ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించాలి : కలెక్టర్ కిషన్ | Regulate the use of plastic bags: Collector Kishan | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించాలి : కలెక్టర్ కిషన్

Aug 28 2013 6:16 AM | Updated on Mar 21 2019 7:25 PM

కలెక్టర్ మాట్లాడుతూ 40 మైక్రాన్ల కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ బ్యాగులను తయా రు చేసినా, విక్రయించినా, రీస్లైకింగ్ చేసినా *50 వేల జరిమానా విధించనున్నట్లు తెలిపారు.

జిల్లాలో 40 మైక్రాన్ల కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ బ్యాగుల నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ కిషన్ సూచించా రు. ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాల నిర్వహణ చట్టంపై మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 40 మైక్రాన్ల కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ బ్యాగులను తయా రు చేసినా, విక్రయించినా, రీస్లైకింగ్ చేసినా *50 వేల జరిమానా విధించనున్నట్లు తెలిపా రు. చిన్నచిన్న వ్యాపారులకు * ఐదు వేల వరకు జరిమానా విధిస్తామన్నారు. వరంగల్ నగరపాలక సంస్థతోపాటు జనగామ, మహబూబాబాద్, నర్సంపేట, భూపాలపల్లి, పరకాల మునిసిపాలిటీల్లో ప్లాస్టిక్ నిషేధాన్ని పటిష్టంగా అమలు చేయాలన్నారు. అన్ని ప్రధాన కూడళ్లలో ప్లాస్టిక్ నిషేధంపై బోర్డులు ప్రదర్శించాలని సూచిం చారు. అన్ని ఫంక్షన్ హాళ్లలో ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్ల వాడకాన్ని నివారించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
 
 ప్లాస్టిక్ నిషేధం అధికార యత్రాంగం బాధ్యత అని చూడకుండా... ప్రజలందరూ స్వచ్ఛందంగా పర్యావరణ పరిరక్షణకు కృషిచేయూలని సూచించారు. ప్లాస్టిక్ బ్యాగుల స్థానంలో పేప ర్ కవర్లు, సంచుల వాడకాన్ని ప్రోత్సహిస్తామని, ఇందుకోసం మెప్మా, డ్వాక్రా సభ్యుల సహకారం తీసుకోనున్నట్లు వెల్లడించారు.  ఈ విషయంలో ప్రజలను చైతన్యపరిచేందుకు కరపత్రాలను ముద్రించాలని, నగరంలోని వ్యా పార సంస్థలు, దుకాణ యజమానులకు ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించాలన్నారు. వచ్చే మేడారం జాతరను ప్లాస్టిక్ రహిత జాతరగా మార్చేలా చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ వివేక్‌యాదవ్, పీసీబీ అధికారి జవహర్‌లాల్, ప్రొఫెసర్ రతన్‌సింగ్ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement