వేరుగా నిర్వహించాలి. ఆన్సైట్లో కంపోస్టింగ్ చేపట్టని పక్షంలో నవంబర్ 28 నుంచి వీటిపై సైతం జరిమానా విధించనున్నారు. నవంబర్ 28 నుంచి గుర్తించిన కాలనీలను చెత్తరహిత ప్రాంతాలుగా ప్రకటించి, చెత్త పడేసే వారిపై జరిమానా వడ్డించనున్నారు. -
మరో 30 ఏళ్లలో సముద్రంలో చేపల కంటే ఇవే ఎక్కువట!
వెబ్‌డెస్క్: అణుయుద్ధాలు, కరోనా వైరస్ల కంటే ప్రమాదకరంగా చాప కింద నీరులా ప్రపంచాన్ని చుట్టేస్తోన్న మరో ప్రమాదకారి ప్లాస్టిక్. ప్రస్తుతం ప్రతీ రోజు భూమిపై పోగవుతున్న ప్లాస్టిక్‌ను కంట్రోల్ చేయకపోతే 2050 నాటికి సముద్రంలో ఉన్న చేపల బరువు కంటే ఎక్కువ ప్లాస్టిక్ చెత్త అక్కడ పోగు పడిపోతుందని అంతర్జాతీయ నివేదికలు తేల్చి చెబుతున్నాయి. జులై 12న పేపర్ బ్యాగులపై అవగాహన పెంచడానికి ప్రపంచ వ్యాప్తంగా జులై 12న పేపర్ బ్యాగ్ డే నిర్వహిస్తున్నాయి. పర్యవరణానికి హానీకరంగా మారిన ప్లాస్టిక్ బ్యాగుల స్థానంలో పేపర్ బ్యాగులు వాడాటాన్ని ప్రోత్సహించడం పేపర్ డే యొక్క ముఖ్య ఉద్దేశం. 1952లో అమెరికాలో 1852లో తొలిసారి పేపర్ బ్యాగులను తయారు చేసే యంత్రాన్ని కనిపెట్టారు. ఆ తర్వాత కాలంలో పేపర్ బ్యాగులు ప్రపంచం మొత్తం విపరీతంగా అమ్ముడయ్యాయి. సరిగ్గా వందేళ్ల తర్వాత వచ్చిన ప్లాస్టిక్ బ్యాగులు పేపర్ బ్యాగుల స్థానానికి ఎసరు పెట్టాయి ఇక 80వ దశకంలో వచ్చిన యూజ్ అండ్ త్రో బ్యాగులైతే పర్యవరనానికే ప్రమాదకరంగా మారాయి. ప్లాస్టిక్ భూతం 1950 నుంచి ఇప్పటి వరకు 830 బిలిమన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అయ్యాయి. ఇందులో 60 శాతం ప్లాస్టిక్ అంటే 500 బిలియన్ టన్నులు రీసైకిల్ చేయడానికి అనువుగా లేదు. అంటే 70 ఏళ్లలో 500 బిలియన్ టన్నుల ప్టాస్టిక్ భూతాన్ని భూమిపై పడేశాం. మనకు ప్రమాదమే సముద్రంలో పోగవుతున్న చెత్తను చేపలు తినేస్తున్నాయి, ఆ చేపలు మనం ఆహారంగా తీసుకోవడం వల్ల హర్మోన్స్ సమతుల్యత దెబ్బ తింటోంది. వీటికి తోడు ప్లాస్టిక్ కవర్లు, బాటిల్స్ కారణంగా డ్రైనేజీలు మూసుకుపోయి వరద సమస్యలు కూడా తలెత్తున్నాయి. ప్లాస్టిక్‌ను కాల్చేయడం వల్ల కర్బణ ఉద్గారాలు పెరిగి భూతాపం సమస్య ఎదురువుతోంది. ఇలా ప్లాస్టిక్‌తో ఎలా ఉన్నా ఇబ్బందులే ఉన్నాయి. అందుకే పేపర్ బ్యాగులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. కట్టడి చేయాల్సిందే ప్లాస్టిక్ నియంత్రణ విషయంలో అన్ని దేశాల మధ్య ఏకాభిప్రాయం ఉంది. అయితే ప్లాస్టిక్ కట్టడి విషయంలో చాలా దేశాలు ఉదాసీన వైఖరినే అవలంభిస్తున్నాయి. ప్లాస్టిక్ విషయలో కఠినంగా ఉన్న దేశాల వివరాలు కెనడా భూమ్మీద ఉన్న తాగునీటిలో నాలుగో వంతు స్వచ్ఛమైన నీరు కెనడాలో ఉంది. ప్లాస్టిక్ కారణంగా జలవనరులకు తలెత్తుతున్న ఇబ్బందులు గుర్తించిన కెనడా జాగ్రత్త పడుతోంది. 2030 నాటికి పూర్తిగా ప్లాస్టిక్ రహిత దేశంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ తయారీని నిషేధించింది. స్ట్రాలు, బ్యాగులు, కవర్లు, బాటిళ్లు, ఫుడ్ ప్లేట్స్, చెంచాలు ఇలా వన్ టైం యూజ్ ప్లాస్టిక్ నిషేధం విధించింది. రువాండ రువాండలో జరిగిన అంతర్యుద్ధం 1994లో ముగిసిన వెంటనే వ్యవసాయంపై ఆ దేశం దృష్టి సారించింది. అయితే అసలే వర్షాలు తక్కువగా ఉండే ఆ దేశంలో ప్లాస్టిక్ కారణంగా సాగు దిగుబడికి జరుగుతున్న నష్టాన్ని గుర్తించింది. 2004లో ప్లాస్టిక్‌పై నిషేధం విధించింది. అంతటితో ఆగకుండా క్రమం తప్పకుండా ప్లాస్టిక్ నిషేధంపై భారీ ఎత్తున ప్రచారం నిర్వహించింది. ప్లాస్టిక్‌ను ఉపయోగించకుండా ఉండటం వారి జీవన విధానంలో ఓ భాగం అయ్యేలా చర్యలు తీసుకుంది. ఇప్పుడు ప్లాస్టిక్‌ను అతి తక్కువగా వినియోగించే దేశాల్లో ఒకటిగా నిలిచింది. కెన్యా ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా అత్యంత కఠినమైన చర్యలు తీసుకున్న దేశంగా కెన్యా చరిత్రలో నిలిచిపోయింది. ప్లాస్టిక్ తయారు చేసినా, అమ్మినా, ఉపయోగించినా సరే నాలుగేళ్ల జైలు శిక్ష లేదా 40,000 డాలర్లు జరిమానాగా విధిస్తూ చట్టాన్ని అమలు చేసింది. ఈ చట్టం దెబ్బకు ఆ దేశంలో ప్లాస్టిక్ వినియోగం 80 శాతం మేరకు తగ్గిపోయింది. పేపర్ బ్యాగుల వినియోగం పెరిగింది. ఫ్రాన్స్ 2040 నాటికి దేశాన్ని ప్లాస్టిక్ ఫ్రీగా మార్చేందుకు అనుగుణంగా ఫ్రాన్స్ పటిష్టమైన కార్యచరణతో ముందుకు వెళ్తోంది. అందులో భాగంగా 2016లో టేక్ అవే, ఫుడ్ వేర్, కర్ట్లరీ ఐటమ్స్‌లో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించింది. 2020లో టేబుల్ వేర్కి ఉపయోగించే ఐటమ్స్‌లో ప్లాస్టిక్ వినియోగాన్ని 50 శాతంలోపు పరిమితం చేసి, వాటి స్థానంలో భూమిలో కలిసిపోయే మెటీరియల్‌తో తయారైన వస్తువులు ఉపయోగించాలనే నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాలు, కార్యక్రమాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని 2022 నాటికి పూర్తిగా తగ్గించాలని నిర్ణయించారు. ఇలా ఒక క్రమపద్దతిలో ప్లాస్టిక్‌కి చెక్ ఫ్రాన్స్ పెడుతోంది. ఇండియా 2022 నాటికి యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించాలంటూ 2017లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ ఆచరణలో అది అమలు కావడం లేదు. మన దగ్గర మార్కెట్లోకి వస్తున్న ప్లాస్టిక్‌లో 80 శాతం తిరిగి సముద్రంలోకి చేరుతుంది. ప్లాస్టిక్ నియంత్రణ, డిస్పోజల్‌కు సరైన పద్దతులు అమలు చేయకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతోంది. -
‘ప్లాస్టిక్’ పరిష్కారం ఇదే!
వెబ్‌డెస్క్: న్యూ క్లియర్ వెపన్స్, గ్లోబల్ వార్మింగ్ స్థాయిలో ప్రపంచాన్ని భయపెడుతున్న మరో పెద్ద అంశం ప్లాస్టిక్. పర్యావరణ సమతుల్యత ప్లాస్టిక్ బ్యాగ్‌లతో దెబ్బతింటోంది. ముఖ్యంగా జంతువులు, పక్షులు ప్లాస్టిక్ కారణంగా తీవ్రంగా నష్టపోతున్నాయి. దీంతో ప్లాస్టిక్‌పై అవగాహన కల్పించేందుకు జులై 3న ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ డేని నిర్వహిస్తున్నారు. ప్లాస్టిక్.. ప్రమాదాలు నిత్య జీవితంలో ప్లాస్టిక్ వాడకం తప్పనిసరి అవసరంగా మారింది. అయితే ప్లాస్టిక్‌తో ఉన్న అతి పెద్ద ప్రమాదం వాటి మన్నిక కాలం. ప్లాస్టిక్ బ్యాగులు సహజ పద్దతిలో తిరిగి భూమిలో కలిసి పోవాలంటే 100 నుంచి 500 ఏళ్ల సమయం పడుతుంది. అప్పటి వరకు అది భూమి మీద అలాగే ఉంటుంది. అంతేకాదు ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా నాలాలు మూసుకుపోయి... వరదలకు కూడా కారణం అవుతోంది. ప్రమాదంలో పశువుల ప్రాణాలు పెద్దపెద్ద నగరాలన్నీ సముద్ర తీరాల చుట్టే వెలిశాయి. ఈ నగరాల్లో ఉత్పత్తి అవుతున్న చెత్త కారణంగా సముద్ర జీవుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి. ఇక పల్లె నుంచి మెట్రో సిటీ వరకు చెత్త కుప్పల్లో పేరుకు పోతున ప్లాస్టిక్‌ని తిని పశువులు మృత్యువాత పడుతున్నాయి. మొదట యూరప్‌లో ప్లాస్టిక్ బ్యాగులకు బదులు ఏకో ఫ్రెండ్లీ బ్యాగులు వాడాలనే ప్రచారం మొదట యూరప్‌లో మొదలైంది. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఇతర దేశాల్లోనూ ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమాలు, ప్రచారాలు, అవగాహన కార్యక్రమాలు మొదలయ్యాయి. ‘ఏకో’ ధర తగ్గాలి ఎకో ఫ్రెండ్లీ బ్యాగులు వాడాలంటూ భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నా... క్షేత్రస్థాయిలో ఫలితాలు ఆశించిన స్థాయిలో రావడం లేదు. ప్రస్తుతం మార్కెట్లో ఏకో ఫ్రెండ్లీ బ్యాగులు ఉన్నా .. వాటి ఖరీదు ఎక్కువగా ఉండటంతో చాలా మంది తిరిగి ప్లాస్టిక్ బ్యాగుల వైపుకే మొగ్గు చూపుతున్నారు. కార్పొరేట్ బాధ్యత ప్లాస్టిక్ వాడకం తగ్గించడంపై మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉంది. స్టార్టప్‌లు ఈ దిశగా పని చేయాల్సి ఉంది. కార్పొరేట్ కంపెనీలు, భారీ వాణిజ్య సంస్థలు తమ వంతు బాధ్యతగా ప్లాస్టిక్ పరిశోధనలకు దన్నుగా నిలవాల్సిన సమయం వచ్చింది. వ్యాపారంలో కోట్లు గడిస్తున్న సంస్థలు ఇప్పటి వరకు ప్లాస్టిక్ నివారణపై పెద్దగా దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. బడా సంస్థలు ప్లాస్టిక్‌పై దృష్టి సారించి... నూతన ఆవిష్కరణలకు ఊతం ఇస్తే మార్పులు త్వరగా వచ్చేందుకు ఆస్కారం ఉంది. అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం మన్నిక ఉండేలా ఏకో ఫ్రెండ్లీ బ్యాగులు మార్కెట్లోకి తేవడం ద్వారా ప్లాస్టిక్ ఉపయోగాన్ని తగ్గించవచ్చు. చదవండి : అంతరిక్షంలో అద్భుతం.. తొలిసారిగా -
ఉపాధి కుటీరం!
ప్లాస్టిక్ రహితమే లక్ష్యంగా కుటీర పరిశ్రమ స్థాపించివిస్తరాకులు, వక్క చెట్లబెరడులతో బోజనం, టిఫన్ ప్లేట్లు, కప్పులు, తయారు చేసి తాను ఉపాధి పొందడమేకాకుండా పది మందికి ఉపాధి కల్పిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. వివరాల్లోకి వెళితే షేక్ అలీముస్తఫా కంభం: బయోడీగ్రేడబుల్ ఉత్పత్తుల తయారీతో పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారు మాజీ సైనికుడు అలీ ముస్తఫా. కుటీర పరిశ్రమ స్థాపనతో స్వయం ఉపాధి పొందడమే కాకుండా పలువురికి ఉపాధి కల్పిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కంభం మండలంలోని కందులాపురం గ్రామానికి చెందిన మాజీ సైనికుడు షేక్ అలీ ముస్తఫా ఆర్మీలో ఉద్యోగం చేస్తూనే పదవీ విరమణకు ముందు హైదరాబాద్‌లోని ఎన్ఐఆర్డీ రూరల్ టెక్నాలజీ పార్క్‌లో ఉపాధి శిక్షణ పొందారు. రీ ఎంప్లాయ్మెంట్లో భాగంగా సైన్యంలో పనిచేసే వారికి ఉద్యోగ విరమణకు ముందు 21 విభాగాల్లో శిక్షణ ఇస్తారు. అందులో ప్లాస్టిక్ రహిత వస్తువుల తయారీపై ముస్తఫా శిక్షణ పొందారు. రిటైరైన తర్వాత అసోం, ఒడిశా, హైదరాబాద్ నుంచి అవసరమైన మిషనరీని తెప్పించి ఈ ఏడాది ఫిబ్రవరిలో స్వగ్రామం కందులాపురంలో కుటీర పరిశ్రమ స్థాపించారు. పూర్తిగా ప్లాస్టిక్ రహితంగా.. కుటీర పరిశ్రమలో ప్లాస్టిక్ రహిత ప్రసాదం ప్లేట్లు, భోజనం, బిర్యానీ, టిఫిన్, పానీపూరీ, చాట్, టేబుల్ ప్లేట్లు, బఫే ప్లేట్లు తయారు చేస్తున్నారు. వీటి తయారీ కోసం మాడపాకులు(విస్తరాకులు), కాన్సెషన్ పేపర్, బ్రౌన్ క్రాఫ్ట్, డీగ్రేడబుల్ ఎల్డీ పేపర్ వినియోగిస్తున్నారు. వక్కచెట్ల బెరడుతో ప్రత్యేకంగా ప్లేట్లు తయారు చేస్తారు. 4 అడుగుల సైజు నుంచి 12 అడుగుల సైజు వరకు ప్లేట్లు ఇక్కడ తయారవుతున్నాయి. అలాగే బ్రిచ్‌ఉడ్ స్పూన్స్, ఫోర్కులు, బయో డీగ్రేడబుల్ వాటర్ గ్లాసులు కూడా తయారు చేస్తున్నారు. నెలకు 60 వేల ప్లేట్ల తయారీ డిమాండ్‌ను బట్టి నెలకు 60 వేల ప్లేట్లు తయారు చేస్తామని అలీ ముస్తఫా తెలిపారు. ప్లేట్ల తయారీ కోసం ఆరుగురు కార్మికులు పని చేస్తున్నారు. ఇక్కడి నుంచి ఎక్కువగా కోయంబత్తూరు, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు నగరానికి ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి. పూర్తిగా ప్లాస్టిక్ రహితం కావడం, బయోడీగ్రేడబుల్ మెటీరియల్ వినియోగిస్తుండటంతో ఇతర రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది. ప్లాస్టిక్, డిస్పోజల్ ప్లేట్లతో పోల్చితే వీటి ఖరీదులో పెద్దగా వ్యత్యాసం లేదు. పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ రహిత వస్తువులు ఆర్మీ నుంచి రిటైరైన తర్వాత ఈ రంగాన్ని ఎంచుకున్నాను. కుటీర పరిశ్రమ కోసం సుమారు రూ.25 లక్షలు పెట్టుబడి పెట్టా. కందులాపురంతోపాటు గిద్దలూరులో కూడా ప్లేట్లు తయారీ చేస్తాం. రెండు చోట్లా కలిపి 12 మంది కార్మికులు పనిచేస్తున్నారు. నెలలో 24 రోజులు ప్లేట్లు, గ్లాసులు తయారు చేస్తాం. పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ రహితంగా తయారు చేస్తున్నాం. ప్రస్తుతం ఇతర రాష్ట్రాలకు ఎక్కువగా పంపిస్తున్నా. రానున్న రోజుల్లో ప్లాస్టిక్ నిర్మూలన పూర్తి స్థాయిలో చేపడితే బయోడీగ్రేడబుల్ ఉత్పత్తుల వాడకం మన ప్రాంతంలో కూడా పెరిగే అవకాశం ఉంది. – ఎస్కే అలీ ముస్తఫా, మాజీ సైనికుడు -
వాటిని వెనక్కి తీసుకుంటున్న ఫ్లిప్‌కార్ట్
సాక్షి, ముంబై: ఆన్‌లైన రీటైల్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ పర్యావర్ణ పరిరక్షణ కోసం నడుం బిగించింది. వినియోగదారులనుంచి ప్లాస్టిక్ సంచులను సేకరించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఒక పైలట్ ప్రాజెక్టు అమలు చేస్తోంది. వ్యవస్థలో ఉన్న ప్లాస్టిక్ ప్యాకేజింగ్లను రీసైకిల్ చేయడంతో పాటు, తిరిగి ఉపయోగించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టింది. ప్లాస్టిక్ వ్యర్థాలు ముప్పుగా పరిణమించుతున్నతరుణంలో ఫ్లిప్‌కార్ట్ ఈ చర్యకు దిగింది. సింగిల్-యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని ఇప్పటికే 33 శాతం తగ్గించిన కంపెనీ మార్చి 2021 నాటికి దాని సప్లయ్ చైన్‌లో 100శాతం రీసైకిల్ ప్లాస్టిక్ వినియోగం వైపు వెళ్ళాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా చెన్నై, ముంబై, బెంగళూరు, డెహ్రాడూన్, ఢిల్లీ, కోల్‌కతా, పూణే, అహ్మదాబాద్‌లోని ఎంపిక కేంద్రాలలో వినియోగదారుల నుండి ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌ను తిరిగి సేకరించేందుకు ఫ్లిప్‌కార్ట్ పైలట్ ప్రాజెక్టును నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం కింద, తమ ప్రొడక్ట్స్ డెలివరీ సమయంలో ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌ను స్వచ్ఛందంగా కంపెనీకి చెందిన ఫ్లిప్‌కార్ట్ విష్-మాస్టర్స్‌కు అప్పగించమని వినియోగదారులకు ఒక సమాచారం పంపుతుంది. అంతేకాదు ఈ ప్రాజెక్టును విజయవంతం చేసేందుకు, వివిధ కోణాలను వివరించి, వినియోగదారుల్లో అవగాహనపెంచేందుకు, విష్-మాస్టర్స్‌కు సరైన శిక్షణ కూడా ఇచ్చింది. అలాగే సేకరించిన ప్యాకెట్లు రిజిస్టర్డ్ విక్రేతలకు పంపించి, రీసైకిల్ అయ్యేలా చర్యలు తీసుకుంటుంది. -
ఓడల్లో ప్లాస్టిక్ నిషేధం
న్యూఢిల్లీ: ఇకపై ఓడల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం విధించాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ నిర్ణయించింది. కేవలం మనదేశానికి చెందిన షిప్పులకు మాత్రమేగాక, ఇతర దేశ ఓడలు భారత జలాలపై తిరుగుతున్నపుడు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి. భారత జలాల్లో ప్రవేశించే ముందే తమతో ఉన్న ప్లాస్టిక్ సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. 10 లీటర్ల నీటి కంటే తక్కువ పట్టే ప్లాస్టిక్ బాటిళ్లను కూడా నిషేధించనున్నారు. సముద్ర జలాల్లో వీటి అవశేషాలే ఎక్కువగా ఉంటున్న తేలిన విషయం తెలిసిందే. -
ఇ–వ్యర్థాలను అరికట్టలేమా?
ఆదిమ సమాజం నుంచి నేటి అత్యాధునిక సమాజం వరకు ఒక ‘విచ్ఛిన్న ప్రవాహం’లా సాగిన ప్రకృతి మానవీకరణ క్రమంలో వివిధ చారిత్రక దశల్లో ఏర్పడిన నిర్దిష్ట సామాజికార్థిక సంక్షోభాలకు సహజాతంగా పర్యావరణ సంక్షోభాలు కూడా ఉనికిలోకి వచ్చాయి. లాభార్జనే పరమావధిగా సాగే సరకుల ఉత్పత్తి విధానం, కార్పొరేట్ శక్తుల అత్యాశకు ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వ విధానాల స్థానంలో ప్రకృతికి సమాజానికి మధ్య లావాదేవీల సమతుల్యతను సాధించే ఉత్పత్తి విధానం ప్రపంచంలో ఉనికిలోకి వస్తే తప్ప పర్యావరణ సంక్షోభానికి ఒక హేతుబద్ధ పరిష్కారం దొరకదు. పర్యావరణ సంక్షోభంపై వివిధ అంతర్జాతీయ ఒప్పందాల్ని ఆర్థిక విధానంతో సంబంధం లేకుండా వాటికవిగా అమలు చేయడం సాధ్యం కాదు. ప్రపంచాన్ని తీవ్రంగా కలవరపెడుతున్న అంశాల్లో ఇ–వ్యర్థాల నిర్వ హణ అత్యంత కీలకమైన సమస్యగా అవతరిం చింది. స్మార్ట్ ఫోన్లు, టీవీలు, వాషింగ్ మెషీ న్లు, ఫ్రిజ్‌లు, కంప్యూ టర్లు, ల్యాప్‌టాప్‌లు వంటి సవాలక్ష ఎలక్ట్రానిక్ పరికరాలు వినియోగం తర్వాత వ్యర్థాలుగా మారి పర్యావరణ, ప్రజారోగ్య విధ్వంసానికి పాల్పడుతున్నాయి. 2019లో 5 కోట్ల టన్నుల ఇ–వ్యర్థాలు ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి కానున్నాయని అంచనా. ఆ వ్యర్థాల్లో సగభాగం ఆధునిక సంస్కృతికి అద్దం పడుతున్న, వ్యక్తిగ తంగా వినియోగిస్తున్న కంప్యూటర్లు, స్క్రీన్లు, స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్స్, టీవీలు, మిగిలిన వాటిలో వేడి, చల్లబరచే వివిధ రకాల గృహోప కరణాలే. వీటి వినియోగం ద్వారా హానికర వ్యర్థాలు విడుదలవడమే కాకుండా, ఇ–సరుకుల ఉత్పత్తిలో విడుదలయ్యే హరిత గృహ వాయు వులు భూతాపం పెరుగుదలకు, పర్యవసానంగా వాతావరణ మార్పు వైపరీత్యాలకు కారణమవు తున్నాయి. ఇ–వ్యర్థాల నిర్వహణ భౌగోళిక రాజ కీయ సవాలుగా మారి, ప్రపంచస్థాయిలో ఈ వ్యర్థాల నిర్వహణ, నియంత్రణ చేయవలసిన అవసరం ఏర్పడిన నేపథ్యంలో 2002 ఏప్రిల్‌లో ‘వేస్ట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ (డబ్ల్యూఈఈఈ) అంతర్జాతీయ వేదిక ఏర్పడింది. అంతర్జాతీయ సమాజంలో ఇ–వ్యర్థాల అనర్థాలు, నియంత్రణ అవసరంపై అవగాహన పెంపొందిం చేందుకు ‘ఇంటర్నేషనల్ ఇ–వేస్ట్ డే’ను ప్రతి ఏటా అక్టోబర్ 14 తేదీన జరుపుకోవాలని డబ్ల్యూఈ ఈఈ వేదిక 2018లో పిలుపునిచ్చింది. ఏటా 50 శాతం వృద్ధితో ఇ–వ్యర్థాలు పోగవు తున్నప్పటికీ గ్లోబల్ వ్యర్థాల్లో 20 శాతం మించి రిసైక్లింగ్‌కు నోచుకోవడం లేదు. మిగిలిన 4 కోట్ల టన్నుల వ్యర్థాలను చెత్త క్షేత్రాల్లో నిలువ చేయ డమో, భస్మం చేయడమో లేదా ప్రధానంగా వెనుక బడిన, వర్ధమాన దేశాలకు చట్టవిరుద్ధంగా ఎగు మతి చేయడమో, లేదా సముద్ర జలాల్లో పారబో యడమో జరుగుతోంది. అత్యధిక స్థాయిలో ఇ– వ్యర్థాలను సృష్టిస్తున్న అభివృద్ధి చెందిన ఉత్తరార్థ గోళ పారిశ్రామిక దేశాలు ఆ వ్యర్థాలను జీవ వైవిధ్యం మెండుగా ఉన్న దక్షిణార్థగోళ వ్యావసా యిక దేశాల్లో అన్యాయంగా పారబోస్తున్నాయి. మన దేశంలో ఏటా 18.5 లక్షల టన్నుల ఇ–వ్యర్థాలు విడుదలవుతున్నాయి. ఎలక్ట్రానిక్ వ్యర్థాల్లో మహారాష్ట్ర, తమిళనాడు తరవాత 3వ స్థానంలో తెలుగు రాష్ట్రాలున్నాయి. అశాస్త్రీయ పద్ధతుల్లో రీసైక్లింగ్, కంటితుడుపు చట్టాలు, లోపా యికారీ నియంత్రణ కారణంగా ఇ–వ్యర్థాల నుంచి పెద్దఎత్తున విష రసాయనాలు వెలువడుతు న్నాయి. సంపన్న దేశాలు భారత్‌ను ఎలక్ట్రానిక్ వ్యర్థాల కుప్పతొట్టిగా భావిస్తూ ఏటా 50 వేల టన్నులకు పైగా ఇ–వ్యర్థాల్ని భారత్‌లో లేదా ఇక్కడి సముద్ర జలాల్లో కుప్పపోస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచం పునరుద్ధరణ సాధ్యం కాని ‘ఆకస్మిక వాతావరణ మార్పు’ దశకు చేరుకో బోతోంది. ఇ–సరకుల వినియోగం, ఉత్పత్తి విష యంలో వ్యక్తి, సంస్థాగత స్వీయ నియంత్రణలు, ప్రభుత్వ స్థాయిలో నియంత్రణ చర్యలు, అంత ర్జాతీయ ఒప్పందాల ద్వారా ఇ–వ్యర్థాలను నిరో ధించడం అసాధ్యం. ఇ–వ్యర్థాల సమస్య, హరిత గృహ వాయువులు వెలువడుతున్న కారణంగా ఏర్పడిన వాతావరణ మార్పు ముప్పు, పారిశ్రా మిక, వ్యవసాయ కార్యకలాపాల వల్ల జల, వాయు, శబ్ద, కాంతి కాలుష్యాలు తదితర భూగో ళంపై సాగుతున్న పర్యావరణ వైపరీత్యాలన్నీ విడి విడి అంశాలు కావు. సమాజానికి, ప్రకృతికి మధ్య జరిగే లావాదేవీల సమతుల్యత దెబ్బతిన్నందువల్ల ఏర్పడిన పర్యావరణ సంక్షోభంలో ఈ వైపరీత్యా లన్నీ విడదీయరాని అంతర్భాగాలే. ఆదిమ సమాజం నుంచి నేటి అత్యాధునిక సమాజం వరకు ఒక ‘విచ్ఛిన్న ప్రవాహం’లా సాగిన ప్రకృతి మానవీకరణ క్రమంలో వివిధ చారి త్రక దశల్లో ఏర్పడిన నిర్దిష్ట సామాజికార్థిక సంక్షోభాలకు సహజాతంగా పర్యావరణ సంక్షో భాలు కూడా ఉనికిలోకి వచ్చాయి. పర్యావరణ సంక్షోభంపై వివిధ అంతర్జాతీయ ఒప్పందాలు, వినిమయ సంస్కృతిని సంస్కరించే ప్రయత్నాలు, ప్రభుత్వాల నిషేధాలు, నిబంధనలన్నీ ఆర్థిక విధా నంతో సంబంధం లేకుండా వాటికవిగా అమలు చేయడం సాధ్యం కాదు. ఐక్యరాజ్యసమితి దేశాధినేతల సమావేశాన్ని ఉద్దేశించి వాతావరణ మార్పును అరికట్టేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని డిమాండ్ చేస్తూ ప్రముఖ పర్యావరణ ఉద్యమకారిణిగా ప్రపంచ ఖ్యాతిని గడించిన బాలిక గ్రెటా థెన్‌బర్గ్ చేసిన ప్రసంగం... భవిష్యత్ చిత్రానికి అద్దం పడుతోంది. లాభార్జనే పరమావధిగా సాగే సరకుల ఉత్పత్తి విధానం, కార్పొరేట్ శక్తుల అత్యాశకు ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వ విధానాల స్థానంలో ప్రకృతికి సమాజానికి మధ్య లావాదేవీల సమతుల్యతను సాధించే ఉత్పత్తి విధానం ప్రపంచంలో ఉనికిలోకి వస్తే తప్ప పర్యావరణ సంక్షోభానికి ఒక హేతుబద్ధ పరిష్కారం దొరకదు. (అక్టోబర్ 14న అంతర్జాతీయ ఇ–వేస్ట్ డే సందర్భంగా) వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు వెన్నెలకంటి రామారావు మొబైల్ : 95503 67536 -
ప్లాస్టిక్ పారిపోలె!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో ప్లాస్టిక్ నిషేధం ప్రకటనలకే పరిమితమవుతోంది. జీహెచ్ఎంసీ ఏళ్ల క్రితమే ప్రయత్నాలు ప్రారంభించినప్పటికీ అమలులో విఫలమవుతోంది. బండ కార్తీకరెడ్డి మేయర్‌గా ఉన్నప్పుడు నిషేధానికి బీజం పడినప్పటికీ వివిధ కారణాలతోఅటకెక్కింది. పూర్తిస్థాయి నిషేధం కాస్తా... తర్వాత 40 మైక్రాన్లకు పరిమితమైంది. అనంతరం దాన్ని 50 మైక్రాన్లకు పెంచారు. గతేడాది జూన్‌లో పర్యావరణ దినోత్సవం సందర్భంగా నగరంలో ప్లాస్టిక్‌వినియోగాన్ని తగ్గిస్తామని ప్రభుత్వం, జీహెచ్ఎంసీ సంయుక్తంగా ప్రకటించాయి. దీని అమలు, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణకు తగిన కార్యాచరణతో ముందుకెళ్లాలనే లక్ష్యంతో డిసెంబర్లో మరోసారి కార్యక్రమం నిర్వహించాయి. ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ స్ట్రాటెజీస్ (ఐజీఈఎస్) సహకారంతో దీన్ని నిర్వహిస్తామని తెలిపాయి. ఇక్లీ సౌత్ ఏసియా సంస్థ కూడా ఈ కార్యక్రమ అమలులో ప్రధాన భాగస్వామిగా ఉంది. సింగిల్‌యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించడంతో పాటు రీసైకిల్ ప్లాస్టిక్‌నే వినియోగించేలా ప్రజల్లో అవగాహన కల్పిస్తామని ప్రకటించాయి. జీహెచ్ఎంసీ అన్ని కార్యాలయాల్లో సింగిల్‌యూజ్ ప్లాస్టిక్, ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల్ని, 200 మిల్లీ లీటర్ల లోపు ప్లాస్టిక్‌బాటిల్స్ వినియోగించరాదని దాదాపు రెండు నెలల క్రితం బల్దియా ఆదేశాలు జారీ చేసింది. ఏవైనా కార్యక్రమాల నిర్వహణలో వాటిని వాడితే బిల్లుల చెల్లింపులు ఉండవని కూడా హెచ్చరించింది. ఆయా కార్యాలయాల్లో సింగిల్‌యూజ్ ప్లాస్టిక్‌ను వాడటం లేదని అండర్‌టేకింగ్ ఇవ్వాలని సర్క్యులర్ పంపింది. అయినా అమలు మాత్రం జరగడం లేదు. గాంధీ 150వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ కూడా ప్లాస్టిక్ నిషేధానికి పిలుపునివ్వడం తెలిసిందే. తాజాగా సీఎం కేసీఆర్ గురువారం కలెక్టర్ల సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధిస్తామని ప్రకటించారు. జరిమానాలు సరే.. ప్లాస్టిక్ నిషేధం పేరుతో జీహెచ్ఎంసీ అధికారులు దుకాణదారులకు భారీ జరిమానాలు విధిస్తున్నారు. తాజాగా గురువారం కాటేదాన్‌లో మూడు ప్లాస్టిక్ ఉత్పత్తి పరిశ్రమలను సీజ్ చేశారు. ప్లాస్టిక్ వినియోగిస్తున్న దుకాణాలకు రూ.1.35 లక్షల జరిమానా వేశారు. అయితే బల్దియా జరిమానాలపై చూపుతున్న శ్రద్ధ ప్రజలకు అవగాహన కల్పించడంలో చూపడం లేదనే విమర్శలున్నాయి. ప్లాస్టిక్‌పై గానీ, దోమలపై గానీ తీవ్ర విమర్శలు వచ్చినప్పుడు మాత్రం హడావుడి చేస్తున్న జీహెచ్ఎంసీ... ఆ తర్వాత మరచిపోతోందనే ఆరోపణలున్నాయి. ముంపు ముప్పు... నగరంలో వర్షం వస్తే కాలనీలు, రోడ్లు చెరువులుగా మారేందుకూ ప్లాస్టిక్‌నే కారణం. నాలాల్లోని వ్యర్థాల్లో దాదాపు 40 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలే ఉండడం గమనార్హం. ఇళ్ల నుంచి వెలువడే చెత్తలో 20 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలే ఉంటున్నాయి. ఇక సింగిల్‌యూజ్ ప్లాస్టిక్ 66 శాతంగా ఉంది. ఇవన్నీ డంపింగ్‌యార్డుకు వెళ్లేలోగా చెల్లాచెదురై అన్ని ప్రాంతాలకూ వ్యాపిస్తున్నాయి. లక్ష్యం.. 2022 1972 జూన్ 5న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ పర్యావరణ దినోత్సవాన్ని ప్రారంభించింది. అదే ఏడాది ఏర్పాటైన యూఎన్ఈపీ పర్యావరణానికి సంబంధించి ప్రజలకు అవగాహన, చైతన్యపరిచే కార్యక్రమాలను నిర్వహిస్తోంది. గతేడాది నగరంలో జరిగిన కార్యక్రమంలో హైదరాబాద్‌లో 2022 నాటికి సింగిల్‌యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తామని యూఎన్ఈపీ డైరెక్టర్ ఎరిక్ సోల్హెమ్, మంత్రి కేటీఆర్‌ల సమక్షంలో అధికారులు ప్రతిజ్ఞ చేశారు. జీహెచ్ఎంసీ పాలకమండలిలోనూ ఏకగ్రీవ తీర్మానం చేసి ప్రభుత్వ అనుమతి కోసం నివేదించారు. -
‘భయ్యా.. మా చిన్నప్పుడు ఇలానే ఉండేది’
ఇటానగర్: అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఓ మాంసం వ్యాపారి.. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాడు. ఇంతకు అతడు ఏం చేశాడంటే.. ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని పూర్తిగా వదిలేయడమే కాక తన దుకాణానికి వచ్చే కస్టమర్లకు మాంసాన్ని కవర్ల బదులు ఆకుల్లో ప్యాక్ చేసి ఇస్తూ.. సామాన్యులతో పాటు.. కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజు దృష్టిని కూడా ఆకర్షించాడు. దాంతో అతడి ప్రయత్నాన్ని మెచ్చుకుంటూ.. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేశాడు కిరెణ్ రిజిజు. ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. అరుణాచల్ ప్రదేశ్ లేపా రాడా జిల్లాకు చెందిన స్థానిక మాంసం దుకాణదారుడు.. తన షాప్‌కు వచ్చి మాంసం తీసుకునే వారికి ప్లాస్టిక్ కవర్లకు బదులు ఆకుల్లో పెట్టి సరఫరా చేస్తున్నాడు. "PM @narendramodi has told us not to use plastics so we are using local leaves because plastics are no more available" A local meat vendor at remote Tirbin, Lepa Rada Dist, Arunachal Pradesh. pic.twitter.com/Z1vuB2K8fK — Kiren Rijiju (@KirenRijiju) October 6, 2019 ఇందుకు సంబంధించిన వీడియోను కిరణ్ రిజిజు తన ట్విటర్లో షేర్ చేస్తూ.. ‘ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు మేం ప్లాస్టిక్ కవర్లను వినియోగించడం లేదు. దాని బదులు స్థానికంగా లభించే ఆకులను ఉపయోగిస్తూ.. పర్యావరణహితంగా మెలుగుతున్నాం’ అంటూ ట్వీట్ చేశారు. మూడు రోజుల క్రితం షేర్ చేసిన ఈ వీడియో ఇప్పటికే 17వేలకు పైగా లైకులు సాధించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. సదరు మాంస దుకాణదారునిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తమ బాల్యంలో మాంసాన్ని ఇలానే ఆకుల్లో పెట్టి ఇచ్చే వారని గుర్తు చేసుకుంటున్నారు. 2022 నాటికి ఒకసారి మాత్రమే వినియోగించే వీలున్న ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిర్మూలించాలని మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. -
ప్లాస్టిక్‌ను తరిమేద్దాం..
పర్యావరణ పరిరక్షణకు జిల్లా యంత్రాంగం నడుం బిగించింది. దీనిలో భాగంగా రాజధాని నగరంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ.. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో చెత్త రీసైక్లింగ్‌పై ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. కార్యక్రమానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శాప్ ఎండీ కాటంనేని భాస్కర్, కలెక్టర్ ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ మాధవీలత, కమిషనర్ ప్రసన్న వెంకటేష్ పాల్గొన్నారు.ఈ మేరకు ఇంది ప్రజలతో ‘ప్లాస్టిక్ వాడం.. పర్యవరణాన్ని కాపాడుతాం..’ అంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, కలెక్టర్ ఇంతియాజ్ ప్రతిజ్ఞ చేయించారు. సాక్షి, అమరావతి : ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి నిద్రపోయేవరకు ప్లాస్టిక్ మన జీవితంలో భాగమైపోయింది. ప్లాస్టిక్ వల్ల మనిషి తినే ఆహారంతో పాటు జిల్లాలో ఉన్న జలవనరులన్నీ కలుషితమైపోయి పర్యావరణానికి హాని కలుగుతోంది. ఒక సర్వే ప్రకారం ఒక కుటుంబం ఏటా సగటున 100 కిలోల ప్లాస్టిక్‌ను ఉత్పత్తి చేస్తుందని సమాచారం. ఇది గ్రామాల్లో పోలిస్తే పట్టణాలు, పురపాలికల్లో ఎక్కువ. జిల్లాలో నూజివీడు, గుడివాడ, జగ్గయ్యపేట, పెడన మున్సిపాలిటీల్లో రోజుకు సగటున 45 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. అలాగే నగర పంచాయతీలైన ఉయ్యూరు, నందిగామ, తిరువూరు నగర పంచాయతీల్లోనూ రోజు సగటున 10 నుంచి 15 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. ఇందులో దాదాపు 20 శాతం అంటే 20 టన్నుల టన్నుల మేర నిత్యం ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతోంది. దీనిలో 40 శాతం వరకు సేకరణకు రాకుండా ఇళ్లలో, రహదారులపై ఉండిపోతోంది. మిగిలిన దాంట్లో కొంత కాల్చివేస్తుండగా.. ఎక్కువ శాతం సేకరించి పేర్చుతున్నారు. 15 నుంచి 20 శాతం మాత్రమే పునరుత్పత్తి జరుగుతోంది. అత్యధికంగా విజయవాడలోనే.. జిల్లాలో మొత్తం విజయవాడ, మచిలీపట్నం కార్పొరేషన్లతోపాటు 4 మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీలున్నాయి. జిల్లా వ్యాప్తంగా రోజూ వెయ్యి టన్నులకు పైగా చెత్త ఉత్పత్తి అవుతుంటే అందులో దాదాపు 100 టన్నుల మేర ప్లాస్టిక్ వ్యర్థాలే ఉంటున్నాయి. జిల్లాలో అత్యధికంగా విజయవాడ కార్పొరేషన్లో రోజూ 550 టన్నులు ఉత్పత్తి అవుతుండగా.. తర్వాత స్థానం మచిలీపట్నం కార్పొరేషన్లో దాదాపు వంద టన్నుల చెత్త ఉత్పన్నమవుతోంది. నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న దుకాణాలు, హోటళ్లు, ఇతరత్రా వాటిల్లో 40 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్‌ను నిషేధించేలా చర్యలు తీసుకున్నా క్షేత్రస్థాయిలో అవి అమలు కావడం లేదు. ‘స్వచ్ఛ విజయవాడ’కు శ్రీకారం.. ప్రపంచ వర్తక, వాణిజ్య రంగంలో ముఖ్య భూమిక పోషించిన విజయవాడ నగరంలో ఎక్కడ చూసినా చెత్తాచెదారం దర్శనమిస్తున్నాయి. నగరాన్ని అపరిశుభ్రంగా మార్చుతున్న నిర్లక్ష్యపు నీడల్ని తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘స్వచ్ఛ విజయవాడ’కు శ్రీకారం చుట్టింది. బెజవాడలోని ప్రధాన వీధులు మినహా ఇతర వీధుల్లో ముక్కు మూసుకుని పోయే పరిస్థితికి కారణమవుతున్న డంపర్ బిన్లను తొలగించింది. ఇంటింటి నుంచి రోజూ చెత్త సేకరించాలనే ఉద్దేశంతో రూ.కోట్లు పెట్టి పుష్‌కార్ట్‌లు, చెత్త సేకరించే బుట్టలను తీసుకురావడమే కాకుండా.. ప్రత్యేకంగా సిబ్బందిని నియమించింది. ఈ క్రమంలో నగరాన్ని పట్టిపీడిస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలపై దృష్టి సారించింది. ఇది కేవలం అధికారుల చర్యలతో కాదు.. ప్రజల సహకారంతోనే సాధ్యమవుతుంది. ప్రతిజ్ఞ చేస్తున్న సీఎస్ సుబ్రహ్మణ్యం, కలెక్టర్ ఇంతియాజ్, శాప్ ఎండీ భాస్కర్, జేసీ మాధవీలత తదితరులు చేయాల్సిందిదీ.. ► పాలు, మాంసం లాంటివి తీసుకురావడానికి బయటకు వెళ్లేటప్పుడు ఇంటి నుంచే ఓ టిఫిన్ బాక్సు తీసుకుపోవాలి. ► 40 మైక్రాన్ల కంటే ఎక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ సంచులను వాడినా వాటిని మన బాధ్యతగా పారిశుద్ధ్య సిబ్బందికి ఇచ్చేలా ప్రయత్నించాలి. ► కూరగాయలు, ఇతరత్రా కొనేటప్పుడే భూమిలో కలిసి పోయే గుణమున్న చేతి సంచినే వినియోగించాలి. ► వ్యాపారులు, దుకాణాదారుల యజమానులు ప్లాస్టిక్‌ను ఇవ్వకుండా వినియోగదారులకు నచ్చజెప్పేలా మాట్లాడాలి. ప్లాస్టిక్ నీళ్ల సీసాలకు బదులుగా స్టీలు, రాగి వంటి సీసాలు ఉపయోగిస్తే మంచిది. ► పురపాలక సంఘ అధికారులు మొక్కుబడిగా కాకుండా ప్లాస్టిక్ నియంత్రణపై చిత్తశుద్ధి కనబర్చాలి. పురపాలికల్లో ఉన్న అన్ని దుకాణాలు, హోటళ్లు ప్లాస్టిక్‌ను నిషేధించేలా వారికి దశల వారీగా కౌన్సెలింగ్ కేంద్రాల ద్వార అవగాహన కల్పించాలి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధించాలి. ప్రతి ఒక్కరూ సహకరించాలి.. నగరంతో పాటు, జిల్లా అంతటా ప్లాస్టిక్‌ను నిషేధించేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. నగరంతో పాటు జిల్లాల్లో సింగల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించే దిశగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాం. రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు, వ్యాపార సంస్థలు, సూపర్ మార్కెట్లు, హోటళ్ల తదితరాల నిర్వాహకులకు అవగాహన కల్పించాం. – ఏఎండీ ఇంతియాజ్, కలెక్టర్ -
‘ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చాలన్నదే లక్ష్యం’
సాక్షి, విజయవాడ : సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేదంపై మంగళవారం నగరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ పాల్గొన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ పీడబ్ల్యూ గ్రౌండ్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. సీఎం జగన్మోహన్రెడ్డి ప్లాస్టిక్ నిషేందించాలని దృఢ నిశ్చయంతో ఉన్నారని, ఇందులో భాగంగానే ఈ కార్యక్రమం చేపట్టామని పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్‌లో భాగంగా నగరాలు, పట్టణాలు, కార్పొరేషన్ పరిధిలో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేదించామని తెలిపారు. ప్రజల తోడ్పాటుతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని అన్నారు. కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు ప్లాస్టిక్‌ను నిషేదించాలని సూచించారు.. మానవ జీవితంలో ఒక భాగంగా మారిన ప్లాస్టిక్ అనేక సమస్యలకు కారణం అవుతుందని తెలిపారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ నినాదంతో గాంధీ జయంతిని పురస్కరించుకుని అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ మాట్లాడుతూ.. విజయవాడ నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ఈ ఉద్యమంలో పాల్గొనాలని కోరారు. ప్రజల నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించేందుకు నగర పాలక సంస్థ వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. -
ప్లాస్టిక్ చెత్తను పాతరేద్దాం..
‘ఇందుగలదందు లేదన్న సందేహంబు వలదు.. తరచి చూచిన.. ప్లాస్టిక్ ఎందెందు వెదకినా అందందే గలదు’ ఇదీ ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ పరిస్థితి. మనిషికి ప్రియమైన శత్రువుగా మారిపోయిన ఈ ప్లాస్టిక్‌ను వదిలించుకునేందుకు ఇప్పుడిప్పుడే సీరియస్‌గా ప్రయత్నాలు మొదలయ్యాయి. మన ప్రధాని మోదీ సైతం తన ‘మన్‌కీ బాత్’లో ప్లాస్టిక్ చెత్తను వదిలించుకోవాలని పిలుపునిచ్చారు. మరి ఈ లక్ష్యాన్ని అందుకోవాలంటే మనం ఏం చేయొచ్చు. ఇతర దేశాల్లో అమల్లో ఉన్న మంచి పద్ధతులేంటి..? సగం ప్లాస్టిక్ చెత్త రీసైక్లింగ్ జర్మనీ, ఆస్ట్రియా, కొరియాతో పాటు బ్రిటన్‌లోని వేల్స్లో ప్లాస్టిక్ చెత్త రీసైక్లింగ్ అత్యంత సమర్థంగా జరుగుతోంది. వాడి పడేసిన ప్లాస్టిక్‌లో కనీసం సగం మొత్తాన్ని మళ్లీ వాడుకునేలా చేస్తున్నారు. రీసైక్లింగ్‌ను ప్రోత్సహించేందుకు తగినన్ని ప్రోత్సాహకాలు ఇవ్వ డంతో పాటు.. నిధులు, మౌలిక సదు పాయాలు కల్పించడం ఇం దుకు కారణం. ప్లాస్టిక్ రీసైక్లింగ్‌కు సంబంధించి మున్సిపాలిటీలు, పంచాయతీలు సాధించాల్సిన లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించడంతో పాటు అమలు ఆధారంగా ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. ఈ–వేస్ట్ పనిపడతారు.. వాడేసిన స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్ల వంటి ఎలక్ట్రానిక్ పరికరాల చెత్తను వదిలించుకునే విషయంలో స్పష్టమైన విధానాన్ని ప్రకటించిన తొలిదేశంగా కొలంబియా నిలిచింది. రెండేళ్ల కిందట ప్రకటించిన ఈ విధానం నాలుగు ప్రధాన లక్ష్యాలను నిర్దేశించుకుంది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను బాధ్యతాయుతంగా వాడటంపై వినియోగదారుల్లో అవగాహన కల్పించడం.. దిగుమతి చేసుకున్న లేదా దేశీయంగా ఉత్పత్తి చేసిన ఎలక్ట్రానిక్ పరికరాలను సక్రమంగా రీసైకిల్ చేసేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవడం.. జాతీయ స్థాయిలో రీసైక్లింగ్ వ్యవస్థలను బలోపేతం చేసుకోవడం.. ఇందుకు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం చేస్తోంది. కొలంబియాలో ఏటా దాదాపు 2.5 లక్షల టన్నుల ఈ–వేస్ట్ ఉత్పత్తి అవుతోంది. చెత్త సేకరణకు ఆరోగ్య బీమా.. ఇండోనేసియాలో ప్లాస్టిక్ చెత్తను సేకరించే వారికి ‘గార్బేజ్ క్లినికల్ ఇన్సూరెన్స్’కింద ఆరోగ్య సేవలు అందుతాయి. గమాన్ అల్బిసెయిద్ నేతృత్వంలోని ‘ఇండోనేసియా మెడికా’అనే కంపెనీ ఈ ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టింది. దాదాపు 600 మంది ఈ ఇన్సూరెన్స్ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. రీసైకిల్ చేసేందుకు అనువైన పదార్థాలను సేకరించి తీసుకురావడం.. ప్రతిఫలంగా మలాంగ్, జకార్తాల్లోని మూడు ఆసుపత్రుల్లో ఆరోగ్య సేవలు పొందడం ఈ పథకం ప్రత్యేకత. సింగపూర్ ఆదర్శం.. మొత్తం 40 లక్షల మంది జనాభా మాత్రమే ఉండే సింగపూర్.. చెత్త నిర్వహణ విషయంలో ప్రపంచానికి ఆదర్శంగా ఉన్న విషయం తెలి సిందే. మండించేందుకు అవకాశమున్న చెత్తను ఇంధన ఉత్పత్తికి వాడు కోవడం.. తడిచెత్తను క్రమపద్ధతిలో ల్యాండ్‌ఫిల్స్‌లో నింపి అక్కడ పచ్చదనాన్ని పెంచే ప్రయ త్నం చేయడం సింగపూర్ మోడల్లో చెప్పుకోదగ్గ విశేషాలు. భవన నిర్మాణ వ్యర్థాలను అత్యంత సమర్థంగా తగ్గించుకునే విషయంలో సింగపూర్ మిగిలిన దేశాల కంటే ఎంతో ముం దుంది. 2005 నాటికే ఈ చిన్న దేశం 94 శాతం భవన నిర్మాణ వ్యర్థాలను రీసైకిల్ చేసేసింది. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన పూర్తిస్థాయి ప్రణాళికను జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన అతికొద్ది రాష్ట్రాల్లో ఏపీ కూడా ఒకటి. పాల ప్యాకెట్లలో వాడే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు ఒడిశాలో ఇటీవలే పాల ఏటీఎంలు మొదలయ్యాయి. క్యాన్లు, పాత్రలు తీసుకెళ్లి ఈ ఏటీఎంల నుంచి పాలు తెచ్చుకోవాల్సి ఉంటుంది. చెత్త సేకరించే వారు తెచ్చే ప్లాస్టిక్‌కు బదులు భోజనం పెట్టే పథకం ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్ పట్టణంలో అమలవుతోంది. కిలో ప్లాస్టిక్ చెత్తకు ఒక పూట భోజనం అందిస్తున్నారు. అరకిలో చెత్తతో బ్రేక్‌ఫాస్ట్ ఇస్తారు. అండమాన్ నికోబార్ దీవుల్లో పనిచేస్తున్న ఓ అటవీ అధికారి.. మొక్కల పెంపకానికి ప్లాస్టిక్ కవర్ల స్థానంలో వెదురుబొంగులు వాడటం మొదలుపెట్టారు. బెంగళూరులోని 6 హోటళ్లలో ఆహారం పార్సిల్ చేసేందుకు ప్లాస్టిక్ వాడట్లేదు. వినియోగదారులే పాత్రలు తీసుకెళ్లాల్సి ఉంటుంది. కేరళలోని కొంతమంది జాలర్లు వేట నుంచి తిరిగొచ్చేటప్పుడు చేపలతో పాటు సముద్రంలోని ప్లాస్టిక్ చెత్తను ఒడ్డుకు చేరుస్తున్నారు. తమిళనాడులో కొంతమంది ఔత్సాహికులు ప్లాస్టిక్ స్ట్రాలకు బదులు బొప్పాయి ఆకు కాడలను స్ట్రాలుగా వాడటం మొదలుపెట్టారు. జొన్న చొప్పతో ప్లాస్టిక్‌ను తయారు చేసేందుకు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధన కేంద్రం కొత్త పద్ధతిని అభివృద్ధి చేస్తోంది. గొంగడి పురుగులు ప్లాస్టిక్ చెత్తను ఇష్టంగా తిని జీర్ణం చేసుకోగలవని పుణేలోని డాక్టర్ రాహుల్ మూడేళ్ల కిందటే గుర్తించారు. 50 మైక్రాన్ల కంటే తక్కువ మందమున్న ప్లాస్టిక్‌ను కొన్ని రకాల గొంగడి పురుగులు తినేయడంతో పాటు వాటి విసర్జితాలు ఎరువుగానూ ఉపయోగపడతాయని గుర్తించారు. -
ప్లాస్టిక్ నిషేదం; ఫొటో పంపితే రూ.100 పారితోషికం..!
సాక్షి, విజయవాడ : జిల్లా యంత్రాంగం ప్లాస్టిక్ రహిత సమాజం కోసం నడుం బిగించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో కృష్ణలంకలోని గీతానగర్‌లో అధికారులు మొక్కలు నాటి జ్యూట్ బ్యాగులను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ... ‘మన విజయవాడ అనే నినాదంతో ప్లాస్టిక్‌ను తరిమేయాలన్నదే లక్ష్యం. భూసారం తగ్గిపోవడానికి, డ్రైనేజీ సమస్యలకి, పర్యావరణం దెబ్బతినడానికి ప్లాస్టిక్ వ్యర్థాలే కారణం. విజయవాడలో అందరూ చైతన్య వంతులై ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలి. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా ప్లాస్టిక్ వాడితే చర్యలు తప్పవు. ఆ విషయాన్ని ఫొటో తీసి పంపితే వంద రూపాయలు పారితోషికం ఇస్తా’అన్నారు. నగరంలో ఎవరైనా ప్లాస్టిక్ క్యారీబ్యాగ్స్ అమ్మినా, వాడినా జరిమానా విధిస్తున్నామని కలెక్టర్ ఇంతియాజ్ వెల్లడించారు. అక్టోబర్ 2 నుంచి ప్లాస్టిక్‌పై పూర్తి నిషేదం అమలవుతుందని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
నిషేధం.. నిస్తేజం! వ్యర్థ అనర్థమిదీ...
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో ప్లాస్టిక్ కవర్ల నిషేధం నిస్తేజంగా మారింది. దీని అమలు ఒకడుగు ముందుకు...రెండడుగులు వెనక్కు అన్న చందంగా సాగుతోంది. దాదాపు ఐదారేళ్ల క్రితమే నగరంలో ప్లాస్టిక్ కవర్ల వాడకంపై నిషేధం విధించాలనే ప్రయత్నాలు మొదలైనప్పటికీ... ఆచరణలో మాత్రం చిత్తశుద్ధి కొరవడింది. కవర్ల నిషేధంపై ప్రజలను చైతన్యం చేసే దిశగా పూర్తిస్థాయిలో కృషి చేయకపోవడం, వీటికి ప్రత్యామ్నాయంగా జూట్, క్లాత్ బ్యాగుల తయారీపై శ్రద్ధ చూపకపోవడం ఇందుకు కారణమవుతోంది. ఫలితంగా ప్లాస్టిక్ కవర్ల దందాయథేచ్ఛగా కొనసాగుతోంది. తిరుపతి టెంపుల్ సిటీలో ప్లాస్టిక్ నిషేధం పక్కాగా అమలవుతుండగా... మహానగరంలో కనీసం మోడల్‌గానైనా ఒక్క సర్కిల్/డివిజన్‌లోనైనా నిషేధించలేకపోయారు. అడపాదడపా ఆర్నెళ్లకో, ఏడాదికో ప్లాస్టిక్ కవర్ల నిషేధమంటూ ప్రకటించడం.. ఉత్పత్తిదారులు, విక్రేతలపై దాడులు నిర్వహించి పెనాల్టీలు విధించడంతో మమ అనిపిస్తున్న అధికారులు.. ఆపై అంతా మరిచిపోతున్నారు. దీంతో తిరిగి ప్లాస్టిక్ కవర్ల వినియోగం పెరిగిపోతోంది. ఐదారేళ్ల క్రితం తొలిసారిగా 40 మైక్రాన్లలోపు ప్లాస్టిక్ కవర్లపై నిషేధం విధించినప్పుడు ప్రజల్లో అవగాహన పెరిగే సమయానికే నిషేధానికి తూట్లు పొడిచారు. అదే అనుభవం ప్రతిసారీ పునరావృతమవుతోంది. గతేడాది సైతం ప్లాస్టిక్ నిషేధంపై విస్తృత ప్రచారాలతో ప్రజల్లో కొంతమేర అవగాహన రాగానే కార్యక్రమం మళ్లీ అటకెక్కింది. పండ్లు, కూరగాయల వ్యాపారులు మొదలు మాంసం విక్రేతలు, ఫంక్షన్‌హాళ్ల నిర్వాహకులకు సైతం అవగాహన కల్పించే కార్యక్రమాలు ఒక దశకు చేరుకోగానే చరమగీతం పాడారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధిస్తామని ప్రతిజ్ఞలు చేసి కొద్దికాలం పకడ్బందీగానే అమలు చేసినా.. ఆ తర్వాత విస్మరించారు. ఒక దశలో మైక్రాన్లతో సంబంధం లేకుండా ప్లాస్టిక్ కవర్లను సంపూర్ణంగా నిషేధించేందుకు సిద్ధమైన జీహెచ్ఎంసీ.. ఆ మేరకు స్టాండింగ్ కమిటీలో తీర్మానించి అనుమతి కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఆ తర్వాత ఆ అంశాన్ని పట్టించుకోకపోవడంతో కార్యరూపం దాల్చలేదు. నాలాల్లో 40శాతం... జీహెచ్ఎంసీలో రోజుకు సగటున 5వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు వెలువడుతుండగా, వాటిలో దాదాపు 400 మెట్రిక్ టన్నులు ప్లాస్టిక్ వ్యర్థాలే. అవి క్రమేపీ పెరుగుతూ ప్రస్తుతం 500 మెట్రిక్ టన్నులకు చేరినట్లు తెలుస్తోంది. ప్లాస్టిక్ వ్యర్థాలతో పర్యావరణానికి పెను ముప్పుతో పాటు చెరువులు, నీటి వనరులు కలుషితమవుతున్నాయి. నగరంలో కురిసే భారీ వర్షాలకు నాలాలు, సివరేజీ లైన్లు ప్లాస్టిక్ వ్యర్థాలతో పేరుకుపోయి నీరు రోడ్లపైకి చేరి ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వర్షాకాలంలో నాలాలు పొంగి రోడ్లు చెరువులుగా మారడానికి ప్రధాన కారణం నాలాల్లోని ప్లాస్టిక్ వ్యర్థాలేనని వెల్లడైంది. నాలాల్లో 40శాతానికి పైగా ప్లాస్టిక్ వ్యర్థాలే ఉన్నట్లు ఇంజినీరింగ్ అధికారులు గుర్తించారు. తిరిగి వర్షాకాలం లోపు ఆ వ్యర్థాలను తొలగించడంతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలు వేయకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేసి జరిమానాలు విధిస్తామన్నప్పటికీ కార్యరూపం దాల్చలేదు. అధికారులు డిసెంబర్ 18 నుంచి ఏప్రిల్ 23వరకు 50 మైక్రాన్ల లోపు ప్లాస్టిక్ కవర్ల విక్రేతలు, ఉత్పత్తిదారులపై తనిఖీలు నిర్వహించి రూ.1,16,600 జరిమానాలు విధించారు. 81 కేసులు నమోదు చేశారు. ‘సంపూర్ణం’ సాధ్యమిలా... జన జీవితంలో నిత్యావసరంగా మారిన ప్లాస్టిక్‌ను నిషేధించడం అంత తేలికేమీ కాదు. అందువల్లే 2022 నాటికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తామని గతేడాది పర్యావరణ దినోత్సవం సందర్భంగా అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ సమక్షంలో అధికారులు ప్రతిజ్ఞ చేశారు. ఆలోగా సింగిల్‌యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించడం, సంపూర్ణ నిషేధానికి ప్రణాళిక రూపొందించాల్సి ఉంది. దశల వారీగానే అమలు సాధ్యమవుతుందని ఆయా నగరాల్లోని ప్లాస్టిక్ నిషేధ కార్యక్రమాలను పరిశీలిస్తే అవగతమవుతుంది. ♦ తొలుత 50 మైక్రాన్లలోపు విజయవంతమైతే ఆ తర్వాత సంపూర్ణ నిషేధం చేయవచ్చుననే అభిప్రాయాలున్నాయి. ♦ అన్ని స్థాయిల్లో ఆయా వర్గాల ప్రజలకు ప్లాస్టిక్ అనర్థాలపై అవగాహన కల్పించాలి. ♦ బస్తీల్లోని స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా ఇంటింటికీ అవగాహన కల్పించడం, వారు ఉపాధి పొందేలా క్లాత్, జూట్ బ్యాగుల తయారీలో శిక్షణనిచ్చి వారి ఉత్పత్తులకు తగిన మార్కెటింగ్ కల్పించాలి. వాటిని వినియోగంలోకి తెస్తూ క్రమేపీ ప్లాస్టిక్ వాడడం మానేలా చేయాలి. ♦ విద్యార్థులకు అవగాహన కల్పించడం ద్వారా విషయం కుటుంబానికి చేరుతుంది. ♦ ఫంక్షన్‌హాళ్లు, కల్యాణ మండపాలు తదితర ప్రాంతాల్లో వాడే ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు, కప్పుల స్థానంలో స్టీల్, పింగాణీ, గాజు రకం వాడేలా చర్యలు తీసుకోవాలి. ♦ సరుకులు, కూరగాయల కోసం జూట్, క్లాత్ బ్యాగులు వాడేలా, మాంసం కోసం టిఫిన్ బాక్సులు వినియోగించేలా చర్యలు చేపట్టాలి. ♦ ప్లాస్టిక్ కవర్ల తయారీ, రవాణా, అమ్మకం, పంపిణీ వంటివి పూర్తిగా ఆగిపోవాలి. ♦ హోల్‌సేలర్, రిటైలర్, ట్రేడర్, హాకర్, సేల్స్‌మెన్‌తో సహా ఎవరూ ప్లాస్టిక్ కవర్లు అమ్మడం గానీ చేస్తే జరిమానాలు విధించాలి. వరుసగా మూడుసార్లు చేస్తే దుకాణాన్ని సీజ్ చేయాలి. -
నేను మారాను..మీరూ మారండి..!
ప్లాస్టిక్ వద్దు... క్లాత్ బ్యాగ్ ముద్దు పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్లాస్టిక్ సంచులను వదిలేసి ఈ టిఫిన్ బాక్స్‌లను, క్లాత్ బ్లాగ్‌లను వినియోగిస్తున్నాను. మీరు కూడా టిఫిన్ బాక్స్ చాలెంజ్‌ను స్వీకరించి ప్లాస్టిక్ రహిత సమాజానికి పాటుపడాలి. సాధ్యమైనంత వరకు కవర్ల వాడకాన్ని తగ్గించాలి. పేపర్, జ్యూట్ బ్యాగ్స్ వాడాలి. ప్రభుత్వం కూడా ఎక్కువ ప్రచారం కల్పించాలి. ప్లాస్టిక్.. ప్లాస్టిక్.. తాగే గ్లాసు నుంచి తినే కంచ వరకు ప్రస్తుతం అంతా ప్లాస్టిక్ భూతమే కనిపిస్తోంది. పర్యావరణాన్ని కబళించే ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టేందుకు నడుం బిగించాడు ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్. అనుకున్నదే తడవుగా ఎక్కడికి వెళ్లినా.. టిఫిన్ బాక్స్ తీసుకువెళుతూ అందరికి చాలెంజ్ విసురుతున్నాడు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్‌ను పారదోలేందుకు గత ఏడాది ఉగాది పండుగ రోజున ‘టిఫిన్ బాక్స్’ చాలెంజ్ తీసుకొచ్చాడు హైదరాబాద్‌కు చెందిన దోసపాటి రాము. ఎల్బీనగర్లో ఉండే రాము ఈ చాలెంజ్ ద్వారా కొన్ని లక్షల ప్లాస్టిక్ కవర్లను తగ్గించి ఎంతో మందికి పర్యావరణంపై అవగాహన కలిగిస్తూ పలువురి మన్ననలు పొందుతున్నాడు. నగరంలో వాడుతున్న కవర్లలో కొన్ని కవర్ల వాడకాన్ని అయినా తగ్గించాలని తన ప్రయత్నాన్ని గత ఏడాది ఉగాదిన తన ఇంటిలోనే మొదలు పట్టాడు. ‘మటన్, చికెన్ షాపునకు వెళ్తే టిఫిన్ బాక్స్ తీసుకెళ్లండి. కూరగాయల మార్కెట్‌కి వెళ్లే జ్యూట్ లేదా క్లాత్ బ్యాగును తీసుకెళ్లండి’’ అంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ తాను పాటించడం మొదలు పెట్టాడు. అంతేగాక ‘మీరు కూడా ప్లాస్టిక్‌కు బదులు టిఫిన్ బాక్స్‌లు వాడండి’ అంటూ ఫొటోలు దిగి సామాజిక మాధ్యమాల్లో స్నేహితులకు చాలెంజ్ విసిరారు. వాళ్లు ఈ ఐడియా నచ్చి మరికొంత మందికి చాలెంజ్ చేస్తూ ప్లాస్టిక్ కవర్ల వాడాకాన్ని తగ్గించారు. కూరగాయల మార్కెట్లలో.. సాధారణంగా కూరగాయల మార్కెట్లలో ప్లాస్టిక్ కవర్ల వాడకం ఎక్కువగా ఉంటుంది. ఇది గమనించిన రాము ఎల్బీనగర్, నాగోల్, కొత్తపేట, రాక్‌టౌన్ కాలనీలోని వారపు సంతలో మకాం వేస్తూ ప్లాస్టిక్ కవర్ల వినియోగం వల్ల కలిగే అనర్థాలను మైక్ పట్టుకుని సంతకు వచ్చే వారికి వివరించడంతోపాటు స్థానికుల సాయంతో పేపర్ బ్యాగ్స్ తయారు చేయించి, ఆ బ్యాగులను కూరగాయలు అమ్మే వారికి పంపిణీ చేశాడు. ఇలా రెండు నెలల పాటు చేయడంతో మార్కెట్‌కు వచ్చే వాళ్లకు అవగాహన వచ్చి ఇంటినుంచి వచ్చేటప్పుడే క్లాత్ బ్యాగులు తెచ్చుకోవడం మొదలు పెట్టారు. దీంతో కొన్ని వందల కవర్ల వాడకం తగ్గిపోయిందని, ఇక్కడే గాక నల్లగొండ, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో సైతం టిఫిన్ బాక్స్ చాలెంజ్‌కు మంచి స్పందన వచ్చిందని రాము చెబుతున్నాడు. – మంగినేపల్లి సాయి కుమార్, సాక్షి, నకిరేకల్ -
నీరుగారుతున్న నిషేధం..
విజయనగరం మున్సిపాలిటీ: నాజూగ్గా ఉందని... ఉచితంగా వస్తుందని... తేలికపాటిదని పాలిథిన్ కవర్ల వాడకానికి ప్రజలు అలవాటు పడిపోయారు. ఖాళీ చేతులతో వెళ్లడం... ఎలాంటి వస్తువునైనా పాలిథిన్ కవర్లలో తెచ్చుకోవడం పరిపాటిగా మారిపోయింది. అయితే పొంచి ఉన్న పెను ప్రమాదాన్ని ఎవరూ గుర్తించలేకపోతున్నారు. క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులకు ప్లాస్టిక్ వాడకం కూడా ఒక కారణమని విద్యావంతులకు తెలుసు. అయినప్పటికీ దీని వాడకం ఆగడం లేదు. నిషేధం అమలులో ఉన్నప్పటికీ వినియోగం తగ్గడం లేదు. ఫలితంగా మనుషులతో పాటు మూగ జీవాలు సైతం మత్యువాతపడుతున్నాయి. పర్యావరణానికి పెను ప్రమాదంగా తయారైన పాలిథిన్ సంచుల వాడకాన్ని నిషేధిస్తూ 1986లో అప్పటి ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ చట్టం తీసుకొచ్చింది. అయితే ప్రభుత్వం హడావుడి చేసిందని తూతూ మంత్రంగా అమలుపరిచి వదిలేశారు. దీంతో ఇష్టారాజ్యంగా ప్లాస్టిక్ గ్లాసులు, కప్పులు, సంచులను వినియోగిస్తున్నారు. టీ దుకాణాలు, పెళ్లిళ్లు, విందుల్లో వీటి వినియోగం ఎక్కువ. 50 మైక్రాన్లకు మించి తయారు చేసిన గ్లాసులు, సంచుల్లో వేడి వస్తువులైన పాలు, టీ, కూరలు వేయడం వల్ల అందులో ప్లాస్టిక్ పొర కరిగి పదార్థాల్లో కలిసిపోయి శరీర అవయవాలు దెబ్బతింటాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. తనిఖీలు అంతంతమాత్రమే.. విజయనగరం మున్సిపాలిటీ పరిధిలో ప్లాస్టిక్ నిషేధం అమలులో ఉన్నప్పటికీ స్థానిక అధికారులు నామమాత్రపు జరిమానాలు విధించి చేతులు దులుపుకొంటున్నారు. దీంతో వ్యాపారులు పెద్దగా లెక్క చేయడం లేదు. స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే జరిగే సమయంలో తూతూ మంత్రంగా దాడులు నిర్వహించి ర్యాంకుల కోసం ఆరాటపడుతున్న అధికారులు పూర్తి స్థాయి నిషేధంపై చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. యథేచ్ఛగా విక్రయాలు.. వాస్తవానికి పాలిథిన్ సంచులు తయారు చేసే కంపెనీలపై చర్యలు తీసుకుంటే వినియోగాన్ని నివారించవచ్చని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అలా కాకుండా కొనుగోలు చేసి విక్రయిస్తున్న దుకాణదారులపై చర్యలు తీసుకోవడం వల్ల ఫలితం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అసలు ప్లాస్టిక్ వస్తువులు తయారు చేయకుండా ఉంటే వాటిని వాడే అవసరమే ఉండదని ప్రజలు భావిస్తున్నారు. చట్టం ఏం చెబుతోంది... పాలిథిన్ కవర్లు, ప్లాస్టిక్ వస్తువులు విక్రయించడం, వినియోగించడంపై 1986లో చట్టం చేశారు. 20 మైక్రానులు కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ సంచులను విక్రయించకూడదని నిబంధన విధించారు. ఈ తర్వాత దాన్ని సవరిస్తూ 50 మైక్రానులకు పెంచారు. నిషేధిత వస్తువులు తయారు చేసినా, అమ్మినా, వాడినా రూ.2,500 నుంచి రూ.అయిదు వేల వరకు జరిమానా విధించవచ్చు. కమిటీలు ఏం చేస్తున్నాయి... పాలిథిన్ సంచుల నిషేధం అమలు కమిటీలో కలెక్టరుతో పాటు 10 మంది అధికారులు ఉంటారు. నెలకోసారి ప్లాస్టిక్ నిషేధం అమలుపై చర్చించాలి. అయితే ఈ సమావేశాలు జరుగుతున్న దాఖలాలు కనిపించడం లేదు. 2004 నుంచి పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ నిషేధం అమలులో ఉన్నా ఏటా నమోదయ్యే కేసులు పదుల సంఖ్యలో ఉంటున్నాయి. ప్రజలు చైతన్యం కావాలి... పర్యావరణానికి పెద్ద శత్రువుగా మారిన ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించేందుకు ప్రజలు సహకరించాలి. స్వచ్ఛందంగా చైతన్యవంతులై వీటిని వినియోగించడం మానేస్తే సమాజానికి ఎంతో మేలు చేసినవారవుతారు. ఈ విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు విద్యావంతులు, స్వచ్ఛంద సంస్థలు కృషిచేయాలి. నిషేధిత కవర్లు అమ్మకూడదు... 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ ఉత్పత్తులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. నిషేధం అమలైన తర్వాత ఐదు కేసులు నమోదయ్యాయి. ఇటీవల స్వచ్ఛ సర్వేక్షన్ సర్వే జరిగే సమయంలో విక్రయదారులు, ఉత్పత్తిదారులపై ఎలాంటి కేసులు నమోదు చేయలేదు. దుకాణాల వద్దకు వెళ్లి వ్యాపారులను హెచ్చరించాం. – వెంకట్, మున్సిపల్‌ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్, విజయనగరం -
బేగంబజార్: చిరుదుకాణాలపై విజిలెన్స్ అధికారుల దాడులు
-
ప్లాస్టిక్ కవర్లో మృతదేహం
తాడేపల్లిరూరల్(మంగళగిరి): మృత దేహాన్ని ప్లాస్టిక్ కవర్లో చుట్టి జాతీయ రహదారి పక్కన పడేసిన ఘటన తాడేపల్లి మండల పరిధిలోని రాధారంగా నగర్లో బుధవారం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు తాడేపల్లి సీఐ బ్రహ్మయ్య ఘటనా స్థలానికి చేరుకుని కవర్ చుట్టి ఉన్న మృతదేహాన్ని బయటకు తీసి పరిశీలించారు. అనంతరం నార్త్‌జోన్ డీఎస్పీ రామకృష్ణకు సమాచారం ఇవ్వడంతో వెంటనే వెంటనే ఆయన ఘటనా స్థలానికి చేరుకున్నారు. లారీ నుంచి కిందపడి చనిపోయి ఉండవచ్చా.. లారీ తొక్కి ఉండవచ్చా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు లారీ క్లీనర్ అయి ఉంటాడని, 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండవచ్చన్నారు. ఎటువంటి ఆధారాలు లభించ లేదు. మృతుడి ఒంటిపై సిమెంటు రంగు ప్యాంటు, నల్ల బన్నీను, మెడలో అయ్యప్పస్వాములు ధరించే నల్లని వస్త్రం ఉంది. చనిపోయింది లారీ క్లీనర్ అయితే నేల బురదగా ఉండగా, లారీ కింద ఎందుకు పడుకుంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మద్యం మత్తులో ప్లాస్టిక్ సంచులు కప్పుకొని పడుకుంటే లారీ తొక్కి వెళ్లిందా?.. ఆ సంచుల్లో మృతదేహాన్ని చుట్టి అక్కడ పడవేస్తే, గుర్తు తెలియని వాహనం తొక్కివెళ్లిందా అనే అనుమానాలు వెల్లువెత్తాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
తిరుమల: ప్లాస్టిక్ కవర్ల వినియోగంపై నిషేదం
-
నిషేధిత ప్లాస్టిక్ కవర్ల వినియోగంపై సీరియస్
చంద్రశేఖర్‌కాలనీ నిజామబాద్ : ఇందూరు నగరంలోని వివిధ ప్రాంతాల్లో గల షాపుల్లో సోమవారం సాయంత్రం మున్సిపల్ పబ్లిక్ హెల్త్ అధికారులు స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా దాడులు చేసి నిషేధిత ప్లాస్టిక్ కవర్లు స్వాధీనం చేసుకొని జరిమానాలు విధించారు.స్థానిక అహ్మదీబజార్, గాంధీచౌక్ ఏరియాల్లో గల మద్యం షాపులు, దుస్తుల షాపులపై దాడులు చేసి నిబంధనలకు విరుద్ధంగా ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తున్న వ్యాపారులకు రూ. 11 వేల 800 జరిమానా విధించామని మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ సాజిద్ అలీ తెలిపారు. నిషేధించిన ప్లాస్టిక్ కవర్లను వ్యాపారులు వినియోగించవద్దని ఆయన ఆదేశించారు. స్పెషల్ డ్రైవ్‌లో మున్సిపల్ పబ్లిక్ హెల్త్ అసిస్టెంట్ సునీల్, జవాన్లు రాములు, లతీఫ్, శేఖర్, నరేశ్, కిరణ్ పాల్గొన్నారు. -
ప్లాస్టిక్‌తో పరేషాన్.!
రైల్వేకోడూరు రూరల్ : గాంధీజీని ఆదర్శంగా తీసుకుందాం ...ప్లాస్టిక్ వాడకం ఆపేద్దాం... చెత్తాచెదారం చెత్త కుండీలలోనే వేద్దాం... డ్రైనేజీ కాల్వలలో వ్యర్థం వేయకుండా చూసుకుందాం.. పర్యావరణాన్ని కాపాడుదాం... రండి చేతులు కలపండి... ఆదర్శ పట్టణాలుగా తీర్చిదిద్దుకుందాం.. అంటూ జిల్లాలోని ప్రతి పట్టణంలోనూ అధికారులు ప్రచారం నిర్వహించారు. ఇలా కొన్ని రోజులు అన్ని చోట్ల దుకాణాలను తనిఖీ చేసి, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. చేతి సంచులను వాడేలా చూశారు. ప్రతి అంగడిలో గుడ్డ సంచులు అమ్మసాగారు. అంతా మూన్నాళ్ల ముచ్చటగానే ముగిసిపోయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కవర్లే కనిపిస్తున్నాయి. వినియోగదారులు ఇంటి దగ్గర నుంచి చేతులూపుకుంటూ రావడం పది రూపాయల వస్తువు కొన్నా కవరు ఇవ్వండి లేకుంటే మాకొద్దు అనే స్థాయికి వచ్చారు. చిల్లర వ్యాపారులు మొదలుకుని పెద్ద వ్యాపారుల వరకు ప్లాస్టిక్ వినియోగం తప్పనిసరి అయింది. కాల్వల్లో పేరుకుపోతున్న ప్లాస్టిక్ చిన్నచిన్న వ్యాపారులు టీ కప్పులను, జ్యూస్‌కు వాడిన కప్పులను రోడ్డుపై వేయడం, గాలికి అవి కాల్వల్లో పేరుకుపోవడం జరుగుతోంది. దీని వలన పట్టణాల్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతోంది. ప్లాస్టిక్ వినియోగం ఆపితేగానీ సమస్య తీరదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అమలు కాని ప్లాస్టిక్ నిషేధం – పట్టించుకోని అధికారులు జిల్లాలో ఎక్కడా ప్లాస్టిక్ నిషేధం అమలుకు నోచుకోలేదు. గతంలో అధికారులు ప్లాస్టిక్ నిషేధం అమలు చేద్దామని ఎన్నో ప్రయత్నాలు చేశారు. సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. దుకాణాలలో తనిఖీలు నిర్వహించి జరిమానాలు విధించారు. మళ్లీ రెట్టింపు ఊపుతో ప్లాస్టిక్ వాడకం ప్రారంభం అయింది. ఇదంతా జరుగుతున్నా అధికారులు మాత్రం తమకేమీ తెలియదు అన్నట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. టిఫిన్ సెంటర్లలో ప్లాస్టిక్ వాడకం–క్యాన్సర్‌కు కారకం పలు టిఫిన్ సెంటర్లలో ప్లాస్టిక్‌ను విరివిగా ఉపయోగిస్తున్నారు. ఇడ్లీలు తయారు చేసేందుకు, ఇడ్లీ పాత్రలలో అతితక్కువ మైక్రాన్ కలిగిన ప్లాస్టిక్ పేపర్లును వాడుతున్నారు. వేడి వలన అందులో ఉన్న క్యాన్సర్‌కు కారకమయ్యే రసాయనం కరుగుతుందని, అలాంటి టిఫిన్ తిన్నవారికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు అంటున్నారు. అంతరిస్తున్న అరిటాకు వాడకం – వీధిన పడుతున్న కూలీలు చిన్నచిన్న టిఫిన్ సెంటర్లు మొదలుకుని పెద్దపెద్ద హోటళ్ల వరకు అరటి ఆకు వాడకాన్ని తగ్గించి ప్లాస్టిక్ వాడుతున్నారు. దీని వలన ప్రజల ఆరోగ్యం క్షీణించడంతోపాటు సంపాదించింది కూడా ఆసుపత్రులకే ఖర్చు అవుతోంది. అరటి ఆకులు వ్యాపారం చేసే వారి పరిస్థితి దీనంగా తయారైంది. ఫలితంగా కూలీలు పనులు దొరక్క రోడ్డున పడుతున్నారు. అరిటాకులో భోజనం, టిఫిన్ తినడం వలన ఆరోగ్యంగా ఉంటారని అధికారులు అవగాహన కల్పించి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని అరికట్టాలి ప్లాస్టిక్ వాడకాన్ని అరికట్టకపోతే ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు. ప్లాస్టిక్ కవర్లు ఎక్కడపడితే అక్కడ వేయడం వలన కాలుష్యం ఏర్పడుతోంది. ఆవులు కూడా వాటిని తిని ప్రాణాలు కోల్పోతున్నాయి. –శ్రీనివాసులు, జన్మభూమి కమిటీ సభ్యుడు, రైల్వేకోడూరు. పనులు కోల్పోయారు ప్లాస్టిక్ వాడకం వలన అరటి ఆకులు కోసే కూలీలు పనులు కోల్పోయారు. టిఫిన్ సెంటర్లు, హోటళ్లలో చాలా వరకు ప్లాస్టిక్ వాడడం వలన అరటి ఆకుల వ్యాపారాలు తగ్గి కూలీలు పనులు లేక రోడ్డున పడ్డారు. –వెంకటేశు, అరటి ఆకుల వ్యాపారి, రైల్వేకోడూరు. -
ప్లాస్టిక్ బాటిళ్లలో పచ్చటి మొక్కలు
ఇది హరిత మాసం. అవును! మీరు పొరపాటుగా ఏమీ చదవలేదు. ఆషాడాన్ని హరితంగా మార్చడం కాదిది. బీడును పచ్చగా పండించాలని తెలంగాణ ప్రభుత్వం హరితహారాన్ని అల్లుతోంది. అందుకోసం గ్రీన్ చాలెంజ్ విసిరింది. నాలుగేళ్ల నుంచీ ఈ ప్రయత్నం సాగుతోంది. బాగానే ఉంది కానీ.. హైదరాబాద్ లాంటి చోట అంగుళం కూడా చోటు వదలకుండా కాంక్రీట్‌ను పేరుస్తున్నారు. మొక్కలు నాటడానికి మట్టి ఎక్కడుంది? ఇందుకు పరిష్కారంగా చాలామంది మిద్దె తోటలతో (టెర్రస్ గార్డెన్స్‌తో) నేల విడిచి సాగు చేయమని సలహా ఇస్తున్నారు. చేసి చూపిస్తున్నారు కూడా. ఇక్కడ మనం ఇలా ఉంటే.. మిద్దెలే కాదు గోడల్నీ వదిలిపెట్టకండి అని పంజాబ్‌లోని లుధియానా రైల్వేస్టేషన్ కూడా ఓ ప్రయోగాన్ని అమల్లోకి తెచ్చింది. తాముంటున్న ప్రదేశాన్ని ప్లాస్టిక్ ఫ్రీగా కూల్‌గా చేసేసింది. దేశంలోనే ఫస్ట్ నిజానికి ఈ వర్టికల్ గార్డెన్ (నిలువు తోట) పంజాబ్‌లోని లుధియానాలో మొదలుపెట్టింది ప్లాస్టిక్‌ని నిషేధించడానికి, ప్లాస్టిక్ వేస్ట్‌ను నియంత్రించడానికి. ఓ సంవత్సరం కిందట లుధియానాలోని రెవెన్యూ అధికారి రోహిత్ మెహ్రాకు ఈ ఆలోచన వచ్చింది. లుధియానా రైల్వేస్టేషన్ చుట్టుపక్కలంతా ప్లాస్టిక్ బాటిల్సే. వాటిల్తో రైల్వేస్టేషన్ గోడల మీద మొక్కలు పెంచాలనుకున్నాడు. అధికారుల అనుమతితో యేడాది కిందట దాదాపు 37వేల మొక్కలతో ఈ కార్యక్రమానికి నీరు పోశాడు. ఇప్పుడు ఇదిగో... ఈ ఫొటోలో కనిపిస్తున్నట్టు గోడలన్నీ పచ్చగా.. లోపలి వాతావరణమంతా కనీసం అయిదు డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గి చల్లగా.. రైల్వేస్టేషన్ చుట్టుపక్కలంతా శుభ్రంగా తయారయింది. హైదరాబాద్‌లో... మన దగ్గర హరితహారం పుణ్యమాని ఇప్పటికే చాలా అవగాహన వచ్చేసింది. పర్యావరణవేత్తల కృషితో చాలామంది మిద్దె తోటలూ పెంచేస్తున్నారు. గవర్నమెంట్ ఆఫీస్‌ల కాంపౌండ్స్ అన్నీ మొక్కలతో కళకళలాడుతున్నాయి. అక్కడితో ఆగకుండా రోహిత్ మెహ్రా స్ఫూర్తితో మనం కూడా గ్రీన్ చాలెంజ్‌ను ప్రభుత్వ కార్యాలయ గోడలు, ఫ్లై ఓవర్స్, మెట్రో పిల్లర్స్కూ పాకించేద్దాం! ఈ సవాల్‌నూ రెండు రాష్ట్రాలకూ విసిరి.. ఒకర్నొకరం ప్లాస్టిక్ రహిత హరిత ప్రాంతాలుగా చేసుకుందాం! -
చెడు వాసన దూరం
బట్టలు ఉతికాక అందులో కొన్ని చుక్కల వైట్ వెనిగర్ వేసి నానబెట్టి, పది నిమిషాల తర్వాత ఆరేయాలి. ఇలా చేస్తే బట్టల దుర్వాసన వదులుతుంది. ఇంట్లో పొగ, ఇతర మాడు వాసన త్వరగా పోవాలంటే వైట్ వెనిగర్‌ను ఒక చిన్న గిన్నెలో పోసి గదిలో ఉంచాలి. అర సగం నిమ్మ ముక్కను ఉప్పులో అద్ది, దాంతో వంటగదిలోని పొయ్యి గట్టు తుడిచి కడిగితే క్రిములు, దుర్వాసన దరిచేరకుండా ఉంటాయి.డ్రై వాష్ నుంచి తెచ్చిన దుస్తులను అలాగే ప్లాస్టిక్ బ్యాగ్‌లో ఉంచకుండా, తీసి అల్మరాలో భద్రపరచాలి. కొన్నాళ్లుగా ప్లాస్టిక్ బ్యాగులో దుస్తులు అలాగే ఉంచితే చెడువాసన రావడంతో పాటు అవి అక్కడక్కడా పసుపు రంగుమారే అవకాశం ఉంది. కొత్త షూస్ బిగుతుగా ఉంటే లోపలివైపు హెయిర్ డ్రయ్యర్‌తో వెచ్చగా చేసి, కొద్దిగా అటూ ఇటూ లాగి వదలాలి. ఇలా చేయడం వల్ల షూస్ వదులు అవుతాయి. పాదాలకు నొప్పి ఉండదు. రోజూ వాడుతున్న షూస్‌కి ఇలా అప్పుడప్పుడు హెయిర్ డ్రయ్యర్‌ని ఉపయోగిస్తే షూ దుర్వాసన తగ్గుతుంది. వానకాలం తడిగా అయిన లెదర్ చెప్పులు, షూష్లోపల చెమ్మను పోగొట్టాలంటే డ్రయ్యర్‌ని ఉపయోగిస్తే త్వరగా పొడిబారుతాయి. -
గ్రేటర్‌కు ‘చెత్త’ముప్పు
సాక్షి, హైదరాబాద్: విశ్వనగరం బాటలో దూసుకెళుతోన్న మన గ్రేటర్ సిటీ తలసరి చెత్త ఉత్పత్తిలోనూ దేశంలో అగ్రభాగానికి చేరింది. నగరంలో ప్రతీ వ్యక్తి నిత్యం సుమారు 570 గ్రాముల చెత్త ఉత్పత్తి చేస్తుండగా, బెంగళూరులో 440 గ్రాములు ఉత్పత్తి అవుతోంది. ఇదే దేశ రాజధాని ఢిల్లీలో అయితే 410 గ్రాముల చెత్త మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. దేశంలోని పలు మెట్రో నగరాల్లో రోజువారీ తలసరి చెత్త ఉత్పత్తిపై నాగ్‌పూర్‌లోని నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(నీరి) తాజాగా అధ్యయనం చేసింది. ఇందులో ఈ లెక్కలు తేలాయి. హైదరాబాద్‌లో తలసరి చెత్త ఉత్పత్తి అధికంగా ఉండడంతోపాటు తడి, పొడి చెత్త వేరు చేసే విషయంలో ప్రజల విముఖత నగరపాలక సంస్థకు శాపంగా మారింది. వ్యర్థాల్లో అధికం ఇవే... నగరంలో రోజూ సుమారు 4,500 టన్నుల వ్యర్థాలు ఉత్పన్నమౌతున్నాయి. ఇందులో సుమారు 10 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలే ఉన్నాయి. మిగతా వాటిలో ఆర్గానిక్ వ్యర్థాలు, జీవ వ్యర్థాలు, ఈ–వేస్ట్ తదితరాలున్నాయి. ఇక వ్యక్తిగతంగా సిటిజన్లు వృథాగా పడవేస్తున్న వాటిలో వస్తువులు, దుస్తులు, తినుబండారాలు, ఫుడ్ పార్సిళ్లకు సంబంధించిన ప్యాకేజింగ్ మెటీరియల్ అధికంగా ఉన్నాయి. ఆ తర్వాత వినియోగించి పడవేస్తున్న లెదర్ బ్యాగులు, బూట్లు, ప్లాస్టిక్ క్యారీబ్యాగులు, వాటర్ బాటిల్స్, బ్యాటరీలు, ఎల క్ట్రానిక్ విడిభాగాలున్నాయి. కొన్ని రకాల వినియోగ వస్తువులను శుద్ధిచేసి పునర్వినియోగం చేసేందుకు అవకాశం ఉన్నప్పటికీ సిటిజన్లు వాటిని చెత్తడబ్బాలు, వీధుల్లో పడేస్తుండటంతో గ్రేటర్ నగరంలో తలసరి చెత్త ఉత్పత్తి అధికంగా ఉన్నట్లు పీసీబీ అంచనా వేస్తోంది. అవగాహనే కీలకం... ఇళ్లలో తడి, పొడి చెత్తను వేరుచేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు నగరవ్యాప్తంగా పంపిణీ చేసిన డబ్బాలను వేర్వేరుగా వినియోగించడంలో చాలా మంది విముఖత చూపుతున్నారు. పండ్లు, కూరగాయలు, ఆకులు తదితర వ్యర్థాలను వేరుచేసి ఆరబెట్టిన తరవాత ఇళ్లలో మొక్కలకు ఎరువుగా వినియోగించేందుకు కూడా చాలామంది ముం దుకు రావడంలేదు. ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సైతం సాధారణ చెత్తతోపాటే పడేస్తుండటంతో నగర పర్యావరణం ప్రమాదంలో పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రతీ వ్యక్తి సామాజిక బాధ్యతగా వ్యవహరించి తడి, పొడి చెత్త కోసం 2 డబ్బాల విధానాన్ని పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. దుస్తులు, వస్తువులు, తినుబండారాల పార్సిళ్ల కోసం వినియోగించే ప్యాకింగ్‌లను ఇష్టారాజ్యంగా రహదారులు, పార్కులు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు తదితర బహిరంగ ప్రదేశాల్లో పడేయవద్దని కోరుతున్నారు. -
ప్లాస్టిక్.. పారిపో
సాక్షి, సిటీబ్యూరో: పర్యావరణానికి పెను సవాలుగా మారిన ‘ప్లాస్టిక్’ వినియోగాన్ని గ్రేటర్లో దశలవారీగా నిషేధించనున్నారు. మైక్రాన్లతో నిమిత్తం లేకుండా ఇప్పటికే జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో ప్లాస్టిక్ నిషేధానికి తీర్మానం చేశారు. ఇటీవల పర్యావరణ దినోత్సవం సందర్భంగా 2022 నాటికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తామని మంత్రి కేటీఆర్ సమక్షంలో అధికారులు ప్రతిజ్ఞ చేశారు. ప్రస్తుతం ముంబై మహానగరంలో ప్లాస్టిక్ నిషేధంపై చిరువ్యాపారుల నుంచి, ప్లాస్టిక్ ఉత్పత్తిదారుల నుంచి వెల్లువెత్తుతున్న నిరసనలనుపరిగణనలోకి తీసుకున్న గ్రేటర్ అధికారులు ఇక్కడ దశలవారీగా నిషేధ యజ్ఞాన్ని పూర్తిచేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా తొలుత 50 మైక్రాన్ల లోపు ప్లాస్టిక్ నిషేధంపై దృష్టి సారించారు. అవి ఉత్పత్తి చేసే వారిపైనా, వినియోగించే వ్యాపారులపైనా చర్యలు తీసుకుంటున్నారు. దశలవారీగా మిగతా ప్లాస్టిక్స్‌ను నిషేధించాలని, వివిధ వర్గాల ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు ముమ్మర ప్రచార, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఫంక్షన్‌హాళ్లు, కల్యాణ మండపాలు వంటి ప్రాంతాల్లో వాడే ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు, కప్పుల స్థానే స్టీల్, పింగాణీ, గాజువి వాడేలా అవగాహన కల్పించనున్నారు. విద్యార్థులకు అవగాహన కల్పిస్తే ఇంటిల్లిపాదీ ఆచరించేలా చేస్తారనే తలంపుతో పది లక్షల మంది విద్యార్థులకు ఈ సంవత్సరం అవగాహన కల్పించేందుకు సిద్ధమైంది. బస్తీల్లోని స్వయం సహాయక మహిళా బృందాల ద్వారా ప్రతి ఇంటికీ ప్రచారం చేయానున్నారు. ఓవైపు ప్రచారం నిర్వహిస్తూ.. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా వస్తువుల కొనుగోలుకు టిఫిన్ బాక్సులు, జూట్, క్లాత్ బ్యాగులను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. ప్రాథమికంగా ఈ కార్యక్రమాలు ఇప్పటికే చేపట్టినప్పటికీ, మరింత ముమ్మరం చేయనున్నారు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాలు లేని పక్షంలో నిషేధం సాధ్యం కాదని ముంబై అనుభవం నిరూపించడంతో ఆదిశగానూ పకడ్బందీ ఏర్పాట్లకు సిద్ధమయ్యారు. ముంబైలో ఏం జరుగుతోందంటే.. ముంబై మహానగరంలో మార్చి నెలలో ప్లాస్టిక్ నిషేధం ప్రకటన జారీ చేసి ఈనెల 23 నుంచి అమల్లోకి తెచ్చారు. దుకాణాలు, సంస్థలపై భారీగా దాడులు చేస్తూ పెనాల్టీలు విధించారు. నిషేధంపై ప్రజలకు తగిన అవగాహన కల్పించలేదు. ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి తేలేదు. బ్రాండెడ్ కంపెనీలు చిప్స్‌కు వినియోగించే ప్లాస్టిక్ కవర్లను మాత్రం అనుమతిస్తూ.. సామాన్య ప్రజలకు అవసరమైన పప్పులు, బియ్యం, చక్కెర వంటివాటికి వినియోగించే ప్లాస్టిక్స్ క్యారీ బ్యాగుల్ని నిషేధించడంతో వివిధ వర్గాల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈనేపథ్యంలో రిటైల్ సరుకుల ప్యాకింగ్స్కు నిషేధం నుంచి మినహాయింపు ఇచ్చేందుకు సిద్ధమైంది. తిరిగి వాటిని రీసైకిల్, రీయూజ్ చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టే చర్యలకు సిద్ధమైంది. ప్లాస్టిక్ నిషేధం వల్ల తలెత్తే పరిస్థితుల్ని అంచనా వేయకపోవడం.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో విఫలమవడంతో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలో తొలుత ప్రజల ఆలోచనల్లో మార్పు తెచ్చి.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి.. దశలవారీగా ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేసేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో ఇలా.. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఈనెల 23 నుంచి అమల్లోకి తెచ్చిన ప్లాస్టిక్ నిషేధం ప్రకంపలను సృష్టిస్తోంది. పలు వర్తక సంఘాలు నిషేధాన్ని నిరసిస్తూ ఆందోళనలకు దిగాయి. ప్లాస్టిక్ నిషేధాన్ని ఎత్తివేయని పక్షంలో ఆందోళనలు తీవ్రం చేయనున్నట్లు మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్)చీఫ్ రాజ్‌థాకరే హెచ్చరించారు. రాబోయే ఎన్నికలకు నిధులు సమకూర్చుకునేందుకే ఈ నిషేధాన్ని తెచ్చి జరిమానాల ద్వారా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఐదు రోజుల్లో బీఎంసీ తనిఖీ బృందాలు 19,240 దుకాణాల్లో తనిఖీలు చేసి 35 సంస్థలకు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్స్(ఐఆర్) జారీ చేశాయి. 1226.8 కిలోల ప్లాస్టిక్‌ను స్వాధీనం చేసుకున్నాయి. రూ.13.30 లక్షల పెనాల్టీలు వసూలు చేశాయి. జరిమానా చెల్లించేందుకు నిరాకరించిన 16 సంస్థలపై చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. ప్లాస్టిక్ వాడేందుకు రిటైల్ దుకాణాలను అనుమతించని పక్షంలో సమ్మెకు దిగనున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ రిటైల్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు హెచ్చరించారు. మైక్రాన్లతో సంబంధం లేకుండా టీకప్పులు, గ్లాసులు, ఆహార పదార్థాలు ప్యాక్‌చేసే డబ్బాలు, స్పూన్లు అన్నింటిపైనా నిషేధం ప్రకటించారు. ప్రస్తుతం వేటిపై నిషేధం ఉందో.. వేటికిలేదో స్పష్టత లేకపోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్లాస్టిక్ వాడితే మొదటిసారి రూ.5 వేలు, రెండోసారి రూ.10 వేలు జరిమానా విధించారు. మూడోసారి రూ. 25వేల జరిమానాతో పాటు మూడునెలల జైలుశిక్షగా ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఇలా.. నిత్యం వెలువడుతున్న వ్యర్థాలు 4800 మెట్రిక్ టన్నులు వీటిలో ప్లాస్టిక్ వ్యర్థాలు 450 మెట్రిక్ టన్నులు ఇందులో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాలు 270 మెట్రిక్ టన్నులు ఏటా వాడుతున్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు 73,00,00,000 మొత్తం ప్లాస్టిక్‌లో రీసైక్లింగ్ అవుతున్నది 14 శాతం ప్రస్తుతం 50 మైక్రాన్లలోపు ప్లాస్టిక్ వాడకుండా జరిమానాలు విధిస్తున్నారు. దశలవారీగా ముందుకెళ్తాం.. ప్లాస్టిక్స్ ఎంత ప్రమాదకరమో, పర్యావరణానికి ఎంత హానికరమో ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తే అందరూ నిషేధాన్ని పాటిస్తారు. ప్రజలకు అర్థమయ్యేందుకు ఒక్కో నెల ఒక్కో అంశంపై నిషేధాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తాం. ఉదాహరణకు ఒక నెలంతా ప్టాస్టిక్ గ్లాసులు వాడరాదని ప్రచారం చేసి ప్రత్యామ్నాయాలను చూపిస్తాం. అందుకు ప్లాస్టిక్ గ్లాసెస్ నిషేధ మాసంగా పరిగణిస్తాం. మరో నెల కప్పుల మాసం.. ఇంకో మాసం కట్లెరీ మాసంగా ప్రచారం చేస్తాం. తద్వారా ప్రజల్లో వాటిని వాడరాదని బలంగా నాటుకుంటుంది. ఉత్పత్తిదారులకూ నిషేధంపై అవగాహన కల్పిస్తాం. ఇప్పటికే మాంసానికి టిఫిన్ బాక్సులు వాడేలా చేసిన ప్రచారం మంచి ఫలితాలిచ్చింది. 2022 నాటికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పూర్తిగా నిషేధిస్తాం. – డా.బి.జనార్దన్‌రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ ప్రత్యామ్నాయాలు లేకుండా అసాధ్యం నిత్యావసరంగా మారిన ప్లాస్టిక్‌ను ప్రత్యామ్నాయ మార్గాలు లేకుండా నిషేధించడం సాధ్యం కాదు. అన్ని ప్లాస్టిక్స్ వల్లా హాని ఉండదు. రీసైకిల్ చేయగలిగే వాటిని వినియోగించవచ్చు. తగిన ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి తెచ్చి నిషేధించవచ్చు. ఉత్పత్తి చేసిన కంపెనీ తిరిగి వాటిని సేకరించి, రీసైక్లింగ్‌కు పంపించే ఏర్పాట్లు చేయాలి. ఉన్నపళంగా ప్లాస్టిక్‌ను నిషేధిస్తే వాటిపై ఆధారపడ్డ చిరువ్యాపారులు, ర్యాగ్‌పిక్కర్స్ జీవనోపాధి దెబ్బతింటుంది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని దశలవారీగా నిషేధించాలి. – అనిల్‌కుమార్, ఆలిండియా ప్లాస్టిక్ఉత్పత్తిదారుల సంఘం (సౌత్) ఉపాధ్యక్షుడు -
కండోమ్ బ్యాన్.. ఎయిడ్స్‌తో పోతావ్!
నటీమణుల మధ్య సరదాగా మొదలైన సంభాషణ కాస్త.. దుర్భాషలాడుకునే దాకా వెళ్లింది. కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే నటి రాఖీ సావంత్.. మరోసారి నోటిదురుసును ప్రదర్శించారు. ఎలాంటి విషయాన్ని అయినా సరే ఓపెన్‌గా మాట్లాడే రాఖీకి ఓ సీరియల్ నటి చిర్రెత్తుకొచ్చేలా చేసింది. దీంతో రాఖీ ఇన్‌స్టాగ్రామ్‌లో బండబూతులు తిడుతూ వరుస పోస్టులు చేశారు. మహారాష్ట్రలో ప్లాస్టిక్ బ్యాన్‌ను ఉద్దేశిస్తూ సీరియల్ నటి మహికా శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశారు. ముందుగా సరదాగా ఓ పోస్ట్ చేసిన ఆమె తర్వాత అసలు వ్యవహారం మొదలుపెట్టారు. ‘సోదరి.. ప్లాస్టిక్ బ్యాన్ గురించి కాస్త పరిజ్ఞానం నాకు పంచుతావా? కండోమ్‌లు కూడా బ్యాన్ అయ్యాయా?’ అంటూ ఓ సందేశం ఉంచారు. అంతే అది చూసిన రాఖీకి ఎక్కడో కాలింది. వెంటనే పచ్చి బూతులు తిడుతూ (వీడియో సందేశాలు కూడా) వరుసగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు రాఖీ ఉంచారు. ‘కండోమ్‌ల గురించి నాకు అవగాహన ఉంది. అవి రబ్బర్‌తో కాకుండా ప్లాస్టిక్‌తోనే తయారు చేస్తారు. ఒకవేళ కండోమ్‌లు బ్యాన్ చేస్తే మాత్రం మహికా లాంటి వాళ్లు ఎయిడ్స్ వచ్చి పోతారు’ అంటూ పోస్టులు చేశారు. ఆవెంటనే మహికా దానికి ఘాటుగానే సమాధానిమిచ్చారు. ఈ ఇద్దరి మధ్య ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. నటి రాఖీ సావంత్ -
పుణెలో ప్లాస్టిక్ బ్యాన్ ఎఫెక్ట్
-
రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేస్తే...
పుణె : పర్యావరణ పరిరక్షణలో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్ వాడకంపై నిషేధాన్ని విధిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్లాస్టిక్ కవర్లు వాడే రీటైలర్స్, షాపు ఓనర్లపై జరిమానాలు విధిస్తూ కాస్త కఠినంగానే వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో ముంబై రీటైలర్ అసోసియేషన్ సమ్మె చేసేందుకు కూడా సిద్ధమైంది. అయితే జరిమానా తప్పించుకునేందుకు, పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యయ్యేందుకు పుణేకు చెందిన ఓ రెస్టారెంట్ యాజమాన్యం వినూత్న యత్నం చేస్తోంది. తమ రెస్టారెంట్ నుంచి పార్శిల్ తీసుకువెళ్లే కస్టమర్లకు కవర్లకు బదులుగా స్టీల్ డబ్బాల్లో భోజనాన్ని అందిస్తోంది. ఇందుకుగానూ రూ. 200 కస్టమర్లు డిపాజిట్ చేయొచ్చు. బాక్స్‌లను రిటర్న్ చేయగానే ఆ డిపాజిట్ ఎమౌంట్‌ను తిరిగి ఇచ్చేస్తారు. ప్రస్తుతం మరికొన్ని రెస్టారెంట్లు ఇదే ఆలోచనను అమలు చేసేందుకు సిద్ధమైపోయాయి. మంచి నిర్ణయమే కానీ, ప్లాస్టిక్ బ్యాన్పై మహా సర్కార్ తీసుకున్న నిర్ణయం మంచిదే అయినా వ్యాపారస్థులు మాత్రం ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. ‘పర్యావరణ హితం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నామన్నారు. అయితే ప్లాస్టిక్ నిషేధం సరిగ్గా అమలు కావాలంటే అందుకు తగిన ప్రత్యామ్నాయాలు కల్పించడంలో ప్రభుత్వం చొరవ చూపితే బాగుంటుందన్నారు. ప్రస్తుతం జొమాటో, స్విగ్గీ సర్వీసులు చాలా వరకు నిలిచిపోయాయని.. దీని వల్ల వ్యాపారం బాగా దెబ్బతింటోందని’ రెస్టారెంట్ ఓనర్ గణేశ్ శెట్టి చెబుతున్నారు. -
ప్లాస్టిక్ నిషేధం అమలయ్యేనా?
జగిత్యాల : పాలిథీన్(ప్లాస్టిక్) కవర్ల వినియోగం ఎంత ప్రమాదకరమో ఇటీవల జరిగిన సంఘటనలే తెలుపుతున్నాయి. సముద్రంలోని జీవులు సైతం ప్లాస్టిక్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నాయి. పర్యావరణానికి ప్రమాదకరంగా మారిన ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించాలంటూ పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. 50 మైక్రాన్ల కంటే తక్కువగా ఉన్న ప్లాస్టిక్ కవర్లను వినియోగించవద్దని ఆదేశాలు సూచిస్తున్నాయి. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం నిషేధాజ్ఞలు అమలుకాక కుప్పలుతెప్పలుగా ప్లాస్టిక్ కవర్లు పేరుకుపోతున్నాయి. ప్లాస్టిక్ ప్రమాదకరం ప్లాస్టిక్ కవర్లు, బాటిల్స్ ఏళ్లకేళ్లపాటు భూమిలో కరగకుండానే ఉంటాయి. దీంతో ప్రజలు అనారోగ్యానికి గురవడంతోపాటు రోగాలు విజృంభిస్తుంటాయి. ముఖ్యంగా మూగజీవాలు ప్లాస్టిక్ కవర్లు తిని ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇప్పటికే ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు వాడవద్దని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా ఆశించిన మేర ఫలితం ఇవ్వడం లేదు. మున్సిపల్ కార్యాలయాల్లోనూ ప్లాస్టిక్ కవర్లు వాడవద్దని ఆదేశించారు. జిల్లాలో మూడు మున్సిపాలిటీలున్నాయి. ముఖ్యంగా కిరాణందారులు, కూరగాయల వ్యాపారులు, పండ్ల వ్యాపారులు, వివిధ దుకాణాల్లో ఎక్కువగా ప్లాస్టిక్ కవర్లనే వాడుతుంటారు. ప్రతి చిన్న వస్తువునైనా ప్లాస్టిక్ కవర్లలోనే ఇస్తున్నారు. అవగాహన కల్పించినా శూన్యమే! ప్లాస్టిక్ బాటిల్స్, కవర్లు వాడవద్దని ప్రభుత్వం అవగాహన కల్పిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ కవర్లను వినియోగిస్తున్నారు. కూరగాయల మార్కెట్‌కు వెళ్లేవారు ముఖ్యంగా సంచులు తీసుకెళ్లకపోవడంతో వ్యాపారులు ప్లాస్టిక్ కవర్లలోనే పెట్టి అందజేస్తున్నారు. అధికారులు కూడా పెద్దగా పట్టించుకోకపోవడంతో ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగింది. గతంలో పలుమార్లు వారానికోసారి అధికారులు తనిఖీలు చేసే వారు ప్రస్తుతం అలాంటి దాఖలాలు లేవు. అధికారులు నిషేధం అమలును సీరియస్‌గా తీసుకోకపోవడంతో వ్యాపారులు సైతం విచ్చలవిడిగా ప్లాస్టిక్ కవర్లను విక్రయిస్తున్నారు. చెత్తసేకరణతో ఇబ్బందులు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రతిరోజు ఇంటింటికీ చెత్తసేకరణ చేపడుతుంటారు. గతంలో తడిచెత్త, పొడిచెత్త వేర్వేరుగా సేకరించినప్పటికీ.. ప్రస్తుతం నిలిచిపోయినట్లు ఉంది. జిల్లా కేంద్రంలోని గొల్లపల్లిరోడ్‌లో ఒక డంపింగ్‌యార్డు ఉండగా అంత అందులోనే పోస్తుంటారు. ప్లాస్టిక్ కవర్లను వేరు చేయకపోవడంతో అందులోనే వేసి కాల్చివేస్తున్నారు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాలకు ఆ దుర్గంధం వ్యాపిస్తుంది. విరివిగా ప్లాస్టిక్‌ను వాడడం, డ్రెయినేజీల్లో పడేయడంతో మురికినీరు బయటకు వెళ్లకపోవడంతో రోడ్లపైనే మురికినీరు ప్రవహిస్తున్న సంఘటనలున్నాయి. 50 మైక్రాన్ల కన్నా తక్కువ ఉంటే చర్యలు ముఖ్యంగా 50 మైక్రాన్ల కన్న తక్కవ ఉన్న కవర్లను వాడకూడదని నిబంధనలు తెలుపుతున్నాయి. జిల్లా కేంద్రంలో అనేక చోట్ల 50 మైక్రాన్ల కన్న తక్కువ ఉన్న కవర్లనే వాడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ముఖ్యంగా పండ్ల విక్రయదారులు, కూరగాయలు, కిరాణందారులు ఎక్కువగా వీటినే వాడుతున్నారు. ప్లాస్టిక్ వాడకూడదు బల్దియా పరిధిలోని వ్యాపారసంస్థలు, కార్యాలయాల్లో ప్లాస్టిక్ బాటిళ్లు, పాలిథీన్ కవర్లు వాడవద్దు. వ్యాపారసంస్థల్లో తనిఖీలు నిర్వహిస్తాం. 50 మైక్రాన్ల కన్న తక్కువగా ఉన్న కవర్లు, బాటిళ్లు వాడకూడదు. తనిఖీలు చేపడతాం. ఎవరైనా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. - సంపత్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ -
ప్లాస్టిక్‌పై బ్యాన్‌కు వ్యతిరేకంగా సమ్మె!
సాక్షి, ముంబై : పర్యావరణ పరిరక్షణలో భాగంగా బ్రిహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) శనివారం(జూన్ 23) నుంచి ప్లాస్టిక్‌పై నిషేధాన్ని విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్లాస్టిక్ కవర్లు వాడే రీటైలర్స్, షాపు ఓనర్లపై కొరడా ఝలిపించింది. దీంతో ఆదివారం ఒక్కరోజే 87 షాపుల నుంచి 3.5 లక్షల రూపాయలు జరిమానా రూపంలో ఖజానాకు జమ అయింది. అయితే బీఎంసీ తీరుతో తమకు నష్టాలు వస్తున్నాయంటూ రీటైలర్ అసోసియేషన్ సమ్మె చేసేందుకు సిద్ధమైంది. రీటైలర్ వ్యాపారుల సంక్షేమ సమాఖ్య అధ్యక్షుడు వీరేశ్ షా మాట్లాడుతూ... ‘ప్లాస్టిక్ నిషేధం వల్ల కూరగాయల వ్యాపారులకు, స్వీట్ షాపు ఓనర్లకు నష్టాలు వస్తున్నాయంటూ ఫిర్యాదులు అందుతున్నాయి. కూరగాయలు, స్వీట్లు నిల్వ చేయాలన్నా, కస్టమర్లకు అందించాలన్నా ప్లాస్టిక్ కవర్లు తప్పనిసరిగా అవసరమవుతాయి. ఇలాంటి సీజన్ టైమ్‌లో బీఎంసీ తీసుకున్న నిర్ణయం వల్ల చాలా మంది చిరు వ్యాపారులు ఎంతగానో నష్టపోతున్నారు. కాబట్టి సీజన్(వర్షాకాలం) అయిపోయేంత వరకైనా ప్లాస్టిక్‌పై నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతున్నామ’ని వ్యాఖ్యానించారు. పాల వ్యాపారులకు ఉన్నవిధంగానే కూరగాయల వ్యాపారులకు కూడా ప్యాకేజింగ్ విధానానికి అనుమతినివ్వాలని బీఎంసీకి విఙ్ఞప్తి చేశామన్నారు. తమ సమస్యలను వివరిస్తూ బీఎంసీకి లేఖ రాసినప్పటికీ వారి నుంచి ఎటువంటి హామీ రాలేదని.. అందుకే బుధవారం నుంచి సమ్మె చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. బ్రాండెడ్ వస్తువుల కోసం ఉపయోగించే మల్టీ లేయర్డ్ ప్లాస్టిక్‌ను ఉపయోగించుకునేందుకు అనుమతి ఇచ్చే మీరు.. రీసైక్లింగ్ ప్లాస్టిక్ వాడేందుకు చిరు వ్యాపారులకు అనుమతి నిరాకరించడం న్యాయమేనా అంటూ ప్రశ్నించారు. -
ప్లాస్టిక్‌పై బ్యాన్.. ఒక్కరోజే 3.5 లక్షల రూపాయలు
సాక్షి, ముంబై : పర్యావరణ పరిరక్షణలో భాగంగా బ్రిహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) శనివారం(జూన్ 23) నుంచి ప్లాస్టిక్‌పై నిషేధాన్ని విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్లాస్టిక్ కవర్లు వాడే రీటైలర్స్, షాపు ఓనర్లపై కొరడా ఝలిపించింది. దీంతో ఆదివారం ఒక్కరోజే 87 షాపుల నుంచి 3.5 లక్షల రూపాయలు జరిమానా రూపంలో ఖజానాకు జమ అయింది. అయితే బీఎంసీ తీరుతో తమకు నష్టాలు వస్తున్నాయంటూ రీటైలర్ అసోసియేషన్ సమ్మె చేసేందుకు సిద్ధమైంది. రీటైలర్ వ్యాపారుల సంక్షేమ సమాఖ్య అధ్యక్షుడు వీరేశ్ షా మాట్లాడుతూ... ‘ప్లాస్టిక్ నిషేధం వల్ల కూరగాయల వ్యాపారులకు, స్వీట్ షాపు ఓనర్లకు నష్టాలు వస్తున్నాయంటూ ఫిర్యాదులు అందుతున్నాయి. కూరగాయలు, స్వీట్లు నిల్వ చేయాలన్నా, కస్టమర్లకు అందించాలన్నా ప్లాస్టిక్ కవర్లు తప్పనిసరిగా అవసరమవుతాయి. ఇలాంటి సీజన్ టైమ్‌లో బీఎంసీ తీసుకున్న నిర్ణయం వల్ల చాలా మంది చిరు వ్యాపారులు ఎంతగానో నష్టపోతున్నారు. కాబట్టి సీజన్(వర్షాకాలం) అయిపోయేంత వరకైనా ప్లాస్టిక్‌పై నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతున్నామ’ని వ్యాఖ్యానించారు. పాల వ్యాపారులకు ఉన్నవిధంగానే కూరగాయల వ్యాపారులకు కూడా ప్యాకేజింగ్ విధానానికి అనుమతినివ్వాలని బీఎంసీకి విఙ్ఞప్తి చేశామన్నారు. తమ సమస్యలను వివరిస్తూ బీఎంసీకి లేఖ రాసినప్పటికీ వారి నుంచి ఎటువంటి హామీ రాలేదని.. అందుకే బుధవారం నుంచి సమ్మె చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. బ్రాండెడ్ వస్తువుల కోసం ఉపయోగించే మల్టీ లేయర్డ్ ప్లాస్టిక్‌ను ఉపయోగించుకునేందుకు అనుమతి ఇచ్చే మీరు.. రీసైక్లింగ్ ప్లాస్టిక్ వాడేందుకు చిరు వ్యాపారులకు అనుమతి నిరాకరించడం న్యాయమేనా అంటూ ప్రశ్నించారు. -
ఆ నిర్ణయంతో 3 లక్షల ఉద్యోగాలు ఫట్!
సాక్షి, ముంబై : ప్లాస్టిక్‌ను నిషేధిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై ప్లాస్టిక్ పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో రాత్రికి రాత్రి 3 లక్షల మంది ఉద్యోగులు వీధినపడ్డారని, రూ 15,000 కోట్ల ఆదాయ నష్టం వాటిల్లుతుందని పేర్కొంది. ప్లాస్టిక్‌ను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఉత్పత్తిదారులు తమ యూనిట్లను మూసివేశారని ప్లాస్టిక్ బ్యాగ్స్ తయారీదారుల సంఘం ప్రధాన కార్యదర్శి నీమిత్ పునామియా చెప్పారు. ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయంతో ఈ రంగంపై ఆధారపడి జీవించే వారి పరిస్థితి దయనీయంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ బ్యాగులు, స్పూన్లు, ప్లేట్లు, పెట్ బాటిల్స్, థర్మాకోల్ ఐటెమ్స్ సహా ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీ, వాడకం, అమ్మకం, సరఫఱా, నిల్వ చేయడాన్ని నిషేధిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం మార్చి 23న ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటివరకూ ఉన్న నిల్వలను విక్రయించేందుకు ఇచ్చిన మూడు నెలల గడువు ఈనెల 23తో ముగిసింది. ఇక ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగాలు తగ్గిపోవడం రాష్ట్ర జీడీపీపై ప్రభావం చూపుతుందని, ప్లాస్టిక్ రంగం నుంచి బ్యాంకులకు రుణ బకాయిలు పేరుకుపోతాయని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. -
చూడచక్కని జంట.. ఆకుపచ్చని పెళ్లి
సాక్షి, ముంబై: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధుర ఙ్ఞాపకం. అలాంటి వేడుకను ప్రస్తుత తరంవారు విభిన్నంగా, అందరూ మెచ్చుకునేలా, అందరినీ ఆలోచింపజేసేలా జరుపుకోవాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం అలాంటి ప్రయత్నమే చేశారు ముంబైకి చెందిన దీపా కామత్, ప్రషిన్ జాగర్ జంట. వివాహం అనగానే పెళ్లి పత్రికల నుంచి మొదలు డెకరేషన్స్, భోజనాలు చేసే ప్లేట్లు, గ్లాస్‌ల దాకా పర్యావరణానికి విఘాతం కలిగించేవే. ప్రకృతికి నష్టం కలిగించే ఇలాంటి వస్తువులేవీ వాడకుండా.. పర్యావరణ హితంగా తమ పెళ్లి ఉండాలని వారు కోరుకున్నారు. తమ సాదాసీదాగా వినూత్న వివాహానికి పెద్దలను, స్నేహితులను ఒప్పించారు. వారి సహకారంతో పర్యావరణానికి అనుకూలమైన, రీసైక్లింగ్ (జీరో ప్లాస్టిక్)వస్తువులనే వాడాలని, ఆఖరికి టిష్యూ పేపర్ కూడా వాడకూదని(పేపర్ చెట్ల నుంచి వస్తుందని) నిర్ణయించుకున్నారు. వివాహ ఆహ్వానానికి పత్రికల బదులు వాట్సప్ మెసేజ్, దగ్గరి బంధువులను కలిసి ఆహ్వానం చెప్పివచ్చారు. భోజనాలు వడ్డించేందుకు ప్లాస్టిక్ ప్లేట్లకు బదులు పాత పద్ధతి పళ్లాలు వాడారు. వీరనుకున్నంత సులభంగా ఈ పనులు జరగలేదు. ఎన్నో అడ్డంకులు, బంధువుల నుంచి వ్యతిరేకత వీటన్నింటినీ అధిగమించి, ప్రకృతి ఒడిలో అందరినీ ఆలోచింపజేసాలా వీరి వివాహ వేడుక జరిగింది. వీరి పర్యావరణ అనుకూల వివాహం ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు హృదయాలను గెలుచుకుంటోంది. -
ప్లాస్టిక్ వాడితే జైలుకే..!
సాక్షి, ముంబై: ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించడానికి బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎమ్సీ) కీలక నిర్ణయం తీసుకుంది. ప్లాస్టిక్ ఉపయోగించే ప్రజలు, దుకాణాదారులు, మాల్స్‌పై భారీ జరిమానాలు విధించనుంది. నిబంధనలకు విరుద్దంగా ప్లాస్టిక్ వినియోగించే వారిపై తొలిసారి ఐదు వేల జరిమానా, రెండో సారి పది వేల జరిమానా, మూడో సారి కూడా వాడితే 25,000 జరిమానాతో పాటు మూడు నెలల జైలు శిక్ష విధించాలని నిర్ణయించింది. ఈ నిబంధనలు ఆదివారం(జూన్ 24) నుంచి అమలులోకి రానున్నాయి. ఆరు నెలల నుంచే ప్లాస్టిక్ నిషేధంపై మాల్స్, షాపింగ్‌మాల్స్, రెస్టారెంట్స్, మార్కెట్లలో అవగాహన కల్సిస్తున్నా మార్పు రాకపోవటంతో భారీ జరిమానాలు విధించాల్సి వచ్చిందని మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ నిధి చౌదరి తెలిపారు. 249 మందితో కూడిన ప్రత్యేక స్క్వాడ్.. బీచ్‌లు, బస్స్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ప్రత్యేక నిఘా పెడతారన్నారు. జరిమానా చెల్లింపులలో ఎలాంటి అవినీతి జరగకుండా ఈ-బిల్స్ ద్వారా చెల్లించాలని ప్రజలకు డిప్యూటీ కమిషనర్ సూచించారు. పలుమార్లు లా కమిటీతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. అవగాహన కార్యక్రమాలు.. ప్లాస్టిక్ వాడకం తగ్గించేదిశగా ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు బీఎమ్సీ తెలిపింది. ఇప్పటికే 60 కంపెనీలు, 80 స్వయం సేవక సంఘాలు ఒక ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసి ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయం గురించి వివరిస్తున్నారు. ఇప్పటివరకు మున్సిపల్ శాఖ, ఎన్జీవోలు సంయుక్తంగా భారీ ఎత్తున్న ప్లాస్టిక్‌ను సేకరించాయి. -
రిజర్వ్ ఫారెస్ట్‌లో ప్లాస్టిక్ నిషేధం
సాక్షి, మన్ననూర్ (అచ్చంపేట) : అమ్రాబాద్ పులుల రక్షిత ప్రాంతం (కోర్ ఏరియా)లో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తున్నామని వాటి స్థానంలో పేపర్, బట్ట సంచులను అందుబాటులో ఉంచుతున్నట్లు ఫీల్డ్ డైరెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. మంగళవారం అటవీశాఖ ఈసీ సెంటర్ వద్ద డబ్లూడబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడారు. మానవ మనుగడతో పాటు జీవరాశులకు ముప్పు కలిగించే ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. వన్యప్రాణులకు అమ్రాబాద్ అభయారణ్యం దేశంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగి ఉండటం గర్వకారణమని అన్నారు. ఈ క్రమంలో పర్యాటకులు, అటవీ సమీప గ్రామాల ప్రజలు ప్లాస్టిక్‌ను ఉపయోగించడం, పారబోయడంతో వాటిని తింటున్న వన్యప్రాణులు మృత్యవాతపడుతున్నాయని అన్నారు. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ డైరెక్టర్ ఫరీదా టంపల్ మాట్లాడుతూ శ్రీశైలం – హైదరాబాద్ ప్రధాన రహదారి వెంట అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించి వన్యప్రాణులను కాపాడాలన్నారు. ఈ ప్రాంతంలో పేవర్ కవర్ల తయారీ కోసం కుటీర పరిశ్రమను మరో నెల రోజుల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పేపర్ కవర్ల తయారీ కోసం చెంచు మహిళలకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామన్నారు. అడవులను, జంతుజాలాన్ని రక్షించుకోవాలని కళాకారుల ఇచ్చిన ప్రదర్శన, ఆట పాటలు ఆకట్టుకున్నాయి. యాత్రికులకు పేపర్ కవర్లు అందజేత అటవీశాఖ చెక్‌పోస్టు వద్ద డబ్ల్యూడబ్ల్యూఎఫ్, శ్రీనివాస ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో శ్రీశైలం వెళ్లే యాత్రికులకు పేపర్ కవర్లు అందజేశారు. టోల్గేట్ రూ.20లకు అదనంగా రూ.5 వసూలు చేసి కవర్ అందిస్తున్నారు. దీంతోపాటు మరో రూ.25 అదనంగా వసూలు చేస్తున్నారు. మన్ననూర్ నుంచి దోమలపెంట వరకు ఎలాంటి చెత్త, వ్యర్థాలు ఉన్నా రోడ్డు పక్కన వేయకూడదు. కవర్లో వేసి దోమలపెంట చెక్‌పోస్టు వద్ద అటవీశాఖ సిబ్బందికి కవర్ అందించాలి. వారు రూ.25 తిరిగి ఇస్తారని అధికారులు తెలిపారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు పర్యావరణ రోజు సందర్భంగా అమ్రాబాద్, మన్ననూర్ రేంజ్ పరిధిలోని ఆయా పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో శ్రీనివాస ఛారిటబుల్ ట్రస్టు డైరెక్టర్ శ్రీనివాస్, డీఎఫ్ఓ జోజీ,ఎఫ్ఆర్ఓలు ప్రభాకర్, శ్రీదేవి ఎఫ్ఎస్ఓ రామాంజనేయులు సిబ్బంది బాబలి, వెంకటేశ్వర్లు, కనకయ్య, కళాకారులు మాడ్గుల నర్సింహ, లింగస్వామి, బీముడు, ఆయా చెంచుపెంటల మహిళలు పాల్గొన్నారు. -
తమిళనాడు కీలక నిర్ణయం
చెన్నై : తమిళనాడు ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వచ్చే ఏడాది ప్రారంభం నుంచి అంటే 2019 జనవరి 1 నుంచి పూర్తిగా తమ రాష్ట్రంలో ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి నేడు (సోమవారం)ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ప్లాస్టిక్ ఉత్పత్తులను తయారు చేయడం, వాడటం అన్నీ నిషేధమే. ‘తమిళనాడు 2019 నుంచి ప్లాస్టిక్ నిషేధాన్ని ప్రారంభిస్తుంది’ అని పళనిస్వామి రాష్ట శాసన సభలో ప్రకటించారు. పాలు, ఆయిల్ పౌచ్‌లు, మెడికల్ యుటిలిటీస్, ఇతర ప్రాథమిక ఉత్పత్తులకు ఈ నిషేధం నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు తెలిపారు. రూల్ 110 కింద ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. గుజరాత్ కూడా ప్రజా రవాణా మార్గాలు, గార్డెన్లు, ప్రభుత్వ ఆఫీసుల్లో ప్లాస్టిక్ వాడకాన్ని నేటి నుంచి నిషేధిస్తున్నట్టు పేర్కొంది. -
భారీ తిమింగలం మృతి.. షాకింగ్ నిజాలు
బ్యాంకాక్ : ప్లాస్టిక్ భూతానికి ఓ భారీ తిమింగలం బలైంది. మానవుల నిర్లక్ష్యం ఆ సముద్ర జీవికి శాపంగా మారింది. థాయ్‌లాండ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన ప్లాస్టిక్ వాడకంపై ప్రపంచాన్ని హెచ్చరిస్తోంది. దాని ప్రాణాలు నిలపడం కోసం ఐదు రోజులుగా ప్రయత్నించిన వెటర్నటీ డాక్టర్లకు నిరాశే ఎదురైంది. థాయ్‌లాండ్, సంగాక్ల దక్షిణా ప్రాంతంలోని ఓ కెనాల్ సమీపాన అచేతన స్థితిలో ఉన్న ఓ భారీ తిమింగలాన్ని స్థానికులు గుర్తించి మెరైన్ కోస్టల్ రిసోర్స్ డిపార్ట్మెంట్కు సమాచారం ఇచ్చారు. తిమింగళం పొట్ట నుంచి తీసిన ప్లాస్టిక్ కవర్లు విస్తుపోయే విషయాలు.. ఆ తిమింగలం అనారోగ్యానికి గల కారణాలను తెలుసుకోవడానికి వెటర్నీ డాక్టర్లు ప్రయత్నించగా.. విస్మయపరిచే విషయాలు వెల్లడయ్యాయి. భారీ సంఖ్యలో ప్లాస్టిక్ బ్యాగులను తిమింగలం పొట్టలో పేరుకుపోయాయి. దాని పొట్ట నుంచి 5 ప్లాస్టిక్ బ్యాగ్‌లను తొలిగించగానే అది మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. అనంతరం దాని పొట్టలో మొత్తం 8 కేజీల బరువుగల 80 ప్లాస్టిక్ బ్యాగులను గుర్తించామని మెరైన్ కోస్టల్ రిసోర్స్ డిపార్ట్మెంట్ తన వెబ్సైట్లో పేర్కొంది. ఇలా కడుపులో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలతో తిమింగలం జీర్ణవ్యవస్థ దెబ్బతిందని, దాని మృతికి ఇదే కారణమని వైద్యులు పేర్కొన్నారు. కెనాల్ నుంచి తిమింగలాన్ని బయటకు తీస్తున్న వెటర్నటీ సిబ్బంది చిన్న చేపలు, సముద్ర జీవులను వేటాడి ఆహారంగా తీసుకునే తిమింగలాలకు అవి లభించకపోవడంతో ప్లాస్టిక్‌నే ఆహారంగా తీసుకుంటున్నాయని మెరైన్ కోస్టల్ డిపార్ట్మెంట్ హెడ్ జతుపోర్న్ తెలిపారు. ప్లాస్టిక్ వాడకంపై థాయ్‌లాండ్ ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు. థాయ్‌లాండ్ ప్రజలు ఎక్కువగా ప్లాస్టిక్ వాడుతున్నారని చెప్పారు. 2050 నాటికి సముద్రాలలో చేపల కంటే ప్లాస్టిక్ వ్యర్థాల పరిమాణమే ఎక్కువగా ఉంటుందని వరల్డ్ ఎకనమిక్ ఫోరం హెచ్చరిస్తూ ఓ నివేదికలో వెల్లడించింది. మన దేశంలో కూడా ప్రభుత్వాలు ఎన్ని కార్యక్రమాలు చేపట్టిన ప్లాస్టిక్ వాడకం మాత్రం తగ్గడం లేదు. ఇది జంతువులకు శాపంగా మారింది. -
ప్లాస్టిక్ వాడకం ఆపేద్దాం
న్యూఢిల్లీ: నాసిరకం ప్లాస్టిక్, పాలిథిన్ కవర్లను వాడటాన్ని ఆపేయాలని దేశ ప్రజలను మోదీ కోరారు. వీటి వలన పర్యావరణం, మూగజీవాలతోపాటు ప్రజల ఆరోగ్యంపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. మాసాంతపు మన్‌కీబాత్ సందర్భంగా ఆదివారం దేశప్రజలనుద్దేశించి మోదీ మాట్లాడారు. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినం జరుపుకోవాలని.. ఈ సందర్భంగా మొక్కలు నాటి, అవి చెట్లు అయ్యేంతవరకు దృష్టిపెట్టాలని కోరారు. జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవాన్ని కూడా ఘనంగా జరుపుకోవాలని మోదీ కోరారు. ‘యోగాతో మనలో విశ్వాసం పెరుగుతుంది, అందుకే రోజూ యోగా చేయటం అలవర్చుకోవాలి’ అని ఆయన చెప్పారు. జూన్ నెలలో రానున్న రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి (మే 27), భారత స్వాతంత్య్ర సంగ్రామంలో స్ఫూర్తి నింపిన వీర్ సావర్కర్ జయంతి (మే 28)ల సందర్భంగా ఆయన నివాళులర్పించారు. ధైర్య సాహసాలకు సలాం! మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా ఆశ్రమ పాఠశాలకు చెందిన ఐదుగురు గిరిజన విద్యార్థులు (మనీశా, ప్రమేశ్, ఉమాకాంత్, కవిదాస్, వికాస్) ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన సందర్భంగా వారిని మోదీ ప్రశంసించారు. ‘మిషన్ శౌర్య’లో భాగంగా 2017 ఆగస్టులో వివిధ ప్రాంతాల్లో వీరు శిక్షణ పొందారని.. ధైర్య, సాహసాలను ప్రదర్శిస్తూ ఎవరెస్టు శిఖరాన్ని చేరుకున్నారన్నారు. నేపాల్ వైపునుంచి ఎవరెస్టును అధిరోహించిన అతిచిన్న వయస్కురాలైన భారతీయురాలిగా నిలిచిన శివాంగి పాఠక్ (16)ను కూడా మోదీ అభినందించారు. ఐఎన్ఎస్వీ తరుణిలో ప్రపంచాన్ని చుట్టి వచ్చిన బృందం సభ్యురాళ్లను మోదీ ప్రశంసించారు. యువతకు ఫిట్నెస్ మంత్ర భారత సంప్రదాయ క్రీడలైన ఖో–ఖో, గిల్లి దండ, బొంగరం, పతంగులు ఎగురవేయటం వంటి వాటిని పూర్తిగా విస్మరిస్తున్నామని ప్రధాని తెలిపారు. పాఠశాలలు, యువత మండళ్లు ఇలాంటి క్రీడలను ప్రోత్సహించాలని ఆయన సూచించారు. ప్రతి చిన్నారి జీవితంలో క్రీడలు భాగంగా ఉండేవని.. అలాంటి పరిస్థితిని తిరిగి తీసుకురావాల్సిన అవసరం ఉందని మోదీ పేర్కొన్నారు. యువత ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టాలని సూచించిన ప్రధాని.. ‘హమ్ ఫిట్ హైతో ఇండియా ఫిట్’ చాలెంజ్‌లో అందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారన్నారు. -
ప్లాస్టిక్ రహిత రాష్ట్రం కోసం ప్రణాళిక
జనగామ: ప్లాస్టిక్ రహిత తెలంగాణ కోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నట్లు రాష్ట్ర బీసీ, టూరిజం కార్పొరేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్రా వెంకటేశం తెలిపారు. జనగామ మండలంలోని ఓబుల్‌కేశ్వాపూర్ గ్రామంలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆయలంలో శనివారం జరిగిన పూజా కార్యక్రమాల్లో స్టేట్ బీసీ వెల్ఫేర్ ఎండీ అశోక్‌కుమార్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. అనంతరం వెంకటేశం మాట్లాడుతూ పాస్టిక్ రహిత ఉద్యమాన్ని ఓబుల్‌కేశ్వాపూర్ నుంచి ప్రారంభంచాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. ఇందు కోసం గ్రామానికి ఇద్దరు గీతాకార్మికుల కుటుంబాలకు చెందిన యువకుల శ్రీధర్, కర్ణాకర్‌కు తాటి కొమ్మలతో తయారు చేసే వస్తువులపై కేరళలో శిక్షణ ఇప్పించినట్లు తెలిపారు. అక్కడ శిక్షణ పొందిన కళాకారులు గ్రామంలోని చాలా మందికి దీనిపై అవగాహన కల్పిస్తున్నాన్నారు. తాటి కొమ్మలతో బుట్టలు, హ్యాండ్ బ్యాగులు ఇలా ప్రతి ఒక్కటి తయారు చేసే విధంగా తాము ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే విధంగా వీటి తయారీ ఉంటుందన్నారు. అంతే కాకుండా ఓబుల్కేశ్వాపూర్ను ఓ మినీ ఇండస్ట్రియల్ కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. హారతి కర్పూరం, ఊది బత్తీలు తదితర పూజా సామాగ్రి ఇలా ప్రతి ఒక్కటి ఇక్కడే తయారు చేసి, ఎగుమతి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి కల్పించడం తమ బాధ్యత అన్నారు. ఇక్కడి సక్సెస్ రేటు ఆధారంగా వీటిని అన్ని చోట్ల విస్తరిం చేలా ప్రయత్నిస్తామన్నారు. ఇందుకు యువతకు ఆర్థిక భరోసా కల్పించేందుకు బీసీ కార్పొరేషన్ నుంచి నిధులు మంజూరు చే యాలని లోచిస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట సర్పంచ్ జయప్రకాష్‌రెడ్డి, ఎంపీడీఓ హశీమ్ ఉన్నారు. -
వర్సిటీల్లో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించండి
న్యూఢిల్లీ: విద్యా సంస్థల ప్రాంగణాల్లో ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని నిషేధించాలని యూజీసీ కోరింది. ప్లాస్టిక్ కప్పులు, బాటిళ్లు, స్ట్రాలు, బ్యాగ్‌లు, లంచ్ ప్యాకెట్ల వాడకంపై నిషేధం విధించాలని వర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థలను కోరింది. వాడిపారేసే వాటర్ బాటిళ్లకు బదులు పునర్వినియోగానికి వీలుండే బాటిళ్ల వాడకాన్ని ప్రోత్సహించాలని కోరింది. స్వచ్ఛ్ భారత్ కార్యక్రమం కింద మున్సిపాలిటీలతో కలిసి పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని వర్సిటీల వైస్ చాన్సలర్లను కోరింది. పాఠశాల విద్యార్థులు కూడా ప్లాస్టిక్ వాడకాన్ని ఆపాలని కోరింది. దేశవ్యాప్తంగా ఉన్న 24 బీచ్‌లు, నదీ తీరాలు, సరస్సులను పరిశుభ్రంగా మార్చేందుకు పర్యావరణ మంత్రిత్వశాఖ 19 బృందాలను ఏర్పాటు చేసింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాలకు ఈ ఏడాది భారత్ వేదిక కానున్న నేపథ్యంలో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ సలహా మేరకు ఈ సూచన చేసింది. -
ప్లాస్టిక్ భూతం!
గ్రేటర్లో ప్లాస్టిక్ భూతం కోరలు చాస్తోంది. పేరుకు నిషేధం అమల్లో ఉన్నా బహిరంగ ప్రదేశాలు, నివాస సముదాయాలు, మార్కెట్లు..మాల్స్..ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కవర్లే దర్శనమిస్తున్నాయి. నిత్యం మన నగరంలో రెండు కోట్లకు పైగా ప్లాస్టిక్ కవర్లు ఉపయోగిస్తున్నారు. ఇవి క్రమంగా మహానగరంలోని ప్రధాన నాలాలు, వరద, మురుగునీటి పైపులైన్లలోకి చేరుతుండడంతో మురుగు నీటి ప్రవాహానికి తరచు ఆటంకాలు తలెత్తుతున్నాయి. వేసవి నేపథ్యంలో జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులు ఇటీవల పలు ప్రాంతాల్లో డీసిల్టింగ్ ప్రక్రియ చేపట్టగా...పలు పైపులైన్లు, వరదనీటి కాల్వల్లో వెలికితీసిన వ్యర్థాల్లో 30 శాతం ప్లాస్టిక్ కవర్లే ఉన్నాయి. ఇవి నీటి ప్రవాహాన్ని నిరోధిస్తూ వరదలకు కారణమవుతున్నాయి. నిషేధం అమలుపై జీహెచ్ఎంసీ, పరిశ్రమలు, పీసీబీ తదితర విభాగాలు సీరియస్‌గా దృష్టి సారించకపోవడం..ప్రజలు, వ్యాపారుల్లో అవగాహన లేమి నగరవాసుల పాలిట శాపంగా మారుతోంది. సాక్షి, సిటీబ్యూరో:నగరంలో ప్లాస్టిక్ కవర్లు విచ్చలవిడిగా ఉపయోగిస్తున్న కారణంగా అవి వరద, మురుగు నీటి కాలువలు, పైపులైన్లలోకి చేరుతున్నాయి. వీటి వల్ల మురుగు ప్రవాహానికి పలు చోట్ల ఆటంకాలు ఎదురై ప్రధాన రహదారులు, వీధులు మురుగుకూపంగా మారుతున్నాయి. నిత్యం రెండు కోట్ల ప్లాస్టిక్ కవర్ల వినియోగం..? గ్రేటర్ జనాభా కోటికి చేరువైంది. ప్రతీ వ్యక్తి దైనందిన జీవితంలో కూరగాయలు, పండ్లు ఇతర నిత్యావసర సరుకులు, షాపింగ్ అవసరాలకు సరాసరిన రెండుచొప్పున వివిధ మందాలు కలిగిన ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తున్నట్లు పర్యావరణ వేత్తలు అంచనావేస్తున్నారు. గ్రేటర్ పరిధిలో రోజుకు సుమారు రెండుకోట్ల ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తుండడం పట్ల ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రెండేళ్లక్రితం వీటి వినియోగం రోజుకు 1.40 కోట్లు మాత్రమేనని చెబుతున్నారు. వినియోగిస్తున్న కవర్లలోనూ 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల కవర్లే సింహభాగం ఉంటున్నాయి. వీటిపై నిషేధం అమల్లో ఉన్నప్పటికీ ప్లాస్టిక్ కవర్ల వినియోగం ఎక్కడా తగ్గుముఖం పట్టకపోగా క్రమంగా పెరగడం గమనార్హం. ఈ కవర్లు గాలి, నీరు, నేల, భూగర్భజల కాలుష్యానికి ప్రధానంగా కారణమౌతున్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రక్షాళనలో 30 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలే..! గ్రేటర్ పరిధిలో సుమారు 6 వేల కిలోమీటర్ల మేర మురుగునీటి పైపులైన్లు, మరో 1500 కిలోమీటర్ల మేర నాలాలు విస్తరించి ఉన్నాయి. వేసవి కార్యాచరణ ప్రణాళిక అమల్లో భాగంగా జీహెచ్ఎంసీ, జలమండలి విభాగాలు ఆయా పైపులైన్లు, నాలాల్లో పూడిక తీత పనులు చేపట్టాయి. ఈ పనుల్లో భాగంగా తొలగిస్తున్న ఘన వ్యర్థాల్లో సుమారు 30 శాతం ప్లాస్టిక్ కవర్లే దర్శనమిస్తున్నట్లు సంబంధిత అధికారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాలు, మాల్స్, రెస్టారెంట్ల నుంచి పెద్దమొత్తంలో ప్లాస్టిక్ కవర్లు తొలుత చెత్తలో అటు నుంచి క్రమంగా మురుగునీటి పైపులైన్లు, నాలాల్లోకి చేరుతుండడంతో మురుగు ప్రవాహానికి తరచూ ఆటంకాలు తలెత్తి మురుగునీరు ఉప్పొంగి సమీప కాలనీలు, బస్తీలను ముంచెత్తుతున్నాయి. తూతూమంత్రంగానే నిషేధం.. గ్రేటర్ పరిధిలో 50 మైక్రాన్లలోపున్న ప్లాస్టిక్ కవర్లను నిషేధించినప్పటికీ పూర్తిస్థాయిలో అమలవుతున్న దాఖలాలు కనిపించడంలేదు. బల్దియా అధికారులు దాడులు చేసి అక్రమార్కులపై తరచూ జరిమానాలు విధిస్తున్నప్పటికీ వారిలో మార్పు కనిపించడంలేదు. ఇక మహానగరం పరిధిలో సుమారు వెయ్యి వరకు ప్లాస్టిక్ కవర్ల తయారీ సంస్థలుండగా..వీటిలో నిబంధనల ప్రకారం అనుమతి పొందిన కంపెనీలు సగమైనా లేవన్నది పరిశ్రమల శాఖ వర్గాలు చెబుతుండడం గమనార్హం. అంటే ప్లాస్టిక్ కవర్ల తయారీ మొదలు వినియోగం వరకు ఎక్కడా పటిష్ట నిఘా, నియంత్రణ, కఠిన శిక్షలు, అవగాహన లేకపోవడంతో ప్లాస్టిక్ మహమ్మారిని తరిమికొట్టడంలో ఆయా విభాగాలు చతికిలపడుతున్నట్లు సుస్పష్టమౌతోంది. జనచేతనే కీలకం.. ప్లాస్టిక్ వినియోగం విషయంలో చట్టాలెన్ని ఉన్నా ప్రజల్లో అవగాహన, చైతన్యమే కీలకమని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. ఇంటి నుంచి మార్కెట్లు, షాపింగ్‌కు వెళ్లే సమయంలో పేపర్బ్యాగులు, గోనెసంచులను వెంట తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. పండ్లు, కూరగాయాలు, మాంసం సహా ఇతర నిత్యావసరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కవర్లలో ఇంటికి తీసుకురావద్దని సూచిస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లు వాటి మందాన్ని బట్టి విఛ్చిన్నమై పర్యావరణంలో కలిసేందుకు 200–1000 సవత్సరాలు పడుతుండడంతో ఈ పరిణామం పర్యావరణానికేకాదు మానవ ఆరోగ్యంపైనా దుష్ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లు భూగర్భజలాలను సైతం విషతుల్యంగా మార్చేస్తున్నాయంటున్నారు. -
నిషేధం అమలయ్యేనా?
విశ్లేషణ ప్లాస్టిక్ నిషేధంలో సానుకూల కారణమేదంటే.. తయారీదారు, సరఫరాదారుతోపాటు వినియోగదారుపై కూడా జరిమానా విధిస్తారు. ప్రభుత్వ యంత్రాంగం పనితీరులో జాప్యమే నిషేధం అమలులో ప్రధాన అవరోధం. ప్లాస్టిక్ వినియోగంపై నిషేధానికి సంబంధించిన అనుభవం సానుకూలంగా మాత్రం లేదు. మహారాష్ట్రలోని దాదాపు అన్ని మునిసిపల్ కార్పొరేషన్లలో 20 మైక్రాన్లకంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ పదార్థాలను నిషేధించారు కానీ, రెండు సాధారణ కారణాల వల్ల ఈ నిషేధం ఉల్లంఘనకు గురవుతోంది. ఒకవైపు ప్లాస్టిక్ బ్యాగులను తీసుకెళ్లడం సౌకర్యవంతంగా ఉండటం, మరోవైపు ప్లాస్టిక్ నియంత్రణ యంత్రాంగం నిబంధనలను పట్టించుకోకపోవడం. ప్లాస్టిక్ మురుగుకాలువలను అడ్డుకుంటుంది. బహిరంగ స్థలాలను చెత్తతో నింపుతుంది. డంపింగ్ కేంద్రాలలో ప్లాస్టిక్ పోగుపడుతోంది. ప్రతి సంవత్సరం నగరాల్లో వరదలకు భారీవర్షాలు కారణం కాదు. మురుగుకాలవలను ప్లాస్టిక్ వ్యర్థాలు అడ్డుకోవడం వల్లే కారణమని తెలిసిందే. ఇప్పుడు ఉన్నట్లుండి మహారాష్ట్ర ప్రభుత్వం ఉగాది (గుడిపర్వ) నుంచి ప్లాస్టిక్ నిషేధంపై జీవో జారీ చేసింది. కానీ ఇది ఎలా అమలవుతుందన్నది ఎవరికి వారు ఊహించుకోవలసిందే. ఈ నిషేధం ఎందుకు పనిచేస్తుందో, ఎందుకు పని చేయదో చెప్పడానికి ప్రాథమికంగా రెండు కారణాలున్నాయి. సానుకూల కారణమేదంటే, ప్లాస్టిక్ తయారీదారు, సరఫరాదారు మీదే కాకుండా వినియోగదారుపై కూడా జరిమానా విధిస్తారు. అందుకే ఇప్పటికే జనాభాలోని ఒక చిన్న విభాగం ఈ కొత్త నిబంధనకు కట్టుబడాలని నిర్ణయించుకుంది. పర్యావరణ కారణాలపై కాదు కానీ జరిమానా భయంతోనే అన్నది నిజం. ఎందుకంటే ప్లాస్టిక్‌ని వినియోగించినందుకు తొలిసారి తప్పు కింద రూ. 5,000లు రెండో తప్పుకు రూ. 10 వేలు జరిమానా విధిస్తారు, ఇక మూడో తప్పుకింద రూ. 25,000ల జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధిస్తారు. మరో కోణం ఏదంటే, ప్లాస్టిక్ నిషేధ యంత్రాంగం పనితీరులో జాప్యం కారణంగా ప్లాస్టిక్ సంచులను చాలా షాపులు ఇంకా ఉపయోగిస్తూనే ఉన్నాయి. నిఘా యంత్రాంగం క్రియాశీలం అయ్యేంతవరకు వీటిని ఉపయోగిస్తూనే ఉంటారు. ప్లాస్టిక్ చెత్తను సేకరించే కేంద్రాలను నెలలోపు ఏర్పర్చి వినియోగించిన ప్లాస్టిక్ వ్యర్థాలను వాటిలో ఉంచాలని అన్ని ప్రభుత్వ సంస్థలకూ ఆదేశాలు వెళ్లాయి. ఆ తర్వాత ఏం జరుగుతుందని ప్రశ్నార్థకమే. ఇలా సేకరించిన చెత్తలో ప్లాస్టిక్ సంచులు, స్పూన్లు, థర్మోకోల్ వంటివి ఉంటాయి. వీటిని విస్తృతంగా వినియోగిస్తున్న రీత్యా వీటి నిషేధం పెద్ద లక్ష్యమే అవుతుంది. అదే సమయంలో ఇప్పటికే తయారీదారుల వద్ద ఉన్న ప్లాస్టిక్ నిల్వలను అవి అమ్ముడయేంతవరకు మార్కెట్లోకి తీసుకురావచ్చని ప్రభుత్వం అనుమతించింది. ఒక నెలలో ఈ నిల్వలన్నీ ఖాళీ చేయాలనడం అయోమయం కల్గించే వైరుధ్యమే. పెద్దపెద్ద బాటిళ్లు కాకుండా నీటిని నిల్వచేసిన అర్ధ లీటర్ బాటిళ్లను వదిలించుకోవలసిన చెత్తగా ప్రకటించడం గందరగోళం కలిగిస్తోంది. ఇది తర్క విరుద్ధంగా ఉంది. బ్రాండ్ ప్లాస్టిక్ బాటిళ్ల వినియోగాన్ని కొనసాగించాలని ప్రభుత్వ ఆదేశం చెబుతోంది. ప్యాక్ చేసిన ప్లాస్టిక్ పట్ల జాగ్రత్త వహించాల్సిన బాధ్యత రిటైలర్లమీదే ఉంటుందని 2016లో ప్రభుత్వం చేసిన ప్రకటన వాస్తవానికి పూర్తిగా విఫలమైంది. అందుకే ఇప్పుడు కూడా వాటిని మినహాయించారు. మరింత చిక్కు ఏమిటంటే పాల ప్యాకెట్లతో వ్యవహరించవలసి రావడం. పాల ప్యాకెట్లను డెయిరీలు సేకరించి వాటిని మళ్లీ రీసైకిల్ చేస్తుం టాయి. అయితే అసంఘటిత రంగంలో సాగుతున్న పాల పంపిణీ రంగం ఈ కొత్త ఆదేశాలతో ఎలా వ్యవహరిస్తుందన్నది అస్పష్టమే. పాల ప్యాకెట్లు, బాటిళ్ల తయారీదారులను ఎవరూ విశ్వాసంలోకి తీసుకోలేదు. పునర్వినియోగానికి సిద్ధం కావలి సిందిగా వీరికి ప్రభుత్వం చెప్పడం లేదు. పైగా ఇలాంటి వాటిని ఏర్పర్చుకోవడం రాత్రికి రాత్రే జరిగిపోదు. ఒక బ్యాగ్ రీసైకిల్ చేసే ప్రక్రియలో 50 పైసలు పాల డైరీకి వెళుతుంది. అలాగే, బ్యాటిల్ తయారీదారులు 500 మిల్లీ లీటర్ల బ్యాటిల్‌కి రూపాయి లెవీ వసూలు చేస్తారు. ముందే చెప్పినట్లుగా ప్రభుత్వాదేశం ప్రకారం ప్లాస్టిక్ బ్యాటిల్స్ పునర్వినియోగ వసతుల ఏర్పాటు చట్టం చేసినంత సులభమైన విషయం మాత్రం కానే కాదు. పైగా ఇక నుంచి ఆహారం రుచి కూడా కొంతకాలం వరకు బాగానే ఉంటుంది. ఆ తర్వాత దానిలోని దినుసుల రుచి మారిపోవచ్చు లేదా మార్పులేకుండా ఉండవచ్చు. కానీ ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం అమలు అనే మంచి ఉద్దేశం కూడా మహారాష్ట్రకు పెద్ద సమస్యే అవుతుంది. ఎందుకంటే రాష్ట్రం ఇప్పటికే 1000 బ్యాటిల్స్ తయారీ సంస్థలను మూసివేసింది. వాటిలో 500 సంస్థలు చాలా పెద్దవి. రోజుకు మహారాష్ట్రలో 30 లక్షల నీటి బ్యాటిళ్లు అమ్ముడవుతుంటాయి. వీటన్నింటినీ కలిపితే సంవత్సరానికి అయిదు లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థం పోగుపడుతుంది. దీన్ని ఉన్న పళానా తొలగించడం అన్నదే ప్రధాన సమస్య. - మహేశ్ విజాపుర్కర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
ప్లాస్టిక్ బాటిళ్లపై నిషేధం!?
సాక్షి, ముంబై : ప్లాస్టిక్ బాటిళ్లపై నిషేధం విధించే దిశగా మహారాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రభుత్వ కార్యాలయాలు, స్టార్ హోటళ్లు, విద్యాసంస్థలు, పర్యాకట ప్రాంతాల్లోని హోటళ్లలో ఈ నిషేధం అమలు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను సిద్ధం చేసిన దేవేంద్ర ఫడవ్నిస్ ప్రభుత్వం త్వరలో దానిని కేబినెట్ ముందుకు తీసుకురానుంది. ‘ప్లాస్టిక్ పెట్ బాటిళ్ల అమ్మకంతోపాటు పర్యావరణానికి హానికరంగా ఉన్న వస్తువుల(ఫ్లాస్టిక్ బ్యాగులు, ఫ్లెక్సీ మెటీరియల్, బ్యానర్లు తదితరాలు)పై కూడా నిషేధం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది’ అని అదనపు సీఎస్ సతీష్ గవై వెల్లడించారు. అయితే దుకాణ సముదాయాల్లో మాత్రం వాటి అమ్మకం యథావిధిగా కొనసాగుతాయని ఆయన స్పష్టత ఇచ్చారు. ఇక రాష్ట్ర ఆదాయంపై గణనీయ ప్రభావం చూపే ఈ నిర్ణయంపై వివిధ విభాగాల అభిప్రాయాన్ని సేకరించే పనిలో ప్రభుత్వం నిమగ్నమయ్యింది. ఇందుకోసం పర్యావరణ శాఖ అధికారులను రంగంలోకి దించింది. ఓవైపు ఈ నిర్ణయంపై వాటర్ బాటిల్ కంపెనీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా.. పర్యావరణ ఉద్యమకారులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. అని అనుకున్నట్లు జరిగితే మార్చి నుంచే ఈ నిర్ణయం మహారాష్ట్రలో అమలు అయ్యే అవకాశం ఉంది. -
నీరుగారిన నిషేధం
బరంపురం: ప్రస్తుతం మానవ జీవితంలో ప్లాస్టి క్స్ విడదీయరాని భాగమైపోయాయి. ఉదయం బ్రష్ చేసుకోవడం నుంచే ప్లాస్టిక్స్ వాడకం మొదలవుతోంది. ఇక పాల ప్యాకెట్లు, కూరలు తెచ్చుకునే బ్యాగులు, చిన్నారులు స్కూలు కెవెళ్లేటపు డు లంచ్ బాక్స్‌లు, వాటర్ బాటిళ్లు, ఇంటి బయట అడుగు పెడితే అల్పాహారం, బోజనం, నీళ్లు, కాయగూరలు ఏది కొన్నా ప్లాస్టిక్ బ్యాగులతోనే మన చేతికందుతాయి. ఇటీవల కాలం లో ప్రచారం ఊపందుకోవడంతో ఫ్లెక్సీ బ్యాన ర్లు, బోర్డులు వెల్లువెత్తుతున్నాయి. ఇవి కూడా ప్లాస్టిక్స్ వినియోగించి రూపొందిస్తున్నవే. ఇంకా ప్రమాదకరమైన రసాయనాలు రంగులను వీటిపై పూస్తున్నారు. ఇవన్నీ పర్యావరణానికి పెను ప్రమాదాన్ని తెచ్చి పెడుతున్నాయని వివిధ సంస్థల వాదన. జిల్లాలో ప్లాస్టిక్ కారణంగా రకరకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నవారు వేల సంఖ్యలో ఉండడం గమనార్హం. పదేళ్ల క్రితం వరకూ సరుకులు తెచ్చుకోవాలంటే కాగితం సంచులు, జనప నార సంచులు ఎక్కువగా వాడేవారు. వీటికన్నా తక్కువ ధరకే ప్లాస్టిక్ సంచులు అందుబాటులోకి రావడంతో అందరూ వీటిని ఉపయోగిస్తున్నారు. 20 మైక్రానుల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ వాడకం సమస్త జీవజాలం ఉనికికి ముప్పుతెస్తుందని అంతర్జాతీయంగా పర్యావరణవేత్తలు రుజువుచేశారు. దీంతో కొన్ని దేశాలు ప్లాస్టిక్ వాడకంపై నిషేధం విధించాయి. అయినప్పటికీ నిషేధం అమలు కావడం లేదు. మన దేశంలో ప్రజాసంక్షేమమే తమ పరమావధి అంటూ భారీగా ఉపన్యాసాలు ఇచ్చే నేతలందరూ పర్యావరణానికి తూట్లు పొడితే ఈ ఫెక్సీ బ్యానర్లకు భారీగానే ప్రోత్సాహం ఇస్తుండడం విశేషం. ప్రస్తుతం జిల్లాలో పట్టణ, నగర ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాల వరకూ లక్షల సంఖ్యలో ఇలాంటి ఫ్లెక్సీ బ్యానర్లు ఉన్నప్పటికీ ఏ అధికారి కూడా వీటిని పట్టించుకోవడం లేదు. ప్రమాదమని తెలిసినా.. పలువురు పరిశోధకులు అందించిన సమాచారం ప్రకారం ప్లాస్టిక్ సంచులు, ఇతర ప్లాస్టిక్ ఉత్పాదకాలు మట్టిలో కలవాలంటే అక్షరాలా లక్ష సంవత్సరాలు పడుతుంది. మనం తిని పారేసే అరటితొక్క 24 రోజుల్లో, కాగితంతో తయారుచేసిన వస్తువులు నెల రోజుల్లో, వస్త్రాలు రెండేళ్లలో, చర్మపు ఉత్పత్తులు 200 ఏళ్లలోగా భూమిలో కలిసిపోయే పరిస్థితిలేదని అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్లాస్టిక్స్ వల్ల కాలుష్య విషవలయంలో జన జీవితాలు విలవిలలాడుతున్నాయి. గంజాం జిల్లాలో ప్లాస్టిక్స్ వినియోగం ఏటా నలభై శాతం పెరుగుతోంది. అందులోని హెవీమెటల్స్ ఆహా రం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. ఫలితంగా నరాల బలహీనత ఏర్పడుతోంది. బ్యాగ్‌ల కోసం, ఫ్లెక్సీ బ్యానర్ల కోసం వినియోగించే రంగుల వలన సీసం, కాడ్మియంలు పిల్లల్లో ఎదుగుదలను, జ్ఞాపకశక్తిని హరించి వేస్తున్నాయి. నామమాత్రంగా తనిఖీలు ప్లాస్టిక్స్ వినియోగంపై ప్రపంచ వ్యాప్తంగా నిషేధం ఉన్నప్పటికీ ఈ జిల్లాలో మాత్రం ఒక్క శాతం కూడా అమలు కావడం లేదు. 20 మైక్రానుల కంటే తక్కువ మందం ఉన్న క్యారీ బ్యాగ్‌లు ఉపయోగించరాదని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు అమలుచేసే స్థితిలో అధికారులు లేరు. తక్కువ మందం ఉండే క్యారీ బ్యాగ్‌ల తయారీ లాభసాటి కావడంతో ఉత్పత్తిదారులు వాటిని తయారుచేస్తూ ప్రజల ప్రాణా లతో చెలగాటమాడుతున్నారు. ఏదో నామమాత్రంగా బీఎంసీ ఆధ్వర్యంలో నగరంలో తూతూమంత్రంగా సోదాలు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. ఇప్పటిౖMðనా అధికార యంత్రాంగం ప్లాస్టిక్స్ వినియోగం వల్ల కలుగుతున్న పర్యావరణ విషాదాన్ని గుర్తించి నిషేధంపై దృష్టి సారించా లని పలు స్వచ్ఛం, ప్రజా సంఘాలు కోరుతున్నారు. -
మానవాళి శ్రేయస్సుకు.. జర్మనీ కొత్త పద్దతి
సాక్షి, వెబ్ డెస్క్ : ప్రపంచంలో వాతావరణం మార్పు పెద్ద తలనొప్పిగా మారింది. ప్లాస్టిక్ వినియోగం పెరగడం వల్ల వాతావరణంలో అనేక మార్పులకు సంభవిస్తున్నాయి. అయితే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు జర్మనీ దేశంలోని ఫ్రీబర్గ్ కంపెనీ ఒక నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. మనం రోజుకు అనేక సార్లు ప్లాస్టిక్‌ను వాడతాము. కూల్‌డ్రింక్స్, కాఫీ, టీ తదితర పానీయాలను తాగడానికి ప్లాస్టిక్, పేపర్ డిస్పోజబుల్ కప్స్‌ను వాడతారు. ఇవి విచ్ఛిన్నం చెంది భూమిలో కలసిపోవడానికి ఎన్నో ఏళ్లు పడుతుంది. తద్వార భూమి కాలుష్యం అవుతుంది. అయితే, ఇందుకు ప్రత్యామ్నాయ పద్దతిని జర్మన్ కంపెనీ కనుగొంది. ఒకసారికే వాడి పడేయకుండా 400 సార్లు వినియోగించేలా ఓ ప్రత్యేక కప్పును తయారు చేసింది. ఈ కప్పులను నగరంలోని అన్ని చోట్లా ఎల్లవేళలా అందుబాటులో ఉండేలా వంద కంపెనీలతో ఓ విధానాన్ని జర్మనీ ప్రభుత్వం రూపొందించనుంది. ఒకరి ఒకసారి వినియోగించిన కప్పు వేరొకరికి వెళ్లకుండా ఉండేందుకు కప్పులపై ప్రత్యేకమైన బార్ కోడ్‌ను తీసుకొచ్చారు. జర్మనీలో గంటకు దాదాపు 3 లక్షల కాఫీ కప్పులను వినియోగిస్తారట. సంవత్సరానికి దాదాపు 2.8 బిలియన్ కప్పులను వాడతారు. ప్రతీ కప్పును దాదాపు 13నిమిషాల పాటు వినియోగిస్తారు. ఈ సమస్య కేవలం జర్మనీది మాత్రమే కాదు. అమెరికా 2010లో 23 బిలియన్ల పేపర్ కప్పులను వాడినట్టు ఓ అంచనా. అంతేకాకుండా ప్రతి సంవత్సరం 25 బిలియన్ల స్టైరోఫోం కాఫీ కప్పులను, ప్రతి గంటకు 2.5 మిలియన్ల కూల్‌డ్రింక్ బాటిల్స్‌ను వాడి పడేస్తారనీ ఒక అంచనా. ఇవి భూమిలో డీకంపోజ్ కావడానికి దాదాపు 500 సంవత్సరాలు పడతాయి. -
ప్లాస్టిక్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం
న్యూఢిల్లీ: నోయిడాలోని శ్రీనివాస్పురిలో అర్థరాత్రి ఓ ప్లాస్టిక్ కంపెనీలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రెండతస్తుల భవనంలో నిల్వ ఉంచిన ప్లాస్టిక్ వస్తువులకు మంటలు వేగంగా వ్యాపించడంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 26 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్లాస్టిక్ సంచుల్లో సైనికుల మృతదేహాలు
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో హెలికాప్టర్ కూలిన ప్రమాదంలో మృతిచెందిన సైనికుల శరీరాలను ప్లాస్టిక్ సంచుల్లో చుట్టి కార్డుబోర్డుల్లో కుక్కిన ఫొటోలు వెలుగుచూడంతో దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. వారి మృతదేహాలు గువాహటికి చేరుకున్న తరువాత ఈ ఫొటోలు తీసినట్లు తెలిసింది. వీటిని చూసిన పలువురు నెటిజన్లు జవాన్లకిస్తున్న గౌరవమిదేనా అంటూ ట్వీటర్ వేదికగా మండిపడ్డారు. అందుబాటులో ఉన్న వనరులతో సైనికుల మృతదేహాలను అలా భద్రపరచాల్సి వచ్చిందని, వారికి పూర్తి మిలిటరీ మర్యాదలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆర్మీ తెలిపింది. -
ప్లాస్టిక్ బాటిళ్ల భవంతి!
ఎలా ఉంది ఈ బిల్డింగ్? బానే ఉందిగానీ.. ఏంటి దీని స్పెషాలిటీ అంటున్నారా? ఒకటా రెండా.. బోలెడున్నాయి. అన్నింటికంటే ముందుగా చెప్పుకోవాల్సింది... ఇదో ప్లాస్టిక్ భవంతి! అవునండీ బాబు.. కొంచెం జాగ్రత్తగా చూడండి.. తైవాన్ రాజధాని తైపీలో ఉండే ఈ భవనం ముందుభాగం మొత్తం ప్లాస్టిక్ బాటిళ్లే కనిపిస్తాయి. అది కూడా ఏకంగా 15 లక్షల బాటిళ్లు! అయితే ఇక్కడో ట్విస్ట్. వాడి పడేసిన వాటిని నేరుగా వాడకుండా.. కరిగించి మళ్లీ బాటిళ్ల మాదిరిగా తయారు చేసి వాడారు. ఇలా ప్రత్యేకమైన ఆకారంలో తయారు చేయడం వల్ల వాటిని స్టీల్ ఫ్రేమ్‌లో ఒకదానితో ఒకటి జోడించడం సులువు అవుతుంది. బాటిళ్లను చతురస్రాకారపు ప్యానెళ్లుగా అసెంబుల్ చేసి అవసరమైన ఆకారంలో ఏర్పాటు చేయడం ద్వారా ఈ భవనం ఫసాడ్ సిద్ధమైంది. ఇక రెండో ప్రత్యేకత... తొమ్మిది అంతస్తులు ఉన్న ఈ భవనంలో రాత్రిపూట వెలిగే 40 వేల ఎల్ఈడీ బల్బులకు కావల్సిన విద్యుత్తు మొత్తాన్ని సోలార్ ప్యానెల్స్, విండ్ మిల్స్ల సాయంతో అక్కడికక్కడే ఉత్పత్తి చేస్తారు. ప్లాస్టిక్ బాటిళ్లు పారదర్శకంగా ఉండటం వల్ల పగలు బల్బులు వాడాల్సిన అవసరం దాదాపుగా ఏర్పడదు. మిగిలిన ప్రత్యేకతలు ఏమిటంటే.. కాంక్రీట్ బిల్డింగ్‌లతో పోలిస్తే దీని బరువు సగం కంటే తక్కువగా ఉంటుంది. అలాగని తేలికగా ఏమీ ఉండదండోయ్! గంటకు 130 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులనైనా.. భూకంపాలనైనా తట్టుకుని నిలబడుతుంది. నిప్పు కూడా తాకకుండా ప్రత్యేకమైన కోటింగ్‌ను ఉపయోగించారు. ఇంతకీ దీని పేరేమిటో? ఎవరు డిజైన్ చేశారో చెప్పనే లేదు కదూ.. నిజానికి ఒది కొత్తది కాదు. దాదాపు ఏడేళ్ల క్రితం తైపీలో జరిగిన ఒక అంతర్జాతీయ ప్రదర్శన కోసం సిద్ధమైంది. ఆర్థర్ హాంగ్ అనే ఆయన దేశంలో ఏటా ఖర్చవుతున్న 45 లక్షల ప్లాస్టిక్ బాటిళ్లకు కొత్త అర్థం చెప్పే ఉద్దేశంతో దీన్ని డిజైన్ చేశారు. కట్టేందుకు రూ.20 కోట్ల వరకూ ఖర్చయింది లెండి! చివరగా.. దీని పేరు.. ‘ఎకో ఆర్క్’! – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ప్లాస్టిక్ సంచుల గోదాములో అగ్నిప్రమాదం
డోన్ టౌన్ : పట్టణ శివారులోని వైఎస్సార్ విగ్రహం వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారి పక్కనే ఉన్న లక్ష్మీవెంకటేశ్వర ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన ప్లాస్టిక్ సంచుల గోదాములో ఆదివారం ఉదయం 5గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. యజమాని ఎరుకలి సుంకన్న కథనం మేరకు.. గోదాములో విద్యుదాఘాతం కారణంగా ప్రమాదం చోటుచేసుకుంది. గత వారం రూ. 15లక్షల సరుకును బెంగళూరు నుంచి తెప్పించుకుని నిల్వ ఉంచగా సుమారు రూ. 12 లక్షల సరుకు కాలిపోయింది. సమాచారం అందుకున్న స్థానిక అగ్నిమాపక కేంద్ర ప్రధాన అధికారి మద్దిలేటి ఆధ్వర్యంలో సిబ్బంది గోపాల్, రామాంజనేయులు, గోవిందరాజు, సుంకన్న, నారాయణ ఫైరింజిన్‌తో వచ్చి మంటలను ఆర్పివేయడంతో ఆస్తి నష్టం తగ్గింది. జిల్లా అగ్నిమాపక కేంద్ర అధికారి బాలరాజు ఉదయం 7గంటల సమయంలో ప్రమాద స్థలానికి వచ్చి పరిశీలించారు. గోదాము యజమాని ఎరుకలి సుంకన్న, అగ్నిమాపక అధికారి మద్దిలేటితో మాట్లాడి ప్రమాదానికి కారణాలు, జరిగిన నష్టం తదితర వివరాలు తెలుసుకున్నారు. -
ప్లాస్టిక్ బాటిల్స్ సురక్షితమేనా..?
ఇకపై మీరు వాటర్ బాటిల్ కొని తాగడానికి ముందు దాని కిందభాగాన్ని ఒకసారి చూడండి. ఏం కనిపిస్తాయి? ఎప్పుడైనా పరిశీలించారా? అయితే జాగ్రత్తగా చూడండి. ఎన్నో రకాల ప్లాస్టిక్స్ ఉన్నాయి కదా! వాటిలో ఏ తరహా ప్లాస్టిక్‌తో ఆ వాటర్ బాటిల్ తయారు చేశారో తెలియజేస్తూ బాటిల్ కింద దానికి చెందిన లెటర్స్‌ను ప్రింట్ చేస్తారు. మరి వాటిలో మనకు ఏది మంచిదో, ఏది హానికరమో కింద చూడండి. పీఈటీఈ లేదా పీఈటీ - వాటర్ బాటిల్ కింద ఈ లెటర్స్ ప్రింట్ చేసి ఉంటే జాగ్రత్త. ఎందుకంటే ఈ ప్లాస్టిక్‌తో తయారు చేసిన వాటర్ బాటిల్స్‌లో నీరు పోస్తే ఆ నీటిలోకి ప్రమాదకరమైన విషపదార్థాలు విడుదల అవుతాయట! ఆ క్రమంలో ఆ నీటిని తాగడం మంచిది కాదట. హెచ్డీపీఈ లేదా హెచ్‌డీపీ - వాటర్ బాటిల్ కింద ఈ లెటర్స్ ఉంటే అప్పుడు ఆ బాటిల్లోని నీటిని మనం నిరభ్యంతరంగా తాగవచ్చు. ఆ నీటిలోకి ఎలాంటి ప్లాస్టిక్ అవశేషాలు చేరవు. అవి పూర్తిగా సురక్షితమైనవి. మనకు ఎలాంటి హాని కలిగించవు. పీవీసీ లేదా 3వీ - ఈ లెటర్స్ ఉన్నా జాగ్రత్తగా చూడాలి. ఎందకంటే ఈ ప్లాస్టిక్ వల్ల నీటిలోకి కొన్ని రకాల విష పదార్థాలు చేరుతాయి. అవి మన శరీరంలో హార్మోన్ అసమతుల్యతను కలిగిస్తాయి. ఎల్‌డీపీఈ - ఈ ప్లాస్టిక్‌తో చేసిన వాటర్ బాటిల్స్ మనకు శ్రేయస్కరమే. వీటి నుంచి ఎలాంటి వ్యర్థాలు నీటిలో చేరవు. కానీ ఈ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ తయారీకి పనికిరాదు. దీంతో ప్లాస్టిక్ బ్యాగ్స్‌ను తయారు చేస్తారు. పీపీ- పెరుగు కప్పులు, టానిక్‌లు, సిరప్లు ఉంచేందుకు వాడే చిన్నపాటి బాటిల్స్‌ను తయారు చేసేందుకు ఈ ప్లాస్టిక్‌ను వాడుతారు. ఇది మనకు సురక్షితమే. పీఎస్ - ఈ తరహ ప్లాస్టిక్‌తో కాఫీ, టీ కప్పులు తయారు చేస్తారు. అవి వాటిలోకి కార్సినోజెనిక్ సమ్మేళనాలను విడుదల చేస్తాయి. కనుక ఈ తరహా ప్లాస్టిక్‌తో చేసిన వస్తువులను వాడరాదు. లేబుల్ ఏమీ లేకపోయినా లేదా పీసీ అని ఉన్నా ఈ ప్లాస్టిక్ చాలా డేంజర్. జాగ్రత్త పడండి మరి! -
హైదరాబాద్‌ను ముంచేస్తున్న ప్లాస్టిక్
-
కర్నూలులో కలకలం రేపిన చిన్నారి మృతదేహం
-
ప్రారంభమైన యోగి మార్క్ పాలన
-
సీబీఐ వలలో సెంట్రల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్
రూ.10 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ గోపాల కృష్ణమూర్తి సాక్షి, హైదరాబాద్: సీబీఐ వలలో మరో అవినీతి తిమింగళం పట్టుబడింది. సెంట్రల్ ఎక్సైజ్ శాఖలో యాంటీ ఇవాషన్ సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న ఎస్.గోపాల కృష్ణమూర్తి.. కాటేదాన్‌లోని కేఎం ప్లాస్టిక్ కంపెనీకి అనుకూలంగా ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఇచ్చేందుకు ఆ సంస్థ యజమాని జగదీశ్ ప్రసాద్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అందులో భాగంగా ఈ నెల 1వ తేదీన గోపాల కృష్ణమూర్తి బృందం కంపెనీలో తనిఖీలు చేసింది. ఈ నేపథ్యంలో అనుకూలంగా రిపొర్ట్ ఇచ్చేందుకు మంగళవారం ఉదయం రూ.6 లక్షలను గోపాల కృష్ణమూర్తికి జగదీశ్ ఇచ్చాడు. మిగతా రూ.4 లక్షలు మధ్యాహ్నం ఇస్తానని చెప్పాడు. అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ ద్వారా ఈ సమాచారం అందుకున్న సీబీఐ ఇన్స్పెక్టర్ రాందాస్.. బషీర్‌బాగ్‌లోని సెంట్రల్ ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకొని రూ.4 లక్షలు ఇస్తున్న సమయంలో గోపాల కృష్ణమూర్తితోపాటు జగదీశ్ప్రసాద్ను అరెస్ట్ చేశారు. గోపాల కృష్ణమూర్తి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేసిన అధికారులు రూ.5.6 లక్షల నగదుతోపాటు కీలకమైన పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు సీబీఐ డీఐజీ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టినట్టు ఆయన వెల్లడించారు. -
జాడలేని డంపింగ్ యార్డులు
► ఏర్పాటుకు చర్యలే తీసుకోని అధికారులు ► గ్రామాలలో తీవ్రమవుతున్న ‘చెత్త’ సమస్య ► రోడ్ల పక్కనే తగులబెడుతున్న వైనం ► రోగాలపాలవుతున్న స్థానికులు శంషాబాద్ రూరల్: గ్రామీణ ప్రాంతాలలో చెత్త సమస్య రోజురోజుకూ జఠిలంగా మారుతోంది..ఓ వైపు ప్లాస్టిక్ వినియోగం పెరిగిపోతుండగా.. మరో వైపు సేకరించిన చెత్తను వేయడానికి స్థలం లేక ఇబ్బందులు తప్పడం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్ల పక్కన పడవేసి కాల్చేస్తున్నారు. దీంతో అందులోని ప్లాస్టిక్ కారణంగా వాయు కాలుష్యం ఏర్పడి గ్రామీణులు రోగాల పాలవుతున్నారు. పెద్దషాపూర్, తొండుపల్లి, కాచారం, కవ్వగూడ, నర్కూడ, పెద్దగోల్కొండ, చిన్నగోల్కొండ, ఊట్పల్లి, పాల్మాకుల, మదన్ పల్లి, శంకరాపురం, హమీదుల్లానగర్, మల్కారం, నానాజీపూర్, రామంజాపూర్, ముచ్చింతల్, ఘాంసిమియాగూడ, గొల్లపల్లి, జూకల్, సుల్తాన్ పల్లి, పెద్దతూప్ర పంచాయతీల పరిధిలోని గ్రామాల్లో చెత్త సమస్య తీవ్రంగా మారింది. ఆయా గ్రామాల్లో ప్లాస్టిక్ నివారణకు చర్యలు లేకపోవడంతో, ఇష్టానుసారంగా వినియోగిస్తున్నారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా కాకుండా ఒకే రకంగా సేకరిస్తున్నారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలు, రోడ్ల పక్కన పార బోస్తున్నారు. నర్కూడలోని చెత్తను సమీపంలోని చెరువులో వేస్తున్నారు. ఇక పెద్దషాపూర్లో చెత్తను జూకల్ వెళ్లే దారిలోని స్మశానవాటిక స్థలం లోనే వేసి కాల్చేస్తున్నారు. కాచారంలోని చెత్తను షాబాద్ రోడ్డు పక్కన ఉన్న వరద కాలు వలో వేస్తున్నారు. మిగిలిన గ్రామాల్లో సైతం పరిస్థితి ఇలా గే ఉండడంతో ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో చెత్త నుంచి వెలువడే దుర్గంధంతో అవస్థలు తప్పడం లేదు. చెత్తను కాల్చివేసే సమయంలో అందులోని ప్లాస్టిక్ నుంచి వెదజల్లే కాలుష్యంతో శ్వాస సంబంధిత రోగాల బారిన పడుతున్నా మని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కాగితాల మీదనే ప్రతిపాదనలు.. అన్ని గ్రామాల్లో చెత్త డంపింగ్ యార్డులను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు రూపొందించారు. ఇందుకోసం అనువైన స్థలాలను ఎంపిక చేయడానికి రెవెన్యూ అధికారులు సన్నాహాలు చేపట్టారు. కానీ, చాలా చోట్ల స్థలాభావంతో ఈ ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. తొండుపల్లి పంచాయతీ పరిధిలో చెత్త డంపింగ్ యార్డు కోసం ఇందిరమ్మ కాలనీ సమీపంలోని ప్రభుత్వ స్థలం కేటాయించారు. చెత్త వేయడానికి అనువుగా గోతులు కూడా తీశారు. సేకరించిన చెత్తను ఇక్కడకు తరలించడానికి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. ఇక్కడ చెత్త వేస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుందని అక్కడి కాలనీ వాసులు అభ్యంతరం చెబు తున్నారు. స్థలాలు లేక కొన్ని చోట్ల..ఉన్నా వినియోగించుకోలేని పరిస్థితులు నెలకొనడంతో సమస్యకు పరిష్కారం దొరకడంలేదు. -
భారీ తిమింగలం మృతి.. షాకింగ్ నిజాలు
ఓస్లో: నార్వే సముద్రతీరంలో ఇటీవల ఓ భారీ తిమింగలం పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిని ఇక బతికే అవకాశం లేకపోవడంతో మెరైన్ బయాలజిస్టులు దానికి కారుణ్య మరణం ప్రసాదించారు. అనంతరం.. దాని తీవ్ర అనారోగ్యానికి గల కారణాలను తెలుసుకోవడానికి డెన్మార్క్‌లోని యూనివర్సిటీ ఆఫ్ బెర్జిన్కు చెందిన పరిశోధకులు ప్రయత్నించగా.. విస్మయపరిచే విషయాలు వెల్లడయ్యాయి. సుమారు 30 ప్లాస్టిక్ బ్యాగులతో పాటు.. భారీ సంఖ్యలో మానవ వ్యర్థాలను తిమింగలం పొట్టలో గుర్తించారు. ఇలా భారీ సంఖ్యలో వ్యర్థాలను తీసుకోవడం మూలంగా.. తిమింగలం జీర్ణవ్యవస్థ దెబ్బతిందని, దాని మృతికి కారణం ఇదే అని జంతు శాస్త్రవేత్త టెర్జీ లిస్లెవాండ్ తెలిపారు. 2050 నాటికి సముద్రాలలో చేపల కంటే ప్లాస్టిక్ వ్యర్థాల పరిమాణమే ఎక్కువ ఉంటుందని వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఓ నివేదికలో వెల్లడించింది. -
తాటాకు బుట్టల్లో చికెన్!
కేకే నగర్: మార్కెట్ నుంచి చికెన్ ఎలా తెచ్చుకుంటారు? ఇదేం పిచ్చి ప్రశ్న.. సంచులతో అని తెలియదా అంటారా. పల్లెటూర్ల అయితే గిన్నెల్లో కూడా తెచ్చుకుంటారు. తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో తాటాకు బుట్టల్లో కోడిమాంసం తెచ్చుకుంటున్నారు. తిరునల్వేలి జిల్లా కార్పొరేషన్లో ప్లాస్టిక్ నిషేధం విధించడంతో వ్యాపారులు కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. ప్లాస్టిక్ కవర్లకు బదులుగా తాటాకు బుట్టల్లో కోడిమాంసం విక్రయిస్తున్నారు. తిరునల్వేలి జిల్లాలో ఆరోగ్యశాఖ అధికారులు దుకాణాలకు వెళ్లి ప్లాస్టిక్ వస్తువులు, కవర్లను స్వాధీనం చేసుకుంటున్నారు. బుధవారం రోజున ప్రజల నుంచి ప్లాస్టిక్ వస్తువులను అధికారులు తీసుకునే పద్ధతిని కార్పొరేషన్ అధికారులు పరిచయం చేశారు. మిగతా రోజుల్లో జరిమానా వసూలు చేస్తున్నారు. మాంసం దుకాణాల్లో ప్లాస్టిక్ కవర్లను వినియోగించే వారిపై జరిమానా విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాళయంకోట ఎస్పీ కార్యాలయం ఎదురుగా దుకాణాల్లో తాటాకు బుట్టల్లో మాంసాన్ని విక్రయిస్తున్నారు. ఇందుకు తిరుచెందూర్ సమీపంలోని గ్రామాల నుంచి వందల సంఖ్యలో తాటాకు బుట్టలను వ్యాపారులు కొంటున్నారు. దీనిపై మాంసం దుకాణం యజమాని రజాక్ మాట్లాడుతూ కార్పొరేషన్ చేపట్టిన ప్లాస్టిక్ నిషేధ చర్యలకు వ్యాపారులు సహకరిస్తున్నారని, ఇందులో భాగంగా తాటాకు బుట్టల్లో మాంసం విక్రయిస్తున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్ కవర్లలో మాంసం గంట దాటితే చెడిపోయే అవకాశం ఉందని, అదే తాటాకు బుట్టలో ఆరు గంటల సేపు చెడిపోకుండా ఉంటుందని తెలిపారు. తాటాకు బుట్టల ద్వారా కుటీర పరిశ్రమ కార్మికులకు ఉపాధి లభిస్తుందని అన్నారు. -
ఫ్లెక్సీలు బంద్
► హోర్డింగులకే పరిమితం ►నేటినుంచి పక్కాగా అమలు ► పటిష్టంగా ప్లాస్టిక్ నిషేధం ► నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా ►ప్రత్యామ్నాయం చూపండి ►ఫ్లెక్సీ నిర్వాహకుల విజ్ఞప్తి రహదారులకు అడ్డుగా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తేలా కట్టే ఫ్లెక్షీలు ఇకనుంచి కనిపించవు. తమ నేత వస్తున్నాడని రాజకీయ పార్టీలు, నాయకుడొస్తున్నాడని వివిధ సంఘాల నాయకులు పట్టణాలు, ఊళ్లను ఫ్లెక్సీలతో కుమ్మేయడం ఈ కొత్త సంవత్సరం నుంచి కుదరదు. ఫ్లెక్షీల ద్వారా తలెత్తుతున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు ఫ్లెక్సీలను నిషేధిస్తూ (హోర్డింగ్‌లకు మినహా) గతంలోనే నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది అంటే.. ఆదివారం నుంచి మంత్రి ఆదేశాలు పక్కాగా అమలులోకి రానున్నాయి. – సాక్షి, సిరిసిల్ల సాక్షి, సిరిసిల్ల : పర్యావరణానికి హానికరంగా మారిన ప్లాస్టిక్‌ను తరిమివేసే క్రమంలో ఫ్లెక్షీలనూ నిషేధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేవలం మున్సిపల్ అనుమతులున్న హోర్డింగ్‌లు, సైన్ బోర్డులకు తప్ప ఫ్లెక్షీలు ఏర్పాటు చేయడంపై నిషేధం విధించారు. సిరిసిల్ల పట్టణంలో 12, వేములవాడలో 4 హోర్డింగ్‌లకు మాత్రమే మున్సిపాల్టీల అనుమతి ఉంది. ఫ్లెక్సీల తయారీపై నిషేధిం విధించకున్నా .. హోర్డింగ్‌లు తప్ప బయట ఏర్పాటు చేస్తే జరిమానా విధిస్తామనే అధికారుల హెచ్చరికతో దాదాపు నిషేధం అమలు కానుంది. పటిష్టంగా ప్లాస్టిక్‌పై నిషేధం మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సూచన మేరకు ప్లాస్టిక్‌రహిత జిల్లాగా మార్చేందుకు అధికారులు నడుం కట్టా రు. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాల్టీల్లో ప్లాస్టిక్, ఫ్లెక్షీల నిషేధాన్ని పగడ్బందీగా అమలు చేసేం దుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ప్లాస్టిక్‌పై నిషేధం కొనసాగిస్తుండగా, నూతన సంవత్సరంలో మరింత పటిష్టంగా అమలు చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ సుమన్ రావు నేతృత్వంలో ఎన్విరాన్ మెంట్ ఇంజినీరింగ్, శానిటరీ ఇన్ స్పెక్టర్, సంబంధిత వార్డు జవాన్, ఇద్దరు వర్కర్లతో కూడిన బృందం నిషేధం అమలు ఉల్లంఘించేవారిపై దాడులు చేపడుతోంది. గత మూడు నెలల్లో 12 సార్లు చేసిన దాడుల్లో రూ.1.10 లక్షల జరిమానాను వ్యాపారుల నుంచి వసూలు చేశారు. ప్లాస్టిక్ కవర్స్, గ్లాస్లు విక్రయిస్తూ తొలిసారి పట్టుబడిన దుకాణదారుకు రూ.2 వేలు, రెండోసారి పట్టుబడితే అదనంగా రూ.వేయి కలిపి జరిమానా విధిస్తారు. మూడు, నాలుగో సారైతే లైసెన్స్ రద్దు చేస్తారు. వేములవాడలోనూ పలు పర్యాయాలు తనిఖీలు చేపట్టారు. ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌ల స్థానంలో నాన్ వోవెన్ క్లాత్ బ్యాగ్స్‌ను మాత్రమే అనుమతినిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రణాళికాబద్ధంగా ప్రచారం.. పా్లస్టిక్ రహిత సమాజం వైపు అడుగులు వేయాలంటే ప్రజలు, వ్యాపారుల సహకారం అత్యవసరమని గుర్తిం చిన అధికారులు.. ఆ దిశగా చర్యలు చేపట్టారు. ప్రణాళి కాబద్ధంగా ప్లాస్టిక్ నిషేధానికి విస్తృత ప్రచారం కల్పిం చేందుకు కొత్త సంవత్సరం మొదటి వారంలో వరుస కార్యక్రమాలు చేపట్టారు. పట్టణాల్లో ర్యాలీలు, పాఠశాలల్లో వ్యాసరచన, ఉపన్యాస పోటీలు, వ్యాపార, వాణి జ్య వర్గాలతో సమావేశాలు, ఆటోలకు మైక్‌ల ద్వారా కాలనీల్లో తిరుగుతూ ప్రచారం చేపట్టేందుకు నిర్ణయించారు. ప్రత్యామ్నయం చూపండి.. ఫ్లెక్షీలపై నిషేధాన్ని అమలు చేస్తుండడంపై నిర్వాహకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఫ్లెక్షీల తయారీపై నిషేధం లేకున్నా.. అనుమతున్న హోర్డింగ్‌లు మిన హా ఇతర ప్రాంతాల్లో నిషేధించడంతో తమ వ్యాపారం పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రూ.లక్షల్లో రుణాలు తీసుకుని, అప్పులు తెచ్చి ఫ్లెక్షీ వ్యాపారం చేసుకుంటున్న తమకు ప్రభుత్వ నిర్ణయం అశనిపాతంలా మారిందని ఆవేదన చెందుతున్నారు. ఫ్లెక్షీ దుకాణాలు సిరిసిల్లలో ఆరు, వేములవాడలో రెండు ఉన్నాయి. ఫ్లెక్షీలను నిషేధించడం సరికాదని, దీని వల్ల తాము ఉపాధి కోల్పోతున్నామని నిర్వాహకులు భిక్షపతి, మాదాసు రమేశ్ ఆవేదన చెందారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వంద కుటుంబాలపై దీని ప్రభావం పడుతుందని ఆందోళన చెందారు. ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకోకపోతే ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాలని వారు కోరారు. ఇక ప్లాస్టిక్, ఫ్లెక్షీ రహితం పా్లస్టిక్, ఫ్లెక్షీ రహిత పట్టణంగా సిరిసిల్లను ప్రకటించాం. రాజకీయ పార్టీలు, మత, విద్యా, వ్యాపార సంస్థలు, సహకార, విద్యార్థి సంఘాలు, వ్యక్తులు ఎవరూ కూడా ఆదివారం నుంచి చౌరస్తాలు, ఎక్కడైనా ఫ్లెక్షీలు కట్టడం, ప్రదర్శించడం చేయరాదు. చనిపోయిన వారి చిత్రాలు, ఫొటలతో కూడిన ఫ్లెక్షీలు కూడా పెట్టొద్దు. వ్యాపారసంస్థలు, వ్యక్తులు ప్లాస్టిక్, పాలిథిన్ క్యారీ బ్యాగులు అమ్మడం, వాడడం చేయొద్దు. నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానా విధింస్తాం. నూతన సంవత్సరంలో వందశాతం ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దుతాం. ప్లాస్టిక్ నిషేధంపై ప్రచారాన్ని విస్తృతం చేశాం. ప్రజలు, వ్యాపారులు కూడా ఇందుకు సహకరించాలి. – బడుగు సుమన్ రావు, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ -
మార్కెట్లోకి మరో కొత్త రకం నోట్లు!
పాతనోట్ల రద్దు అనంతరం ఆర్బీఐచే కొత్త కరెన్సీ నోట్లను ముద్రిస్తున్న కేంద్రప్రభుత్వం మరో కీలకప్రకటన చేసింది. పేపర్ కరెన్సీ స్థానంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ప్రింట్ చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించింది. దానికి అవసరమైన మెటీరియల్ సేకరణను కూడా ప్రారంభించినట్టు తెలిపింది. ఈ విషయాన్ని ఆర్థికశాఖ సహాయమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్‌సభకు లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు. రిజర్వు బ్యాంకు ఎప్పటినుంచో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ప్రింట్ చేయాలని ప్లాన్ చేస్తుందని, దీనికోసం క్షేత్రస్థాయి పరిశీలన కూడా చేపట్టినట్టు అర్జున్ రామ్ మేఘ్వాల్ చెప్పారు. 2014 పిబ్రవరిలోనే ప్రభుత్వం ఈ విషయాన్ని పార్లమెంట్‌కు వెల్లడించింది. రూ.10 విలువ కలిగిన 100 కోట్ల ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టనున్నట్టు, క్షేత్రస్థాయి పరిశీలన కోసం ఐదు రాష్ట్రాలను కూడా ఎంపికచేసినట్టు పార్లమెంట్‌కు ప్రభుత్వం నివేదించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఎంపికచేసిన ప్రాంతాలు కొచ్చి, మైసూర్, జైపూర్, సిమ్లా, భువనేశ్వర్‌లు. పేపర్ కరెన్సీ పోలిస్తే ప్లాస్టిక్ నోట్లు ఎంతో సురక్షితమైనవి, కనీసం వీటి జీవిత కాలం ఐదేళ్లవరకు ఉంటుంది. వాటిని నకిలీగా ప్రింట్ చేయడానికి ఎటువంటి వీలుండదు. మార్కెట్లో నకిలీ కరెన్సీ నోట్లు పెరిగిపోతుండటంతో ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ, ప్రభుత్వం దృష్టిసారించింది. నకిలీలకు వ్యతిరేకంగా ఈ పేపర్ కరెన్సీని మొదట ఆస్ట్రేలియాలో ప్రవేశపెట్టారు. ఎలాంటి సెక్యురిటీ ఫీచర్లు లేని కొన్ని రూ.1000 నోట్లు ఆర్బీఐ తన వద్దకు వచ్చినట్టు 2015 డిసెంబర్లో తెలిపినట్టు మేఘ్వాల్ పేర్కొన్నారు. ఆ కరెన్సీ నోట్లు నాసిక్‌లోని కరెన్సీ నోట్ ప్రెస్‌లో ప్రింట్ చేశారని వెల్లడైనట్టు తెలిపారు. ఈ ప్రెస్‌కు పేపర్‌ను సెక్యురిటీ పేపర్ మిల్(ఎస్పీఎమ్) హోసంగాబాద్ సరఫరా చేసిందని, ఈ విషయంపై వెంటనే ఆ యూనిట్లపై విచారణకు ఆదేశించామని వెల్లడించారు. -
‘కేంద్రం ప్లాస్టిక్ కార్డులు అమ్ముతోంది’
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. పెద్ద నోట్ల రద్దు విషయంలో అవకాశం దొరికిన ప్రతిసారి ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శలతో ఎండగడుతున్నారు. ఈ ప్రభుత్వం ఓ సేల్స్మెన్లాగా పనిచేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కేంద్ర ప్రభుత్వంలోని నాయకులు వారి ఉత్పత్తులను అమ్ముకోవడం ప్రారంభించారు. దుకాణాలు తెరిచి ప్లాస్టిక్ కార్డులు అమ్ముకోవడం ప్రారంభించారు. స్వైపింగ్ మిషన్ల అమ్మకాన్ని ఈ మాదిరిగా పెంచుతున్నారు. అసలు సమస్య నుంచి వారు పక్కకు జరిగారు. రోజురోజుకు వారు తప్పులను మించినతప్పులు చేస్తున్నారు’అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన అంశంపై నుంచి పక్కకు తప్పించేందుకు కేంద్రం ఈ ప్రభుత్వం ఈ నాటకాలు ఆడుతోందని మండిపడ్డారు. -
ప్లాస్టిక్ కవర్లో మృతదేహం తరలింపు
-
మృతదేహాన్ని ప్లాస్టిక్ బ్యాగ్‌లో చుట్టి..
మృతదేహాన్ని తరలించడానికి కనీసం ఒక అంబులెన్సు ఇప్పించమని కోరినా ఆస్పత్రి పట్టించుకోలేదు. దాంతో తప్పనిసరి పరిస్థితులలో మృతుడి బంధువులు అతడి మృతదేహాన్ని ఒక ప్లాస్టిక్ బ్యాగ్‌లో చుట్టి, చేతులతోనే మోసుకుని తీసుకెళ్లాల్సి వచ్చింది. ఈ దారుణ ఘటన బిహార్‌లో మళ్లీ కలకలం రేపింది. సింటు కుమార్ అనే వ్యక్తి దాదాపు రెండు వారాల క్రితం గంగానదిలో పడి చనిపోయాడు. ఈనెల 25న అతడి మృతదేహాన్ని బయటకు తీశారు గానీ, అప్పటికే అది బాగా కుళ్లిపోయింది. దాన్ని అతడి బంధువులు పోస్టుమార్టం కోసం కతియార్లోని ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. కానీ ప్రభుత్వ వైద్యులు అక్కడి నుంచి 86 కిలోమీటర్ల దూరంలో ఉన్న భాగల్పూర్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. అంతదూరం వెళ్లేందుకు తమవద్ద డబ్బు లేదని, ఒక అంబులెన్సు ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదు. దాంతో ఏమీ చేయలేని పరిస్థితులలో కుమార్ బంధువులు అతడి మృతదేహాన్ని ఒక ప్లాస్టిక్ బ్యాగ్‌లో చుట్టి, చేతులతో మోసుకుంటూ తీసుకెల్లారు. మృతదేహం అప్పటికే బాగా కుళ్లిపోవడం వల్లే పోస్టుమార్టం కోసం భాగల్పూర్కు రిఫర్ చేశామని కతియార్ ఆస్పత్రి సివిల్ సర్జన్ ఎస్సీ ఝా తెలిపారు. తమ వద్ద శవాలను తీసుకెళ్లే వాహనం లేదన్నారు. పైగా మృతదేహాన్ని భాగల్పూర్ పంపాల్సిన బాధ్యత పోలీసులది తప్ప తమది కాదని ఆయన అన్నారు. బిహార్‌లోని వైశాలి జిల్లాలో ఇలాగే కుళ్లిపోయిన ఓ మృతదేహాన్ని బయటకు తీయడానికి పోలీసులు తాళ్లు కట్టి బయటకు లాగడంతో అది పెద్ద వివాదం అయింది. దానికి సంబంధించిన వీడియోను స్థానిక యువకులు సెల్ఫోన్లో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ దృశ్యాలు విపరీతంగా ప్రచారం అయ్యాయి. ఇప్పుడు మళ్లీ అలాంటి ఘటనే చోటుచేసుకుంది. -
మునకే సుఖమనుకోవోయ్!
హ్యూమర్ ప్లస్ సుబ్బారావుకి గాలిలో తేలుతున్నట్టు కలొచ్చింది. కలవరంలో వుండగా చల్లగా తగిలింది. కళ్ళు తెరిస్తే మంచం నీళ్లలో తేలుతూ వుంది. అపార్ట్మెంట్ చెరువులా కనిపించింది. గబాలున లేస్తే కిటికీలోంచి వెంకట్రావ్ విష్ చేశాడు. ఒక ప్లాస్టిక్ కవర్లో లాప్టాప్ చుట్టుకుని ఈదుతూ వెళుతున్నాడు. ‘‘ఏంటిది ప్రళయమా?’’ అడిగాడు సుబ్బారావు. ‘‘చెరువుల్లో వూళ్లు కడితే, వూళ్లు చెరువులవుతాయి’’ వెంకట్రావ్ సాఫ్ట్‌వేరే కానీ తల్లి వేరు కవిత్వం. ‘‘చెరువుని ఈదడం సులభం, జీవితాన్ని ఈదడమే కష్టం’’ అన్నాడు వెంకట్రావు. ‘‘నాకు ఈత రాదు’’ అన్నాడు సుబ్బారావు. ‘‘లైఫ్ జాకెట్ వేసుకో’’ ‘‘జాకెట్ లేడీస్ వేసుకుంటారు. లైఫ్ షర్ట్ వుంటే చెప్పు’’ సుబ్బారావు పురుషవాది. పురుషులందు పురుషవాదులు వేరు. స్త్రీవాదులతో ఓడిపోవడం వల్లే పురుషులు రుషులుగా మారుతున్నారనేది అతని ఫిలాసఫీ. ‘‘తుపాన్లో జర్దా పాను గురించి చర్చ అవసరమా?’’ ‘‘పురుషుల్ని ఉతికి ఇస్త్రీ చేయడానికే స్త్రీలు పుట్టారని ఇంతకాలం వాదించాను. అందువల్ల జాకెట్ వేసుకోను.’’ ‘‘అయితే సెల్ఫీ తీసుకుని ఎఫ్‌బిలో పోస్ట్ చెయ్. అదే నీ ఆఖరి పోస్టింగ్ అని అందరికీ గుర్తుంటుంది’’లాహిరి లాహిరి పాడుకుంటూ వెంకట్రావ్ వెళ్లిపోయాడు. సుబ్బారావుకి బాస్ గుర్తొచ్చాడు. ప్రపంచమంతా మునిగిపోయినా ఆఫీసులు మునిగిపోవు, అదో ట్రాజెడీ. ఇంతలో కూకట్పల్లి అని అరుస్తూ ఒక పడవ వచ్చింది. దాన్నిండా జనం. ఎవరు ఎవరి మీద కూచున్నారో తెలియడం లేదు. తెడ్డుకి కూడా ఇద్దరు వేలాడుతున్నారు. కిటికీలోంచే సుబ్బారావు దాంట్లోకి దూకాడు. పడవ అటూఇటూ కదిలి హాహాకారాలు వినిపించాయి. ‘‘ఏంటిది?’’ పడవవాడ్ని అడిగాడు. ‘‘సర్వీస్ ఆటోలుగా, సర్వీస్ బోట్’’ ‘‘ఇంతమంది ఎక్కితే మునిగిపోదా?’’ ‘‘మునిగిపోతే రక్షించడానికి ఇద్దరు గజ ఈతగాళ్లున్నారు. వాళ్ల చార్జి ఎగస్ట్రా’’ హైలెస్సా హైలెస్సా అంటూ తెడ్డువేశాడు. పడుతూ లేస్తూ నిజాంపేట నుంచి కూకట్పల్లి చేరింది పడవ. ఒడ్డున సర్వీస్ ఆటో ఎక్కాడు. జనాల్ని ఆటోలో కుక్కి ఒక తాడుతో అందర్నీ కలిపి కట్టేశాడు ఆటోడ్రైవర్. ‘‘ఈ బంధనం ఎందుకు?’’ ‘‘ఇది సీట్ బెల్ట్ లాంటిది సార్. మనకు ముందర రోడ్డంటూ ఏమీ లేదు. ఒక గోతిలోంచి ఇంకో గోతిలోకి జంప్చేస్తూ వెళ్లడమే’’ అని డ్రైవర్ స్టార్ట్ చేశాడు. పిండిమరలాగా అది గుడగుడ సౌండ్ చేస్తూ కదిలింది. సర్వాంగాలు గజగజ వణికాయి. దబేల్దుబేల్మంటూ ఆటో అటూ ఇటూ ఒరుగుతూ వెళ్లింది. ఒక మాన్హోల్లోకి డైవ్ చేయడానికి ఆటో ప్రయత్నించింది కానీ సమయస్ఫూర్తితో డ్రైవర్ హ్యాండిల్‌కి వేళాడుతూ హ్యాండిల్ చేశాడు. ఈ కీలకమైన ఘట్టంలో పలువురు బాధితులు గోవిందనామస్మరణ చేస్తూ కాస్త పుణ్యం గడించారు. సామూహిక పగ్గం నుంచి ఆటోవాడు విముక్తి చేసిన తరువాత ఆఫీస్ దగ్గరికి వెళితే గుండె చెరువైంది. అక్కడ గడకర్ర సాము జరుగుతూ వుంది. యాభై రూపాయల ఫీజు ఇస్తే గడకర్రని ఇస్తున్నారు. దాన్ని వూతంగా గాల్లోకి ఎగిరితే సెకండ్‌ఫ్లోర్‌లో ల్యాండ్ అవుతాం. నీటిలో ఆఫీస్ వుండడం వల్ల ఇంకో దారిలేదు. ఆఫీస్‌కి వెళ్లాలంటే గడకర్ర, వెళ్లకపోతే బాస్ దుడ్డుకర్ర తీసుకుంటాడు. ‘‘జీవితంలో ఇలా ఎత్తుకు ఎదిగే అవకాశం పదేపదే రాదు సార్’’ అన్నాడు గడకర్రవాడు. ‘‘నాకు భయం’’ అన్నాడు సుబ్బారావు. ‘‘భయానికి విరుగుడు అభయం’’ అంటూ ఆంజనేయుడిలా భుజాల మీద ఎక్కించుకుని యాహూ అంటూ గడకర్రవాడు ఎగిరాడు. గూగుల్ అంటూ దూకాడు సుబ్బారావు. ఐరిస్ మిషన్‌కు కళ్లు చూపించాడు. ఆఫీస్‌లోకి తగలడిచావు అని మూలిగింది. ‘‘ప్రకృతితో వికృతిగా వ్యవహరిస్తే భవిష్యత్ ఆకృతి ఇదే. నాలుగు చినుకులకే చిరిగి చాటంతవుతుంది’’ అంటున్నారెవరో. - జి.ఆర్. మహర్షి -
ఫ్రాన్స్ విప్లవాత్మక నిర్ణయం
పారిస్ :పర్యావరణ పరిరక్షణ కోసం ఫ్రాన్స్ దేశం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో ప్లాస్టిక్ కప్పులు, ప్లేట్లను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ తరహా నిషేధం విధించిన ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా అవతరించింది.అలాగే ఒక కొత్త చట్టాన్ని కూడా ప్రభుత్వం తీసుకురానుంది. 2020 సం.రానికి డిస్పోజబుల్ వస్తులన్నింటీనీ 50శాతం జీవశాస్త్ర మూలం పదార్థాల నుంచి తయారు చేయాలనే చట్టాన్ని తీసుకురానుంది. వినియోగం తర్వాత వీటిని ఇంటిదగ్గరే కంపోస్ట్ చేసేలా తయారు చేయాలని ఆదేశించనుంది. ఈ పరిమితిని 2025 జనవరి నాటికి ఈ శాతాన్ని 60కి పెంచనుంది. మరోవైపు ఫ్రాన్స్ ప్రభుత్వ నిర్ణయం మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి. దీనిపై పలువురు సంతోసం వ్యక్తం చేసినప్పటికీ, ముఖ్యంగా పరిశ్రమ వర్గాలనుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నిర్ణయం ఈయూ దేశాల చట్టాల ఉల్లంఘన అని వాదిస్తున్నాయి. దీనిపై ఈయు కమిషన్ ను ఆశ్రయించాయి. బయో ప్లాస్టిక్ వస్తువులకు తాము వ్యతిరేకులం కాదనీ, కానీ శాస్త్రీయ ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలని కోరారు. గత ఏడాది డిశెంబర్ లో వాతావరణ మార్పు పై ప్యారిస్ సీఓపీ 21 శిఖరాగ్ర సమావేశం సదస్సు విజయవంతం తర్వాత ఎన్విరాన్మెంటల్ అండ్ ఎనర్జీ సొల్యూషన్స్ లో గ్లోబల్ లీడర్ గా ఎదగాలని యోచిస్తోంది. మరోవైపు ప్రతి సెకనుకు దాదాపు 150 ప్లాస్టిక్ కప్పుల చొప్పున, సంవత్సరానికి 4.37 బిలియన్ కప్పులను వాడి పారేస్తున్నట్టు ఫ్రెంచ్ అసోసియేషన్ ఆఫ్ హెల్త్ అండ్ ఎన్విరాన్ మెంట్ నివేదికలు చెబుతున్నాయి. కాగా ప్లాస్టిక్ బ్యాగుల నిషేధంలో బంగ్లాదేశ్ ముందుంది. భారీ వరదల్లో డ్రైనేజీలను ప్లాస్టిక్ బ్యాగులు మంచెత్తేయడంతో...2002లోనే దేశంలో వీటిని నిషేధించింది. అనంతరం దక్షిణ ఆఫ్రికా, కెన్యా, చైనా, మెక్సికో,రువాండా ఇదే బాటలో నడిచాయి. మరికొన్ని దేశాల్లో ఈ ప్లాస్టిక్ వాడకంపై కొన్ని ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలోనే గత జూలైలో తేలికపాటి ప్లాస్టిక్ బ్యాగులను నిషేధించింది. -
ఆకాశంలో బీభత్సానికి ఐసిస్ ప్లాన్
- వైమానిక దాడులను తిప్పికొట్టేందుకు ఉగ్రసంస్థ కొత్త ఎత్తుడడలు మోసూల్: సిరియా, ఇరాక్‌లలోని తమ ప్రభావిత ప్రాంతంపై పట్టును పెంచుకునే క్రమంలో ఐసిస్ ఉగ్రవాద సంస్థ కొత్త ఎత్తుగడలను రచిస్తోంది. తన పాలిట వినాశనకారిగా మారిన వైమానిక దాడులను తిప్పికొట్టేందుకు కొత్త తరహాలో ఆకాశ బాంబులను ప్రయోగిస్తోంది. పేలుడు పదార్థాలు, హైడ్రోజన్ ను ప్లాస్టిక్ సంచులు, కండోమ్‌లలో నింపి, ఆకాశంలోకి పంపి వాటి ద్వారా శత్రుదేశాల యుద్ధవిమానాలను నేల కూల్చడం ఎలాగో తన సైన్యానికి నేర్పుతోంది. దీనికి సంబంధించిన కీలక వీడియో ఒకటి ఇటీవలే వెలుగలోకి వచ్చింది. అబూ అయూబ్ అల్ బాగ్ధాది అనే ఐసిస్ టెక్ శావి 'Dropping Fighter Jets in the Lands of the Islamic State' పేరుతో రూపొందిచిన వీడియోలో ఈ ఆకాశ బాంబుల తయారీకి సంబంధించిన వివరాలను పొందుపర్చారు. సాధారణంగా ఇంట్లో వాడుకునే వస్తువుల ద్వారా హైడ్రోజన్ వాయువును తయారుచేయడం మొదలు ప్లాస్టిక్ సంచుల్లో పేలుడు పదార్థాలను కూర్చడం, ఆ తర్వాత హైడ్రోజన్ ను నింపి, ఆకాశంలోకి వదలడం వరకు అన్ని విషయాలను పూసగుచ్చినట్లు వీడియోలో వివరించారారు. ఇలా తయారుచేసిన వందలకొద్దీ ఆకాశ బాంబులను తన గగనతలంలోకి పంపడం ద్వారా శత్రుదేశ యద్ధవిమానాలను రానీయకుండా చేయాలనేది ఐసిస్ ప్రణాళిక. ఆకాశ బాంబుల్లో నింపే హైడ్రోజన్ పరిమాణాన్ని బట్టి రకరకాల ఎత్తుల్లో వీటిని మోహరింపజేస్తారు. అటుగా ఏదైన ఫైటర్ జెట్ దూసుకొచ్చి ఈ ప్లాస్టిక్ బ్యాగ్ లను తాకగానే పేలిపోతాయి. గత ఏడాది విడుదలైన కొన్ని వీడియోల్లో ఐసిస్ జిహాదీలు కొందరు పెద్ద ఎత్తున కండోమ్స్ గాలిలోకి ఎగురవేస్తున్న దృశ్యాలు కనిపించాయి. అయితే కండోమ్ పరిమాణం చిన్నది కావడంతో వాటి స్థానంలో మధ్య, పెద్ద స్థాయి ప్లాస్టిక్ బ్యాగ్స్ లో పేలుడు పదార్థాలను పైకి వదులుతున్నారు. ఈ ఆకాశ బాంబుల ద్వారా ఇప్పటికే సిరియన్ ప్రభుత్వ దళాలకు చెందిన యుద్ధ విమానాన్ని నేల కూల్చినట్లు ఐసిస్ చెప్పుకుంటోంది. -
సీఎం సభలో వినూత్న ప్రయోగం
రాజ్‌కోట్: గుజరాత్ సీఎంగా విజయ్ రూపానీ హాజరైన సభలో పటీదార్ అనామత్ ఆందోళన సమితి(పీఏఏఎస్) కార్యకర్తలు నిరసన తెలపకుండా నిర్వాహకులు వినూత్న ప్రయోగం చేశారు. జాస్దాన్ తాలుకాలోని ఆట్కోట్ గ్రామంలో మల్టీస్పెషాలిటీ ఆస్పత్రికి విజయ్ రూపానీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు 25 వేల మంది హాజరైయ్యారు. పటేల్ సామాజిక వర్గానికి పట్టున్న ప్రాంతం కావడంతో సభకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 25 మంది పీఏఏఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. సభలో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ కుర్చీలను ఒకదానితో ఒకటి తాళ్లతో కట్టేశారు. ఇలా ఎందుకు కట్టారే అర్థంకాక సభకు హాజరైన వారు జుట్టుపీక్కున్నారు. పీఏఏఎస్ కార్యకర్తలు ఆందోళన చేయకుండా పోలీసులు ఇలా చేశారని తెలుసుకుని ముక్కుపై వేలేసుకున్నారు. అంతకుముందు సూరత్ లో విజయ్ రూపానీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పాల్గొన్న సభలో ప్లాస్టిక్ కుర్చీలను విసిరేసి పీఏఏఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈసారి అలాంటి అవకాశం ఇవ్వకూడదన్న ఉద్దేశంతో కుర్చీలను పోలీసులు తాళ్లతో కట్టేశారు. అంతేకాదు కుర్చీలు కూడా తక్కువగా వేశారు. ఎక్కువ మందిని కార్పెట్ మీద కూర్చొబెట్టారు. -
ప్లాస్టిక్‌ను నిషేధించాల్సిందే?
వందశాతం అమలుకు బల్దియా చర్యలు కవర్లు వాడితే భారీగా జరిమానాలు మెదక్: క్యాన్సర్ వ్యాధికి కారణమవుతూ పర్యావరణానికి పెనుముప్పుగా మారిన తక్కువ మైక్రాన్ల ప్లాస్టిక్ కవర్ల నిషేధాన్ని పకడ్బంధీగా అమలు చేసేందుకు మెదక్ బల్దియా సన్నద్ధమైంది. ఈ ఏడాది అక్టోబర్ 2 గాంధీ జయంతి నాటికి పట్టణంలో వందశాతం తక్కువ మైక్రాన్ల ప్లాస్టిక్ కవర్ల నిషేధం అమలు చేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. 40 మైక్రాన్లలోపు ఉన్న ప్లాస్టిక్ కవర్లను వినియోగించడం పర్యావరణానికే కాకుండా మానవాళి ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. దీంతో తక్కువ మైక్రాన్ల ప్లాస్టిక్ కవర్లను వినియోగించడంపై ప్రభుత్వం గతంలోనే నిషేధం విధించింది. అయితే అంతటా నిర్లక్ష్యం అలుముకోవడంతో వాటి నిషేధం పూర్తి స్థాయిలో అమలు కాలేదు. దీంతో తక్కువ మైక్లాన్ల కవర్ల వాడకాన్ని పకడ్బంధీగా నిలువరించేందుకు బల్దియా నడుం బిగించింది. ఈ నేపథ్యంలో నిషేధం అమలులో ఉన్నా అక్రమంగా ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తున్న షాపుల యజమానులపై భారీగా జరిమానాలు విధిస్తున్నారు. రాష్ట్రంలో ప్లాస్టిక్ నిషేధం కోసం బల్దియాలు కృషి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే మున్సిపాలిటీలకు ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 18న మెదక్ ఖిల్లా బల్దియా అధికారులతోపాటు మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్, వైస్చైర్మన్లతో స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పలు అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో ముఖ్యంగా పర్యావరణానికి పెను సవాలుగా మారిన ప్లాస్టిక్ కవర్లను వందశాతం నిషేధించి, ప్లాస్టిక్ రహిత పట్టణాన్ని నెలకొల్పాలని తీర్మానం చేశారు. మున్సిపల్ శానిటేషన్ అధికారులు ప్లాస్టిక్ కవర్లను వినియోగించే షాపుల యజమానులపై భారీ మొత్తంలో జరిమానాలు విధిస్తూ వందశాతం నిషేధం అమలుకు కృషి చేస్తున్నారు. అలాగే రోడ్లపై షాపుల యజమానులు నిత్యం చెత్తా చెదారం పడేయడంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని ప్రతీ షాపు యజమాని చెత్తను బుట్టలోనే వేసి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలన్నారు. ఇందుకోసం పట్టణంలోని డిపో రోడ్డు, జే.ఎన్ రోడ్డుతోపాటు మున్సిపాలిటీ ముందున్న రోడ్లను ఎంపిక చేశారు. మున్సిపాలిటీ ఆదేశాలు పాటించని షాపులపై భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. ప్లాస్టిక్ బ్యాగుల వాడకానికి బదులు న్యూస్ పేపర్‌తో తయారు చేసే బ్యాగులను ఉపయోగించాలని నిర్ణయించారు. ఈ బ్యాగుల తయారీ కోసం ఇప్పటికే మెప్మా అధికారులు సంగారెడ్డికి వెళ్లి దాని తయారీని క్షుణ్ణంగా తెలుసుకొని వచ్చినట్లు తెలిసింది. కాగా పట్టణంలోని మహిళా గ్రూప్ సభ్యులకు పేపర్ బ్యాగుల తయారీపై శిక్షణ ఇచ్చి వాటిని తయారు చేయించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. బ్యాగుల తయారీతో మహిళా సంఘాల సభ్యులకు జీవనోపాధి లభించడంతోపాటు పట్టణంలో వందశాతం ప్లాస్టిక్ నిషేధం అమలవుతుందని అధికారులు భావిస్తున్నారు. మహిళా సంఘాల సభ్యులు తయారు చేసిన ఈ పేపర్ బ్యాగులను అన్ని షాపుల యజమానులు కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టనున్నట్లు మున్సిపల్ అధికారులు పేర్కొంటున్నారు. ప్రజలు సహకరించాలి ప్లాస్టిక్ రహిత పట్టణం కోసం ప్రజలంతా సహకరించాలి. ప్లాస్టిక్‌తో క్యాన్సర్ వ్యాధితోపాటు పర్యావరణ సమతుల్యత దెబ్బతిని కరువు, కాటకాలకు కారణమవుతోంది. ప్లాస్టిక్‌తో ఇంతటి ప్రమాదం పొంచి ఉన్నందున దీని వాడకాన్ని పూర్తిగా తగ్గించాలి. దీనికి ప్రజలంతా సహకరించాలి. - మల్లికార్జున్‌గౌడ్, మున్సిపల్ చైర్మన్, మెదక్ ప్లాస్టిక్ కవర్లు వాడితే కఠిన చర్యలే మానవ మనుగడకు పెనుముప్పుగా తయారైన ప్లాస్టిక్‌ను మెదక్ పట్టణంలో పూర్తిగా నిషేధించాం. నిబంధనలకు విరుద్ధంగా ఎవరు ప్లాస్టిక్ వాడినా కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే పట్టణంలో షాపులు, హోటళ్లపై దాడులుచేసి జరిమానాలు విధించాం. అక్టోబర్ 2వరకు వందశాతం నిషేధం అమలు చేస్తాం. - షాదుల్లా, శానిటేషన్ అధికారి, మెదక్ పేపర్ బ్యాగుల తయారీలో మహిళలు ముందుండాలి పట్టణంలో ప్లాస్టిక్‌ను నిషేధిస్తున్నందున పేపర్ బ్యాగుల తయారీ విధానం తెలుసుకునేందుకు మెప్మా అధికారులను ఇప్పటికే సంప్రదించాం. త్వరలోనే మహిళా సంఘాల సభ్యులకు వాటి తయారీపై శిక్షణ ఇప్పిస్తాం. పేపర్ బ్యాగుల తయారీతో ఆదాయం సమకూరుతుంది. దీనికోసం మహిళలకు రుణాలిస్తాం. - ప్రసాదరావు, మున్సిపల్ కమిషనర్, మెదక్ -
ప్లాస్టిక్ రహిత పట్టణాలుగా తీర్చిదిద్దాలి
మహబూబ్‌నగర్ న్యూటౌన్ : అన్ని మున్సిపాలిటీలను ప్లాస్టిక్, ఫ్లెక్సీ రహిత పట్టణాలుగా తీర్చిదిద్దాలని సీడీఎంఏ దాన కిశోర్ సూచించారు. సోమవారం హైదరాబాద్ నుంచి మున్సిపల్ అధికారులతో వీడియోకాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటికీ చెత్త సేకరణను వందశాతం అమలు చేయాలన్నారు. నిర్దేశించిన లక్ష్యం ప్రకారం హరితహారం కార్యక్రమంలో విరివిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. ప్రతీ మున్సిపాలిటీలో రెండుకు తగ్గకుండా మహిళా మరుగుదొడ్లు నిర్మించాలన్నారు. ఆయా మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ బయోమెట్రిక్ హాజరును తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమానికి మహబూబ్‌నగర్, ఐజ మున్సిపల్ కమిషనర్లు భూక్యాదేవ్సింగ్, వెంకన్న, ఇంజనీరింగ్ విభాగం అధికారులు హాజరయ్యారు. -
‘ప్లాస్టిక్’ దుకాణాలపై దాడులు
మెదక్: పట్టణంలో బుధవారం మున్సిపల్ శానిటేషన్ అధికారులు పలు దుకాణాలపై దాడులు నిర్వహించి ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకొని జరిమాన విధించారు. ఈ సందర్భంగా మున్సిపల్ శానిటేషన్ అధికారి షాదుల్లా మాట్లాడుతూ ప్లాస్టిక్ కవర్లను ఎవరూ వాడిన సహించేది లేదని ఆయన హెచ్చరించారు. క్యాన్సర్‌కు కారణమవుతున్న ప్లాస్టిక్‌ను మెదక్ పట్టణంలో పూర్తిగా నిషేదించడం జరిగిందన్నారు. అక్రమంగా ప్లాస్టిక్ కవర్లు వాడుతున్న పలు దుకాణాలపై దాడులు చేసి రూ.20100 జరిమాన విధించడం జరిగిందన్నారు.దాడులు నిరంతరం కొనసాగుతాయని ఆయన తెలిపారు. ఆయన వెంట మున్సిపల్ సిబ్బంది శేఖర్, కిషన్, శ్యామ్ తదితరులు ఉన్నారు. -
ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌ల విక్రయాలపై తనిఖీలు
ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ ల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు శేరిలింగంపల్లి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వి.వి.మనోహర్ గురువారం తెలిపారు. 40 మైక్రాన్ల లోపు సామర్ధ్యం ఉన్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌లను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. సర్కిల్ పరిదిలోని మార్కెట్లు, వ్యాపార సముదాయాల్లో ఎంత సామర్ధ్యం ఉన్న బ్యాగ్‌లను విక్రయిస్తున్నారో పరిశీలించేందుకు తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 40 మైక్రాన్ల కన్నా సామర్ధ్యం తక్కువ ఉన్న కవర్లు విక్రయిస్తే వారిపై ఫైన్లు విధిస్తామని హెచ్చరించారు. -
ప్లాస్టిక్ పనిపట్టేస్తారా?
నగరాన్ని కమ్మేస్తున్న ఫ్లెక్సీలు గుట్టలుగా పేరుకుపోతున్న వ్యర్థాలు బహిరంగంగా ప్లాస్టిక్‌సంచుల విక్రయాలు కరీంనగర్ కార్పొరేషన్ : ప్లాస్టిక్ కవర్ చేతిలో పట్టుకోవడం ఫ్యాషన్‌గా మారింది. ఏ వస్తువు కొనుగోలు చేసినా దుకాణదారులు ఓ కవర్లో పెట్టి మన చేతికి అందిస్తున్నారు. వాటిని ఎక్కడ పడితే అక్కడ పారేస్తుండడంతో ప్లాస్టిక్ గుట్టలు తయారవుతున్నాయి. వందల ఏళ్లపాటు భూమిలో కలవని ఈ ప్లాస్టిక్ పర్యవరణానికి ముప్పుగా పరిణమించింది. భావితరాలకు స్వచ్ఛమైన గాలి, వాతావరణం, మంచి నేల అందించాలంటే ప్లాస్టిక్ నియంత్రణపై ఇప్పటికైన మున్సిపల్ అధికారులు దష్టిసారించాల్సిందే. పాలిథీన్మయం పాలు, కూరగాయలు, పండ్లు, నూనెలు, స్వీట్స్, చివరికి మెుక్కజొన్న కంకులు సైతం ప్లాస్టిక్ ప్యాకెట్లలో ప్యాక్ చేసేస్తున్నారు. మటన్, చికెన్, చేపలు ఇలా ఏది తీసుకెళ్లాలన్నా ప్లాస్టిక్ సంచులే దిక్కుగా మారాయి. చివరకు శుభకార్యాల్లో సైతం ప్లాస్టిక్ కవర్‌తో తయారు చేసిన విస్తరిలోనే భోజనం వడ్డిస్తున్నారు. శరీరంలోకి చేరిన పాలిథీన్ వ్యర్థాలు ఆయువును హరిస్తున్న విషయాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. పలు వ్యాధులకు కారణం పాలిథీన్ వెయ్యేళ్ల వరకు భూమిలో కలిసిపోకుండా పలు నష్టాలకు కారణంగా మారుతుంది. వర్షపునీరు భూగర్భజలంగా మారకుండా అడ్డుకుంటుంది. పాలిథీన్ కాల్చగా బయాక్సిన్, ప్యూరాన్ వంటి విషవాయువులు వెలువడుతున్నాయి. వీటిని పీల్చినవారు కేన్సర్ బారినపడే ప్రమాదముంది. రంగురంగుల సంచుల తయారీలో వాడే సీసం, కాడ్మియం నరాల బలహీనతకు దారితీస్తుంది. నిషేధం ఉన్నా పాలిథీన్ కవర్లు అమ్మితే జరిమానా విధించాల్సి ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో నగరంలో బహిరంగంగానే పాలిథీన్ కవర్లు విక్రయిస్తున్నారు. ప్లాస్టిక్‌ను నియంత్రించిన ప్రతిసారీ వ్యాపారులకువరంగా మారి వాటి ధరలకు రెక్కలొస్తున్నాయి. అడ్డగోలుగా ఫ్లెక్సీలు ముఖ్య నేతల పర్యటనలు, పుట్టిన రోజు, పెళ్లిరోజు, బహిరంగసభలు ఏవైనా ఫ్లెక్సీలు ఉండాల్సిందే. మున్సిపాలిటీకి ఒక్క రూపాయి పన్ను చెల్లించకుండా ఫ్లెక్సీ పెడుతున్న నియంత్రించడం లేదు. ఒకటి, రెండు రోజుల కోసం కట్టే ప్లెక్సీలన్నీ డంప్‌యార్డుకు చేరి, పర్యావరణాన్ని విషతుల్యం చేస్తున్నాయి. ఇటీవల మంత్రి కేటీఆర్ పర్యటనకు ముందే ఒక్క ప్లెక్సీ కూడా కట్టవద్దంటూ ఆదేశించారు. దీంతో మున్సిపాలిటీల సదస్సు ఆర్భాటం లేకుండా జరిగింది. అవగాహనే ముఖ్యం జీవకోటికి ప్రాణాంతకమైన పాలిథీన్ వాడకంతో ఎన్నో అనర్థాలను ఎదుర్కొంటున్నాం. దీన్ని ప్రజలకు వివరించి వారిని చైతన్యపరచాలి. జనపనార, బట్ట సంచులు వినియోగించడం ద్వారా ప్లాస్టిక్ కవర్లను వాడకుండా చేయవచ్చు. మహిళా సంఘాలు, యువతకు జనపనార, కాగితపు సంచుల తయారీలో శిక్షణ ఇచ్చి కుటీర పరిశ్రమలకు ప్రోత్సాహం అందజేయాలి. అదేవిధంగా నిషేధిత ప్లాస్టిక్ విక్రయదారులపై కఠిన చర్యలు చేపట్టాలి. నిషేధం అమలుపై దష్టి సారిస్తున్నాం – రవీందర్‌సింగ్, నగరమేయర్ నిషేధిత పాలిథీన్ కవర్ల వినియోగించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మంత్రి కేటీఆర్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తాం. ప్లాస్టిక్ కవర్లు విక్రయిస్తే జరిమానాలు విధిస్తాం. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు చేపడతాం. -
జూలై 31 డెడ్‌లైన్
హైదరాబాద్ : పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్న ప్లాస్టిక్ కవర్ల వినియోగంపై జీహెచ్ఎంసీ యంత్రాంగం ఆంక్షలు విధించింది. జూలై 31వ తేదీ నుంచి ఇవి అమల్లోకి రానున్నట్లు కమిషనర్ జనార్దన్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. 40 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ కవర్ల తయారీ, వినియోగాన్ని నగరంలో నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. గడువు దాటిన తర్వాత కూడా వీటిని తయారు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే వినియోగదారులపైనా చర్యలుంటాయన్నారు. -
ప్లాస్టిక్ కోర్సులకు కేరాఫ్ సిపెట్
సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (సిపెట్).. ప్లాస్టిక్ సంబంధిత కోర్సులు అభ్యసించాలనుకునే అభ్యర్థులకు చక్కటి విద్యా సంస్థ. కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఈ సంస్థ పదో తరగతి ఉత్తీర్ణుల నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణుల వరకు వివిధ కోర్సులందిస్తోంది. చెన్నై ప్రధాన కేంద్రంగా ఉన్న సిపెట్‌కు హైదరాబాద్ (చర్లపల్లి)లో కూడా క్యాంపస్ ఉంది. ప్రస్తుతం వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో సిపెట్ కోర్సులు, అర్హతలు తదితర వివరాలు.. ఇంజనీరింగ్ స్పెషల్ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ, మారుతున్న అవసరాలకనుగుణంగా ప్లాస్టిక్ వాడకం నానాటికీ పెరుగుతోంది. పిల్లల పాల డ బ్బా, ఆడుకునే వస్తువులు మొదలుకుని పెద్దలకు ఊతాన్నిచ్చే స్టిక్ వరకు ప్రతీది పాలిమర్ సమ్మేళనమే. రాదేదీ ప్లాస్టిక్‌కు సాటి అనే చందంగా.. గతంలో మాదిరిగా సాదాసీదా వ్యవహారంలా కాకుండా ప్లాస్టిక్ రంగం ఇప్పుడు ప్రొఫెషన్ రూపును సంతరించుకుంటోంది. దీంతో ప్లాస్టిక్‌లో ఇంజనీరింగ్, డిప్లొమా కోర్సులను అభ్యసించినవారికి డిమాండ్ పెరుగుతోంది. ఈ విభాగంలో నిపుణులను తీర్చిదిద్దే ఉద్దేశంతో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (సిపెట్) హైదరాబాద్ క్యాంపస్ వివిధ కోర్సుల్లో శిక్షణ అందిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న డిమాండ్ వ్యవసాయ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న తెలుగు రాష్ట్రాల్లో ప్లాస్టిక్‌కి ప్రాధాన్యత పెరుగుతోంది. వాటర్ గ్రిడ్, మిషన్ కాకతీయ, చెరువుల పునరుద్ధరణ .. వంటి కార్యక్రమాల్లో దాదాపు 85 శాతం ప్లాస్టిక్ సంబంధిత మెటీరియల్స్‌నే వాడుతున్నారు. వీటితోపాటు కూరగాయలు, పండ్లను ప్యాకింగ్ చేసే ట్రేలు, వరి నాట్లు, పాల శుద్ధికి ఉపయోగించే వస్తువులు.. ఇలా ఒకటేంటి దాదాపు వ్యవసాయ రంగంలో అధికంగా ప్లాస్టిక్ వస్తువులే కీలక పాత్ర పోషిస్తున్నాయి. దీంతో అనేక రకాల ప్లాస్టిక్ తయారీ సంస్థల్లో ఉద్యోగుల అవసరం పెరుగుతోంది. అనేక విభాగాల్లో కోర్సులు మార్కెట్, పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుకోర్సులున్నాయి. డిజైన్/టూలింగ్/క్యాడ్/ సీఏఎం/సీఎన్సీ ప్రోగ్రామ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్/ ప్రాసెసింగ్ ఆఫ్ ప్లాస్టిక్స్/మెషీన్ మెయింటనెన్స్, టెస్టింగ్ - క్వాలిటీ ఇంప్రూవ్మెంట్, వెల్డింగ్ - ఫ్యాబ్రికేషన్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, హార్డ్‌వేర్ -నెట్వర్కింగ్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్లున్నాయి. అవకాశాలు ఏటా దాదాపు ఐదు వేల మందికి శిక్షణ ఇస్తున్నారు. వీరిలో 85 శాతం మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. కొంతమంది స్వయం ఉపాధి దిశగా సాగుతున్నారు. సౌదీ అరేబియా, యూఏఈ కంపెనీలకు సగానికి పైగా ఎంపికవుతున్నారు. వీటితోపాటు జైన్, సుధాకర్ పైప్స్, గోదావరి పాలిమర్స్, నాగార్జున గ్రూప్.. క్యాంపస్ ప్లేస్మెంట్లు కల్పిస్తున్నాయి. గతేడాది అమెరికాకు చెందిన అప్తార్ కంపెనీకి 65 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఇలా కోర్సు నేర్చుకున్న ప్రతీ ఒక్కరు ఉద్యోగాలు పొందుతున్నారు. ప్లాస్టిక్ అనేది కామన్ మ్యాన్ మెటీరియల్, తక్కువ ధరకే లభించే వస్తువు. దీంతో ఈ రంగంలో మానవ వనరుల ఆవశ్యకత పెరుగుతోంది. రెగ్యులర్ డిగ్రీ కోర్సుల కంటే సిపెట్ అందించే కోర్సుల్లో డిగ్రీ/డిప్లొమా చేసిన వారికి ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శిక్షణ పొందేవారిలో అర్హత గల విద్యార్థులకు స్కాలర్షిప్ సదుపాయాన్ని కల్పిస్తున్నాం. అనేక మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్లాస్టిక్ రంగంలో శిక్షణ ఇచ్చివారిని ప్రోత్సహిస్తున్నాం. ప్రతిభావంతులైన ఐదుగురు విద్యార్థులకు మా సంస్థలోనే ఉద్యోగం ఇస్తాం. ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఇద్దరు విద్యార్థులకు ప్రత్యేకంగా స్కాలర్‌షిప్‌ని అందిస్తున్నాం. వి. కిరణ్‌కుమార్, చీఫ్ మేనేజర్ సిపెట్, హైదరాబాద్ కోర్సుల వివరాలు సిపెట్ హైదరాబాద్ క్యాంపస్.. డిప్లొమా, పోస్ట్ డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రామ్‌లలో శిక్షణ ఇస్తోంది. ప్రస్తుతం ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ప్లాస్టిక్ ప్రాసెసింగ్ టెస్టింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా (పీజీడీ-పీపీటీ) అర్హత: కెమిస్ట్రీ ఒక సబ్జెక్టుగా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. వ్యవధి: ఏడాదిన్నర వయసు: 25 ఏళ్లకు మించకూడదు. క్యాడ్/ క్యామ్‌తో ప్లాస్టిక్స్ మౌల్డ్ డిజైన్‌లో పోస్ట్ డిప్లొమా (పీడీ-పీఎండీ విత్ క్యాడ్/ క్యామ్) అర్హత: డిప్లొమా ఇన్ మెకానికల్/ప్లాస్టిక్ టెక్నాలజీ/ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ /మెకట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ / టూల్ అండ్ డై మేకింగ్/ డీపీఎంటీ/డీపీటీ లేదా తత్సమాన కోర్సుల్లో ఉత్తీర్ణత. వ్యవధి: ఏడాదిన్నర వయసు: 25 ఏళ్లకు మించకూడదు. ప్లాస్టిక్ మౌల్డ్ టెక్నాలజీలో డిప్లొమా (డీపీఎంటీ) ప్లాస్టిక్ టెక్నాలజీలో డిప్లొమా (డీపీటీ) అర్హత: 10వ తరగతి వ్యవధి: మూడేళ్లు వయసు: 20 ఏళ్లకు మించకూడదు అన్ని కోర్సుల్లో ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది. దరఖాస్తుల విక్రయానికి చివరి తేది: మే 6 దరఖాస్తుకు చివరి తేది: మే 13 జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్: జూన్ 5 వెబ్సైట్: www.cipet.gov.in ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి పాస్/ ఫెయిల్ విద్యార్థులకు షార్ట్ టర్మ్ కోర్సుల ద్వారా శిక్షణ అందిస్తున్నారు. ఈ కోర్సులు రెండు నుంచి మూడు నెలల వ్యవధి ఉంటాయి. -
ఇంటిప్స్
అరటిపండు త్వరగా మగ్గిపోకుండా, క్రిములు లోపలికి వెళ్లకుండా ఉండాలంటే ముచ్చిక దగ్గర ప్లాస్టిక్ కవర్ చుట్టాలి. ♦ ఐస్‌క్రీమ్ డబ్బాను ప్లాస్టిక్ కవర్లో వేసి, చుట్టి డీప్‌ఫ్రిజ్‌లో ఉంచితే అడుగున అతుక్కుపోదు. ఐస్‌క్రీమ్ కూడా మరీ గట్టిగా కాకుండా స్పూన్‌తో తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. ♦ కప్పు నీళ్లు, టేబుల్ స్పూన్ నిమ్మరసం, టేబుల్ స్పూన్ బేకింగ్ సొడా స్ప్రే బాటిల్లో పోసి షేక్ చేయాలి. పండ్లు, కూరగాయల మీద స్ప్రే చేసి, పది నిమిషాల తర్వాత నీటితో శుభ్రపరుచుకోవాలి. రసాయనాల గాఢత తగ్గుతుంది. క్రిములు నశిస్తాయి. -
ప్లాస్టిక్ బాటిళ్లతో ఇళ్లు!
కెనడా: ప్లాస్టిక్‌తో పర్యావరణానికి తీరని నష్టం జరుగుతుందని తెలుసు. ఈ ప్లాస్టిక్ మహమ్మారి నుంచి తప్పించుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కాదు. ప్లాస్టిక్‌ను వదిలించుకునేందుకు కెనడాకు చెందిన వ్యాపారవేత్త రాబర్ట్ బీజూ ఓ వినూత్న ప్రయత్నం చేపట్టాడు. పనామాలోని ఓ అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్ చెత్త ముఖ్యంగా ప్లాస్టిక్ బాటిళ్లతో ఏకంగా ఓ గ్రామాన్నే కట్టేయాలని సంకల్పించాడు. ప్లాస్టిక్‌తో వచ్చే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని బీజూ చెబుతున్నాడు. ప్లాస్టిక్ బాటిల్ విలేజి పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో భాగంగా మొత్తం 83 ఎకరాల్లో 90 నుంచి 120 ఇళ్లు నిర్మించాలన్నది ప్రాజెక్టు లక్ష్యం. ఇనుప చట్రం లోపల ప్లాస్టిక్ బాటిళ్లను ఉంచి గోడలు, ఇతర నిర్మాణాలు చేపడతారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి దాదాపు 10 వేల నుంచి 25 వేల బాటిళ్లు అవసరమవుతాయని అంచనా. అతి చౌకగా, చాలా వేగంగా కట్టగలిగే ఈ ఇళ్లలో బయటి వేడి లోపలికి రాదని చెబుతున్నాడు. గ్రామంలో ఓ హోటల్, సూపర్‌మార్కెట్ వంటి ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేసిన తరువాత ఇళ్లను అమ్మకానికి పెడతానని బీజూ పేర్కొంటున్నాడు. ఒక్కో ఇల్లుకు రూ.1.5 లక్షల డాలర్ల నుంచి మూడు లక్షల డాలర్లు అవుతుందని అంచనా. -
ప్లాస్టిక్ కవర్లో మృతదేహం
హైదరాబాద్ : జీడిమెట్లలోని ఓ నిర్జన ప్రదేశంలో గుర్తుతెలియని మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ప్లాస్టిక్ కవర్లో చుట్టి చెత్తాచెదారంలో పడేసి ఉన్న పురుషుడి మృతదేహం (సుమారు 55 సంవత్సరాలు) గురువారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. దర్యాప్తు చేస్తున్నారు. -
ప్లాస్టిక్ ఆధార్ అవసరం లేదు
సాధారణ కాగితంపై ఉంటే సరిపోతుంది: కేంద్రం సాక్షి, హైదరాబాద్: ప్లాస్టిక్ కార్డు మీద ఆధార్ ముద్రణ, స్మార్ట్ ఆధార్ కార్డుల పేరిట కొందరు ప్రైవేటు వ్యక్తులు చేస్తున్న ప్రచారం మోసపూరితమని, ఇలాంటి వారి మాటలు నమ్మి వ్యక్తిగత సమాచారం ఇవ్వొద్దని ప్రజలను కేంద్రం హెచ్చరించింది. ఆధార్ లేఖ/కత్తిరించిన భాగం/సాధారణ కాగితంపై డౌన్లోడ్ చేసుకున్న ఆధార్ వివరాలు సమగ్రంగా ఉంటే చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేసింది. ప్లాస్టిక్ ఆధార్ కార్డులు, స్మార్ట్ ఆధార్ పేరుతో ప్రజల నుంచి రూ.50 నుంచి రూ.200ల వరకు వసూలు చేస్తున్న వారితో కేంద్రానికి సంబంధం లేదని పేర్కొంది. స్మార్ట్ ఆధార్ అంటూ ఏదీ లేదని యూఐడీఏఐ మిషన్ డెరైక్టర్ అజయ్ భూషణ్ పాండే బుధవారం ఓ ప్రకటనలో చెప్పారు. ఆధార్ కార్డు పోగొట్టుకున్న వారు https://eaadhaar.uidai.gov.in/ వెబ్సైట్ నుంచి ప్రింట్ తీసుకోవచ్చని తెలిపారు. ప్లాస్టిక్ ఆధార్‌కార్డులు, లామినేషన్ చేయడం వంటివి అవసరం లేదన్నారు. ప్లాస్టిక్ కార్డుపై ఆధార్, లామినేటెడ్ ఆధార్ కార్డును అధికారిక ఆధార్ కేంద్రాల నుంచి రూ.30 కంటే తక్కువ ధరకు పొందవచ్చని సూచించారు. -
ఆ బుడతడి కల నెరవేరింది!
ఐదేళ్ల ముర్తాజా అహ్మది 'మెస్సీ'పై తనకున్న అభిమానంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలమంది హృదయాలు కొల్లగొట్టాడు. అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ వీరాభిమాని అయిన ఈ చిన్నారి.. అతని టీ షర్ట్ మాదిరి ప్లాస్టిక్ బ్యాగ్‌ను ధరించి.. యుద్ధబాధిత ఆఫ్గానిస్థాన్‌లో ఫుట్‌బాల్ ఆడుతూ కనిపించాడు. అతని ఫొటోలు నెట్టింట్లోకి రావడంతోనే ఎంతోమంది దృష్టిని ఆకర్షించాయి. నీలం, తెలుపు రంగుల్లో ఉన్న ప్లాస్టిక్ బ్యాగ్‌పై 'మెస్సీ'తోపాటు అతని జెర్సీ నంబర్ 10ని రాసి.. మొర్తాజా ధరించాడు. ఫుట్‌బాల్ సూపర్ స్టారైన లియోనల్ మెస్సీ కూడా నీలం, తెలపు రంగుల్లోని జెర్సీనే ధరిస్తాడు. దీంతో మొర్తాజా ఫొటోలు ఆన్లైన్లో ఒక్కసారిగా హల్చల్ చేశాయి. మొర్తాజా ఎవరూ అన్న అన్వేషణ ఫుట్‌బాల్ అభిమానుల్లో మొదలైంది. ఈ వార్త స్వయంగా మెస్సీకి కూడా చేరడంతో.. ఆ బుడతడిని కలువాలని ఆయన కూడా ముచ్చటపడ్డారు. ఎట్టకేలకు మొర్తాజా యుద్ధబాధిత ఆఫ్గానిస్థాన్‌లోని ఓ మారుమూల పల్లెలో తేలాడు. ఒకప్పుడు తాలిబన్ నియంత్రణలో ఈ ప్రాంతంలో ఆటలకు ఎంతమాత్రం తావు లేదు. అయినా ఇక్కడి చిన్నారులు క్రికెట్ అన్నా, ఫుట్‌బాల్ అన్న పడిచస్తారు. అలా చిన్నప్పుడు 'మెస్సీ'కి మొర్తాజా వీరాభిమాని అయిపోయాడు. తమ్ముడి అభిమానాన్ని సంతృప్తిపరిచేందుకు తన దగ్గరున్న ప్లాస్టిక్ బ్యాగుతో 'మెస్సీ' టీ షర్ట్ మాదిరి చొక్కాను రూపొందించి ఇచ్చాడు అతని సోదరుడు 15 ఏళ్ల హమయోన్. ఆ చొక్కాను ధరించి ఆనందంతో ఫుట్‌బాల్ ఆడుతున్న మొర్తాజా ఫొటోలు ఆన్లైన్లో ఏకంగా మెస్సీ దాకా పాకాయి. దీంతో మెస్సీ స్వయంగా తాను ధరించే జాతీయ జట్టు టీ షర్ట్‌ని సంతకం చేసి మరీ మొర్జాజా కోసం పంపాడు. మెస్సీ మేనేజ్మెంట్, యూనిసెఫ్ సంయుక్తంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో మొర్తాజాకు ఈ టీ షర్ట్ బహుమతిగా అందించారు. దీంతో ఫుల్ ఖుషి అయిన మొర్తాజా 'నేను మెస్సీని ఎంతోగానో ఇష్టపడతాను. ఆయన నన్ను ఇష్టపడుతున్నట్టు ఈ టీ షర్ట్ రాసి పంపారు' అని చెప్పాడు. మెస్సీ టీ షర్ట్ లో ఆడాలన్న తన కల నెరవేర్చుకున్న ఈ బుడతడు త్వరలోనే మెస్సీని కూడా కలువాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు. -
చేతులకూ కొంత టైమివ్వాలి!
బ్యూటిప్స్ మృదువైన ముఖం మీద నుంచి దృష్టి తామరతూడుల్లా ఉండాల్సిన చేతుల మీదకు మళ్లుతుంది. కానీ చాలామంది చేతుల మీద శ్రద్ధ పెట్టరు. దాంతో చేతులు గరుకుదేలి మొరటుగా తయారవుతాయి. ముఖం కోసం కేటాయించిన సమయంతోపాటు చేతులకూ టైమివ్వాల్సిందే. కొద్దిగా నీళ్ళు, టీ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ కలిపి చేతులకు పట్టించాలి. ఈ మిశ్రమం చేతులపై ఉండే మృత కణాలను, పొడి చర్మాన్ని తొలగించి చేతులను సున్నితంగా తయారు చేస్తుంది. గిన్నెడు నీటిలో కొద్దిగా ఉప్పు, నిమ్మరసం కలిపి ఈ మిశ్రమాన్ని ముంజేతి నుంచి భుజాల వరకు రాయాలి. ఇలా వారానికి రెండుసార్లు చే స్తే చేతులు సున్నితంగా తయారవుతాయి. గోరువెచ్చని నీటితో చేతులు శుభ్రంగా కడుక్కొని కాటన్ క్లాత్‌తో గబగబారుద్దాలి. ఇలా చేస్తే మృతకణాలు రాలిపోతాయి. తర్వాత ఒక టీ స్పూన్ తేనెకి ఒక టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలిపి చేతులకు రాయాలి. తరువాత చేతులకు ప్లాస్టిక్ బ్యాగ్స్ తొడుక్కొని అరగంట అలాగే ఉంచుకోవాలి. చేతులపై చర్మం మృదువుగా తయారవుతుంది. అరచేతులు పొడిబారినట్లయితే రాత్రి పడుకోబోయే ముందు రెండు చుక్కల కొబ్బరి నూనె అరచేతుల్లో వేసుకుని మర్దన చేసుకోవాలి. -
పులికాట్ కేంద్రంగా... ఎర్రల దందా!
ప్రతి రోజూ రూ.500 కేజీల అక్రమ రవాణా రూ.లక్షలు సంపాదిస్తున్న దళారులు చిల్లకూరు: పులికాట్ కేంద్రంగా వానపాముల అక్రమ దందా యథేచ్ఛగా సాగుతోంది. ప్రతి రోజూ సుమారు 500 కేజీల వరకు తరలిపోతున్నాయి. భూమిని తొలిచి పంటలకు ఆక్సిజన్ అందించడంలో వానపాములు(ఎర్ర లు) రైతుల కీలకపాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యంలో గిరాకీ పెరిగింది. ఇది ఎక్కవ శాతం పులికాట్‌ను ఆధారం చేసుకుని దాందా సాగుతోంది. ఎందుకు వినియోగిస్తారంటే: వానపాములు ఎక్కువగా రొయ్యలకు మేతగా వినియోగి స్తారు. ఇవి ఎంత తింటే అంత బలంగా రొయ్యలు పెరుగుతాయి. రొయ్యల గుంతలు సాగు చేసే వారు ఎర్రల కోసం దళారులను ఆశ్రయిస్తున్నారు. పులికాట్ ప్రాంతంలో దోరికే వాటికి మండి డిమాండ్ ఉండటంతో ప్రకాశం, తూర్పుగోదావరి ప్రాంతాల్లోని రొయ్య పిల్లలు ఉత్పత్తి చేసేవారు పోటీ పడిమరీ కొనుగోలు చేస్తుండటంతో వాటికి మంచి గిరాకి ఏర్పడింది. తల్లి రొయ్యకు వానపామును ఆహారంగా వేస్తే లక్ష గుడ్లు పెట్టే రొయ్య అంతకు మించి గుడ్లు పెడుతుంది. వివిధ మార్గాల్లో: సాధారణంగా దొరికే వానపాముల కంటే పులికాట్లో దొరికేవి పుష్టిగా ఉండటమే కాకుండా రొ య్యలకు మంచి బలం చేకూర్చుతుండటంతో ఆ ప్రాం తంలోనే వాటి కోసం అన్వేషణ ఎక్కువైంది. దీంతో దళారులు ఆ ప్రాంతలోని గిరిజనులను మచ్చిక చేసుకుని వారికి డబ్బు ఆశచూపి ప్రతిరోజూ వానపాములను తవ్వి తరలిస్తున్నారు. వీటిని కొంత మంది కుండల్లో, టిఫిన్ బాక్సులు, ప్లాస్టిక్ కవర్లలో ఉంచి బస్సు, లారీలు, ప్రైవేట్ వాహనాల్లో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కేజీ రూ.3 వేలు పలుకుతున్న ధర: పులికాట్ ప్రాంతంలో సేకరించిన ఎర్రలకు కేజీ రూ.3 నుంచి రూ.5 వేల ధర పలుకుతోంది. పులికాట్లో గిరిజనులు సేకరించే వాటికి మాత్రం కేజీకి రూ.40 ఇచ్చి, దళారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. -
ప్లాస్టిక్ కంపెనీలో అగ్ని ప్రమాదం
భవానీపురం: విజయవాడలోని ఓ ప్లాస్టిక్ కంపెనీలో ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యాధరపురం కబేళారోడ్డులోని ఓ ప్లాస్టిక్ కంపెనీలో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు వ్యాపించాయి. స్థానికంగా శ్రీనివాసరావు అనే వ్యాపారి ప్లాస్టిక్ వస్తువుల ప్యాకింగ్ చేసి విక్రయిస్తుంటారు. ఆదివారం ఉదయం ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఫైర్ సిబ్బందికు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో శ్రీనివాసరావుకు స్వల్ప గాయాలు, కాగా భవనం కొంతమేర దెబ్బతింది. సుమారు రూ.15 లక్షల మేర నష్టం వాటిల్లిటినట్టు తెలుస్తుంది. -
అమ్మో! ప్లాస్టిక్‌తో బరువు
పరిపరి శోధన అతిగా తినడంతో, తక్కువగా శ్రమించడం వల్లే ఒంటి బరువు పెరుగుతుందని ఇప్పటి వరకు పలు పరిశోధనల్లో వెల్లడైంది. అయితే, బరువు పెరగడానికి ప్లాస్టిక్ వినియోగం కూడా కారణమేనని ఒక తాజా పరిశోధనలో తేలింది. ప్లాస్టిక్ టిఫిన్ బాక్సులు, ప్లాస్టిక్ బ్యాగుల్లో నిల్వ ఉంచిన ఆహారాన్ని తినడం వల్ల శారీరక జీవక్రియలు మందగించి, స్థూలకాయానికి దారితీస్తున్నట్లు జర్మనీ పరిశోధకులు గుర్తించారు. ప్లాస్టిక్‌లోని ఫాలేట్స్ అనే రసాయనాలు ఆహారంలో కలిసి కడుపులోకి చేరుతున్నాయని, వాటి ప్రభావం వల్ల జీవక్రియలు మందగిస్తున్నాయని జర్మనీలోని హెల్మ్హాల్జ్ సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ పరిశోధకులు చెబుతున్నారు. -
రేప్ తప్పించేందుకు ఇంతటి పైశాచికమా!
లండన్: రక్తంలో ప్లెజర్ కోసం, నరాల తీపి కోసం రేప్‌లు చేసే మృగాళ్ల కబంధ హస్తాల నుంచి ఆడ బిడ్డలను రక్షించుకునేందుకు ఆ తల్లులు దారుణాలకు ఒడిగడుతున్నారు. మగాళ్ల దృష్టిని ఆకర్షించకుండా ఉండేందుకు ఆడ పిల్లల బ్రెస్ట్‌లను ఐరన్ చేస్తున్నారు. అందుబాటులో ఉన్న బలమైన రాయి, సుత్తి, గరిటె లాంటి వస్తువులను ఎర్రటి నిప్పుల్లో ఎర్రగా కాల్చి బ్రెస్ట్‌లను కాల్చి వేస్తున్నారు. అవి పెరగుకుండా మూర్ఖంగా అడ్డుకుంటున్నారు. సంపన్న వర్గానికి చెందిన మహిళలు మాత్రం మరీ ఇంత ఘోరంగా కాకుండా తమ ఆడ పిల్లలకు ఎదిగే వయస్సులోనే ఛాతికి బలమైన ప్లాస్టిక్ బెల్ట్‌లను బిగిస్తున్నారు. ఏడాది వరకు అలాగే ఉంచుతున్నారు. నైజీరియా, దక్షిణాఫ్రికా, కామెరూన్ లాంటి దేశాల్లోనే కాకుండా బ్రిటన్‌లో కూడా ఇలాంటి అనాచారం యధేశ్చగా కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 38 లక్షల మంది ఆడ పిల్లలు ఈ అకృత్యానికి బలవుతున్నారని ఐక్యరాజ్య సమితియే ఓ నివేదికలో వెల్లడించింది. ఈ దేశాల్లో ‘ఫిమేల్ జనిటల్ మ్యుటిలేషన్’ (స్త్రీ జననాంగ విరూపం లేదా సున్తీ) కూడా అమల్లో ఉందని ఆ నివేదిక పేర్కొంది. 11 ఏళ్ల నుంచి 15 ఏళ్ల మధ్యనున్న ఆడపిల్లలపైనే ఈ ‘బ్రెస్ట్ ఐరనింగ్’ పాశవిక ప్రక్రియను అమలు చేస్తున్నారు. త్వరగా ఎదుగుతున్నట్టు కనిపించిన సందర్భాల్లో 9 ఏళ్ల వయస్సున్న వారిపై కూడా ఈ దారుణాలకు ఒడిగడుతున్నారు. ఈ ప్రక్రియ పర్యవసానాలు కూడా దారుణంగా ఉంటున్నాయి. కొందరిలో బ్రెస్ట్ ప్రాంతంలో జన్యువులు పూర్తిగా చనిపోయి మగరాయుళ్లుగా మిగిలిపోతుండగా, కొందరికి పుండ్లు అవడమే కాకుండా ఇన్ఫెక్షన్ కారణంగా ఏళ్లపాటు పస్ కూడా వస్తోంది. దద్దుర్లు వచ్చి దురద శాశ్వతంగా ఉండిపోతోంది. ఎక్కువ మంది బ్రెస్ట్‌లు అష్టవక్రంగా మారిపోతున్నాయి. తల్లులైన ఇలాంటి బాధితుల్లో ఎక్కువ మందికి ‘తల్లిపాలు’ రాకుండా పోతున్నాయి. మూఢ విశ్వాసంగా కొనసాగుతున్న ఈ ‘బ్రెస్ట్ ఐరనింగ్’ వెనకనున్న ఉద్దేశం మాత్రం ప్రధానంగా రేప్‌ల నుంచి తప్పించ డం, మగాళ్ల దృష్టిని ఆకర్షించకుండా జాగ్రత్త పడడమే. పెళ్లి కాకుండా తల్లులు కాకూడదనే ఉద్దేశం కూడా ఉంది. ఆడపిల్ల వైపు నుంచి ప్రోత్సాహం ఉండకూడదనే ఉద్దేశంతో జననాంగ సున్తీకి పాల్పడుతున్నారు. అభివృద్ధి చెందినప్పటికీ నల్ల జాతీయుల్లోనే ఈ అనాచారం ఎక్కువగా కనిపిస్తోంది. 58 శాతం కేసుల్లో తండ్రికి ఏ మాత్రం తెలియకుండా తల్లులే ఈ అకృత్యాన్ని ఆచరిస్తున్నారు. తమ రక్షణ, శ్రేయస్సుకోసం తల్లి అలా చేస్తోందని భావించడంతో బాధితులెవరూ దారుణం గురించి బయటపెట్టడం లేదు. తల్లుల గురించి ఫిర్యాదు చేయడం లేదు. ఒకవేళ ఎవరైనా ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకునేందుకు నైజీరియా, దక్షిణాఫ్రికా, కామెరూన్ లాంటి దేశాల్లోనే కాకుండా అభివృద్ధి చెందిన బ్రిటన్‌లో కూడా చట్టాలు లేవు. సంస్కృతి, సంప్రదాయం, మతం పేర్లతో ఈ అనాచారం ముడివడి ఉండడంతో ప్రభుత్వాలు కూడా ఈ దిశగా చట్టాలు తీసుకరావాలనే ఆలోచన చేయడం లేదు. ఇప్పుడు ఈ అంశంపై ప్రజల్లో, ప్రభుత్వాల్లో చైతన్యం తీసుకరావడం కోసం లండన్‌లోని ‘చారిటీ విమెన్స్ అండ్ గర్ల్స్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్’ కృషి చేస్తోంది. పోలీసులు, ఆరోగ్య సిబ్బంది, పాఠశాలల టీచర్లు, ఇతర సామాజిక కార్యకర్తలను కలుపుకొని ఈ సామాజిక అనాచారానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తోంది. అందులో భాగంగా ఈ సంఘం బాధితులను ఇంటర్వ్యూలు చేస్తోంది. -
చెత్త రహితానికి నజరానా
బీబీఎంపీ కార్పొరేటర్లకు సీఎం తాయిలం బెంగళూరులో ప్లాస్టిక్ నిషేధానికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటన కపై 15 రోజులకొకసారి నగర పర్యటన బెంగళూరు(బనశంకరి) : బృహత్ బెంగళూరు మహా నగర పాలికె (బీబీఎంపీ) పరిధిలోని వార్డులను చెత్త రహితంగా తీర్చిదిద్దిన కార్పొరేటర్లకు పారితోషకం అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. జాతీయ నగర ఆరోగ్య మిషన్ కార్యక్రమం అమలుపై పాలికె సభ్యులకు వికాససౌధలో బుధవారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బెంగళూరులో ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందుకు బీబీఎంపీ సభ్యులు పూర్తిగా సహకరిం చాలని అన్నారు. రహదారులపై చెత్తను తొల గించడంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని, ఫలితంగా అపరిశుభ్రత పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. చెత్తను తొలగించేందుకు పాలికె సభ్యులు తొలి ప్రాధాన్యతనివ్వాలని అన్నారు. నగరంలో రోజూ నా లుగున్నర టన్నుల చెత్త పోగవుతోందని, ఇంత చెత్త సేకరణ కష్టమవుతోందని తెలిపారు. గార్డెన్‌సిటీగా పేరుపొందిన బెంగళూరు నగరం ప్ర స్తుతం గార్బేజ్‌సిటీ అనే పేరుపొందిందని ఈ చెడ్డ పేరును తొలగించడానికి కృషి చేయాలన్నారు. చెత్తసేకరణ సంస్కరణలకు తమ ప్రభుత్వం అవసరమైన సహయసహకారాలు అందిస్తుందని పేర్కొన్నారు. ఆక్రమణలకు గురైన నగరంలోని చెరువులు, రాజకాలువలను గుర్తించి తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. ఒకపై ప్రతి 15 రోజులకొకసారి తాను బెంగళూరులోని వీధుల్లో పర్యటిస్తానని, ఆ సమయంలో చెత్త సేకరణ, విధుల్లో నిర్లక్ష్యం కనబరిచిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడే అధికారులకు మద్దతు ఇవ్వరాదంటూ పాలికె సభ్యులకు సూచించారు. నగర పరిధిలో తాగునీటి లీకేజీలను అరికట్టాలన్నారు. అనంతరం బీబీఎంపీ ప్రతిపక్షనేత పధ్మనాభరెడ్డి మాట్లాడుతూ నగరంలో పూర్తిగా ప్లాస్టిక్ ను నిషేదించడం సాధ్యం కావడం లేదన్నారు. గతంలో ప్లాస్టిక్ నిషేదించాలని ప్రభుత్వానికి ప్రస్తావించామని, ప్రస్తుతం ప్రభుత్వం ప్లాస్టిక్ ను నిషేదిస్తే తామంతా సహకరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు యు.టి.ఖాదర్, రామలింగారెడ్డి, దినేశ్‌గుండూరావు, మేయర్ మం జునాథరెడ్డి, డిప్యూటీ మేయర్ హేమలతాగోపాలయ్య, కమిషనర్ కుమార్‌నాయక్, ఎమ్మెల్యేలు అశ్వత్థనారాయణ, గోపాలయ్య, బీ బీఎంపీ ఆర్థిక స్థాయీ సమితి అధ్యక్షుడు ముజాహిద్దిన్‌పాషా, బీబీ ఎంపీ పాలనా విభాగం నేత అశ్వత్థనారాయణ, కుటుంబసంక్షేమ శాఖా ప్రధాన కార్యదర్శి అతుల్‌కుమార్ తివారీ పాల్గొన్నారు. -
ప్లాస్టిక్ కవర్ లో శిశువు మృతదేహం
ఎమ్మిగనూరు: కర్నూలు జిల్లా లో దారుణం చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన శిశువును గుర్తుతెలియని వ్యక్తులు ఆస్పత్రి గేటు పక్కన పడేసి వెళ్లిన సంఘటన జిల్లాలోని ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం చోటు చేసుకుంది. గేటు పక్కన ఉన్న ప్లాస్టిక్ కవర్లోంచి రక్తం వస్తుండటాన్ని గమనించిన స్థానికులు ఆస్పత్రి వర్గాలకు సమాచారం అందించారు. వైద్యులు వచ్చి పరిశీలించగా ప్లాస్టిక్ కవర్లో అప్పుడే పుట్టిన బాలుడి మృతదేహం కనిపించింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వారి గురించి ఆరా తీస్తున్నారు. -
ప్లాస్టిక్.. కబలిస్తోంది..
యలమంచిలిని ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఓ ప్రణాళిక రూపొందించింది. ఆ తర్వాత పాలిథిన్ కవర్ల అమ్మకాలను కూడా నిషేధించింది. కానీ పరిస్థితి మారలేదు. ప్లాస్టిక్ భూతం పట్టణాన్ని కబళిస్తోంది. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే.. భవిష్యత్ ఎలా ఉంటుంది.. దీనికి ప్రత్యామ్నాయాలు ఏమిటి.. ఇతర దేశాలు అనుసరిస్తున్న విధానాలు గురించి చెప్పే ప్రయత్నమే ఈ కథనం. -యలమంచిలి - విచ్చలవిడిగా ప్లాస్టిక్ వినియోగం - పెరుగుతున్న వాతావరణ కాలుష్యం - ప్రకృతి సిద్ధమైన వస్తువులకు లేని ప్రచారం - భవిష్యత్ అంధకారమే అంటున్న నిపుణులు అది 2050.. స్కూల్‌కు వెళ్లేందుకు రాజేష్ శరీరానికి ‘యాంటీ డేంజరస్ మాస్క్’తో సిద్ధమయ్యాడు. స్కూల్ బస్సులోని పిల్లలందరిదీ అదే పరిస్థితి. పాఠశాల చేరుకోగానే సెక్యూరిటీ గార్డు రాజేష్‌ను యాంటీ రేస్ కేబిన్‌లోకి తీసుకెళ్లి అతణ్ని పూర్తిగా చెక్ చేసి అతనిలో పర్యావరణ హానికారకాలు లేవని నిర్ధారించి లోపలికి పంపాడు. తరగతి గదిలో సైన్స ఉపాధ్యాయినీ మాస్క్ ధరించి బోధిస్తోంది. ఆమె చెబుతోంది ఇలా.. ఆ రోజుల్లో (35 ఏళ్ల కిందట) మున్సిపాలిటీలో కేవలం 25 శాతం మాత్రమే ప్లాస్టిక్ కాలుష్యం ఉండేది. నిపుణులు హెచ్చరిస్తున్నా.. ప్రజలు ప్లాస్టిక్ వస్తువులు, క్యారీ బ్యాగ్‌లు వినియోగించడం మానలేదు. దీంతో 2025 నాటికి కాలుష్య స్థాయి 50 శాతానికి చేరింది. భూమి సారం కోల్పోయి పంటలు పండలేదు. భూగర్భజలాలు లేకపోవడంతో నీళ్లు కరవయ్యాయి. 2040నాటికి కాలుష్యం 90 శాతానికి చేరింది. ప్రజలంతా ప్లాస్టిక్ వినియోగం మానేశారు. జనపనార, కాగితం, బంగాళ దుంప గుజ్జుతో తయారైన బ్యాగులు, ఇతర వస్తువులు వాడటం ప్రారంభించారు. అయినా ఫలితం లేకపోయింది.. ఇప్పటికీ 2 శాతం మాత్రమే కాలుష్యాన్ని నియంత్రించగలిగాం. ఇలా.. మరో 50 ఏళ్లు మనం కాలుష్య నియంత్రణ పాటిస్తే కానీ.. వాతావరణ కాలుష్యం నుంచి బయటపడలేం. అప్పటి దాకా మనపరిస్థితి ఇంతే.. అనగానే ఆశ్చర్యపోవడం పిల్లల వంతైంది. ఇంటికి వచ్చిన రాజేష్ వాళ్ల అమ్మ లక్ష్మిని ఇలా అడిగాడు. ఇంత హానికరమని తెలిసినా.. అప్పటి వాళ్లు ప్లాస్టిక్‌ను ఎందుకు మానలేదని.. అప్పుడు తల్లి ఇలా జవాబిచ్చింది. ఏదైనా అనుభవంలోకి వస్తేకాని తెలియదు నాన్నా.. మన మాత్రం భావితరానికి ఇలాంటి పరిస్థితి రానివ్వకూడదు. ఇదంతా అభూత కల్పనకాదు.. చోద్యం అంతకంటే కాదు.. ప్రపంచ పర్యావరణ నిపుణులందరూ గొంతు చించుకొని చాటి చెబుతున్న నిజాలు. వారంతా అరిచి గగ్గోలు పెడుతున్నా ప్లాస్టిక్‌ను మానలేని పరిస్థితిలో ఉన్నాం. అదే భావితరానికి శాపం కాబోతోంది. ఇప్పటికైనా కళ్లు తెరవకపోతే భవిష్యత్ అంధకారమే. మృత్యుంజయ ప్లాస్టిక్ .. సృష్టిలోని ప్రతిపదార్థం.. జనించి కొంతకాలానికి అవసానం చెందుతుందనేది విజ్ఞానశాస్త్రాలు చెబుతోన్న విషయం. అయితే ప్లాస్టిక్‌కు మాత్రం ఇది అంత తొందరగా వర్తించదు. కొన్ని వందల సంవత్సరాలు గడిస్తేకానీ.. మనం వాడిపారేసిన ప్లాస్టిక్ వస్తువులు, క్యారీ బ్యాగులు భూమిలో కరిగిపోవు. ఇది అక్షరాల నిజం. ఇదీ ప్రత్యామ్నాయం.. మనం ఇప్పటికీ వీటి వాడకాన్ని అదుపుచేయలేకపోతున్నాం. కానీ చైనా, జపాన్ వంటి దేశాలు ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తూనే ప్రత్యామ్నాయాలనూ ప్రోత్సహిస్తున్నాయి. వీటిలో బంగాళ దుంప గుజ్జుతో తయారు చేసిన బ్యాగులు, ప్లేట్లు, గృహోపకరణాలు అందుబాటులో ఉన్నాయి. జనపనార, కాగితంతో పాటు వీటికి గిరాకీ పెరిగింది. అలాగే జనపనార పరిశ్రమలను ప్రోత్సహించి వస్తువుల తయారీని చేపట్టాలి. ఉపయోగించిన ప్లాస్టిక్‌ను రీ-సైక్లింగ్ చేసి మరో వస్తువుగా మారిస్తే పర్యావరణ హానిని కనీసం 20శాతం తగ్గించవచ్చు. తమిళనాడులో ఈ తరహా యూనిట్లకు రాయితీలు కల్పిస్తోంది. మన ప్రభుత్వం కూడా జిల్లాకు కనీసం 5 యూనిట్లయినా కేటాయిస్తే గాని ప్లాస్టిక్ వ్యర్థాలను అరికట్టలేం. ప్లాస్టిక్ నిండా రసాయనాలే.. ప్లాస్టిక్‌ను సముద్రం నుంచి తీసే క్రూడాయిల్ నుంచి ఉత్పత్తి చేస్తారు. ముందుగా ఆయిల్‌ను 400 డిగ్రీల వద్ద మరిగించి. నాఫ్తానుగా రూపొందిస్తారు. దీనిని 800డిగ్రీల వరకు వేడిచేసి వచ్చిన పదార్థాన్ని 200 డిగ్రీల వరకు చల్లారుస్తారు. అప్పుడు ప్లాస్టిక్ అణువులు ఏర్పడాయి. వీటిలో పాలిమర్లు, మోనోమర్ల యూనిట్లు ఉంటాయి. వీటికి ఎథిలీన్ కలిపితే పాలిథిన్ రూపొందుతుంది. ఒక కణం, మరొక కణంతో పెనవేసుకుని జారుడు స్వభావాన్ని కలిగి ఉంటాయి. దీంట్లో కలిపే పిగ్మెంట్లు, ప్లాస్టిసైజర్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఎజోడైలు కలిపేకొద్దీ రకరకాల వస్తువులుగా రూపుదాలుస్తాయి. వాటర్ బాటిళ్లకూ అంతే. అవి భూమిలో కలవాలంటే వందల ఏళ్లు పడుతుంది. వాటిని కాల్చినా విషవాయువులు, భూమిపైనే ఉంటాయి. -
ప్లాస్టిక్ బాల్స్‌తో వాటర్ సేవింగ్
-
ప్లాస్టిక్ బాల్స్‌తో వాటర్ సేవింగ్
-
ప్లాస్టిక్ బాల్స్‌తో వాటర్ సేవింగ్
లాస్ ఏంజెలిస్: ఈసారి కరవు కాటకాలతో అల్లాడిపోతున్న అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో మంచినీటి వనరులను రక్షించుకునేందుకు వినూత్న ప్రక్రియను చేపట్టారు. 75 ఎకరాల్లో విస్తరించివున్న లాస్ ఏంజెలిస్ మంచినీటి రిజర్వాయర్‌లో తీవ్రమైన ఎండల కారణంగా నీరు ఆవిరైపోకుండా ఉండేందుకు ప్లాస్టిక్ బాల్స్‌ను వాటిల్లోకి వదిలారు. పెద్ద పరిమాణంలోని ఆపిల్ అంతా ఉండే ప్లాస్టిక్ బాల్స్‌ను దాదాపు పదికోట్లు వదిలినట్లు లాస్ ఏంజెలిస్ డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ అండ్ పవర్ అధికారులు తెలిపారు. ఎండకు నీరు ఆవిరికాకుండా ఉండడంతోపాటు రసాయనిక చర్యలవల్ల నీరు కలుషితం కాకుండా ఉంటుందని, నల్ల రంగు బాల్స్‌ను వాడడంవల్ల సూర్యుడి అల్ట్రా వాయిలెట్ కిరణాలు కూడా నీటిపై ప్రభావం చూపవని అధికారులు వివరించారు. అంతేకాకుండా పక్షులు, ఇతర జంతువులు కూడా రిజర్వాయర్‌లోకి ప్రవేశించకుండా ఈ ప్లాస్టిక్ బాల్స్ అడ్డుకుంటాయని వారు చెప్పారు. తాము తీసుకున్న ఈ చర్య వల్ల ఏడాదికి 30 కోట్ల గ్యాలన్ల నీటిని పరిరక్షించుకోవచ్చని, ఈ నీటితో 8100 మంది ప్రజలకు ఏడాదిపాటు మంచినీటిని సరఫరా చేయొచ్చని వివరించారు. పైగా ఈ తరహా విధానం ద్వారా తమకు ఏడాదికి రూ.2,500 కోట్లు కలిసొస్తాయని చెబుతున్నారు. కానీ, పర్యావరణ సమతౌల్యం మాత్రం వారు విస్మరిస్తున్నారు. పశు పక్షాదుల దాహార్తిని తీర్చే తరుణోపాయం గురించి కూడా ఆలోచించడం లేదు. -
గ్రామ గ్రామం ఇక ‘లక్ష్మీ’ గ్రామం
ఒక చిన్న ఆలోచనతో ప్రారంభమైన కార్యక్రమం అంచెలంచెలుగా ఎదిగి ఆదర్శంగా వెలిసిన గ్రామమే మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని లక్ష్మీనగర్ గ్రామం. ఒకప్పుడది ఏ సౌకర్యాలూ లేనిదే.. కానీ అందరూ ఒక్కటై ఆలోచనలు పంచుకొని, ఆధునికతను సొంతం చేసుకొని నిర్మించుకుని, నేడు అన్నీ ఉన్న గ్రామం లక్ష్మీనగర్ గ్రామం. 900 మంది జనాభా ఉన్న ఈ చిన్న గ్రామం నేడు అభివృద్ధితో అందరినీ ఆకర్షిస్తోంది. ఆలయా లు, విద్యాలయాలు, వైద్యశాలలు, సహకార సంఘ భవనం, లక్ష్మీనగర్ వెల్ఫేర్ సొసైటీ, తాగునీటి ప్లాంట్, మిల్క్ సొసైటీ, సోలార్ వీధి లైట్లు, ప్లాస్టిక్ నిర్మూలన, ముఖ్యంగా మద్యం అమ్మకం నిషేధం వంటి ప్రజల సంక్షేమ కార్యక్రమాలతో నేడు ప్రపంచానికి ఆదర్శంగా ఉండటం లక్ష్మీనగర్ గ్రామ గొప్పతనం. కర్తవ్య నిర్వహణలో వెనుకంజ వేయకుండా ఉత్సాహంతో ప్రగతి మార్గంలో ముందుకు నడవ డంలో లక్ష్మీనగర్ గ్రామం నిజంగానే తరతరాలకు ఆదర్శ గ్రామమే. మంచినీటి ప్లాంటు ఏర్పాటు, మ ద్యం అమ్మకాలు నిషేధం, మంజీర పాల సమాఖ్య ఏర్పాటు, మహిళా మండలి భవన నిర్మాణం, గ్రామా భివృద్ధి కమిటీలు, గ్రామంలో జెనరిక్ మందుల దుకా ణం, సౌరశక్తితో గృహ, వ్యవసాయ అవసరాలు తీర్చే విద్యుత్‌ని ప్రోత్సహించడం, ఇంకుడు గుంతల్ని ప్రోత్సహించడం, ప్లాస్టిక్ రీసైక్లింగ్‌కి పనికొచ్చే డంప్ యార్డు నిర్మాణం, లక్ష్మీనగర్ కమ్యూనిటీ మెడిటేషన్ హాల్, లైబ్రరీ, ఆర్ఎంపీ హాస్పిటల్, స్పోర్ట్స్ సెంటర్ ఏర్పాటు, వెటర్నరీ హాస్పిటల్, రైతు మహిళా సంఘా ల ఏర్పాటు..ఇలాంటి సామాజిక ప్రయోజన ప్రణా ళికలు ఎన్నో ఆచరణలోకి రావటం ఈ గ్రామం ప్రత్యే కత. ఫ్లోరైడ్ ఇబ్బందుల్ని అధిగమించే నీటి శుద్ధీకరణ ప్లాంట్. 20 లీటర్ల మంచినీరు కేవలం రూ.3 లకే అందించటం. తక్కువ పెట్టుబడితో ప్రజలకు మంచి నీరందించడం అనేది మామూలు విషయం కాదు. మంజీర పాల సమాఖ్య ఏర్పాటుతో 10 మంది స్త్రీలతో కూడిన సొసైటీ ద్వారా మధ్యవర్తుల ప్రమే యం లేకుండా నేరుగా ప్రభుత్వ డైరీ అయిన ‘విజ య’ డైరీకి పాల సరఫరాతో ఎందరో మహిళలు నేడు ఆర్థిక లాభాలు గడించారు. గ్రామంలో ఆలయాల పునరుద్ధరణ, సేంద్రియ వ్యవసాయం. గ్రామం నిం డా మొక్కలు నాటి పెంచడం. గ్రామాభివృద్ధికి సం బంధించి ఇవి చాలా మంచి పనులు. వీరి కృషికి మన కు చేతనైనంత సహకరిద్దాం. మన గ్రామాన్ని కూడా మరో లక్ష్మీనగర్ గ్రామంగా తీర్చి దిద్దుకుందాం. ఇలాంటి ఎన్నో ఎన్నెన్నో దివ్యమైన ప్రణాళికలతో ప్రగతి వైపు దూసుకుపోతున్న ఆదర్శ గ్రామం లక్ష్మీ నగర్ గ్రామ అభివృద్ధికై ఎవరైనా ఆర్థికంగా సహ కరించాలనుకుంటే వారి బ్యాంకు ఖాతాకు జమ చేయవచ్చు. Laxmi Nagar Welfare Society. Special Savings Account. A/c. No. 223101000627. IFSC Code: ICIC0002231, Papannapet Mandal, Medak District, Pin: 502125. (వ్యాసకర్త మాజీ ఎంపీ, నిజామాబాద్, సెల్: 7702941017 - ఎం.నారాయణరెడ్డి -
ఐడియా మండితే.. పర్యావరణ పండగే!
సాక్షి, కర్నూలు : సాధారణంగా గుట్కా, ఒక్కపొడి.. వినియోగించే వారు వాటి ప్యాకెట్లను ఎక్కడో ఒకచోట పడేస్తుంటారు. అలాగే వాడేసిన షాంపూలు.. బిస్కెట్లు, ఇతర ఆహార పదార్థాలు తినేసి ప్లాస్టిక్ కవర్లను అలాగే వదిలేస్తుంటారు. ఇవేవీ పునర్వియోగానికి పనికిరావు. ఇది తెలిసే చెత్త కాగితాలు ఎరుకునే వారు సైతం ముట్టుకోరు. ఫలితంగా జిల్లాను ప్లాస్టిక్ వ్యర్థాలు ముంచెత్తుతున్నాయి. ఈ సమస్య నుంచి బయటపడేందుకు కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) అధికారులు ఓ ప్రణాళిక రూపొందించనున్నారు. పునర్వియోగానికి కూడా పనికిరాని ప్లాస్టిక్ చెత్తను సిమెంట్ పరిశ్రమలోని కొలిమిలో వినియోగించేందుకు చర్యలు తీసుకోబోతున్నారు. భవిష్యత్తులో ఏం చేస్తారంటే.. కర్నూలు జిల్లాలో సుమారు 15 వరకు సిమెంట్ పరిశ్రమలు ఉన్నాయి. వీటిలోని కొలిమిలో వినియోగానికి బొగ్గుతో పాటు ఫార్మా పరిశ్రమల నుంచి చివరి దశలో వెలువడే ఘన వ్యర్థాలను కూడా ఉపయోగిస్తుంటారు. సాధారణంగా ప్లాస్టిక్ వ్యర్థాలను కాలిస్తే విష వాయువులు వెలువడుతాయి. అదే సిమెంట్ పరిశ్రమ కొలిమిలో 1,400 డిగ్రీల ఉష్టోగ్రత ఉంటుంది కాబట్టి ఆ సమస్య ఉత్పన్నం కాదు. ఇదే సమయంలో బొగ్గు కూడా ఆదా అవుతుంది. ఈ నేపథ్యంలో సిమెంట్ పరిశ్రమల యజమానులను ఒప్పించి పనికిరాని వ్యర్థాలను తరలించాలని పీసీబీ ఆలోచిస్తోంది. ఇందుకోసం త్వరలో ఆయా కంపెనీల యజమానులతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. జిల్లా వ్యాప్తంగా.. జిల్లా నుంచి ప్రతిరోజూ సుమారు 2,500 మెట్రిక్ టన్నుల చెత్త వెలువడుతుండగా.. కర్నూలు, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్ తదితర మున్సిపాలిటీల్లోని డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు. అక్కడ వేరుచేసి కొన్నింటిని సేంద్రియ ఎరువుల తయారీకి, మరికొన్నింటిని ఇతర పరిశ్రమల్లో వినియోగానికి ఇటుకలుగా తయారు చేసి విక్రయిస్తున్నారు. ఎందుకూ పనికిరాని వాటిని భూమిలో నిక్షిప్తం చేస్తారు. వీటిలో చాలా వరకు వివిధ వస్తువుల తయారీకి వినియోగించే కవర్లే ఉంటున్నాయి. మరోవైపు ప్లాస్టిక్ తయారీ పరిశ్రమలు అధికంగా ఉన్న హైదరాబాద్, బెంగళూరు తదితర నగరాలకు కొందరు వ్యాపారులు ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకెళ్లి విక్రయిస్తుంటారు. పునర్వియోగానికి పనికొచ్చే ప్లాస్టిక్‌ను గ్రాన్యుల్స్(దాణా.. చిన్నపాటి ఉండలు)గా మార్చి సంచుల తయారీకి వినియోగిస్తారు. అందుకు కూడా ఉపయోగపడని వాటికి నిప్పు పెడతారు. తద్వారా ప్రమాదకర డయాక్సిన్లు అనే కార్సినోజెనిక్ వాయువులు వెలువడి అనారోగ్య కారకాలవుతాయి. -
ఇది తొలిపోరు
ప్లాస్టిక్ నిషేధంపై మలి పోరాటం రేపటి నుంచే ‘స్వచ్ఛ హైదరాబాద్’ ‘సాక్షి’తో జీహెచ్ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్ సిటీబ్యూరో: ‘స్వచ్ఛ హైదరాబాద్’లో భాగంగా చెత్త తొలగింపు తొలి దశ కార్యక్రమమని... మలి దశలో ప్లాస్టిక్ నిషేధంపై శ్రద్ధ చూపుతామని జీహెచ్ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. తొలుత అన్నివర్గాల్లో అవగాహన క ల్పిస్తామని... పట్టించుకోకపోతే నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. శిక్షల కంటే ప్రజల్లో అవగాహన, చైతన్యం ముఖ్యమని అభిప్రాయపడ్డారు. అందుకే సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో ‘స్వచ్ఛ హైదరాబాద్’కు పూనుకున్నారని చెప్పారు. ప్రజల చైతన్యంతో ‘మన ఇల్లు- మన సరిసరాలు- మన సిటీ’ అనే తలంపు కలుగుతుందన్నారు. అప్పుడే ‘స్వచ్ఛ హైదరాబాద్’ సాధ్యమవుతుందని... విశ్వనగరంగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. శనివారంనుంచి ఐదు రోజుల పాటు ‘స్వచ్ఛ హైదరాబాద్’ మహా క్రతువు ప్రారంభం కానున్న నేపథ్యంలో ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.ఆ విశేషాలు... సాక్షి : వీధుల్లో చెత్త తొలగింపు సరే.. ఇళ్లు, కార్యాలయాల్లో చెత్త లేకుండా చేసేందుకు ఏం చేస్తున్నారు? కమిషనర్: వీధుల్లోనే కాకుండా విధులు నిర్వహించే కార్యాలయాలు, ఇళ్లు, పరిసరాల్లోనూ చెత్త లేకుండా చేయాలనేది లక్ష్యం. కార్యాలయాల్లో చెత్తను సిబ్బంది, కార్మికులు తొలగిస్తారు. ఇళ్లకు సంబంధించి తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేయాల్సిందిగా గృహిణులకు అవగాహన కల్పించాలి. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా ఉంటే సగం సమస్య సమసిపోయినట్లే. ప్రజలకు అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమం. సాక్షి : నగరంలో ప్లాస్టిక్ వినియోగం ఎక్కువ. ప్లాస్టిక్ క్యారీబ్యాగులతో ఎన్నో అనర్థాలు పొంచి ఉన్నాయి. ఈ-వేస్ట్, బయో మెడికల్ వేస్ట్, ఇతర వ్యర్ధాలను నిరోధించ కుండా.. వాటిపై అవగాహన కల్పించకుండా... చెత్త ఎంత తొలగించినా ప్రయోజనం ఉంటుందా? కమిషనర్: అన్నీ ఒకేసారి సాధ్యం కావు. మలిదశలో వీటిపై దృష్టి సారిస్తాం. 40 మైక్రాన్ల లోపు ప్లాస్టిక్ వాడరాదని కోర్టు ఆదేశాలు, నిబంధనలు ఉన్నాయి. గ్రేటర్ వ్యర్థాల్లో చెత్త తొలి శత్రువు. ప్రస్తుతం దీనిపైనే పోరాటం. దీన్ని అంతం చేస్తూనే మిగతా వ్యర్థాలపైనా అవగాహన కల్పిస్తాం. తర్వాత ప్లాస్టిక్ తొలగింపు చర్యలు చేపడతాం. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలకు వెనుకాడం. స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా తమ వద్దకు వచ్చే వీవీఐపీలకు ప్రజలు సూచనలు, సలహాలు తెలియజేస్తారు. రోజువారీ నివేదికలొస్తాయి. మంచి సలహాలు, సూచనలు కార్యరూపంలో పెడతాం. సాక్షి : ఈ నెల 16 నుంచి 20 వరకు వీవీఐపీలందరూ పాల్గొంటున్నందున ‘స్వచ్ఛ హైదరాబాద్’ బాగానే సాగుతుంది. ఆ తర్వాత మాటేమిటి? కమిషనర్: ఇంతటితోనే ఈ కార్యక్రమం ఆగిపోదు. ఇది అవగాహనకు బాగా ఉపకరిస్తుంది. చెత్త ఎక్కువగా పేరుకుపోయే ప్రాంతాల్లో అందుకు కారణాలేమిటో తెలుస్తుంది. దానిపై దృష్టి సారిస్తాం. పరిష్కారాలు ఆలోచించి అమలు చేస్తాం. ఒక పద్ధతి ప్రకారం మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తాం. ప్రజల్లో అవగాహన వస్తే సమస్య ఉండదు. దానిని సాధించాలి. ఇల్లు లాగే బస్తీ, కాలనీ అన్నీ ‘మనవి’ అనుకునే స్థితికి ప్రజలంతా రావాలి. అవగాహనతో పాటు.. ఆచరణలో దానిని చూపే వారికి ప్రోత్సాహకాలిస్తాం. ఈ దిశగా ఆలోచిస్తున్నాం. పరిశుభ్ర, స్వచ్ఛ కాలనీలకూ ప్రోత్సాహకాలిస్తాం. సాక్షి : ‘స్వచ్ఛ తెలంగాణ- స్వచ్ఛ హైదరాబాద్’లో పాల్గొనే సైనికులెందరు? కమిషనర్: అధికారులు, సిబ్బంది నేరుగా 36 వేల మంది ఈ యజ్ఞంలో పాలు పంచుకుంటున్నారు. వీరితో పాటు స్థానికులు, స్వచ్ఛంద సంస్థల వారు దాదాపు 30 నుంచి 40 లక్షల మంది భాగస్వాములు కానున్నారు. సాక్షి : తడి,పొడి చెత్తను వేరుగా వేసేందుకు గృహస్థులందరికీ రెండు రకాలైన డబ్బాలను అందిస్తున్నారా? కమిషనర్: ఇప్పుడే కాదు. అందుకు సమయం పడుతుంది. ఇప్పుడు వాటిని అందజేయలేం. ఆ దిశగా ఆలోచిస్తాం. కానీ ప్రజలు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. మన ఇంటిని మనమే శుభ్రపరచుకోవాలనేస్పృహ రావాలి. దీనికి ‘స్వచ్ఛ హైదరాబాద్’ వేదిక అవుతుందనే విశ్వాసం ఉంది. అందుకే ఇప్పుడీ కార్యక్రమం చేపట్టాం. సాక్షి : ఇలాంటి కార్యక్రమం దేశంలో ఎక్కడైనా జరిగిందా? కమిషనర్: ఇంతవరకు లేదు. ఇదే ప్రథమం. 400 మందికి పైగా రాజకీయ ప్రముఖులు, అఖిల భారత స్థాయి అధికారులు, ఇతరులు ప్రజలతో మమేకమై, వారితో కలిసి పనిచేసే అద్భుత దృశ్యం ఇంతకు ముందెప్పుడూ లేదు. ఇదే ప్రథమం. ఈ కార్యక్రమం ఇతరులకూ ఆదర్శప్రాయంగా మారనుంది. -
బాలానగర్ లో అగ్నిప్రమాదం
-
బాలానగర్ లో అగ్నిప్రమాదం
హైదరాబాద్: నగరంలో మరోసారి మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికులను భయబ్రాంతులకు గురిచేశాయి. ఈ సంఘటన నగరంలోని బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్ లో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. బాలానగర్ పారిశ్రామికవాడలో హర్ష ప్లాస్టిక్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఐదంతస్తుల భవనంలో భారీగా మంటలు చెలరేగడంతో భవనం దాదాపు శిథిలావస్థకు చేరుకుంది. పై అంతస్థు ఇప్పటికే కూలిపోయిందని కూడా తెలుస్తోంది. గత 3 గంటలుగా 8 ఫైరింజన్లు మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఆ ప్లాస్టిక్ పరిశ్రమలోని మిషన్లు బాగా వేడెక్కడంతో అగ్నిప్రమాదం సంభవించినట్టు సమాచారం. దీంతో పరిశ్రమలో పని చేసే కార్మికులందరూ అప్రమత్తమై బయటకు పరుగులు తీయడంతో ప్రాణాపాయం తప్పింది. పరిశ్రమలో అగ్నిప్రమాదంతో భారీగా మంటలు చేలరేగాయి. విషయం తెలిసిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. -
ప్లాస్టిక్ వాడితే రూ.500 పెనాల్టీ
అధికారులకు కమిషనర్ ఆదేశం విశాఖపట్నం సిటీ: ప్లాస్టిక్ నిషేధం మార్చి నుంచీ అమల్లోకి వచ్చినందున ఇక ఎవరు దాన్ని వాడినా రూ. 500 పెనాల్టీ వేయాలని కమిషనర్ ప్రవీణ్‌కుమార్ ఆదేశించారు. సోమవారం పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన రోడ్డు పక్కన ఉండే హోటళ్లపై దృష్టి సారించారు. హోటళ్లలో టీ కప్‌లు, చట్నీలు కట్టే ప్లాస్టిక్ కవర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆరా తీశారు. తోపుడు బండిపై టిఫిన్లు అమ్ముతున్న ఓ వ్యక్తికి రూ. 500 జరిమానా వేశారు. ఆయన వద్ద నుంచి పెద్ద సంఖ్యలో లభించిన ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకున్నారు. ప్లాస్టిక్ వాడేవారిని వదలవద్దని అధికారులకు కమిషనర్ సూచించారు. ప్రతీ దుకాణం దగ్గరా ఉండి పరి శీలించాలని, ఎవరైనా ప్లాస్టిక్ కవర్లతో వెళుతుంటే ఆ దుకాణ యజమానిని నిలదీయాలని, భారీ పెనాల్టీలు వసూలు చేసే వరకూ వెనకాడవద్దని సూచించారు. పెనాల్టీలను చూసి ఆ జోలికి వెళ్లకుండా చేయాలన్నారు. కమిషనర్ వెంట జోనల్ కమిషనర్ డాక్టర్. వై.శ్రీనివాసరావు, ఏఎంఓహెచ్ డా క్టర్ రామ్మోహన్, ఇఇ కృష్ణారావు, దామోదర్ పాల్గొన్నారు. సానుభూతితో కాంట్రాక్టర్ల సమస్యలు సానుభూతితోనే కాంట్రాక్టర్ల సమస్యలు పరిష్కరిస్తానని కమిషనర్ ప్రవీణ్‌కుమార్ అ న్నారు. పాత కౌన్సిల్ హాల్లో సోమవారం కాంట్రాక్టర్ల సంఘం ప్రతినిధులతో సమావేశమై స్మార్ట్ సిటీ అభివృద్దికి సహకరించాలన్నారు. కాంట్రాక్టర్ల సంఘం గౌరవ అధ్యక్షుడు డి. నారాయణ రెడ్డి, అధ్యక్షుడు రొంగలి జగన్నాథం, ఆర్గనైజింగ్ కార్యదర్శి సనపల వర ప్రసాద్‌తో పాటు 150 మంది పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ : ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించడమే ల క్ష్యంగా పలు వార్డులను దత్తత తీసుకోవడానికి పేర్లను నమోదు చేసుకోవాలని కమిషనర్ అన్నారు. కౌన్సిల్ హాల్లో జరిగిన మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ స్మార్ట్ వార్డుల అభివృద్ధిపై ఆసక్తి కలిగిన అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కోరారు. ప్రజలందరికీ ఇల్లు, స్వయం సంఘాలకు మార్కెట్ నిపుణత, బ్యాంకు లింకేజీ రుణాలు మంజూరు చేయడం, ఘన వ్యర్థాల నిర్వహణ వంటి 20 అంశాలపై పని చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. -
50 మైక్రాన్ల కన్నా తగ్గితే జరిమానా
ప్లాస్టిక్ బ్యాగ్‌లపై పర్యావరణ మంత్రి సాక్షి, ముంబై: ప్లాస్టిక్ వినియోగం వల్ల విపరీతంగా పెరిగిపోతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు పర్యావరణ శాఖ నడుం బిగించింది. 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. ఒకవేళ అక్రమంగా వాటిని తయారుచేస్తే సంబంధిత తయారిదారులపై, వాటిని విక్రయించే షాపు యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని పర్యావరణ శాఖ మంత్రి రామ్‌దాస్ కదం ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించే వారిపై లక్ష రూపాయల వరకు జరిమాన, ఐదేళ్ల జైలు శిక్ష విధించాలని ఆదేశించారు. ఈ నియమాలు సోమవారం నుంచి అమలులోకి వచ్చాయి. వాతావరణ పరిరక్షణ కోసం గతంలో 40 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను ప్రభుత్వం నిషేధించింది. కాని పకడ్బందీగా అమలు చేయకపోవడంవల్ల వాటి వినియోగం విచ్చల విడిగా జరుగుతోంది. దీనిపై మంత్రాలయంలో జరిగిన సమావేశంలో సంబంధిత అధికారులతో కదం చర్చించారు. ప్లాస్టిక్ వినియోగంవల్ల పర్యావరణానికి హాని జరుగుతోందని, దీంతో 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల తయారీని, వాటి వినియోగాన్ని నిషేధించాల్సిన అవసరం ఉందని సమావేశంలో తీర్మానించారు. దీంతో కదం ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వినియోగాన్ని నిషేధించినప్పటికీ వాటి తయారి మాత్రం కొనసాగుతూనే ఉంది. ఫలితంగా పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్లాస్టిక్‌కు బదులుగా బట్టతో కుట్టిన, కాగితపు సంచుల వాడకంపై ప్రజలకు అవగాహన కల్పించి వాటి తయారీని ప్రోత్సహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు కదం తెలిపారు. అందుకు మహిళా పొదుపు సంఘాలకు వాటి తయారీ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. -
ప్లాస్టిక్ కవర్లో బాలిక...
పశ్చిమగోదావరి: శారీరక, మానసిక వికలాంగురాలైన ఒక బాలిక(13)ను గుర్తు తెలియని వ్యక్తులు ప్లాస్టిక్ కవర్లో మూతకట్టి రోడ్డు మీద పడేశారు. ఈ హృదయ విదారక ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలం రంగాయగూడెం లోని మదర్‌థెరిస్సా విగ్రహం వద్ద ఆదివారం జరిగింది. బాలిక వయసు సుమారు 13 ఏళ్లున్నా ఐదేళ్ల పాప ఎత్తు మాత్రమే ఉంది. నడవలేని స్థితిలో ప్లాస్టిక్ కవర్లో ఉన్న బాలికను బయటకు తీసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన పోలీసులు, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు వెంటనే ఆ బాలికను ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స అవసరమైతే విజయవాడకు తరలిస్తామని అధికారులు తెలిపారు. (ఏలూరు) -
చంద్రన్న సంచి... అవినీతిలో నుంచి...
చంద్రన్న సంక్రాంతి సరుకుల పంపిణీ అభాసుపాలు కాగా వాటి కోసం పంపిణీ చేసిన సంచులు గోడౌన్లలో మూలుగుతున్నాయి. కార్డుదారులకు ఇచ్చే సరుకుల కన్నా ... ఆ సరుకులు వేసుకునే సంచుల ప్రచారంపైనే పాలకులు దృష్టి పెట్టడంతో జిల్లా వ్యాప్తంగా లక్షల రూపాయల విలువైన సంచులు గోడౌన్లపాలయ్యాయి. ఆకలి తీర్చే ఆర్తి కన్నా కమీషన్ల కక్కుర్తే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. డబ్బులు లేవంటూ బీద అరుపులు అరుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సంచులకే కోట్లు వ్యయం చేయడం ... ఆచరణలో వాటిని దుర్వినియోగం చేయడాన్ని ఏ విధంగా సమర్ధించుకుంటారని జిల్లా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. * లాభం గోరంత ... వ్యయం కొండంత * ప్రజాధనం దుర్వినియోగం * గోడౌన్లలో మగ్గుతున్న చంద్రన్న సంచులు * కమీషన్ల కక్కుర్తే ఇందుకు కారణం దర్శి : పేదలసంక్షేమ పథకాల కోసం డబ్బులు లేవంటూ చేతులెత్తేస్తున్న ప్రభుత్వం పచ్చచొక్కా కాంట్రాక్టర్ల కోసం కోట్ల రూపాయల ధనం దుర్వినియోగం చేస్తోందనడానికి చంద్రన్న సంక్రాంతి కానుకల సంచులే ఓ ఉదాహరణ. రాష్ట్రంలో గత జనవరి నెలలో అత్యంత ఆర్భాటంగా కోట్ల రూపాయలు వెచ్చించి చంద్రన్న కానుకల పేరిట ఆరు ఉచిత సరుకుల సరఫరాకు శ్రీకారం చుట్టింది. ఆ సరుకులన్నీ కార్డుదారుడు వేసుకోడానికి వీలుగా సంచులు ఏర్పాటు చేయాలని భావించింది. అనుకున్నదే తడవుగా ఒక్కో సంచికి రూ.12 రూపాయలు వెచ్చించి సర్కారుకు అనుకూలమైన ఓ కాంట్రాక్టర్‌కు అప్పగించింది. ఒప్పందం ప్రకారం సకాలంలో సంచులు ఇవ్వలేకపోవడంతో అప్పటికప్పుడు ప్లాస్టిక్ సంచులు కొనుగోలు చేసి రేషన్ డీలర్లకు ప్రభుత్వం అందజేసింది. గడువు లోపల సంచులు ఇవ్వకపోతే కాంట్రాక్టును రద్దు చేసి బిల్లులను నిలిపి వేయాలి. కానీ దీనికి భిన్నంగా జిల్లాకు వచ్చిన సంచులన్నీ ఆయా డీలర్లకు సరఫరా చేసేయడంతో ఈ సమస్య తలెత్తింది. జిల్లాలో 8,38,423 మంది రేషన్ కార్డుదారులున్నారు. ఆ విధంగా చూస్తే జిల్లాకు 8 లక్షలకు పైగా సంచులు వచ్చినట్టే. అంటే ఒక్కో సంచి రూ. 12 ధర పలికితే 8 లక్షల సంచులకు కోటి రూపాయలపైగానే వెచ్చించారు. జిల్లా పౌర సరఫరా కార్యాలయానికి వచ్చిన సంచులను కొంతమంది పెద్దల ఒత్తిడి ఫలితంగా ఆయా మండలాలకు పంపించేశారు. చాలా మండలాలకు గడువు అయిపోయాక రావడంతో గోడన్లలో వృధాగా పడి ఉన్నాయి. అవసరం లేకపోయినా కమీషన్ల కక్కుర్తితో ఆయా డీలర్లకు వీటిని అంటగట్టారన్న విమర్శలున్నాయి. దర్శి, దొనకొండ పరిధి గోడౌన్లలో స్థలం లేక బయటనే వీటిని పడవేశారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకుంది. దర్శి నియోజకవర్గంలో 66,308 మంది రేషన్‌కార్డుదారులున్నారు. దర్శి మండలంలో 18,652, దొనకొండ 11537, ముండ్లమూరు 14481, కురిచేడు 9847, తాళ్ళూరు 11791 మంది రేషన్ కార్డుదారులున్నారు. అంటే ఒక్క దర్శి నియోజకవర్గంలోనే సుమారు రూ.7 లక్షల విలువై న సంచులు బూడిదలో పోసిన పన్నీరులా తయారయ్యాయి. సకాలంలో రాకపోవడం వల్లే... ఎన్ఫోర్సుమెంట్ డీటీ కృష్ణారావును వివరణ కోరగా...గోడౌన్‌కు ‘చంద్రన్న సంక్రాంతి సంచులు’ వచ్చినట్లు నాకు తెలియదు. సమయానికి సంచులు రాకపోవడం వల్లనే వాడుకోలేకపోయాం. వాటికి బదులు ప్లాస్టిక్ కవర్లను ప్రభుత్వం సరఫరా చేసింది. -
పాపం పసివాళ్లు
వెట్టిచాకిరీలో భారీగా పసివాళ్లు నిన్న గాజుల కంపెనీలు... నేడు చీరలు, ప్లాస్టిక్ కంపెనీల్లో వెలుగు చూస్తున్న వరుస ఉదంతాలు పోలీసుల చొరవతో 238 మందికి విముక్తి బాలికలు సైతం అదో కీకారణ్యం. వందలాది మంది పిల్లలు ఆ అరణ్యంలో కౄరమృగం లాంటి వ్యక్తి వద్ద వెట్టిచాకిరీ చేస్తుంటారు. రొట్టె ముక్కలనే ఆహారంగా వేస్తూ... వారి శ్రమను దోచుకుంటూ ఉంటాడా వ్యక్తి. మరణం తప్ప... తప్పించు కోవడానికి మరో మార్గంలేని దుస్థితి ఆ చిన్నారులది.... సుమారు పాతికేళ్ల క్రితం చిరంజీవి నటించిన ‘రాక్షసుడు’ చిత్రంలోని దృశ్యమిది. ప్రస్తుతం నగరంలో అదే తరహా దృశ్యాలు వెలుగు చూస్తున్నాయి. పాపం... పుణ్యం... ప్రపంచ ‘మార్గం’ తెలియని చిన్నారులు... కూటి కోసం... కూలి కోసం... గనులలో... కర్మాగారాలలో... వెట్టి చాకిరి అనే భూతం కోరల్లో చిక్కుకుంటున్నారు. బాల్యానికీ... బంధువులకు దూరంగా... ఆకలితో అలమటిస్తూ... బాధలతో దోస్తీ చే స్తున్నారు. సిటీబ్యూరో: ‘మెరుపు మెరిస్తే... వాన కురిస్తే...ఆకశాన హ రివిల్లు విరిస్తే’... చిందులేయలేరు ఆ చిన్నారులు. ఆకలేస్తే అమ్మ దగ్గరకు వెళ్లి మారాం చేయలేని దైన్యం వారిది. జ్వరం వ స్తే అమ్మ కొంగు చాటున విశ్రాంతి తీసుకుంటూ... ఆమె ప్రేమగా ఇచ్చే మందు వేసుకోలేని దౌర్భాగ్యం వారిది. కనీసం తోటి పిల్లలకు సాయం చేద్దామన్నా వీలులేని దయనీయ స్థితి. కంటి నిండా నిద్ర పోవడానికి సైతం కుదరని హీన స్థితి. ఇదంతా వెట్టిచాకిరి ప్రభావం. అవును పసిపిల్లల వెట్టి చాకిరీకి పాతబస్తీ కేరాఫ్ అడ్రస్సుగా మారింది. చిన్నారుల రక్తాన్ని... శ్రమను అక్కడి వ్యాపారులు జలగల్లా పీల్చేస్తున్నారు. పోలీసుల వరుస దాడుల్లో వెలుగు చూస్తున్న ఉదంతాలే ఇందుకు నిదర్శనం. భవానీనగర్‌లో 14 గాజుల పరిశ్రమల్లో పని చేస్తున్న 216 మంది పిల్లలను ఇటీవల వెట్టి నుంచి రక్షించిన పోలీసులు... గురువారం కంచన్‌బాగ్‌లో చీరల తయారీ, ప్లాస్టిక్ కంపెనీల్లో పనిచేస్తున్న మరో 22 మందిని రక్షించారు. వీరిలో బాలికలూ ఉండడం గమనార్హం. పలకా బలపం పట్టాల్సిన పిల్లలను కారాగారాల్లాంటి కర్మాగారాల్లో బంధించి... రాత్రీ పగలు అనే తేడా లేకుండా పనులు చేయించుకుంటున్నారు. బీహార్ నుంచి పిల్లలను అక్రమ రవాణా చేస్తూ... ఇక్కడి వ్యాపారుల కబంధ హస్తాల్లో పెట్టి... వారి బంగారు జీవితాన్ని నాశనం చేస్తున్నారు. అనారోగ్యం పాలైనా పట్టించుకునే వారుండరు. తీవ్ర అస్వస్థతకు గురైతే వారిని తల్లిదండ్రులకు అప్పగించి చేతులు దులిపేసుకుంటారు. కార్మిక చట్టాలకు ఇవి కొన్ని యోజనాల దూరంలో ఉంటాయి. పని గంటల ‘లెక్క’లు అక్కరకు రావు. దాహంతో అలమటిస్తున్నా.... తాగడానికి మంచినీరు కూడా ఇవ్వరు. ఇరుకైన గదుల్లో 20 మంది చొప్పున కుక్కేస్తున్నారు. పిల్లికూనల్లా ఒకరిపై ఒకరు ఒదిగి నిద్రపోవాల్సిందే. వారం రోజుల్లో పోలీసులు సుమారు 16 కంపెనీలలో వరుస దాడులు చేయడంతో వీరి కష్టాలు బయటి ప్రపంచానికి తెలిశాయి. ఈ మాఫియా వెనుక సూత్రధారుల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకు 24 మంది నిందితులను అరెస్టు చేశారు. వెలుగులోకి రాని మరిన్ని కేంద్రాలు.... పాతబస్తీలో గల్లీగల్లీలో బాల కార్మికులు పని చేస్తుంటారు. బల పాలు, రంగుల తయారీ, గాజుల తయారీ, పతంగులు, విస్తరాకులు, దారాల తయారీ వంటి పరిశ్రమల్లో పిల్లలనే పనులకు వినియోగిస్తున్నారు. ముఖ్యంగా శాలిబండ, ముర్గిచౌక్, కోళ్ల ఫారాలు, కామాటిపుర, గాజుబండ, చాంద్రాయణగుట్ట, చందులాల్ బారాదరి, దూద్‌బౌలి, హుస్సేనీఆలం, పటేల్‌మార్కెట్, గుల్జార్‌హౌస్, మొగల్పురాలో ఈ వెట్టిచాకిరి ఎక్కువగా ఉంది. ఇక్కడి వ్యాపారులు సంబంధిత అధికారులకు నెలవారీ మామూళ్లు సమర్పించుకుంటూ... ఈ వ్యవహారం సాగిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక శివార్లలోని పారిశ్రామిక వాడల్లో సైతం బాల కార్మికులతో పని చేయించుకుంటున్నట్లు తెలిసింది. వ్యాపారుల క క్కుర్తి పెద్ద వాళ్లను పనిలో పెట్టుకుంటే వారికి రోజుకు రూ.300 నుంచి రూ.500 వరకు చెల్లించాల్సి ఉంటుంది. పైగా వారు కేవలం 8 గంటలే పని చేస్తారు. యాజమాన్యాల మాట అన్నివేళలా చెల్లుబాటు కాదు. అదే చిన్న పిల్లలను పనిలో పెట్టుకుంటే జీతాలు తక్కువ ఇవ్వవచ్చు, ఎక్కువ గంటలు పని చేయించుకోవచ్చుననేది వ్యాపారుల ఉద్దేశం. దీంతో వారు ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా పిల్లలను తీసుకొచ్చి... వెట్టిచాకిరి చేయించుకుంటున్నారు. వారికి రోజుకు రూ.50 నుంచి రూ.150 వరకు చెల్లిస్తున్నారు. నిందితుల్లో 20 మంది బీహారీలే... భవానీనగర్ ఉదంతంలో పట్టుబడిన నిందితుల్లో 20 మందిని నాలుగు రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగించాలని కోరుతూ స్థానిక ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌రావు నాంపల్లి కోర్టులో గురువారం పిటిషన్ దాఖలు చేశారు. అక్కడ 14 కంపెనీల్లో 213 మంది బాలలతో వెట్టిచాకిరి చేయిస్తున్న కేసుల్లో 22 మందిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. వారిలో 20 మంది బీహారీలే కావడం గమనార్హం. నిందితుల్లో ఇద్దరు మాత్రమే భవానీనగర్‌కు చెందిన తండ్రీ కొడుకులైన వ్యాపారులు మహ్మద్ అక్రమ్ ఖాన్ (32), మహ్మద్ యాసీన్ ఖాన్ (62). ఇక పిల్లల విషయంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఇద్దరు, జార్ఖండ్‌కు చెందిన నలుగురు మినహా మిగతా వారంతా బీహార్ రాష్ట్రంలోని గయ, పాట్నా, నలందా జిల్లాలకు చెందిన వారు. సూత్రధారుల కోసమే... వెట్టిచారికి ఉదంతం వెనుక సూత్రదారులు ఎవరున్నారనే కోణంలో ఆరా తీసేందుకే నిందితులను కస్టడీ కోసం పిటిషన్ వేశామని పోలీసులు అంటున్నారు. పిల్లలను ఇతర దేశాలకేమైనా పంపించారా అనే విషయంపైనా ఆరా తీస్తామన్నారు. ఇతర జిల్లాలు, పట్టణాలకు చిన్నారులను అక్రమ రవాణా చేశారా? అనే విషయాలు త్వరలో వెలుగు చూస్తాయంటున్నారు. బీహార్‌కు చెందిన నిందితులను విచారిస్తే పిల్లలను ఎత్తుకొచ్చారా లేక తల్లిదండ్రుల ఇష్టంతో తీసుకొచ్చారా? అనేది తేలుతుందంటున్నారు. వారికి డబ్బులు ఎలా పంపిస్తున్నారు? బ్యాంకు అకౌంట్లు తదితర వివరాలు త్వరలో బయటికి వస్తాయని చెబుతున్నారు. సీడబ్ల్యూసీ సమన్వయం రామంతాపూర్‌లోని డాన్‌బోస్కో స్వచ్ఛంద సంస్థ ఆధీనంలో ఉన్న పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగించేందుకు ఇక్కడి చైల్డ్ వెల్ఫేరకమిటీ (సీడబ్ల్యూసీ)... బీహార్ సీడబ్ల్యూసీ అధికారులతో ఇప్పటికే సంప్రదించింది. మరోవైపు పిల్లల వయసు నిర్ధారణకు ఉస్మానియా వైద్యులకు పోలీసులు లేఖ రాశారు. త్వరలో ఉస్మానియా వైద్యులు పిల్లల వద్దకే వెళ్లి... వయసు నిర్ధారణ పరీక్షలు చేసే అవకాశాలు ఉన్నాయి. -
‘చోరీ’ సొత్తు అప్పగింత
సాక్షి, ముంబై: లోకల్ రైళ్లలో ప్రయాణికులు పొగొట్టుకున్న లేదా మర్చిపోయిన సామగ్రిని రైల్వే పోలీసు కమిషనర్ శుక్రవారం బాధితులకు అందజేశారు. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. నిత్యం ఉరుకులు, పరుగులతో రాకపోకలు సాగించే ముంబైకర్లు రైలు దిగే హడావుడిలో చేతి బ్యాగులు, ప్లాస్టిక్ క్యారీ సంచులు ఇలా ఏదో ఒక వస్తువు మర్చిపోవడం పరిపాటిగా మారింది. అదేవిధంగా కిక్కిరిసిన రైళ్లలో జేబు దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించి దొరికినంత దోచుకుపోతుంటారు. ఇదే తరహాలో మహిళా బోగీల్లో సైతం విలువైన సామగ్రి, ఒంటిపై ఉన్న బంగారు నగలు తెంచుకుని దొంగలు నడిచే రైలులోంచి దూకి పారిపోవడం పరిపాటిగా మారింది. ఇలా ప్రతిరోజూ పశ్చిమ, సెంట్రల్, హార్బర్ లోకల్ రైల్వే మార్గాల పరిధిలో పదుల సంఖ్యలో ఫిర్యాదులు నమోదవుతాయి. అయితే పొగొట్టుకున్న వస్తువులపై బాధితులు దాదాపు ఆశలు వదిలేసుకుంటారు. ఒకవేళ ఆ వస్తువులు తిరిగి పొందాలంటే చెప్పులరిగేలా రైల్వే పోలీసు స్టేషన్ల చుట్టు తిరగాల్సిందే. ఇదిలా ఉండగా, కొంతకాలంగా రైల్వే స్టేషన్లలో దొంగలను పట్టుకోవడానికి ఆర్పీఎఫ్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పట్టుబడిన దొంగల నుంచి రికవరీ చేసిన చోరీ వస్తువులను, తమ వద్ద నమోదైన ఫిర్యాదులను బట్టి బాధితులకు సమాచారమందించి తిరిగి వారికి అప్పగించేందుకు కార్యాచరణ చేపట్టారు. ఇందులో భాగంగా శుక్రవారం రైల్వే పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో కొందరు బాధితులను పిలిచించి, వారి వస్తువులను తిరిగి అప్పగించారు. -
ఊడ్చి.. ఊడ్చి మూలకు
* గతంలో ఇంటింటికీ ఉండేవి * ఇంటి దేవతగానూ చూసేవారు * ఊడ్చిన అతివలకు వ్యాయామం దొరికేది * ఇపుడు వాకిళ్లు లేవు.. చీపురు కట్టలూ లేవు * మార్కెట్లో రకరకాల ప్లాస్టిక్ చీపుర్లు, వైపర్లు కామారెడ్డి: గ్రామీణ ప్రాంతాలలో చీపురుకు తగిన గుర్తింపే ఉంది. ఇప్పటికీ గొప్పగానే చూస్తారు. ఆడపిల్ల రజస్వల అయినపుడు ఇంటి గడప వద్ద ఓ చీపురును ఉంచే సంప్రదా యం ఉంది. ప్రసూతి అయినపుడు కూడా చీపురుకట్టను గడప దగ్గర ఉంచుతారు. అంటే చీపురును ఇల్లు, వాకిలి ఊడ్చే సాధనంగానే కాకుండా, ఓ దేవతగా భావించే వారు. చీపురు కుటుంబంలో ఒక భాగంగా ఉండేది. ఏ ఇంటికి వెళ్లినా చీపురు కట్టలు ఎక్కడో ఒక చోట దర్శనమిచ్చేవి. ఆధునిక చీపుర్లు వచ్చిన తరువాత చీపురు కట్టలు మూలకు పడ్డాయనే చెప్పాలి. అక్కడక్కడా చీపురుకట్టలు దొరుకుతున్నా, వాటిని వాడడానికి మహిళలు ఆసక్తి చూపడం లేదు. దీంతో పాత కాలపు చీపురుకట్ట కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. అడవుల నుంచే చీపురు పుల్లల సేకరణ చీపురు కొయ్యలు (పుల్లలు) అటవీ ప్రాంతాలు, కంచె లలోనే ఎక్కువగా లభిస్తాయి. వీటిని కోసుకువచ్చేవారు ప్రతీ గ్రామంలో ఉంటారు. కూలీలు వ్యవసాయ పనులు లేని సమయంలో అడవులు, కంచెలకు వెళ్లి చీపురు పుల్లలను కోసుకొచ్చి ఇంటి ముందరనో, ఇళ్లపైనో ఎండబెడుతారు. వాటి కొసలకు ముళ్లలాంటివి ఉంటాయి. రోజం తా తిరిగి పదిహేను ఇరవై చీపుర్లకు సరిపడా కొయ్యలు కోసుకొచ్చేవారు. నాలుగు రోజులు ఎండిన తరువాత పుల్లలను మడతలుగా పట్టుకుని కర్రతో కొడుతూ ముళ్లను తొలగిస్తారు. తరువాత పుల్లలను కట్టలుగా కడతారు. అడవుల నుంచి కోసుకొచ్చి కట్టిన చీపురు కట్టలు ఇప్పుడు కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి. ఒక్కో చీపురును రూ. 15 విక్రయిస్తున్నారు. అయితే, మహిళలు వాటిని ఇష్టపడడం లేదు. ఆధునిక చీపుర్ల ధరలు అడ్డగోలుగా ఉన్నా వాటిపైనే ఆసక్తి చూపుతున్నారు. చీపురుతో వ్యాయామం కూడా తెలవారకముందే మహిళలు చీపురుకట్టతో అటూ, ఇటూ వాకిళ్లు ఊడుస్తూ ఉంటే వ్యాయామం కన్నా ఎక్కువ మేలు జరిగేది. మార్కెట్లో పొడవైన చీపురుకట్టలు, వై పర్లు వచ్చిన తరువాత మహిళలు ఎలాంటి శ్రమ లేకుండా ఊడ్చగలుగుతున్నారు. తద్వారా వారు శారీరక వ్యాయామం పొందలేకపోతున్నారు. అంగట్లో ఆధునిక చీపుర్లు మార్కెట్లో అన్ని వస్తువులలాగే చీపుర్లు కూడా రకరకాలవి తరలివచ్చాయి. ఇతర దేశాల నుంచి కూడా రకరకాల చీపుర్లు మార్కెట్ ను చుట్టేశాయి. కొబ్బరి తదితర చీపుర్లు మార్కెట్లో లభిస్తున్నాయి. అవి ఎక్కువ ఎత్తు ఉంటాయి. వంగకుండానే వాకిలి, ఇల్లు ఊడ్చుకోవచ్చు. దీంతో మహిళలు వాటిని వాడడానికే ఆసక్తి చూపుతు న్నారు. చీపురు కట్టలు నేటి తరం మహిళలకు నచ్చడం లేదు. పట్టణాలలోనే కాదు పల్లెలలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. తెలతెలవారకముందే తెల్లవారకముందే మహిళలు నిద్రనుంచి లేచి వాకిళ్ల వెంటపడేవారు. అప్పట్లో ప్రతీ ఇంటి ముందర ఇల్లంత వాకిలి ఉండేది. మహిళలు అందరూ ఒకే స మయంలో వరుసగా ఉంటే ఇళ్ల ముందర చీపురుతో ఊడుస్తుంటేతో ఓ రకమైన సంగీతం వెలువడేది. వాకిలి ఊడవడానికో చీపురు, ఇంటిలోపల ఊడవడానికో చీపురు ఉండేది.స్నా నపు గదులకు, వంటింటికి వేర్వేరుగా చీపురు కట్టలు ఉంచుకునేవారు. అంటే ఒక్కో ఇంటికి నాలుగైదు చీపుర్లు ఉండేవి. చీపురు కట్టల సీజన్ వచ్చిందంటే చాలు ఒక్కో ఇంటిలో పదుల సంఖ్యలో చీపురు కట్టలను జమచేసుకుని పెట్టేవారు. చీపురుకొయ్యలు కోసుకువచ్చిన వారు తమకు సరిపడా ఉంచుకుని మిగతావి అమ్ముకునేవారు. -
ప్లాస్టిక్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
ఒక్క చాన్స్...ఫ్లీజ్!
సాక్షి ప్రతినిధి, కడప: ‘మహాత్ముని సాక్షిగా ఆగస్టు 15 నుంచి ప్లాస్టిక్‌ను నిషేదిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం’ అనే నినాదంతో నగర పాలక సంస్థ ముందుకెళుతోంది. ప్లాస్టిక్ వస్తువుల క్రయ విక్రయాలను కార్పొరేషన్ పరిధిలో నిషేదం విధించారు. ఆలస్యంగానైనా శుభపరిణామంగా నగరవాసులు భావిస్తున్నారు. పలు దుకాణాలలో ప్లాస్టిక్ వస్తువులను వాడటం లేదు. అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు కార్పొరేషన్ యంత్రాంగంలో కొంతమంది అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యాపారుల నుంచి ఒప్పందం కోసం ఆరాటపడుతున్నట్లు సమాచారం. నగరపాలక సంస్థ ప్లాస్టిక్‌పై నిషేదం విధించడంతో అదే వ్యాపారం చేస్తున్న వారిలో అలజడి అధికమైంది. జిల్లా కేంద్రమైన కడపలో ప్లాస్టిక్ కవర్లు, ప్లేట్లు, గ్లాసులు విక్రయించే దుకాణాలు వందకు పైగా ఉన్నాయి. బీకేఎం స్ట్రీట్‌లోనే సుమారు 50కి పైగా హోల్‌సేల్, రిటైల్ దుకాణాలు ఉన్నాయి. గతంలో నిషేదం విధించినా పెద్దగా పట్టించుకోకపోవడంతో ఆ వ్యాపారం ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రస్తుతం కార్పొరేషన్ అధికారులు గట్టి చర్యలు తీసుకుంటుండటంతో వ్యాపారుల్లో తీవ్ర అలజడి వ్యక్తమవుతోంది. ఇందుకు కారణం సుమారు రూ.2.5 కోట్ల స్టాకు వ్యాపారుల వద్ద ఉండటమేనని తెలుస్తోంది. దీంతో కార్పొరేషన్లో కీలకంగా ఉన్న ఓ అధికారిని వ్యాపారులు సంప్రదించినట్లు సమాచారం. సమయం ఇవ్వండి.. ఉన్న స్టాకును విక్రయించుకుంటాం.. తర్వాత విక్రయాలు చేపట్టమని మొరపెట్టుకున్నట్లు తెలుస్తోంది.ఇందుకు రూ.10లక్షలు నజరానాగా ఇచ్చేందుకు వ్యాపారులు ముందుకువచ్చినట్లు సమాచారం. అయితే రూ.2.5 కోట్ల స్టాకులో 10శాతం ఇవ్వగల్గితే తాను మేనేజ్ చేయగల్గుతానని ఆ అధికారి వివరించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా బీకేం స్ట్రీట్‌లో పెద్దగా తనిఖీలు చేపట్టలేదని సమాచారం. వాస్తవానికి ప్లాస్టిక్ విక్రయాలు అక్కడే కీలకం. ఇప్పటి వరకూ బీకేఎం స్ట్రీట్‌లో కార్పొరేషన్ అధికారులు దాడులు చేసి రూ.3250 మాత్రమే అపరాధం రాబట్టగల్గిగారు. యంత్రాంగం పనితీరు ఈ వ్యవహారానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఇదే విషయమై నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ వినోద్‌కుమార్‌ను సంప్రదిస్తే రెండురోజులు మాత్రమే బీకెఎం స్ట్రీట్‌లో దాడులు చేసినట్లు వివరించారు. గురు, శుక్రవారాలలో తనిఖీలు చేపట్టలేదని పేర్కొన్నారు. ప్లాస్టిక్ నిషేధంపై కృతనిశ్చయంతో ఉన్నామని తెలిపారు. -
జ్ఞానోదయాల్లో గ్యాపులు!
ఉత్త(మ)పురుష లక్ష పూల నుంచి కొద్దికొద్దిగా మకరందాన్ని పోగేసి, తేనె పట్టు వేసినట్లుగా మావారి సంపాదనలో పైసా పైసా కూడబెట్టి రెండేళ్ల క్రితం ఎట్టకేలకు ఓ సోఫా సెట్టు, ఓ డ్రెస్సింగ్ టేబుల్ తీసుకున్నాన్నేను. అవి తీసుకున్నప్పట్నుంచీ నా మీద ఆయన సెటైర్లు మొదలు. శ్రీవారికి ఫోన్ చేసిన స్నేహితులకూ, తానే స్వయంగా ఫోన్ చేసి మిత్రులకూ నా షాపింగ్ గొప్పదనాన్ని కామెడీగా వివరించడం మొదలుపెట్టారు. ఇలా అడిగిన వారికీ, అడగని వారికీ మినహాయించి మిగతావారెవ్వరికీ తానేమీ చెప్పడం లేదంటూ చమత్కారమొకటి. అవును... ఇంటికి అవసరమైన ఈ వస్తువులు తీసుకున్నాన్నేను. వృత్తిపరంగా ఎంతోమంది మా ఇంటికి వచ్చి, ముందుగదిలోనే అఫీషియల్ కాన్ఫరెన్సుల్లాంటివాటిని అనఫీషియల్‌గా నిర్వహిస్తుంటారు మావారు. ఇది ఆయన ఆఫీసులో చేసే పనికి అదనం. ఎంతోమంది పెద్దలూ, పిన్నలూ, మాన్యులూ, అసామాన్యులూ వస్తుంటారు గాబట్టి సోఫా ఒకటి ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఇక డ్రెస్సింగ్ టేబుల్ అంటారా... అదేదో నేను మేకప్ చేసుకోడానికి కాకుండా, మీలో వస్తున్న మార్పులను నిత్యం పరికించడానికి ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. కానీ మావారికెంతసేపటికీ... రెండేళ్ల నుంచి సంపాదించిన మొత్తాన్ని రెండు గంటల షాపింగ్‌లో ఖర్చు చేసినట్లుగా గత రెండునెలలుగా నా మీద జోకులేస్తున్నారు. ఆఫీసునుంచి పెద్దలు రాగానే సోఫాల్లో ఆసీనులను చేయించారు మావారు. కాఫీ ఏదైనా తెమ్మంటూ నాకు పురమాయింపు. మొత్తానికి ఆ రోజు మీటింగులో సోఫాలు కూడా చట్టంలాగే తమ పనిని తాము నిశ్శబ్దంగా చేసుకుపోయినట్టు అనిపించింది మా శ్రీవారికి. ఎందుకంటే... అంతకు ముందు మా ఇంట్లో ఒకదానిలో మరొకటి దూరిపోయేలా ఉంచేసే నాలుగు ప్లాస్టిక్ కుర్చీలు ఉండేవి. ఎవరైనా అతిథులు రాగానే ఆయన హడావుడిగా ఆ బండిల్ సెట్టును లోపల్నుంచి తెచ్చి గబగబా కుర్చీలోంచి కుర్చీని లాగేసి పేర్చేవారు. ఇలాంటి ఒక శుభముహూర్తానే... మీటింగ్ తర్వాత ఓ కుర్చీలోకి మరో కుర్చీని దూర్చేప్పుడు ఒకదాని కాలు మరోదాని సీటుమీద బలంగా పడి ఓ రంధ్రం కూడా పడింది. ఆ కుర్చీలో తాను కూర్చుని సదరు రంధ్రాన్వేషణ ఎవ్వరికీ సాధ్యం కాని విధంగా తనను తాను సర్దుకుంటూ కూర్చుంటుండేవారు మా వారు. కానీ ఈ సోఫాల పుణ్యమా అని ఆయనకు ఆ బాధ తప్పిపోయింది. మధ్యతరగతి మాడెస్టీల ప్రకారం ఆ మాత్రం సోఫాలకు మనమూ డిజర్వింగే సుమా అనే ఒకలాంటి భావన నెలకొంది మా శ్రీవారిలో. ఇక డ్రెస్సింగ్ టేబుల్ వచ్చాక అందులో నన్ను నేను చూసుకుంటూ మేకప్పు అయ్యిందెంతో తెలియదు గానీ... మా ఆయనే వెనక్కు తిరిగినప్పుడు టక్కూ... ముందుకు తిరిగినప్పుడు స్టమక్కూ చూసుకోవడం సరిపోయింది. ఇవన్నీ నేను గమనిస్తునే ఉన్నా... ఆయన నాపై వేసే జోకులనూ చూసీచూడనట్లుగానే పోతున్నా. ఎందుకంటే నాకు తెలుసు... నేను చేసింది వేస్ట్ కాదని. రెండేళ్ల తర్వాత ఆయనే అన్నారు. స్నేహితుడితో ఫర్నిచర్ షాపుకు వెళ్లారట. ఆ రాత్రి నాతో అన్నారు. ‘‘నువ్వు సోఫా, డ్రెస్సింగ్ టేబులూ రెండేళ్ల క్రితం మనం కొనడం మంచిదైంది. అప్పటి ఇరవై వేలు... ఇప్పటి ముప్ఫై అయిదు వేలు. కాబట్టి ఇవ్వాళ్టి లెక్క ప్రకారం చూసినా మనకు పదిహేను వేలు ఆదా’’ అంటూ రెండేళ్ల క్రితం నేను చేసిన ‘దుబారా’లో... ‘మనం’ అంటూ తానూ వాటా కలిశారు. ఇక్కడ నేను మాట చెప్పదలిచాను. దేన్నో వెతుక్కుంటూ వెళ్లి తపస్సు చేసిన సిద్ధార్థుడికి జ్ఞానోదయమై, బుద్ధి కలిగి బుద్ధుడు కావడానికి ఎన్నేళ్లు పట్టిందో తెలియదుగానీ... ఆయన అడవులకు వెళ్లిపోయిన రోజే మొగుడి మీద ఆధారపడకూడదని గౌతముడి భార్య యశోధరకు ఆ క్షణంలోనే జ్ఞానోదయమై ఉంటుంది. అలాగే రెండేళ్ల క్రితమే నాక్కూడా. కాకపోతే మగాళ్లకు జ్ఞానోదయమై సత్యం తెలిసి రావడానికి మాత్రం చాలా టైం గ్యాప్ అవసరమవుతుంది. అదీ తేడా! - వై! -
డ్వామా బరితెగింపు
సాక్షి ప్రతినిధి, అనంతపురం : అక్రమార్కులను వెనకేసుకు రావడంలో డ్వామా అధికారులు బరితెగించారు. అక్రమాలకు పాల్పడుతున్న కాంట్రాక్టర్ల పట్ల నిస్సంకోచంగా ‘రాజును మించిన రాజ భక్తి’ చాటుకుంటున్నారు. అసలు వీరు ప్రభుత్వ అధికారులా.. లేక ఆ రూపంలో ఉన్న కాంట్రాక్టర్లా అనిపించేలా వ్యవహరిస్తున్నారు. దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్న చందంగా జిల్లా నీటి యాజమాన్య సంస్థలో చిరుధాన్యాల మినీ కిట్స్ పంపిణీ తయారైంది. శనివారం నగరంలో నకిలీ విత్తనాల ప్యాకింగ్ స్థావరంపై పోలీసులు, వ్యవసాయ అధికారులు సంయుక్తంగా జరిపిన దాడుల్లో కళ్లకు కట్టినట్లు అక్రమాలు బయటపడ్డా... సదరు కాంట్రాక్టరుపై ఈగ కూడా వాలకుండా డ్వామా ఏపీడీ పోలీసుల వద్ద కూడా వాంగ్మూలం ఇచ్చారంటే అక్రమార్కులు, అధికారుల మధ్య బంధం ఎంత గట్టిగా పెనవేసుకు పోయిందో అర్థమవుతోంది. ‘డ్వామా’లో విత్తనాల సరఫరాను పర్యవేక్షించే ఏపీడీ నాగభూషణం కాంట్రాక్టరును వెనకేసుకొస్తున్న వైనం చూసి సంస్థలో సిబ్బందే ఆశ్చర్యపోతున్నారు. శనివారం నగరంలో అక్రమ విత్తనాల ప్యాకింగ్ స్థావరంపై పోలీసులు, వ్యవసాయ అధికారులు దాడులు నిర్వహించారు. ఆ స్థావరంలో ‘డ్వామా’ పేరుతో ప్లాస్టిక్ కవర్లు ఉండటంతో డ్వామా అధికారులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. అక్రమ విత్తనాల ప్యాకింగ్ స్థావరం యజమాని, కంట్రాక్టరు అయిన శ్రీధర్ రెడ్డికి కూడా పోలీసులు సమాచారం ఇచ్చారు. అయితే కాంట్రాక్టరు మాత్రం ఆ ఛాయలకు రాలేదు. డ్వామా ఏపీడీ మాత్రం హాజరై విత్తనాల ప్యాకింగ్‌లో ఎలాంటి అక్రమాలు లేవని, అంతా సవ్యంగానే జరుగుతోందంటూ వాదించారు. అయితే వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం ఎలాంటి ధ్రువీకరణ లేని ధాన్యాన్ని విత్తనాల కింద సరఫరా చేయడం అక్రమమే అని తేల్చి చెప్పారు. ఆ మేరకు అక్కడున్న ధాన్యాన్ని సీజ్ చేసి కలెక్టర్‌కు నివేదిక పంపారు. సంబంధిత కాంట్రాక్టరుపై కేసు నమోదుకు సంబంధించి త్రీ టౌన్ ఎస్ఐ తమీమ్ అహ్మద్‌ని ‘సాక్షి’ సంప్రదించగా.. విత్తనాల ప్యాకింగ్ అంతా సవ్యంగానే జరుగుతోందని, అక్రమాలు లేవని డ్వామా ఏపీడీ వాంగ్మూలం ఇవ్వడంతో ఆ విషయాలనే ‘జనరల్ డైరీ’(జీడీ)లో నమోదు చేసుకున్నామని, ఫిర్యాదు లేక కేసు నమోదు చేయలేదని తెలిపారు. అసలు టెండర్లే పిలవలేదు : విత్తనాల సరఫరాకు సంబంధించి కాంట్రాక్టరుతో డ్వామా కుదుర్చుకున్న కాంట్రాక్టు అగ్రిమెంట్ కాపీ ఇవ్వాల్సిందిగా ‘సాక్షి’ సంబంధిత ఏపీడీని మంగళవారం కోరింది. అందుకు సంబంధించిన వివరాలు సాయంత్రం ఇస్తానన్న అధికారి, తీరా సాయంత్రం అసలు విషయం బయట పెట్టారు. విత్తనాల సరఫరాకు సంబంధించి తామేమీ టెండర్లు పిలవలేదని, ఇండెంట్‌పై నేరుగా సంబంధిత డీలర్ నుంచి ఒక్కో మినీ కిట్ రూ.350 చొప్పున 11 వేల మినికిట్స్ కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. ఒక్కో కిట్ రూ.350 చొప్పున 11 వేల కిట్లకు రూ.37.50 లక్షలు అవుతుంది. ఇంత పెద్ద మొత్తంలో కొనుగోలు జరిపేటప్పుడు టెండర్ లేకుండా ఎలా చేశారని ప్రశ్నిస్తే.. డ్వామాలో ఇలా టెండర్లు లేకుండానే కొనుగోలు చేసే వెసులుబాటు ఉంటుందంటూ తన చర్యను సమర్థించుకున్నారు. అసలు విలువ : టెండర్ల విషయం అటుంచి.. వాస్తవంగా కాంట్రాక్టరు సరఫరా చేస్తున్న చిరుధాన్యాల విలువ ఎంత? అందుకు డ్వామా చెల్లిస్తోందెంత? అన్న వివరాలు చూస్తే ఎవరికైనా కళ్లు తిరగక మానవు. ప్రతి మినీ కిట్‌లో జొన్న, మొక్క జొన్న, సజ్జ, కొర్రలు అరకేజీ చొప్పున ఉంచి సరఫరా చేస్తున్నారు. ఈ చిరు ధాన్యాలు మార్కెట్ ధర కిలోకు.. జొన్న రూ.22, మొక్క జొన్న రూ.14, సజ్జ రూ.18, కొర్ర రూ.40 గా ఉన్నాయి. ఈ లెక్కన కాంట్రాక్టర్ మినీ కిట్‌లో ఉంచే నాలుగు రకాల ధాన్యం ధర రూ.47. సంచి, రవాణా ఖర్చులు మరో రూ.15 వేసుకున్నా మొత్తం ఖర్చు రూ.62. ఒక్కో కిట్‌పై వీరికి మిగిలేది రూ.288. 11వేల కిట్లకు రూ.31.68 లక్షలు. ఒక్క చిరుధాన్యాల సరఫరాలోనే రూ.31.68 లక్షలు ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయ్యిందంటే.. ఇక మిగతా ‘డ్వామా’ పథకాల్లో ఎంత అవినీతి చోటు చేసుకుని ఉంటుందో అన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అంతా సక్రమమేనంటూ వితండవాదం : ఈ విషయమై సంబంధిత ఏపీడీ నాగభూషణంను సంప్రదించగా.. విత్తనాల సరఫరాలో అక్రమాలు ఏమీ లేవని, మీరు సరైన అవగాహన లేక వార్త రాశారన్నారు. ఈ విషయమై తాము కలెక్టర్‌కు కూడా రెండు పేజీల వివరణ పంపుతున్నామని తెలిపారు. కలెక్టర్‌కు పంపిన నివేదిక ప్రతిని అడగ్గా దాన్ని యథాతథంగా ఇవ్వలేనని, కలెక్టర్‌కు పంపిన లేఖ సారాంశాన్ని తెలుగులో రాసి ‘సాక్షి’కి మెయిల్ చేశారు. తమకు విత్తనాలు సరఫరా చేసే కాంట్రాక్టరు లెసైన్సుడు విత్తన డీలర్ అని, లెసైన్సుడు డీలర్ తన గోడౌన్లో లూజు విత్తనాలను ప్యాకింగ్ చేయడంలో ఎలాంటి చట్ట వ్యతిరేకతకు పాల్పడలేదన్నారు. ఆ విత్తనాలను ధ్రువీకరణ లే ని విత్తనాలుగా వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొనడం దురదృష్టకరమం టూ.. వారిపైనా తన కడుపు మంటను వెళ్లగక్కారు. ప్రభుత్వ విత్తన ధ్రువీకరణ సంస్థ నుంచి ఎలాంటి ధ్రువీకరణ లేకుండా ప్యాక్ చేస్తుంటే ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? రూ.37.50 లక్షల విలువైన పనిని టెండర్లు నిర్వహించకుడానే ఒక కాంట్రాక్టరుకు ఎందుకు కట్టబెట్టినట్లు? సప్లై కాంట్రాక్టరు నిబంధనల మేరకు సర్టిఫైడ్ సీడ్ కాకుండా మండీలో ధాన్యాన్ని చిన్న ప్యాకెట్లలో పెట్టి సరఫరా చేస్తే ఎందుకు ‘డ్వామా’ అధికారులు ఎందుకు ప్రశ్నించలేదు? ఈ ప్రశ్నలకు ‘డ్వామా’ ఏపీడీ సమాధానం దాట వేయడం గమనార్హం. -
యథేచ్ఛగా ప్లాస్టిక్ సంచుల వినియోగం
పింప్రి, న్యూస్‌లైన్ : ప్లాస్టిక్ సంచులపై పుణే కార్పొరేషన్ సంపూర్ణ నిషేధం విధించినా, అమలు మాత్రం సాధ్యం కావడం లేదు. వీటిని వినియోగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మొదట్లో ప్రకటనలు చేసి న అధికారులు తదనంతరం తనిఖీలు నిర్వహిం చడం మానేశారు. దుకాణాల్లో క్యారీ బ్యాగులను తనిఖీ చేసేందుకు సరైన సిబ్బంది లేకపోవడం కార్పొరేషన్‌కు ఈ పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వర కు దొంగచాటుగా చెలామణి అవుతున్న క్యారీ బ్యాగులు ఇక మీదట విచ్చలవిడిగా వినియోగమయ్యే ప్రమాదం ఉంది. ఫలితంగా డ్రైనేజీలు ప్లాస్టిక్ సం చులతో నిండిపోతాయి నగరవాసులు ఆవేదన చెందుతున్నారు. పుణేలో ప్రతి రోజు రెండువేల టన్నుల చెత్త పోగవుతోంది. చెత్తలో అధికంగా ప్లాస్టిక్ బ్యాగులు ఉండడం వల్ల వ్యర్థాలను వేరుచేయడం ఇబ్బందిగా మారిందని మున్సిపల్ సిబ్బంది చెబుతున్నారు. నిలిచిఅపోయిన తనిఖీలు ప్రస్తుతం కార్పొరేషన్ వద్ద సిబ్బంది కొరత వల్ల ప్లాస్టిక్ సంచుల తనిఖీలకు వెళ్లడం లేదు. 50 మైక్రాన్లల కంటే తక్కువ మందం గల క్యారీ బ్యాగుల వినియోగంపై నిషేధం విధించారు. వీటిని ఉపయోగించిన వారి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరు వరకు సుమారు రూ.12 లక్షలు వసూలు చేసింది. సిబ్బంది కొరత వల్ల నాలుగు నెలలుగా తనిఖీలు నిలిపి వేయడంలో వసూళ్లు కూడా తగ్గిపోయాయి. జనవరిలో 1,994 సంస్థలు, వ్యక్తులు ప్లాస్టిక్ సంచు లు ఉపయోగించినట్టు తేలింది. -
చెత్త బిజినెస్ రూ.7 కోట్లు
సాక్షి, హన్మకొండ : వార్తా పత్రికల ప్రాధాన్యం తెలియని వారుండరు. ప్రపంచవ్యాప్త సమాచారాన్ని అవి అందిస్తాయి. ఇక స్కూలు పుస్తకాల నుంచి వార, మాస పత్రికలు, మ్యాగజైన్లు అందించే విజ్ఞానం, వినోదం ఎంతో ఉంది. ఇవన్నీ ఎంత విజ్ఞానాన్ని అందించినా సంవత్సరాల తరబడి వీటిని ఇంట్లో పెట్టుకోలేం. ఎప్పుడో ఒకప్పుడు వీటిని బయటకు పంపాల్సిందే. అలాగే పలు రకాల గృహోపకరణాలతో వచ్చే ప్యాకింగ్ అట్టలు, పేపర్లు తదితరాలను ఎప్పుడెప్పుడు వదిలించుకుందామా అని వ్యాపారులు ఆలోచిస్తుంటారు. కానీ ఇలా వదిలించిన సరుకుతో జిల్లా వ్యాప్తంగా ప్రతీరోజు రూ.20లక్షల వ్యాపారం జరుగుతోంది. ఇందులో సగం వాటా వరంగల్దే. ప్రస్తుతం పాతపేపర్లకు మార్కెట్లో కేజీ రూ.10 నుంచి రూ.11 వరకు ధర పలుకుతోంది. అట్టలకు కేజీ రూ. 9 పలుకుతోంది. ప్రతీ ఇంటినుంచి సేకరించే ఈ చెత్త టన్నుల కొద్దీ పోగవుతోంది. ప్రతీరోజు సగటున 18 టన్నుల బరువు గల పాత పేపర్లు, అట్టలు వరంగల్ నగరం నుంచి రాష్ట్రంలో ఉన్న వివిధ రీసైక్లింగ్ యూనిట్లకు తరలివెళ్తున్నాయి. తుక్కు రేగుతోంది గత దశాబ్దకాలంలో పాత పేపర్లు, బీరు బాటిళ్లకు గిరాకీ పెరిగింది. కానీ ఎప్పటి నుంచో పాత ఇనుప సామాన్లకు ఉన్న డిమాండే వేరు. ఇంటి నిర్మాణం నుంచి పైపుల వరకు వాడే ఇనుప పరికరాలు కాలక్రమంలో చేరేది పాత ఇనుప సామాన్ల దుకాణాలకే. తుప్పు పట్టిన ఇనుము ధర కిలోకు రూ.22 వరకు పలుకుతోంది. జిల్లావ్యాప్తంగా 22 టన్నుల పాత ఇనుప సామాన్లు పోగవుతున్నాయి. రోజుకో లారీ తుక్కు ఇనుము వరంగల్ నుంచి ఎగుమతవుతోంది. ఇలా సేకరించి.. అలా పంపించి.. రీసైక్లింగ్‌కు అవకాశం ఉన్న పేపర్లు, బాటిళ్లు, ఇనుప సామాన్లు, ప్లాస్టిక్ వస్తువులను పలు రకాలుగా సేకరిస్తారు. చెత్త కుప్పల్లో పడేసే వ్యర్థాల నుంచి వ్యాపారానికి పనికి వచ్చే బీరు బాటిళ్లు, ప్లాస్టిక్ బాటిళ్లను కాలినడకన కొందరు, సైకిళ్లు, మోటారు సైకిళ్లతో పాటు నాలుగుచక్రాల బండితో ఇంటింటికీ తిరుగుతూ మరికొందరు సేకరిస్తారు. ఇంకొందరు ఆటోలో ప్రతీ వీధీ తిరుగుతూ పాత పేపర్ల నుంచి పాత ఇనుప సామాన్ల వరకు సేకరిస్తుంటారు. రోజంతా సేకరించిన వీటిని హన్మకొండ హంటర్‌రోడ్డు, రాంనగర్, బడేమసీద్ లతో పాటు వరంగల్‌లోని కరీమాబాద్ ఏరియాలో ఉన్న దుకాణాల్లో విక్రయిస్తారు. రూ.కోట్లలో వ్యాపారం చెత్త బిజినెస్‌లో ఉన్న వారి అంచనాలకు బట్టి ప్రతీ రోజు పాత పేపర్లు, అట్టలు సేకరణ, అమ్మకాలకు సంబంధించి రోజుకు రూ.20 లక్షల వరకు క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. ఆ తర్వాతి స్థానంలో ఇనుప సామన్లు ఉన్నాయి. నిత్యం మూడు లక్షల రూపాయల విలువ చేసే పాత ఇనుము దుకాణాలకు చేరుతోంది. మూడో స్థానంలో ఖాళీ మద్యం సీసాలున్నాయి. వీటి సేకరణ.. విక్రయం వల్ల రోజుకు లక్ష రూపాయలు చేతులు మారుతున్నాయి. ప్లాస్టిక్ బాటిళ్లు, బకెట్లకు కూడా గిరాకీ బాగానే ఉంటోంది. ఐదు వందల మందికి ఉపాధి పాతపేపర్లు, ఇతర వ్యర్థాలను సేకరించడం ద్వారా నగరంలో ప్రత్యక్షంగా సుమారు ఐదువందల మంది ఉపాధి పొందుతున్నారు. వీరిలో నాలుగువందలమంది చెత్తను సేకరిస్తుంటే మ రో వందమంది కార్మికులు ఆ చెత్తను కేటగిరీల వారీగా విభజిం చే పనిలో ఉన్నారు. వీరే కాక చెత్తను లోడింగ్, అన్లోడింగ్, ర వాణా పనిలో సుమారు మరో వందమంది వరకు ఉపాధి పొందుతున్నారు. ఇక్కడా తగ్గని కిక్కు ఖాళీ మద్యం బాటిళ్ల వ్యాపారం కూడా కిక్కెక్కేలా సాగుతోంది. ప్రస్తుతం మార్కెట్లో ఖాళీ బీరు బాటిల్ రూ.1.60 వరకు హోల్‌సేల్ ధర పలుకోతోంది. విస్కీ, బ్రాందీ, జిన్, వోడ్కాలకు సంబంధించి అవి లభించే క్వార్టర్, ఆఫ్, ఫుల్ బాటిల్ పరిమాణాలను బట్టి ఒక్కో బాటిల్‌కు 25 పైసల నుంచి రెండు రూపాయల వరకు చెల్లిస్తున్నారు. ప్రతిరోజూ ఇంటింటికీ తిరిగి సేకరించే బీరుబాటిళ్లు సగటున రోజుకు 50వేల వరకు ఉంటున్నాయి. ఈ మద్యం సీసాలను స్థానికంగా ఉన్న మద్యం షాపులు, బార్లు, చెత్తకుప్పలతో పాటు ఇంటింటికి తిరిగి సేకరిస్తారు. సేకరించిన బీరు బాటిళ్లను కొనే కేంద్రాలు నగరంలో యాభై వరకు ఉన్నాయి. ఆయా షాపుల నుంచి వరంగల్‌కు చేరుస్తారు. అక్కడ వాటిని బాటిల్ కంపెనీల ప్రకారం వేరుచేసి బస్తాల్లో నింపి హైదరాబాద్‌కు పంపుతారు. ఒక బస్తాలో 200 బాటిళ్లను నింపుతారు. ఇటువంటి బస్తాలు రోజుకు 250 వరకు నిండుతాయి. -
తగ్గని ప్లాస్టిక్ వాడకం
ఉట్నూర్ రూరల్, న్యూస్‌లైన్ : ప్లాస్టిక్ కవర్లపై నిషేధం అమలు కావడం లేదు. కవర్లు వాడకూడదంటూ అప్పుడప్పుడు హడావుడిగా ప్రచారం చేసే అధికారులు తరువాత పట్టించుకోకపోవడంతో ప్లాస్టిక్ కవర్ల వాడకం తగ్గకుండా పోయింది. పరిస్థితి ఇలాగే ఉంటే వీటి ప్రభావం పర్యావరణంపై తీవ్రంగా పడే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారులు ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. ఇదీ పరిస్థితి దాదాపు ప్రతి చోట ప్లాస్టిక్ కవర్ల వాడకం ఎక్కువగా కనిపిస్తోంది. ఏ చిన్న వస్తువు కొన్నా కవర్లో పెట్టి ఇవ్వండి అంటూ చెబుతున్న మాటలే వీటికి నిదర్శనం. ప్లాస్టిక్ ఉత్పత్తులు ఎక్కువగా వాడితే అనారోగ్యాలతో పాటు వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని తరచూ వైద్యులు హెచ్చరిస్తున్నా పరిస్థితుల్లో మాత్రం ఎలాంటి మార్పులు రావడం లేదు. ప్లాస్టిక్ ఉత్పత్తులు వేల సంవత్సరాలు భూమి పొరల్లో ఉండిపోవడంతో పాటు కరగక పోవడంతో భవిష్యత్తులో విపత్కరమైన పరిస్థితులు మానవాళి ఎదుర్కోబోతుందని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తూ వస్తున్నారు. అదేవిధంగా ప్లాస్టిక్ కాల్చడం ద్వారా దాని నుంచి విషపూరిత వాయువు వెలువడి ప్రజలు వ్యాధుల బారిన పడే అవకాశం లేకపోలేదు. టీ, జ్యూస్ ఇతర ఆహార పదార్థాల ప్లేట్లు, గ్లాసులో పదార్థాలు తీసుకుంటే క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని వైద్యులు సైతం హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ కారణంగా పశువులకు సైతం తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయి. జీర్ణకోశ వ్యాధులతో పశువులు వ్యాధి బారిన పడి మరణించిన సంఘటనలు సైతం విపరీతంగాపెరిగిపోతున్నాయి. చర్యలు తీసుకుంటేనే... ప్లాస్టిక్ వాడకాన్ని రెండేళ్ల క్రితమే ప్రభుత్వం నిషేధిస్తున్నట్లు ఓ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉన్న కవర్లను మాత్రమే వాడాలని హెచ్చరిస్తోంది. దీనికి తోడు కాటన్, జనపనారలతో తయారు చేసే ఉత్పత్తులకు రాయితీ సౌకర్యం ఇస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ప్రస్తుతం అధికారులు ప్లాస్టిక్ సమస్యను నివారించేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడు మాత్రమే ప్లాస్టిక్ భూతం నుంచి మానవాళి తనను తాను రక్షించుకోగలుగుతుంది. -
ఆవాసం ఆరోగ్యం
ఇల్లు మనకు ఆవాసం. మనం నిశ్చింతగా ఫీలయ్యే నివాసం. అక్కడ ఏ భయాలూ ఉండకూడదన్నది అందరి ఆకాంక్ష. కానీ మనం సురక్షితం అనుకునే చోట్లలో కూడా మనకు తెలియకుండానే అనేక అపాయాలు నిరీక్షిస్తూ ఉంటాయని మీకు తెలుసా? అవే... మనకు తెలియకుండా మనింట్లోనే పొంచి ఉండే విషపదార్థాలు. ఆ విషాలు అలర్జీలను ప్రేరేపించి మనల్ని జబ్బు పడేలా చేస్తాయి. ఈ తరహా విషపదార్థాలు వేడి వేడిగా మరిగే చికెన్ పులుసులోనూ ఉంటాయన్నది నమ్మలేని సత్యం. మన ఇంట్లోని ఆ పదార్థాలను తెలుసుకునేందుకు ఉపకరించేదే ఈ కథనం. ప్లాస్టిక్ పాత్రలో పెట్టే కూర... కనిపించని విషపు కోర... ఇప్పుడు మన సూప్ బౌల్స్ అందంగా కనిపించే ప్లాస్టిక్ వంటి పదార్థాలతో తయారవుతున్నాయన్న విషయం తెలిసిందే. పైకి అందంగా కనిపించే ఈ బౌల్స్ ఉపయోగానికి అంత అందమైనవి కాదు. సాధారణంగా ఈ కూరల బౌల్స్ ‘మెలామైన్’ అనే ప్లాస్టిక్ వంటి పదార్థంతో తయారవుతాయి. వేడి వేడి కూరలు, పులుసులు ఇందులోకి తీయగానే ఆ వేడికి ప్లాస్టిక్‌లోని మెలామైన్... ఆహారంతో పాటు కలిసి నోటి ద్వారా శరీరంలోకి వెళ్తుంది. దేహంలోకి వెళ్లిన ఈ పదార్థం వల్ల కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం ఉందని ఒక అధ్యయనంలో తేలింది. ఈ విషయం ‘జామా ఇంటర్నల్ మెడిసిన్’ జర్నల్‌లో ప్రచురితమైంది. మెలామైన్తో కిడ్నీఫెయిల్యూర్‌కు దారితీసే అవకాశాలతో పాటు క్యాన్సర్ రిస్క్ కూడా ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు చెబుతున్నాయి. ఏ ఆహారాన్నీ మెలామైన్ బౌల్లో పెట్టి మైక్రోవేవ్ ఒవెన్‌లో ఉంచి వేడిచేయకూడదని అమెరికన్ ప్రమాణాల సంస్థ ఎఫ్‌డీఏ గట్టిగా చెబుతోంది. ఈ ప్లాస్టిక్ తరహా బౌల్స్‌లో ఉంచుకుని వేడి వేడి ఆహారం తింటే అది హార్మోన్లపై... మరీ ముఖ్యంగా మహిళల్లోని ఈస్ట్రోజెన్ స్రావంపై ప్రభావం ఉంటుంది. దీని వల్ల ప్రత్యుత్పత్తికి తోడ్పడే హార్మోన్ల సమతౌల్యంతో తేడాలు వచ్చి గర్భధారణ సమస్యలు రావచ్చు. పురుషుల్లో వీర్యకణాల సంఖ్య, కదలికలు తగ్గడం, పురుష సంబంధ హార్మోన్ల స్రావం తగ్గడం జరుగుతాయి. ఇలాంటి పాత్రల్లో తినే చాలామందిలో డయాబెటిస్ రిస్క్ పెరుగుతున్నట్లుగా ఒక అధ్యయనంలో తేలింది. స్థూలకాయం వస్తున్న వారి సంఖ్య బాగా పెరుగుతోంది. రొమ్ము క్యాన్సర్ వంటి క్యాన్సర్ రిస్క్‌లు చాలా ఎక్కువ. ప్లాస్టిక్ బౌల్స్‌లో వేడి వేడి ఆహారం పెట్టుకుని తీసుకునేవారిలో మెదడు కణాలు బలహీనమై జ్ఞాపకశక్తి తగ్గుతున్నట్లు, మూడ్స్ మారిపోవడం వంటి సమస్యలు వస్తున్నట్లు గుర్తించారు. అల్జైమర్స్ వ్యాధి వంటి ప్రమాదాలు కూడా పెరుగుతున్నట్లు పలు అధ్యయనాలు తెలుపుతున్నాయి. అధిగమించడం ఇలా: వేడివేడి సూప్‌లను వడ్డించాలనుకుంటే పింగాణీ పాత్ర లేదా పింగాణీ ప్లేట్లే ఆరోగ్యదాయకం. ప్లాస్టిక్ బౌల్స్‌లో వేడి వేడి పులుసు వడ్డించడం అంటే కాలే పులుసులో కాలేసినట్లే. ఫ్రిజ్‌లో దాక్కునే సాల్మొనెలా మనం ఫ్రిజ్‌లో ఆహారాన్ని దాచే సమయంలో మాంసాహారాన్ని, కూరగాయలను, పండ్లను వేర్వేరుగా ప్యాక్ చేసి దాచాలి. ఎందుకంటే ఏదైనా ఒక ఆహారపదార్థంలో సాల్మొనెల్లా అనే సూక్ష్మజీవి ఉంటే అది అన్ని ఆహారాలను కలుషితం చేస్తుంది. దీన్ని తీసుకుంటే నీళ్ల విరేచనాలతో పాటు డీ-హైడ్రేషన్ ముప్పు తప్పదు. ఒక్కోసారి ఈ డీహైడ్రేషన్ ముప్పు ప్రాణాంతకంగా మారే అవకాశాలూ ఉంటాయి. అధిగమించడం ఇలా: మాంసాహారం, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు... వాటికవే వేర్వేరుగా హానికరం కాని ప్యాకింగ్ మెటీరియల్‌తో ప్యాక్ చేసి పెట్టుకోవాలి. మాంసాహార పదార్థాల్లోనూ చికెన్, మటన్, సీఫుడ్స్లాంటి మాంసాన్ని (రా-మీట్‌ను) దేనికదే విడివిడిగా ప్యాక్ చేసి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఆహారాన్ని వడ్డించుకోడానికి ముందు ప్లేట్లను శుభ్రంగా కడుక్కోవాలి. పచ్చిపచ్చిగా ఉండే మాంసాహార పదార్థాలకు దూరంగా ఉండాలి. వంట సమయంలో మాంసాహారాన్ని తప్పనిసరిగా అత్యధిక ఉష్ణోగ్రత వద్ద ఉడికించేలా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే అత్యధిక ఉష్ణోగ్రత వద్ద సాల్మొనెల్లా లేదా ఈ-కొలై సూక్ష్మజీవులు చనిపోతాయి. వంటగదిలో గాలి ఆడేలా చూసుకోండి... చాలామంది వంటగదిని ఇరుకిరుకుగా చేసుకుంటారు. కానీ కిచెన్‌లో గాలి ఆడేలా చూసుకోవడం మంచిది. మరీ ముఖ్యంగా కిరోసిస్ స్టవ్‌లు ఉపయోగించేవారు కూడా ఈ జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే కిరోసిన్ మండే సమయంలో కొన్ని హానికర వాయువులు వెలువడతాయి. ఇక కట్టెల పొయ్యి అయితే కార్బన్ డై ఆక్సైడ్తో పాటు కార్బన్ మోనాక్సైడ్ వంటి హానికరమైన వాయువులు వస్తాయి. వీటివల్ల ప్రాణాపాయం కూడా తప్పని పరిస్థితి కూడా ఎదురుకావచ్చు. అందుకే కిచెన్ తగినంత విశాలంగా, గాలి ఆడేలా ఉండాలి. ఇక ఒక్కోసారి గ్యాస్ వాటర్ హీటర్స్ నుంచి కూడా విషవాయువులు వెలువడే ప్రమాదం ఉంది. అధిగమించడం ఇలా: వంటగది విశాలంగా ఉండేలా చూసుకోండి. అనవసర వస్తువులతో దాన్ని నింపేయవద్దు. బొగ్గులు, నిప్పుల మీద చేసే వంట... కిచెన్‌లో వద్దు. ఆరుబయటే చేయండి. మీకు ఆర్థిక స్తోమత ఉంటే, మీకు వీలైతే మీ వంటింట్లో పొగ, కార్బన్‌మోనాక్సైడ్ డిటెక్టర్లను అమర్చుకోండి. ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను కూడా. ఇది వీలుకాకపోతే కిచెన్‌లో తగినంత గాలి ఆడేలా చూసుకోండి. ఇంటి బయటే పాదరక్షలు... ఒకటి రెండు రోజులు అవే వేసుకుంటే సాక్స్ (మేజోళ్లు) దుర్వాసన వస్తాయన్న సంగతి తెలిసిందే. మేజోడులో బ్యాక్టీరియా వల్ల ఈ దుర్వాసన వస్తుంది. ఒకవేళ ఇంట్లోకి ప్రవేశించాక సాక్స్ విప్పితే ఆ బ్యాక్టీరియా ఇంట్లోకీ వచ్చేసే అవకాశాలుంటాయి. అందుకే పాదరక్షలను ప్రధానంగా సాక్స్‌ను ఇంటి బయటే వదలాలి. అందుకే చెప్పులు, పాదరక్షలు, షూస్, సాక్స్ స్టాండ్ ఇంటి బయట ఉండటమే మంచిది. ‘నాన్‌స్టిక్’తో డ్రాస్టిక్ ప్రభావాలు... నాన్‌స్టిక్ కుక్‌వేర్‌లో వండిన ఆహారం అంత ఆరోగ్యకరమైనది కాదని అధ్యయనాలు చెబుతున్నాయి. వీటి వల్ల పిల్లల్లో భవిష్యత్తులో స్థూలకాయం, డయాబెటిస్ వంటివి వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేలింది. అంతేకాదు... దీర్ఘకాలంలో హార్మోన్లకు సంబంధించిన సమస్యలు, హార్మోన్ల అసమతౌల్యత వంటివి వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ. పైగా వారిలో వ్యాధినిరోధక శక్తి తగ్గే అవకాశాలూ పెరుగుతాయని ‘జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్’లో ప్రచురితమైంది. అధిగమించడం ఇలా: టెఫ్లాన్ వంటి కోటింగ్ ఉన్న నాన్‌స్టిక్ కుక్‌వేర్‌కు బదులుగా సాధారణ స్టెయిన్లెస్ స్టీల్ వంటివి ఉపయోగించండి. కనీసం గర్భంతో ఉన్నప్పుడయినా నాన్‌స్టిక్ గృహోపకరణాలను ఉపయోగించడం మానేయండి. ఇక మరీ ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద వండాల్సిన వాటికి నాన్‌స్టిక్ ఉపయోగించకపోవడమే మంచిది. ఆరోగ్యానికి ఎలకలకలం... మీ ఇంటి కిచెన్‌లో ఎలకలు ఆహార పదార్థాలను తాకుతున్నట్లు కనిపిస్తే ఒకింత జాగ్రత్త. ఎందుకంటే... వీటి వల్ల ‘లెప్టోస్పైరోసిస్’ అనే వ్యాధి వస్తుంది. అది ప్లీహం,, మూత్రపిండాలను ప్రభావితం చేస్తుంది. అధిగమించడం ఇలా : మీ ఆహార పదార్థాలను కిచెన్‌లోని ఎలకల నుంచి దూరంగా ఉంచండి. ఇంట్లో ఎలకలు ఉంటే, అవి దూరని విధంగా మెష్ ఉండే సురక్షితమైన ప్రదేశంలో ఆహారాన్ని ఉంచండి. మీ సోఫాలో విలాసంగా కూర్చునే విషాలు ఎన్నో..! ఇటీవల సోఫాలు అగ్నికి అంటుకోకుండా ఉండేందుకు ఫైర్ రెసిస్టెంట్ పదార్థాలతో తయారు చేస్తున్నారు. ఈ ఫైర్ రెసిస్టెంట్ రసాయనాలను ఫ్లేమ్ రిటార్డెంట్స్ అంటారు. మనం సోఫాలపై చేతులు ఉంచినప్పుడు ఈ రసాయనాలు చేతులపైకి చేరతాయి. మనం ఆహారపదార్థాలను తిన్నప్పుడు అవి నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఈ తరహా విషపదార్థాలు ఎండోక్రైన్ వ్యవస్థను దెబ్బతీస్తాయి. ఫలితంగా మన గ్రంథుల నుంచి స్రవించే పలు రకాల ఎంజైముల, జీవరసాయనాల సమతౌల్యం దెబ్బతినవచ్చు. ఒక్కోసారి కొన్ని క్యాన్సర్లు వచ్చేందుకూ ఆస్కారం ఉంది. అధిగమించడం ఇలా : సోఫాలను వాక్యూమ్ క్లీనర్‌తో (ఎయిర్ ఫిల్టర్ ఉపయోగం మరింత మంచిది) శుభ్రం చేయాలి. సోఫా మీద కూర్చున్న తర్వాత ఏదైనా తినాల్సి వస్తే... చేతులు శుభ్రంగా కడుక్కోవడం, నోటిని నీళ్లతో పుక్కిలించడం అవసరం. (ఈ వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వల్ల ఇతరత్రా జబ్బులు వచ్చే అవకాశాలూ తగ్గుతాయి). బూజుకు ఆస్కారమివ్వద్దు... బ్రెడ్ ఉన్న ప్యాక్ తెరచి కొన్ని తినేసి, మరికొన్నింటిని అలా వదిలేస్తే... దానిపై బూజు రావడం అన్నది అందరికీ అనుభవమైన విషయమే. ఈ బూజునే మౌల్డ్ అంటారు. ఈ బూజు నుంచి వచ్చే గాలి పీల్చినప్పుడు ముక్కులు బిగుసుకుపోవడం, ఊపిరితిత్తుల్లోకి వెళ్లే గాలిగొట్టాలు (విండ్పైప్స్) సన్నబడినట్లుగా మారి ఆయాసం రావడం, ఆస్తమా ప్రేరేపితం కావడం వంటి సమస్యలు వెంటనే కనిపిస్తాయి. వాటిని తినడం వల్ల విరేచనాల వంటి అనర్థాలు సంభవిస్తాయి. అందుకే మీ ఆహారానికి మౌల్డ్ సోకనివ్వకండి. అధిగమించడం ఇలా : తేమ ఎక్కువగా ఉండే చోట్ల ఆహారాలను నిల్వ చేయడం వల్ల మౌల్డ్ తేలిగ్గా పెరుగుతుంది. అందుకే అలాంటి వాతావరణానికి ఆస్కారం ఉండే గదుల్లో ఆహారాన్ని నిల్వ చేయకండి. మీ వంటపాత్రలను వీలైనంత వరకు డిష్-వాషింగ్ సోప్‌తో శుభ్రపరచుకోండి. పల్లెల్లో కొందరు మట్టితో గిన్నెలు కడుగుతుంటారు. ఇలాంటివారు గిన్నెలు తోమడానికి బూడిదను ఉపయోగించడం మేలు. మట్టితో పోలిస్తే బూడిదలో హానికరమైన పదార్థాలు అంతగా ఉండవు. బొద్దింకలతో జాగ్రత్త... బొద్దింకలనుంచి పెద్దగా వెనువెంటనే వచ్చే ప్రమాదం లేకపోయినా... ఆహారాన్ని కలుషితం చేసేందుకు అవి దోహదం చేస్తాయి. దాంతో నీళ్ల విరేచనాలు వంటి ప్రమాదాలు సంభవించవచ్చు. బొద్దింకలు అలర్జీని, ఆస్తమాను ప్రేరేపిస్తాయి. కాబట్టి ఇళ్లలో బొద్దింకలు లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. అధిగమించడం ఇలా : ఆహారాన్ని మెష్ ఉండే సురక్షితమైన చోట ఉంచుకోవాలి. ఇంట్లోని ప్రతి ప్రదేశమూ పొడిగా ఉండేలా, వెలుతురూ, గాలీ ధారాళంగా వచ్చేలా చూసుకుంటే బొద్దింకలు అంతగా పెరగవు. కర్టెన్లతో కష్టాలెక్కువ... వాల్పేపర్లూ ప్రమాదమే... ఇటీవల మన ఇండ్లలో బట్టలతో చేసిన కర్టెన్లు కాకుండా మరింత కాలం మన్నడానికి, కాల ప్రభావానికి లోనై పాడైపోకుండా ఉండటానికి ప్లాస్టిక్ వంటి పదార్థంతో రూపొందించిన కర్టెన్లను వాడుతున్నాం. ఇక బాత్రూమ్లలోనైతే నీళ్ల వల్ల పాడైపోకుండా ఉండటం కోసం ఉపయోగించే షవర్ కర్టెన్లు తప్పనిసరిగా వాటర్‌ప్రూఫ్ మెటీరియల్‌తో తయారయ్యేవే ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. ఈ ప్లాస్టిక్ కర్టెన్లు బట్టలాగే ఎటు పడితే అటు వంగేందుకు వీలుగా ‘థాలేట్’ అనే పదార్థంతో తయారు చేస్తారు. ఈ షవర్ కర్టెన్లలో మాత్రమే కాదు... మన ఇండ్లలో అలంకరణ కోసం ఉపయోగించే వాల్పేపర్లు, ఫ్లెక్సీలు కూడా ఈ పదార్థంతోనే రూపొందుతాయి. ఈ థాలేట్ అనే పదార్థంతో రూపొందిన ఉపకరణాలను ఉపయోగిస్తే అవి పురుష సెక్స్ హార్మోన్‌పై దుష్ర్పభావం చూపుతాయి. వీటి వల్ల పురుషుల్లో వీర్యం క్వాలిటీ దెబ్బతింటుంది. ఇంకా ప్లాస్టిక్ తరహా పదార్థాలపై నుంచి వచ్చే గాలి పీల్చడం వల్ల అది అలర్జీలను ప్రేరేపించడం, శ్వాససంబంధ సమస్యలు రావడం జరగవచ్చు. ఆస్తమా, పిల్లికూతలు కనిపించవచ్చు. ఇక ఈ తరహా వాల్పేపర్లు, గృహాలంకరణ వస్తువులు, కర్టెన్లు ఉన్న ఇండ్లలోని గర్భవతులకు మరీ ప్రమాదం. ఇవి ఉపయోగించడం అంటే... పుట్టబోయే పిల్లలు ఇంట్లోకి రావడానికి ముందే ఇంటి వాతావరణాన్ని అందంగా కలుషితం చేయడమే. ఎందుకంటే ఇలాంటివి ఉపయోగించే ఇళ్లలో పెరిగిన పిల్లల్లో అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ వంటివి కనిపించే అవకాశాలు ఎక్కువ. మరీ ముఖ్యంగా నాలుగు నుంచి తొమ్మిదేళ్ల పిల్లల్లో ఈ తరహా ధోరణులు పెరిగే అవకాశాలు ఎక్కువని మౌంట్ సినాయ్ మెడికల్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన పరిశోధనల ఫలితాలు తెలుపుతున్నాయి. అధిగమించడం ఇలా: డోర్ కర్టెన్లు, షవర్ కర్టెన్ల కోసం వీలైనంత వరకు నిరపాయకరమైన వస్త్రాలనే కర్టెన్లుగా వాడండి. ఫర్నిచర్‌గా ప్లాస్టిక్ పీవీసీతో తయారు చేసిన వాటి కంటే కలపతో చేసినవి కొని అమర్చుకోడానికే ప్రాధాన్యం ఇవ్వండి. కొళాయి కాదది... ‘ఈ’-కొలయి..! కొళాయి (నల్లా/పంపు) నుంచి నీళ్లు వస్తాయన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ వాటితో పాటు దీర్ఘకాలం నిల్వ ఉన్న నీటిలో ‘ఈ-కొలై’ అనే పరాన్నజీవులు పెరుగుతాయి. ఈ నీటిని వాడిన ఆహార పదార్థాల్లోకి ‘ఈ-కొలై’ ప్రవేశించి, అలా మానవ శరీరంలో కూడా ప్రవేశిస్తాయి. వీటి వల్ల నీళ్ల విరేచనాల వంటి అనర్థాలు కలుగుతాయి. వాస్తవానికి ఈ నీటిని ఉపయోగించినా సరే... ఆ నీటిలో మరిగించే వంటలు చేస్తే అవి నశిస్తాయి. కానీ పానీపూరీ/ గప్‌చుప్ వంటి మరిగించడానికి వీలుకాని ఆహారాల కోసం ఈ-కొలై ఉన్న నీటిని ఉపయోగిస్తే నీళ్ల విరేచనాలు తప్పవు. పైగా దూరప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడ అపరిశుభ్రమైన ఆహారం తీసుకుంటే నీళ్ల విరేచనాలు తప్పవు. అధిగమించడం ఇలా: దూరప్రాంతాల్లో ఉన్నవారు మరిగించకుండా తయారు చేసే ఆహారాన్ని లేదా వేడివేడిగా లేని ఆహారాన్ని తీసుకోకపోవడమే మంచిది. ప్లాస్టిక్ పాత్రలో పెట్టే కూర... కనిపించని విషపు కోర... ఇప్పుడు మన సూప్ బౌల్స్ అందంగా కనిపించే ప్లాస్టిక్ వంటి పదార్థాలతో తయారవుతున్నాయన్న విషయం తెలిసిందే. పైకి అందంగా కనిపించే ఈ బౌల్స్ ఉపయోగానికి అంత అందమైనవి కాదు. సాధారణంగా ఈ కూరల బౌల్స్ ‘మెలామైన్’ అనే ప్లాస్టిక్ వంటి పదార్థంతో తయారవుతాయి. వేడి వేడి కూరలు, పులుసులు ఇందులోకి తీయగానే ఆ వేడికి ప్లాస్టిక్‌లోని మెలామైన్... ఆహారంతో పాటు కలిసి నోటి ద్వారా శరీరంలోకి వెళ్తుంది. దేహంలోకి వెళ్లిన ఈ పదార్థం వల్ల కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం ఉందని ఒక అధ్యయనంలో తేలింది. ఈ విషయం ‘జామా ఇంటర్నల్ మెడిసిన్’ జర్నల్‌లో ప్రచురితమైంది. మెలామైన్తో కిడ్నీఫెయిల్యూర్‌కు దారితీసే అవకాశాలతో పాటు క్యాన్సర్ రిస్క్ కూడా ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు చెబుతున్నాయి. ఏ ఆహారాన్నీ మెలామైన్ బౌల్లో పెట్టి మైక్రోవేవ్ ఒవెన్‌లో ఉంచి వేడిచేయకూడదని అమెరికన్ ప్రమాణాల సంస్థ ఎఫ్‌డీఏ గట్టిగా చెబుతోంది. ఈ ప్లాస్టిక్ తరహా బౌల్స్‌లో ఉంచుకుని వేడి వేడి ఆహారం తింటే అది హార్మోన్లపై... మరీ ముఖ్యంగా మహిళల్లోని ఈస్ట్రోజెన్ స్రావంపై ప్రభావం ఉంటుంది. దీని వల్ల ప్రత్యుత్పత్తికి తోడ్పడే హార్మోన్ల సమతౌల్యంతో తేడాలు వచ్చి గర్భధారణ సమస్యలు రావచ్చు. పురుషుల్లో వీర్యకణాల సంఖ్య, కదలికలు తగ్గడం, పురుష సంబంధ హార్మోన్ల స్రావం తగ్గడం జరుగుతాయి. ఇలాంటి పాత్రల్లో తినే చాలామందిలో డయాబెటిస్ రిస్క్ పెరుగుతున్నట్లుగా ఒక అధ్యయనంలో తేలింది. స్థూలకాయం వస్తున్న వారి సంఖ్య బాగా పెరుగుతోంది. రొమ్ము క్యాన్సర్ వంటి క్యాన్సర్ రిస్క్‌లు చాలా ఎక్కువ. ప్లాస్టిక్ బౌల్స్‌లో వేడి వేడి ఆహారం పెట్టుకుని తీసుకునేవారిలో మెదడు కణాలు బలహీనమై జ్ఞాపకశక్తి తగ్గుతున్నట్లు, మూడ్స్ మారిపోవడం వంటి సమస్యలు వస్తున్నట్లు గుర్తించారు. అల్జైమర్స్ వ్యాధి వంటి ప్రమాదాలు కూడా పెరుగుతున్నట్లు పలు అధ్యయనాలు తెలుపుతున్నాయి. అధిగమించడం ఇలా: వేడివేడి సూప్‌లను వడ్డించాలనుకుంటే పింగాణీ పాత్ర లేదా పింగాణీ ప్లేట్లే ఆరోగ్యదాయకం. ప్లాస్టిక్ బౌల్స్‌లో వేడి వేడి పులుసు వడ్డించడం అంటే కాలే పులుసులో కాలేసినట్లే. - నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి -
బ్యాంకుకు బురిడీ
కోదాడటౌన్, న్యూస్‌లైన్: కోదాడ మండలం నల్లబండగూడెం సర్పంచ్‌గా రెండుసార్లు గెలిచిన (ప్రస్తుత) ప్రజాప్రతినిధి అదే గ్రామంలో చిన్న తరహా పరిశ్రమ పెట్టుకునేందుకు 2011లో దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం ప్లాస్టిక్ కవర్లు, సంచులను నిషేధిస్తున్నందున వాటి స్థానంలో ప్లాస్టిక్ రహిత కవర్లు, సంచులు, ప్లేట్స్ తయారీ చేసే పరిశ్రమ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం భారీగా సబ్సిడీని ఇస్తుండడంతో ఆమె ఈ పరిశ్రమను ఎంచుకున్నారు. పరిశ్రమల శాఖ కూడా అనుమతి ఇచ్చింది. పరిశ్రమ ఏర్పాటుకు అయ్యే ఖర్చు రూ.95.80 లక్షల మొత్తాన్ని కోదాడ ఆంధ్రాబ్యాంక్ రుణంగా ఇవ్వడానికి ఒప్పుకుంది. దీనిలో సబ్సిడీ 40 శాతం అంటే దాదాపు రూ.44.74 లక్షలు. సదరు ప్రజాప్రతినిధి తానే యజమానిగా ఉంటూ నల్లబండగూడెం లోని రామాపురం క్రాస్‌రోడ్డు వద్ద సర్వేనెంబర్ 352/ఏఏలో మల్లిక నాన్ ఓవెన్ బ్యాగ్స్, పేపర్స్, ప్లేట్స్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేశారు. కోదాడ ఆంధ్రాబ్యాంక్ శాంక్షన్ లెటర్ నంబర్: 0329/52/ఎస్-213 తేదీ 01-11-2011న రూ.75.80 లక్షలు, మరోవిడత శాంక్షన్ లెటర్ నంబర్: 0329/52/ఎస్-31 తేదీ 26- 06-2013న రూ.22 లక్షలను రుణంగా మంజూరు చేశారు. దీనిలో ప్రభుత్వ సబ్సిడీ రూ.44.74 లక్షలు పోను రూ.51.06 లక్షలను టర్మ్‌లోన్ కింద బ్యాం కుకు చెల్లించాల్సి ఉంది. నేటికీ ఒక్క కిస్తీ కూడా చెల్లించకపోవడంతో బ్యాంక్ అధికారులు పలుమార్లు నోటీసులు పంపారు. అయినా స్పందన లేకపోవడంతో సదరు ప్రజాప్రతినిధిని ఎన్పీఏ (నాన్ పేమెంట్ అకౌంట్)గా మార్చారు. బ్యాంక్ మేనేజర్ లేఖతో వెలుగులోకి.. కోదాడ ఆంధ్రాబ్యాంక్ మేనేజర్‌గా కొత్తగా వచ్చిన లక్ష్మారెడ్డి ఈ పరిశ్రమ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చారు. లెటర్ నెంబర్-0329/ 18/ఎంఎస్ఎంఈ తేదీ 23-08-13న జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. ప్రభుత్వంతోపాటు బ్యాం క్‌ను మోసగించిన నల్లబండగూడెం సర్పంచ్‌ను ఎన్పీఏగా మార్చామని, ఆర్బీఐ నిబంధనల ప్రకారం పదవిలో కొనసాగడానికిఆమె అర్హురాలు కాదని, విచారణ జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు. విచారణ ఏమైందో.. బ్యాంక్ మేనేజర్ లేఖతో స్పందించిన కలెక్టర్ జిల్లా పంచాయతీ అధికారిని విచారణకు ఆదేశించారు. ఆయన లేఖ నెంబర్ 801/2013-ఈ(పీటీఎస్)ను తేదీ 27-08-13న కోదాడ ఎంపీడీఓకు పంపారు. దీనిని అత్యంత అత్యవసరమైనదిగా భావించి వెంటనే తనకు నివేదిక ఇవ్వాలని కోరారు. కానీ, ఏమి జరిగిందో ఏమోగాని దీనిపై నేటికీ కనీస చర్యలు తీసుకోలేదు. ఈ క్రమంలో గ్రామస్తులు సమాచార హక్కు చట్టం ద్వారా మొత్తం వ్యవహారాన్ని సాక్ష్యాధారాలతో సేకరించారు. పక్షం రోజుల క్రితం లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. దీంతో అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. యంత్రాలు మాయం.....? ప్రభుత్వ సబ్సిడీతో ఏర్పాటైన సదరు పరిశ్రమ ఆరేళ్లపాటు పరిశ్రమల శాఖ ఆధీనంలో ఉం టుంది. ఈ సమయంలో ఎలాంటి యంత్రాలు అమ్మకాలు, కొనుగోలు చేయకూడదు. కానీ, పరిశ్రమలోని యంత్రాలు మాయమయ్యాయి. ప్రభుత్వ సబ్సిడీని కాజేసేందుకే పరిశ్రమను ఏర్పాటు చేసి, యంత్రాలను అమ్మున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో పరిశ్రమలశాఖలోని కొందరు అధికారులు లక్షల రూపాయలు దండుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై జిల్లా పరిశ్రమల శాఖ అధికారులను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులో లేరు. -
చుక్కల నంటిన పండ్ల ధరలు
దేవరపల్లి, న్యూస్‌లైన్: నూతన సంవత్సరం సందర్భంగా పండ్లు, పూల బొకేల ధరలు చుక్కల నంటాయి. పెరిగిన పండ్ల ధరలను చూచి ప్రజలు కొనలేని పరిస్థితి ఏర్పడింది. ఏపండు కొందామన్నా అందుబాటులో లేవని వినియోగదారులు వాపోతున్నారు. ఇలాంటి ధరలు ఎప్పుడూ చూడలేదని వినియోగదారులు అంటున్నారు. గత ఏడాదితో పోల్చుకొంటే పండ్ల ధరలు 25 నుండి 30 శాతం పెరిగాయి. పూల బొకేల ధరలు కూడా పెరిగాయి. గత ఏడాది యాపిల్ ధర రూ. 10 నుండి 15 ధర పలకగా ఈ ఏడాది రూ. 25 నుండి 30 పలుకుతున్నాయి. ప్రస్తుతం పండ్ల ధరలు ఈ విధగంగా ఉన్నాయి. దానమ్మ కాయ రూ. 40 నుండి 50, కమలాలు డజను రూ. 120 నుండి 150 ధర పలుకుతున్నాయి. పూల బొకేల ధరలు కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నాయి. పచ్చిపూల బొకే రూ. 50, ప్లాస్టిక్ బొకే రూ. 100 నుండి 250 పలుకుతున్నాయి. ఈ ధరలు సామాన్యులకు అందుబాటులో లేకపోవటం వల్ల నిరూత్సహపడుతున్నారు. కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం 2013 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, 2014 నూతన సంవత్సరానికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఇళ్ల ముందు రంగురంగుల రంగవెల్లులతో సుందరంగా అలంకరించారు. బాణసంచా కాల్చుతూ సంబరాలు జరుపుకొన్నారు. యువత వీధుల్లో తిరుగుతూ సందడి చేశారు. చర్చిల్లో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. నూతన సంత్సరానికి స్వాగతం పలికారు. బార్లు, హోటళ్లు సాయంత్రం 5 గంటల నుండే కిక్కిరిసాయి. మాంసాహార వంటకాలతో రోడ్లు ప్రక్కన స్టాల్స్ ఏర్పాటు చేసి విక్రయాలు జరిపారు. ప్రత్యేక ఆఫర్లు ప్రకటించారు. కౌజుపిట్ట, పీత, చేప, రొయ్య వంటి రుచికరమైన వంటకాలను తయారు చేసి విక్రయించారు. కానరాని సందడి నల్లజర్లరూరల్: నూతన సంవత్సరానికి స్వాగతం పలికే సమయం ఆసన్నమైంది. నల్లజర్ల జంక్షన్లో ఆసందడేమి కనపడటం లేదు. గతంలో పది రోజుల ముందు నుంచే గ్రీటింగ్ కార్డులు, ముగ్గులు, అలంకరణ సామగ్రి షాపుల వద్ద విద్యార్థులు ఉద్యోగులుతో సందడిగా ఉండేది. కాని ఈ ఏడాది కొనేవారు లేక షాపులు వెలవెలబోతున్నాయి. ప్రతి వ్యక్తికి వ్యక్తి గతంగా సెల్ఫోన్లు ఉండటం సంక్షిప్త సమాచారం వాటి పంపే వీలుండటంతో అందరూ పరస్పరం సెల్ఫోన్ల ద్వారానే పంపడానికి ఇష్టపడుతున్నారు. దీంతో గ్రీటింగ్ కార్డుల అమ్మకం పూర్తిగా తగ్గిపోయిందని వ్యాపారి వినాయక్ వాపోయాడు. నూతన సంవత్సరంలో ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకునేటప్పుడు ,పెద్దల వద్దకు వెళ్ళెటప్పుడు వట్టి చేతులతో వెళ్ళకుండా పండ్లు, ఫ్లవర్ బొకేలు తీసుకెళ్ళడం ఆనవాయితీ. ఈ ఏడాది పెరిగిన ధరలతో ఏ పండు పట్టుకుందామన్నా చేతులు కాలే పరిస్థితి. చిన్న యాపిల్‌కూడా రూ.20కి పైనే ఉంది. ఇవి సామాన్యుడికి ప్రియంగా మారాయి. దీంతో పండ్ల వ్యాపారులు తక్కువ మొత్తంలో పళ్ళు అమ్మకానికి పెట్టారు. వీటితో పాటు పూల అలంకరణ, రంగుల దుకాణాలు వినియోగదారులు లేక వెలవెలబోతున్నాయి. నూతన సంవత్సరం మరికొన్ని గంటలలో రానున్నా సందడి మాత్రం కానరావడం లేదు. -
నీరుగారిన నిషేధం
కార్పొరేషన్, న్యూస్‌లైన్: ప్లాస్టిక్‌ను సృష్టిస్తున్న మనిషి కాలధర్మం చేస్తే మట్టిలో కలిసి పోతున్నాడు కాని, ప్లాస్టిక్ మాత్రం ఎన్ని సంవత్సరాలైన అలాగే ఉండిపోతోంది. ఫలితంగా మానవాళికి తీవ్ర ప్రమాదం జరుగుతోంది. వీటిని నిషేధించాలని జాతీయ కాలుష్య నియంత్రణ మండలి సూచనను అన్ని మున్సిపల్‌లలో అమల్లోకి తెచ్చినా పర్యవేక్షణ లేకపోవటంతో ప్లాస్టిక్ విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ప్రతి పదిమందిలో 8 మంది ప్లాస్టిక్ నిషేధాన్ని తుంగలో తొక్కుతున్నారు. జిల్లాలో ఉన్న జనాభాలో దాదాపు 80 శాతం మంది ప్రజలు ఏదో ఒక పని మీద దుకాణాలకు వె ళ్తూ సామాగ్రి కొని ప్లాస్టిక్ కవర్లలో ఇంటికి తీసుకెళ్లున్నారు. తర్వాత వాటిని వాటిని పారవేస్తుండటంతో అవి మురుగు కాల్వలు, కుంటలు, జనావాసాల మధ్య పేరుకుపోతున్నాయి. 40 శాతం మైక్రాన్లు కలిగిన పాలిథీన్ కవర్లను వాడుకోవచ్చని ప్రభుత్వం సడలించిన అవకాశాన్ని అసరగా చేసుకుని చాలామంది వ్యాపారులు నిషేధాన్ని నీరుగారుస్తున్నారు. మున్సిపల్ అధికారులు ‘చెత్తపై కొత్త సమరం’ కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ నిషేధాన్ని పక్కగా అమలు చేయాలని పలువురు కోరుతున్నారు. పాలిథిన్ సంచులకు బదులుగా జూట్,పేపర్లతో తయారు చేసిన కవర్లు మాత్రమే వాడాలని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇవి మార్కెట్లో లభ్యం కాకపోవటంతోనే ప్లాస్టిక్‌ను కొంటున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. జిల్లాలో ప్రభుత్వం ప్లాస్టిక్ వాడకంపై నిబంధనలను వ్యాపారులు పాటించటంలేదు. ప్లాస్టిక్ వినియోగించే వ్యాపారులపై అధికారుల తూతూ మంత్రం చర్యలుతో సరిపెడుతుండటంతో ప్లాస్టిక్ వాడకం మరింత ఎక్కువై పోతోంది. ఫలితంగా నానాటికి పర్యవరణం మరింత పాడవుతోంది. పర్యవరణాన్ని సంరక్షించే కార్యక్రమాలను ప్రభుత్వం ఏటా నిర్వహిస్తున్నా దానిని అదే రోజు మరిచిపోతున్నారు. జిల్లా కేంద్రంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆరోగ్యధికారి డాక్టర్ సిరాజుద్దీన్ అనేకసార్లు 20 శాతం మైక్రాన్లు కలిగిన ప్లాస్టిక్ కవర్లను పట్టుకుని వ్యాపారులకు భారీగా జరిమానాలు విధించారు. అయిన వ్యాపారులు దీనిని తేలికగా తీసుకుంటున్నారు. ఇటీవల ఎంహెచ్ఓ మూడు నెలల పాటు నగరంలో లేకపోవటంతో ప్లాస్టిక్ వ్యాపారం చేసే వ్యాపారుల ఇష్ట్యరాజ్యం అయ్యింది. మూడు నెలల పాటు ఇన్చార్జి ఎంహెచ్‌ఓగా ఉన్న అధికారి ఏనాడూ ప్లాస్టిక్ నిషేధం గురించి పట్టించుకోక పోవటంతో కొంతమంది వ్యాపారులకు అడ్డు అదుపులేకుండా పోయింది. జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని అన్ని మండలాలు,గ్రామాలలోని దాదాపు అన్ని టిఫిన్ సెంటర్లలో, కూరగాయలు, పండ్లు, ఇతర పదార్థాల విక్రయాలకు 20 శాతం మైక్రాన్లు కలిగిన ప్లాస్టిక్ కవర్లే వాడుతున్నారు. ఫంక్షన్హళ్లపై చర్యలేవీ? జిల్లాలోని అన్ని ఫంక్షన్ హళ్లలో ప్లాస్టిక్ కవర్లు, గ్లాస్లు, గిన్నెలు వాడొద్దని గతంలో అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు అన్ని ఫంక్షన్‌హాళ్లలో ఇక్కడ ప్లాస్టిక్ వాడటాన్ని నిషేధించామని బోర్డులు పెట్టించారు. ఈ ఆదేశాలు కొద్ది రోజులు మాత్రమే అమలు పరిచి మళ్లి వాటి వైపు కన్నెత్తి చూడటంలేదు. దాడులు ఉధ్రుతం చేస్తాం.. ఇప్పటి వరకు నగరంలో ప్లాస్టిక్ కవర్లు విక్రయించే వ్యాపారులపైనే చర్యలు తీసుకుంటూ వచ్చాం. ఇక వ్యాపారులతో పాటు ప్లాస్టిక్ కవర్లు వాడే ప్రజలపై కూడ చర్యలు తీసుకుంటామని ఎంహెచ్ఓ సిరాజుద్దీన్ తెలిపారు. చెత్తపై కొత్త సమరం వంద రోజుల్లో క్లీన్ సిటీ ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ వినియోగంపై చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. కావున ప్రజలు జూటు సంచులను మాత్రమే వాడాలని ఆయన సూచిస్తున్నారు. అన ర్థాలివే.. ప్లాస్టిక్ కవర్లలో తీసుకుపోయే పదార్థాలకు ప్రాణ వాయువు(అక్సిజన్) తగలక పోవటంతో అట్టి పదార్ధాలు తొందరగా పాడవుతాయి. వీటిని తిన్న వారికి 20 రకాల క్యాన్సర్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. పాలిథిన్ సంచుల్లో తీసుకువచ్చే వేడి పదార్థాల్లో ప్లాస్టిక్ తయారీకి ఉపయోగించే రసాయన పదార్థాలు కలిసిపోయి వాటిని తినే చిన్న పిల్లల్లో ఎదుగుదల నిలిచిపోతుంది. ప్లాస్టిక్ సంచులు, వస్తువులు తగలబెట్టే సమయంలో వెలువడే వాయువు వల్ల ఓజోన్ పొర దెబ్బతింటుంది. చెరువులో, కుంటల్లో ప్లాస్టిక్ కలిసిన నీటిని తాగే పశువులు అనారోగ్యం పాలవుతున్నాయి. -
జీడిమెట్లలో మరో అగ్నిప్రమాదం
హైదరాబాద్ : జీడిమెట్ల పారిశ్రామిక వాడలో 24 గంటలు తిరగక ముందే మరో అగ్నిప్రమాదం జరిగింది. సుభాష్‌నగర్‌లోని ప్లాస్టిక్ గోదాంలో ఈరోజు తెల్లవారుజామున అనూహ్యరీతిలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పరిశ్రమలోని ప్లాస్టిక్ అగ్నికి ఆహుతి అయ్యింది. సమాచారం అందుకున్న అగ్నిమాపకదళ సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా రసాయనాలతో మంటలు చెలరేగటంతో జీడిమెట్ల ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. నిన్న జరిగిన అగ్నిప్రమాదం నుంచి ఇంకా కోలుకోకముందే మరో ప్రమాదం జరగడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నామని, వరుస ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదని వారు మండిపడుతున్నారు. -
సృజనం : చివరి కాన్క
పొగమంచు లాంటి నిశ్శబ్దాన్ని బూడిదలాగా రాలుస్తూ ఫోన్ రింగ్. ‘‘ఓసారి అర్జంట్‌గా స్టేషన్‌కి రండి’’ ఇంకేమీ చెప్పకుండా కాల్ కట్ చేసిన మీనన్ గొంతు అటు నుంచి. మీనన్! ఎన్నో ఏళ్ల కిందటి జ్ఞాపకం. రూపం.ఆరేళ్ల కిందట ఎవరో కూడా తెలీని అతణ్ని, వెతికి మరీ ఫోన్ నంబర్ని ఓసారీ, అతడినే తీసుకెళ్లి మరోసారీ... నిత్య ముందుంచిన రెండు చేదు జ్ఞాపకాలు మనసులో మెదిలాయి. మళ్లీ ఇప్పుడూ అతనే. గతంలో జరిగిన అనుభవాలే మళ్లీ మళ్లీ జీవితం ముందు ప్రశ్నల్లా నిలబడటం అంటే ఇదేనేమో!ఇంటికి లాక్ వేసి స్టేషన్‌కి వెళ్తే- అతడింకా లావయ్యాడు. నన్ను మాత్రం, ‘‘మీరేమీ మారలేదు. ఇంకా సన్నబడ్డారు. కళ్ల కింద ఆ నల్ల గీతలేంటి?’’ పరీక్షగా చూస్తూ అడిగాడు. ‘‘ఏంటిలా? ఎక్కణ్నుంచి?’’ అని అడిగాను. ‘‘మెయిల్లో నెల్లూరు వెళ్తూ, ఈ స్టేషన్ చూడగానే అందరూ గుర్తొచ్చి దిగిపోయాను’’ అన్నాడు. ఎప్పటికీ కలవని రైలు పట్టాలు. ఎందర్నో కలుపుతాయి. అంతలోనే విడదీస్తుంటాయి! ‘‘పదండి. నెక్స్ట్ ట్రైన్‌కి చాలా టైమ్ ఉంది’’ అన్నాక, నా వెనక బయటికి నడిచాడు. కొన్నేళ్ల కిందటి జ్ఞాపకం. చలిగాలిలో మానని గాయంలాగా రేగింది. కొన్నేళ్ల కిందట ఇతణ్ని ఇలాగే రిసీవ్ చేసుకుని, నిత్య వాళ్లింటికి తీసుకెళ్లడం గుర్తొచ్చింది. మేరీ డిన్నర్ ప్లేట్లు తెస్తే, సర్వింగ్‌లో తల్లికి సహాయపడుతూ నిత్య... ఎప్పుడో పదమూడేళ్ల వయసులో తమ ఫ్యామిలీలో మెంబర్‌గా మసిలి, ఆ తర్వాత తలెత్తిన సమస్యలకి భయపడి, ఎటో వెళ్లిపోయిన మీనన్‌ని తెచ్చి, జీవితం ముందుంచిన నన్ను ప్రేమగా చూసింది. అయితే, అప్పటి నా గుండెలో ఎన్ని తుపాన్లు సుడి తిరిగాయో! అతడి ముందు నా జీవితాన్ని తాకట్టు పెట్టి, వీళ్ల రొటీన్ లైఫ్‌లో ‘ఇగో’ని తృప్తి పరిచే, ఆనందంతో కూడిన జర్క్ ఇవ్వడానికి ఎన్ని కన్నీటి లోయలు దాటాడో ఎవరికి తెలుస్తుంది? ఇప్పుడు ఆరేళ్ల తర్వాత మళ్లీ మీనన్ ఎందుకు వచ్చాడు? ‘‘వెళ్దామా’’ అన్నాడు. ఆలోచనల దారం తెగి, జ్ఞాపకాలు జలజలా రాలాయి ముత్యపు బిందువుల్లా. ‘‘ఏమైనా తిన్నారా?’’ అడిగాను. ‘‘లేదు. వెళ్తాం కదా?’’ నా కళ్లలోకి ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు. అతని భావం అర్థమైంది. ఏమీ బదులివ్వకుండా బండి స్టార్ట్ చేసి, అన్ని రోడ్లూ దాటి, మూడు రోడ్ల జంక్షన్లో ఆపితే, కుడివైపున రెండతస్తుల మేడ... నిశ్శబ్దంగా చీకట్లో. కిందకి దిగబోయిన అతణ్ని వారించాను. ప్రశ్నించే కళ్లతో నన్ను చూసి, తలతిప్పి మేడ పైకి చూశాడు. ఆర్చీలతో విశాలంగా ఉన్న వరండాలో ఎవరూ లేరు. బహుశా అతను ఆశపడి ఉంటాడు. ఆరేళ్ల కిందటిలాగా నిత్య, మేరీ అక్కడ ఉంటారని. ఒకసారి జరిగినట్లే మళ్లీ మళ్లీ జరగాలని, సుఖం, సంతోషం మళ్లీ అలాగే రావాలని ఆశపడతాం. కానీ, నాలిక కొనకి తగిలే చేదుని ఊహించలేం. అదేగా జీవితమంటే! ‘‘ఏమైంది? వాళ్లు లేరా?’’ మీనన్ గొంతు వణికింది. తల అడ్డంగా ఊపాను. ఆ మేడమీద, నిత్యవాళ్లు లేరు. ఎక్కడున్నారో తెలీదు. మేరీది తప్ప అన్ని ఫోన్లూ స్విచ్ఛాఫ్. మెసేజ్ ఇచ్చినా, కాల్ చేసినా ఆన్సర్ ఇవ్వని మేరీ, నిత్య బర్త్‌డే ముందురోజు ఫోన్ చేసి, ‘ఇంకోసారి కాల్ చేసినా, కాంటాక్ట్ చేసినా జాగ్రత్త’ అని ఇచ్చిన వార్నింగ్.ఇదే చెప్పాను. అతను మౌనంగా ఉండిపోయాడు. కాసేపటికి తిరిగి స్టేషన్‌కి చేరుకున్నాక, నెల్లూరు వెళ్లే ట్రైన్ అనౌన్స్మెంట్. ఇద్దరమూ మౌనంగా, కాందిశీకుల్లా రెండో ప్లాట్‌ఫామ్ మీదకి చేరాం. ఉక్కు రంగు పట్టాల మీద ఎర్ర చారల్లా సిగ్నల్ లైట్లు. అప్పుడు పెదవులు విప్పాడు మీనన్.‘‘తప్పంతా నాదే. అప్పట్లో ఏదో గందరగోళం. పోలీసులు, కేసు, కోర్టు... ఇవన్నీ ఫేస్ చేయాలేమో అని భయంతో దూరంగా వెళ్లిపోయాను. నాకు నిత్య అంటేనే ఇష్టం. కానీ మధ్యలో ఏవో ప్రలోభాలు. అంతా అలా ముగిసిపోయింది. మర్చిపోయిన జీవితం మీవల్ల మధ్యలో కొంత గుర్తొచ్చింది. అప్పుడు నిత్య ప్రేమని పొందుతున్న మీమీద ద్వేషభావం. కానీ మీరు కూడా ఎందుకు విడిపోయారు?’’ మీనన్ అడిగాడు. ఏమని చెప్పాలి? టీనేజ్ మొదట్లోనే పేరెంట్స్ మీద గొడవలకీ వాళ్లు విడిపోవడానికీ కారణమైన మీనన్‌ని ఇష్టపడిన నిత్య... అమ్మ, నాన్న విడిపోయాక, అమ్మ ఇన్‌ఫ్లుయెన్స్‌లో పెరుగుతూ, సమాజంలోని మృగాల నుంచి తప్పించుకుంటూ, టీనేజ్ ముగిసే చివరి రోజుల్లో, అనుకోకుండా జీవితం ముందు కనిపించిన నన్ను లతలా బలంగా అల్లుకుని, గుండెకి సంకెలుగా మారి, గాఢంగా ప్రేమిస్తూ, అంతలోనే ద్వేషిస్తూ, పరీక్షలు పెడుతూ, ప్రేమించకుండా ఉండలేకపోయా. ఎప్పటికీ వదలనని ప్రామిస్‌లు పొందుతూ, విడిపోయా. మళ్లీ కలిసిపోయా. నిత్యకి కొత్త జీవితాన్ని, వెలుగుతో కూడిన స్వేచ్ఛని ఇవ్వడానికి అన్నీ సిద్ధం చేస్తున్నందుకు నన్ను ద్వేషించి, కక్ష కట్టిన అమ్మ, అక్కల ఒత్తిడికి లొంగి, వాళ్లవల్ల నాకు ఏ కీడూ జరగకూడదని తపిస్తూ... అలా అలా నాకు దూరమైన నిత్యకీ నాకూ మధ్య ఉన్న నాలుగేళ్ల ప్రేమ, అనుబంధం గురించి చెబితే... మీనన్‌కి మిగిలిన జీవితమంతా విషాదమే! ఇలాగే నయం. నేను కూడా విడిపోయానని తృప్తిగా వెళ్తాడు. మౌనం కన్నా మాటలు ఏమంత గొప్పవని?! ఇంతలో పెద్దగా శబ్దం చేసుకుంటూ వచ్చింది ట్రైన్. ఎదురుగా ఆగిన కంపార్ట్మెంట్లోకి ఎక్కబోతూ షేక్‌హ్యాండ్ ఇచ్చాడు మీనన్. ‘‘ఒకవేళ వాళ్ల గురించి తెలిస్తే, ఫోన్ చేయండి. అయామ్ వెరీ సారీ మిస్టర్ ఐజాక్. ఇలా జరుగుతుందనుకోలేదు’’ చెప్పి లోపలికి ఎక్కాడు. నేనేమీ మాట్లాడలేదు. ఒక్క కుదుపుతో ట్రైన్ కదిలింది. డోర్లో నిలబడి నన్నే చూస్తున్న మీనన్ కళ్లలో ఏదో సంతృప్తి కనిపిస్తోంది. ఎవరూ లేని ప్లాట్‌ఫామ్ మీద శిలావిగ్రహంలా నిలబడిపోయాను. పాత జ్ఞాపకాలు తెరలుతెరలుగా కడుపునొప్పిలా తిరగబెడుతున్నాయి. ఎప్పుడో ఆరేళ్ల కిందటి నిత్య మాటలు - ‘‘మీనన్ ఎక్కడున్నాడు? కనీసం ఫోన్ నెంబరైనా తేవాలి. అలా తేలేకపోతే, నువ్వు సెల్ఫిష్వి అంటోంది అమ్మ. నన్ను నిజంగా ప్రేమిస్తే, మీనన్‌ని వెతుకుతావు. నాకోసం కాదు. అమ్మ నమ్మకాన్ని వమ్ము చేసి, నువ్వు సెల్ఫిష్వి కాదని రుజువు చేయడం కోసం’’ అంది అప్పుడు నిత్య. ఈ మాట కోసం... ఇదే మీనన్‌ని ఆరేళ్ల కిందట నిత్యవాళ్లముందుంచాను. ఆ తర్వాత ఏవో కారణాలు, మరేవో ద్రోహాలు ఆరోపించి, నిత్యని తనకు కాకుండా చేస్తున్నాననే కోపంతో, నన్ను దూరంగా నెట్టేసి, తనని గుప్పెట్లో పెట్టుకుంది మేరీ. నన్ను శత్రువులా ద్వేషించడం మొదలుపెట్టింది. అసలు నా తప్పేముంది? అయితే మాత్రం ఇప్పుడు నేను చేసింది ఏమిటి. వాళ్లు ఎక్కడున్నారో తెలీదని మీనన్‌కి అబద్ధం చెప్పాను. ఇది తప్పు కాదా? సెల్ఫిష్నెస్ కాదా? వాళ్లు ఇప్పుడు ఎక్కడున్నారో నాకు తెలుసు. ఆ నిజం చెబితే మీనన్ తప్పకుండా అక్కడికి వెళ్లి కలుస్తాడు. అంతకుముందులాగా మేరీ కూడా మళ్లీ అతన్ని దూరం చేసుకోదు. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా లేను కాబట్టి, అంటే, మానవ సంబంధాలన్నీ ఇలాగే ఉంటాయన్నమాట. స్వార్థం లేకుండా ఎక్కడా, ఎవరిలోనూ ఏమీ ఉండదా? చివరికి ప్రేమ కూడా ఉండదా? చుట్టూ చీకటి. చలి గాలి. సిగ్నల్ ఇవ్వకపోవడంతో ఏదో ట్రైన్ ఔటర్లో హారన్ కొడుతోంది. రైల్పేటలోంచి క్రిస్మస్ కేరల్స్, కేరింతలు, పాటలు... ప్చ్!! ఎప్పుడో జీవితంలోంచి తెలీకుండానే మాయమైన ప్యారడైజ్... మళ్లీ తలుపు తట్టి లోపలికి వస్తుందా? లేక ప్యారడైజ్ లాస్ట్? షర్ట్ జేబులో నాలుగైదు నోట్లు. సెల్‌ఫోన్. రెండు కార్డులు. ఒకటి - మోహన్ ఫౌండేషన్‌కి ఆర్గాన్స్ డొనేట్ చేస్తూ సంతకం పెట్టింది, రెండోది నాకేమైనా జరిగితే తెలియజేయమంటూ కొన్ని ఫోన్ నంబర్లు రాసినది. దీనిలో మేరీ పేరు, ఫోన్ నంబర్. నిత్య పేరు, స్విచ్ ఆఫ్ అయిన నంబర్లు. శాంటాక్లాజ్ లాంటి నిత్య - ఇక ఏ చివరి కాన్కనీ జీవితంలోకి తీసుకురాదని అర్థమయ్యాక, ఇక ఇలా బతకడం కూడా అనవసరమేమో! చీకటి వెలుగుల మిశ్రమం లాంటి ఆ ప్లాట్‌ఫామ్ మీద ఒంటరిగా నిలబడిన నాకు, జీవితం శూన్యంగా అనిపించింది. నాకు ఏమన్నా జరిగితే, ఈ లోకంలో ఎవరికీ తెలియజేయాల్సిన అవసరం లేదనిపించింది. ఫోన్ నంబర్లు రాసిన కార్డుని తీసి, ముక్కలుగా చింపి పట్టాలమీద పడేశాను. రైలు పట్టాలు, ఉక్కురంగులో చల్లగా. ఒక్కసారిగా వాటిని చేత్తో తాకితే, ఎన్నోసార్లు ప్రియమైన వ్యక్తుల్ని దూరంగా తీసుకెళ్లి, మళ్లీ దగ్గరగా తెచ్చిన ఈ చలనం లేని పట్టాల్ని... ఒక్కసారి పెదవులానించి ముద్దుపెట్టుకుంటే... ఔటర్లో కదిలిన ట్రైన్ దగ్గరకొచ్చేస్తోంది. పెద్దగా మోగుతున్న హారన్. రెప్పల వెనుక నిత్య రూపాన్నే గుర్తుచేసుకుంటూ, కళ్లు మూసుకుంటే వేగంగా ట్రైన్. విసురుగా శబ్దం, గాలి... అయిపోబోతోంది... అయిపోబోతోంది. ‘‘ఎలోయీ, ఎలోయీ, లామా సబక్తానీ..’’ శిలువ మీది జీసస్ చివరి మాటలు గుర్తొస్తుంటే, నా జీవితంలో చివరి క్షణాలు... ఒకే ఒక్క అడుగు ముందుకి కదిపితే, గుర్తుపట్టడానికి కూడా వీలులేని శరీరం... ఇంతలో ఉన్నట్టుండి ఎవరో చెయ్యి పట్టుకుని వెనక్కి లాగడం... నేను అమాంతం ప్లాట్‌ఫామ్ మీద వెల్లికిలా పడిపోవడం... అంతా క్షణాల్లోకి. నా వెనుక బెంచీ చాటు నుంచి స్టేషన్లో ప్లాస్టిక్ బాటిల్స్ ఏరుకునే కుర్రాడు నన్నే భయంగా చూస్తున్నాడు. వీడా నా చావుని ఆపింది? నా జీవితాన్ని పొడిగించింది? ఎప్పుడూ స్టేషన్‌ని అంటిపెట్టుకుని ఉండే ఆ కుర్రాడికి రెండు కిడ్నీలు పాడయ్యాయని నాకు తెలుసు. కనీసం ఒక కిడ్నీ అయినా మార్చడానికి దాత లేడు. రేపో మాపో చావుకి సిద్ధపడిన వీడు... నా చావుకి అడ్డం వచ్చి కాపాడతాడా? మరుక్షణం మనసులో ఏదో ఆలోచన. సిమెంట్లా గడ్డ కడుతూ బలపడుతోంది. చెయ్యెత్తి రమ్మని పిలిస్తే, నీరసంగా నడుచుకుంటూ దగ్గరికొచ్చాడు. ఇలాగే ఉంటే వీడు ఎక్కువ కాలం బతకడు. వీడి జీవితాన్ని పొడిగించే కాన్కని ఏ క్రిస్మస్ తాత తీసుకొస్తాడు? ఒకే ఒక్క గుండెతో, బాధల్ని మాత్రమే నింపుకుంటూ ఎన్నాళ్లు ఎదురుచూస్తూ బతకగలమో తెలీదు. కానీ, ఒక్క కిడ్నీతో మాత్రం... జీవితం గడిపేయొచ్చు. మేరీ అనుకున్నట్లుగా నేను సెల్ఫిష్ని కాదని, అందరి ద్వేషానికీ గురైనా, నా గుండె లోపలి ‘ప్రేమ’ ఇంకా అలాగే ఉందని అర్థమైంది. ఔటర్లో కదిలిన ట్రైన్ దగ్గరకొచ్చేస్తోంది. పెద్దగా మోగుతున్న హారన్. రెప్పల వెనుక నిత్య రూపాన్నే గుర్తుచేసుకుంటూ, కళ్లు మూసుకుంటే వేగంగా ట్రైన్. విసురుగా శబ్దం, గాలి... అయిపోబోతోంది... అయిపోబోతోంది. -
నిషేధిత ప్లాస్టిక్ కవర్లు వాడొద్దు
ఆదిలాబాద్ మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: నిషేధిత ప్లాస్టిక్ కవర్లను వాడొద్దని, ఎవరైనా వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ ఫుడ్, శానిటరీ ఇన్స్పెక్టర్లు మహ్మద్ అయాజ్, జగదీశ్వర్‌గౌడ్ హెచ్చరించారు. నిషేధిత పాలిథిన్ కవర్లపై సోమవారం మున్సిపల్ కార్యాలయంలో టిఫిన్ సెంటర్, మిల్క్ సెంట ర్ల నిర్వాహకులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ ప్రభుత్వం కొన్ని ప్లాస్టిక్ బ్యాగులను నిషేధించిందని తెలిపారు. నిషేధిత కవర్లు వాడితే పెద్ద ఎత్తున జరిమానాలు విధిస్తామని పేర్కొన్నారు. ఈ కవర్లతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందన్నారు. వీటిని తినడం ద్వారా ఆవులు, గేదెలు చనిపోతాయని, ఇవి భూమిలో కొన్ని లక్షల సంవత్సరాలు నిల్వ ఉంటాయని పేర్కొన్నారు. 40 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల ప్లాస్టిక్ కవర్లు వాడే వారికి రూ.250 నుంచి రూ.500, విక్రయించే దుకాణదారులకు రూ.2500 నుంచి రూ.5000 జరిమానా విధించి పర్యావరణ చట్టం 1986 ప్రకారం చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతీ వారం ఆయా వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేసి నిషేధిత ప్లాస్టిక్ కవర్లపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. వీటికి సంబంధించిన ఫ్లెక్సీలను మిల్క్, టిఫిన్ సెంటర్ల వద్ద ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతానికి అందరూ సహకరించాలని కోరారు. -
ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తే లెసైన్సులు రద్దు
గంగావతి, న్యూస్‌లైన్ :ప్లాస్టిక్ కవర్లు వినియోగించే హోటళ్లు, దుకాణాల లెసైన్పులు రద్దు చేస్తామని నగరసభ అధ్యక్షుడు షామిద్ మనియార్ హెచ్చరించారు. స్థానిక జంతకల్లులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, మద్దానేశ్వర యువజన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఇక్కడ ఏర్పాటు చేసిన ఎన్ఎస్ఎస్ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్లాస్టిక్ కవర్లు వినియోగించే దుకాణ యజమానుల గురించి నగర ప్రజలు సమాచారం అందించాలన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకునేందుకు మొక్కలను పెంచాలన్నారు. వార్డుల్లోకి వచ్చే చెత్త తరలింపు ట్రాక్టర్లలో చెత్త వేయకుండా చెత్తను ఇళ్లలోనే నిల్వ ఉంచినవారిపై జరిమాన విధించే చట్టం బెంగళూరులో అమలులోకి వచ్చిందన్నారు. నగర, పట్టణ పంచాయతీల పరిధిలో కూడా ఈ చట్టం త్వరలో అమలు అవుతుందని తెలిపారు. పరిసరాలను శుభ్రంగా ఉంచకోకపోతే డెంగీ, మలేరియా వ్యాధులు ప్రబలుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్ర హస్తకళల అభివృద్ధి మండలి మాజీ అధ్యక్షురాలు లలితరాణి శ్రీరంగదేవరాయలు, మద్దానేశ్వర యువజన సంఘం అధ్యక్షులు సోమశేఖరగౌడ, కళాశాల అభివృద్ధి సమితి అధ్యక్షులు సురేష్ గౌడప్ప, కౌన్సిలర్లు హుసేన్, ఉద్భవ లక్ష్మీ మహిళా మండలి ప్రముఖులు మల్లమ్మ, హంపమ్మ, నిర్మల తదితరులు పాల్గొన్నారు. -
ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించాలి : కలెక్టర్ కిషన్
జిల్లాలో 40 మైక్రాన్ల కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ బ్యాగుల నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ కిషన్ సూచించా రు. ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాల నిర్వహణ చట్టంపై మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 40 మైక్రాన్ల కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ బ్యాగులను తయా రు చేసినా, విక్రయించినా, రీస్లైకింగ్ చేసినా *50 వేల జరిమానా విధించనున్నట్లు తెలిపా రు. చిన్నచిన్న వ్యాపారులకు * ఐదు వేల వరకు జరిమానా విధిస్తామన్నారు. వరంగల్ నగరపాలక సంస్థతోపాటు జనగామ, మహబూబాబాద్, నర్సంపేట, భూపాలపల్లి, పరకాల మునిసిపాలిటీల్లో ప్లాస్టిక్ నిషేధాన్ని పటిష్టంగా అమలు చేయాలన్నారు. అన్ని ప్రధాన కూడళ్లలో ప్లాస్టిక్ నిషేధంపై బోర్డులు ప్రదర్శించాలని సూచిం చారు. అన్ని ఫంక్షన్ హాళ్లలో ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్ల వాడకాన్ని నివారించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్లాస్టిక్ నిషేధం అధికార యత్రాంగం బాధ్యత అని చూడకుండా... ప్రజలందరూ స్వచ్ఛందంగా పర్యావరణ పరిరక్షణకు కృషిచేయూలని సూచించారు. ప్లాస్టిక్ బ్యాగుల స్థానంలో పేప ర్ కవర్లు, సంచుల వాడకాన్ని ప్రోత్సహిస్తామని, ఇందుకోసం మెప్మా, డ్వాక్రా సభ్యుల సహకారం తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఈ విషయంలో ప్రజలను చైతన్యపరిచేందుకు కరపత్రాలను ముద్రించాలని, నగరంలోని వ్యా పార సంస్థలు, దుకాణ యజమానులకు ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించాలన్నారు. వచ్చే మేడారం జాతరను ప్లాస్టిక్ రహిత జాతరగా మార్చేలా చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ వివేక్‌యాదవ్, పీసీబీ అధికారి జవహర్లాల్, ప్రొఫెసర్ రతన్‌సింగ్ పాల్గొన్నారు. -
జీవీకే మాల్‌పై జీహెచ్ఎంసీ అధికారుల దాడులు
హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని జీవీకే మాల్‌పై జీహెచ్ఎంసీ అధికారులు శుక్రవారం దాడులు జరిపారు. నిబంధనలకు విరుద్ధంగా జీవీకే మాల్లోని దుకాణాలు ప్లాస్టిక్ సంచులు వినియోగిస్తున్నారన్న ఫిర్యాదు నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు ఈ దాడులు నిర్వహించారు. పాస్టిక్ సంచులు వినియోగిస్తున్న ఇతర దుకాణాలకు 25వేల నుంచి లక్ష వరకూ అధికారులు జరిమానా విధించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
జీవీకే మాల్‌పై జీహెచ్ఎంసీ అధికారుల దాడులు
హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని జీవీకే మాల్‌పై జీహెచ్ఎంసీ అధికారులు శుక్రవారం దాడులు జరిపారు. నిబంధనలకు విరుద్ధంగా జీవీకే మాల్లోని దుకాణాలు ప్లాస్టిక్ సంచులు వినియోగిస్తున్నారన్న ఫిర్యాదు నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు ఈ దాడులు నిర్వహించారు. పాస్టిక్ సంచులు వినియోగిస్తున్న ఇతర దుకాణాలకు 25వేల నుంచి లక్ష వరకూ అధికారులు జరిమానా విధించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.