వెరైటీ వంట: ప్లాస్టిక్‌ కవర్‌లో చేపల పులుసు, ఈ బామ్మ ఎలా చేసిందో చూడండి!

Viral Video: Woman Cooks Fish Broth In Plastic Bag - Sakshi

ఇటీవల స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. మొబైల్‌ చేతిలో ఉంటే చాలు ప్రపంచం నలుమూలలా ఏం జరుగుతున్నా క్షణాల్లో తెలిసిపోతోంది. ఈ క్రమంలో సోషల్‌ మీడియా వాసుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏం చేసినా వెరైటీగా ప్రయత్నిస్తూ ఆ వీడియోలను నెట్టింట షేర్‌ చేస్తున్నారు. ఇవి యూజర్లకు నచ్చితే లక్షల్లో లైకులు, వ్యూస్‌తో వైరల్‌గా మారుతుంది. ప్రస్తుతం ఇదొక ‍ ట్రెండ్‌గా మారిందనే చెప్పాలి. క‌ట్టెల మంటపై చేప‌ల పులుసు వండుతున్న ఓ పెద్దావిడ వీడియో ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఆ వీడియోలో.. ఒక బామ్మ కట్టెల మంట మీద నీటితో నిండిన ప్లాస్టిక్ బ్యాగ్‌ను ఉంచి వంట చేయడం ప్రారంభించింది. అయితే ఈ వీడియో చూస్తున్న వారంతా మంటపై పెట్టిన ప్టాస్టిక్ కవర్‌ వెంటనే కరిగిపోతుందని అనుకున్నారు. అయితే అలా జరగలేదు. వేడి ప్రభావం దాని మీద ఏ మాత్రం చూపించ లేదు. కాసేపు తర్వాత ఆ పెద్దావిడ కవర్‌లో ఉన్న నీటిలో ప‌లు దినుసులు వేస్తూ చేప‌, కొద్దిగా మిర్చిని జోడిస్తుంది. ఈ వీడియోని ది ఫైజెజ్ అనే ట్విటర్ యూజర్‌ షేర్ చేయ‌గా ఇప్ప‌టివ‌ర‌కూ 5 ల‌క్ష‌ల మందిపైగా వీక్షించారు. దీన్ని చూసిన నెటిజన్ల మదిలో పలు ప్రశ్నలను లేవనెత్తింది. కొంతమంది వినియోగదారులు ప్లాస్టిక్‌లో వంట చేయడం వల్ల క్యాన్సర్ వస్తుందని చెప్పగా, మరికొందరు ప్లాస్టిక్ నిప్పు వేడి తాకగానే కరిగిపోతుంది కదా అయినా ఇది ఎలా సాధ్యమైందని కామెంట్‌ చేస్తున్నారు. 

చదవండి: మిస్టరీగా వైట్‌బాల్‌.. గాడ్జిల్లా గుడ్డేం కాదు!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top