శారీరక, మానసిక వికలాంగురాలైన ఒక బాలిక(13)ను గుర్తు తెలియని వ్యక్తులు ప్లాస్టిక్ కవర్లో ఉండగట్టి రోడ్డు మీద పడేశారు.
పశ్చిమగోదావరి: శారీరక, మానసిక వికలాంగురాలైన ఒక బాలిక(13)ను గుర్తు తెలియని వ్యక్తులు ప్లాస్టిక్ కవర్లో మూతకట్టి రోడ్డు మీద పడేశారు. ఈ హృదయ విదారక ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలం రంగాయగూడెం లోని మదర్‌థెరిస్సా విగ్రహం వద్ద ఆదివారం జరిగింది. బాలిక వయసు సుమారు 13 ఏళ్లున్నా ఐదేళ్ల పాప ఎత్తు మాత్రమే ఉంది.
నడవలేని స్థితిలో ప్లాస్టిక్ కవర్లో ఉన్న బాలికను బయటకు తీసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన పోలీసులు, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు వెంటనే ఆ బాలికను ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స అవసరమైతే విజయవాడకు తరలిస్తామని అధికారులు తెలిపారు.
(ఏలూరు)