ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగ్‌లకు చెక్‌.. అమల్లోకి నిషేధం

AP Govt Orders Ban On Plastic Carry Bags Less Than 120 Microns - Sakshi

 డిసెంబర్‌ 31 నుంచి అమల్లోకి వచ్చిన కేంద్ర పర్యావరణ శాఖ ఉత్తర్వులు

వార్డు పరిధిలోనే తనిఖీలు, కేసుల నమోదు 

ఆదేశాలు జారీ చేసిన పురపాలక శాఖ 

ఈ నెల 26 నుంచి ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలపైనా నిషేధం 

సాక్షి, అమరావతి: ఒక్కసారి వాడి పారవేసే ప్లాస్టిక్‌ సంచుల తయారీ, వినియోగంపై కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధం అమల్లోకి వచ్చింది. ఇకపై దేశవ్యాప్తంగా 120 మైక్రాన్లు లేదా ఆపై మందం గల ప్లాస్టిక్‌ సంచులను మాత్రమే వినియోగించాలి. ఈ మేరకు కేంద్ర పర్యావరణ శాఖ జారీ చేసిన ఆదేశాలు డిసెంబర్‌ 31 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇకపై 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల క్యారీ బ్యాగ్‌లు తయారు చేసినా, దిగుమతి చేసుకున్నా, అమ్మినా, వినియోగించినా కఠిన చర్యలు తీసుకుంటారు.

ఇప్పటివరకు 75 మైక్రాన్ల మందం గల క్యారీ బ్యాగులను వినియోగించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇకపై పునర్‌ వినియోగానికి అవకాశము­న్న 120 మైక్రాన్ల ప్లాస్టిక్‌ సంచులను మా­త్ర­మే వినియోగిం­చాల­ని రాష్ట్రంలోని అన్ని ముని­సి­పాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయ­­తీలతో పాటు జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిబంధనల అమలు, పర్యవేక్షణను వార్డు శానిటేషన్‌ కార్యదర్శులు చూడాలని ఆదే­శాలు జారీ అయ్యాయి.

దీంతో ఒక్క­సా­రి వాడి పారేసే ప్లాస్టిక్‌ సంచులు పర్యావరణానికి ఎంత ప్రమాదకరంగా మారుతు­న్నాయో ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. కాగా, వీధుల్లో ఏర్పాటు చేసే ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలపై విధించిన నిషేధం కూడా ఈ నెల 26వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. నిబంధనల అమలును తనిఖీ చేసేందుకు ప్రత్యేక ఎన్‌ఫోర్సుమెంట్‌ విభాగాలను సైతం ఏర్పాటు చేశారు. ఈ బృందాలు నగరాలు, పట్టణాలు, పంచాయతీల్లో తనిఖీలు చేయనున్నాయి.

ఇదీ చదవండి: రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేధం..ప్రజల భద్రత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top