చెడు వాసన దూరం

Fat in dairy products is good - Sakshi

ఇంటిప్స్‌ 

బట్టలు ఉతికాక అందులో కొన్ని చుక్కల వైట్‌ వెనిగర్‌ వేసి నానబెట్టి, పది నిమిషాల తర్వాత ఆరేయాలి. ఇలా చేస్తే బట్టల దుర్వాసన వదులుతుంది. ఇంట్లో పొగ, ఇతర మాడు వాసన త్వరగా పోవాలంటే వైట్‌ వెనిగర్‌ను ఒక చిన్న గిన్నెలో పోసి గదిలో ఉంచాలి.  అర సగం నిమ్మ ముక్కను ఉప్పులో అద్ది, దాంతో వంటగదిలోని పొయ్యి గట్టు తుడిచి కడిగితే క్రిములు, దుర్వాసన దరిచేరకుండా ఉంటాయి.డ్రై వాష్‌ నుంచి తెచ్చిన దుస్తులను అలాగే ప్లాస్టిక్‌ బ్యాగ్‌లో ఉంచకుండా, తీసి అల్మరాలో భద్రపరచాలి. కొన్నాళ్లుగా ప్లాస్టిక్‌ బ్యాగులో దుస్తులు అలాగే ఉంచితే చెడువాసన రావడంతో పాటు అవి అక్కడక్కడా పసుపు రంగుమారే అవకాశం ఉంది. 
     
కొత్త షూస్‌ బిగుతుగా ఉంటే లోపలివైపు హెయిర్‌ డ్రయ్యర్‌తో వెచ్చగా చేసి, కొద్దిగా అటూ ఇటూ లాగి వదలాలి. ఇలా చేయడం వల్ల షూస్‌ వదులు అవుతాయి. పాదాలకు నొప్పి ఉండదు. రోజూ వాడుతున్న షూస్‌కి ఇలా అప్పుడప్పుడు హెయిర్‌ డ్రయ్యర్‌ని ఉపయోగిస్తే షూ దుర్వాసన తగ్గుతుంది. వానకాలం తడిగా అయిన లెదర్‌ చెప్పులు, షూష్‌లోపల చెమ్మను పోగొట్టాలంటే డ్రయ్యర్‌ని ఉపయోగిస్తే త్వరగా పొడిబారుతాయి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top