నీరుగారిన నిషేధం

Badly executed plastic bans in Berhampur - Sakshi

కబళిస్తున్న ప్లాస్టిక్‌ భూతం

ఫ్లెక్సీ బోర్డులతో పొంచిఉన్న ప్రమాదం

ప్రజారోగ్యానికి తూట్లు

పట్టించుకోని ప్రభుత్వాధికారులు

బరంపురం: ప్రస్తుతం  మానవ జీవితంలో ప్లాస్టి క్స్‌ విడదీయరాని భాగమైపోయాయి. ఉదయం బ్రష్‌ చేసుకోవడం నుంచే ప్లాస్టిక్స్‌ వాడకం  మొదలవుతోంది. ఇక పాల ప్యాకెట్లు, కూరలు తెచ్చుకునే బ్యాగులు, చిన్నారులు  స్కూలు కెవెళ్లేటపు డు  లంచ్‌ బాక్స్‌లు,  వాటర్‌ బాటిళ్లు, ఇంటి బయట  అడుగు పెడితే అల్పాహారం, బోజనం, నీళ్లు, కాయగూరలు ఏది కొన్నా  ప్లాస్టిక్‌  బ్యాగులతోనే మన   చేతికందుతాయి.  ఇటీవల  కాలం లో  ప్రచారం ఊపందుకోవడంతో ఫ్లెక్సీ బ్యాన ర్లు, బోర్డులు  వెల్లువెత్తుతున్నాయి. ఇవి కూడా ప్లాస్టిక్స్‌ వినియోగించి రూపొందిస్తున్నవే. ఇంకా ప్రమాదకరమైన రసాయనాలు రంగులను వీటిపై పూస్తున్నారు. ఇవన్నీ పర్యావరణానికి  పెను ప్రమాదాన్ని తెచ్చి పెడుతున్నాయని వివిధ సంస్థల వాదన. జిల్లాలో  ప్లాస్టిక్‌  కారణంగా రకరకాల అనారోగ్య సమస్యలు  ఎదుర్కొంటున్నవారు వేల  సంఖ్యలో ఉండడం  గమనార్హం.   

పదేళ్ల  క్రితం వరకూ సరుకులు తెచ్చుకోవాలంటే కాగితం సంచులు, జనప నార సంచులు ఎక్కువగా వాడేవారు. వీటికన్నా  తక్కువ ధరకే ప్లాస్టిక్‌  సంచులు అందుబాటులోకి రావడంతో అందరూ వీటిని ఉపయోగిస్తున్నారు.  20 మైక్రానుల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్‌  వాడకం  సమస్త జీవజాలం ఉనికికి  ముప్పుతెస్తుందని  అంతర్జాతీయంగా  పర్యావరణవేత్తలు  రుజువుచేశారు.  దీంతో  కొన్ని దేశాలు ప్లాస్టిక్‌  వాడకంపై నిషేధం విధించాయి. అయినప్పటికీ నిషేధం అమలు కావడం లేదు. మన దేశంలో   ప్రజాసంక్షేమమే తమ పరమావధి అంటూ భారీగా ఉపన్యాసాలు ఇచ్చే నేతలందరూ పర్యావరణానికి తూట్లు పొడితే ఈ ఫెక్సీ బ్యానర్లకు  భారీగానే ప్రోత్సాహం  ఇస్తుండడం విశేషం. ప్రస్తుతం జిల్లాలో పట్టణ, నగర ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాల వరకూ లక్షల సంఖ్యలో ఇలాంటి ఫ్లెక్సీ బ్యానర్లు  ఉన్నప్పటికీ ఏ  అధికారి కూడా  వీటిని పట్టించుకోవడం  లేదు.

ప్రమాదమని తెలిసినా..
పలువురు పరిశోధకులు అందించిన సమాచారం ప్రకారం ప్లాస్టిక్‌ సంచులు, ఇతర ప్లాస్టిక్‌ ఉత్పాదకాలు  మట్టిలో  కలవాలంటే అక్షరాలా లక్ష సంవత్సరాలు  పడుతుంది.  మనం తిని పారేసే అరటితొక్క 24 రోజుల్లో,  కాగితంతో  తయారుచేసిన  వస్తువులు నెల రోజుల్లో, వస్త్రాలు రెండేళ్లలో, చర్మపు  ఉత్పత్తులు 200 ఏళ్లలోగా భూమిలో కలిసిపోయే  పరిస్థితిలేదని అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ప్లాస్టిక్స్‌  వల్ల కాలుష్య విషవలయంలో జన జీవితాలు విలవిలలాడుతున్నాయి.  గంజాం జిల్లాలో ప్లాస్టిక్స్‌ వినియోగం ఏటా నలభై శాతం  పెరుగుతోంది.  అందులోని హెవీమెటల్స్‌ ఆహా రం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. ఫలితంగా నరాల  బలహీనత  ఏర్పడుతోంది.  బ్యాగ్‌ల కోసం, ఫ్లెక్సీ బ్యానర్ల కోసం వినియోగించే రంగుల వలన సీసం, కాడ్మియంలు పిల్లల్లో ఎదుగుదలను, జ్ఞాపకశక్తిని హరించి  వేస్తున్నాయి.

నామమాత్రంగా తనిఖీలు
ప్లాస్టిక్స్‌ వినియోగంపై ప్రపంచ  వ్యాప్తంగా నిషేధం ఉన్నప్పటికీ ఈ జిల్లాలో  మాత్రం ఒక్క శాతం కూడా అమలు కావడం లేదు. 20 మైక్రానుల కంటే తక్కువ మందం ఉన్న క్యారీ బ్యాగ్‌లు ఉపయోగించరాదని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు అమలుచేసే స్థితిలో అధికారులు లేరు. తక్కువ మందం ఉండే క్యారీ బ్యాగ్‌ల తయారీ లాభసాటి కావడంతో  ఉత్పత్తిదారులు వాటిని  తయారుచేస్తూ ప్రజల ప్రాణా లతో చెలగాటమాడుతున్నారు. ఏదో నామమాత్రంగా బీఎంసీ ఆధ్వర్యంలో నగరంలో తూతూమంత్రంగా సోదాలు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. ఇప్పటిౖMðనా అధికార యంత్రాంగం ప్లాస్టిక్స్‌ వినియోగం వల్ల కలుగుతున్న పర్యావరణ విషాదాన్ని గుర్తించి నిషేధంపై దృష్టి సారించా లని పలు స్వచ్ఛం, ప్రజా సంఘాలు కోరుతున్నారు.

  

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top