
మార్కాపురం(ప్రకాశం): ‘ మేడం మీరే నన్ను కాపాడండి’ అంటూ ఓ రైతు కలెక్టర్ కాళ్లు పట్టుకోబోయిన సంఘటన మార్కాపురంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. మార్కాపురం వచ్చిన కలెక్టర్ తమీమ్ అన్సారియాకు పెద్దారవీడు మండలం మద్దలకట్ట గ్రామానికి చెందిన రైతు దొడ్డ కోటిరెడ్డి తన బాధను వ్యక్తం చేస్తూ కన్నీటి పర్యంతమయ్యాడు.
హైవేపనుల్లో భాగంగా తనకు జీవనాధారమైన పొలాన్ని ప్రభుత్వం భూసేకరణ కింద సెంటుకు రూ.9 వేలే ఇస్తామంటున్నారని, కనీసం రూ.50వేలైనా ఇచ్చి ఆదుకోవాలని కలెక్టర్ కాళ్లుపట్టుకున్నాడు. తన ఆవేదనంతా కన్నీటిరూపంలో కలెక్టర్‌కు వివరించాడు. ఆ పొలమే తనకు జీవనాధారమని, భూసేకరణలో హైవేరోడ్డు కింద తీసుకుంటే తనకు కుటుంబ పోషణ కష్టమని, న్యాయం చేయాలని కోరాడు. ఈ లోగా కలెక్టర్ వ్యక్తిగత సిబ్బంది, పోలీసులు రైతును సముదాయించారు.