తాడేపల్లి: అసెంబ్లీలో కూటమి నేతలు పచ్చి అబద్ధాలు, కాకి లెక్కలు చెబుతున్నారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. సంపద సృష్టిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. అన్ని బోగస్ లెక్కలే చెబుతున్నారని ధ్వజమెత్తారు. ఈరోజు(శుక్రవారం, మార్చి 6వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన పేర్ని నాని.. ‘ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చంద్రబాబుకు రూ. 8 వేల కోట్ల బడ్జెట్ అప్పచెప్పింది. 2019లో వైఎస్ జగన్‌కు చంద్రబాబు రూ. 100 కోట్ల బడ్జెట్ మాత్రమే అప్పచెప్పారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై చంద్రబాబు అనేక అబద్ధాలు చెప్పారు. వైఎస్ జగన్‌పై విష ప్రచారం చేసి కూటమి అధికారంలోకి వచ్చింది. కూటమి అధికారంలోకి వచ్చాక మూడు బడ్జెట్‌లు ప్రవేశపెట్టింది. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో చెప్పాలి. కరెంట్ చార్జీలు తగ్గిస్తున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాబోయే 60 రోజుల్లో 57 వేల కోట్లు సంపద సృష్టిస్తామని తప్పుడు లెక్కలు చెబుతున్నారు’ అని విమర్శించారు.

పేర్ని నాని ఇంకా ఏమన్నారంటే..
- ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆదాయాలు రాకపోగా, లోటు కనిపిస్తోంది
- అంచనాలకు, వాస్తవ పరిస్థితికి చాలా తేడా కనిపిస్తోంది
- చివరికి బడ్జెట్ కూడా దొంగతనంగా పెడుతున్నారు
- రూ.98 వేల కోట్లు మాత్రమే అప్పు తీసుకుంటామని రూ. లక్షా 3 వేల కోట్లు గతేడాది అప్పు చేశారు
- ఈ ఏడాది రూ. 97 వేల కోట్ల అప్పు తీసుకుంటామని బడ్జెట్ లో చెప్పారు
- వివిధ కార్పొరేషన్ల నుండి తీసుకుంటున్న అప్పులను బడ్జెట్‌లో చూపటం లేదు
- ఈ విషయాన్ని ఎల్లోమీడియా కూడా రాసింది
- రెండు నెలల్లో రూ. 57 వేల కోట్ల ఆదాయం ఎలా వస్తుంది?
- రాష్ట్రం ఆర్థికంగా కుంగిపోతుంటే గాడిన పెట్టామంటూ అబద్దపు మాటలు ఎందుకు చెప్తున్నారు?
- చంద్రబాబు నివాసం ఉంటున్న కరకట్ట ఇల్లు ఎవరిదో ఎందుకు చెప్పటం లేదు?
- లింగమనేని రమేష్‌దా? సీఆర్‌డీఏదా? చంద్రబాబుదా?
- రైతుల భూమిని 22A లో ఎక్కించిన వ్యక్తి చంద్రబాబు
- దీనిపై రాజకీయ పార్టీలు, మీడియా ఎదుట విచారణకు సిద్దమా?
- టాటా మోటర్స్ కి ఎకరా రూ.38 లక్షల చొప్పున గుజరాత్ లో మోడీ ప్రభుత్వం ఇచ్చింది
- కానీ ఎకరం రూపాయికే ఇచ్చారంటూ లోకేష్ పచ్చి అబద్దాలు చెప్పారు
- 1100 ఎకరాలను రూ.400 కోట్లకు టాటా మోటర్స్ కొనుగోలు చేసింది
- ప్రపంచ వ్యాప్తంగా రూపాయి విలువ పడిపోయింది
- కానీ విశాఖలో రూపాయి విలువ విపరీతంగా పెరిగింది
- అందుకే విశాఖలో 99 పైసలకే భూములను ఇస్తున్నారు
- రాష్ట్రంలో సెంటు భూమి ఆక్రమించి ఇల్లు కట్టుకున్నా వాటిని కూల్చేశారు
- కానీ గీతం యూనివర్సిటీ ఆక్రమంచిన వేల కోట్ల విలువైన భూమిని మాత్రం క్రమబద్దీకరిస్తున్నారు
- ఇల్లు కోల్పోయిన పేదల కన్నీటి వరదలో కూటమి ప్రభుత్వం కొట్టుకు పోతుంది
- గీతం యూనివర్సిటీ ఓనరు నారా లోకేష్ తోడల్లుడు కాబట్టే క్రమబద్దీకరిస్తారా?
- వెయ్యి కోట్ల విలువైన భూమినే తాను కబ్జా చేసినట్టు గీతం ఓనరు చెప్పారు
- వెయ్యి కోట్ల భూమిని కబ్జా చేయటం అంటే ఈ ప్రభుత్వాన్ని ఏం అనాలి?
- వైఎస్ జగన్ లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారని పవన్ కళ్యాణ్ తిరుపతి సభలో ఆరోపించారు
- అసెంబ్లీలోనేమో జగన్ కలిపాడని లేదనీ, టీటీడీ పాలకమండలిదే బాధ్యత అంటూ మాట మార్చారు
- బోలేబాబా, సంగం డెయిరీ, వైష్ణవి, ఏఆర్ డెయిరీ అన్నీ చంద్రబాబువే
- 4 వేల కోట్ల టర్నోవర్ హెరిటేజ్ కు ఉందని భువనేశ్వరి చెప్పారు
- తనకు లక్ష కోట్ల ఆస్తి ఉందని చంద్రబాబు ప్రకటించారు
- అసెంబ్లీలో మాత్రం కుటుంబ బతుకు తెరువు కోసమే వ్యాపారం చేస్తున్నామని సన్నాయి నొక్కులు నొక్కారు
- హెరిటేజ్ సంస్థ నుండి కొనుగోలు చేసిన మజ్జిగ ప్యాకెట్లనే ప్రజలకు పంచాలని జీవోలు ఇచ్చారు
- కానీ తాము ప్రభుత్వానికి అసలు మజ్జిగ అమ్మలేదని పచ్చి అబద్ధం చెప్పారు
- చివరికి టీటీడీకి కూడా హెరిటేజ్ ద్వారా నెయ్యి సరఫరా చేశారు
- దీనిపై చర్చించటానికి చంద్రబాబుకు దమ్ముందా?
- పాలపొడి, నెయ్యి సరఫరా చేయలేదని చంద్రబాబు చెప్పగలరా?
- ఈ విషయాలన్నీ చెబుతుంటే హిస్టరీ వద్దంటూ పయ్యావుల కేశవ్ మాట్లాడటం సిగ్గుచేటు
- నెయ్యితో చేసిన లడ్డూకి నెయ్యి వాసన రావటానికి నెయ్యిని స్ప్రే చేసిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానిది
- 6.28 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్టు చంద్రబాబు అసెంబ్లీలో పచ్చి అబద్దాలు చెప్పారు
- ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారో ఆ వివరాలను ఆన్ లైన్ లో పెట్టే సత్తా ఉందా?
- రాష్ట్ర అప్పులు రాకెట్ వేగంతో చేస్తూ, ఆ డబ్బును ఏం చేస్తున్నారో ఎందుకు చెప్పటం లేదు?
- 20 నెలల్లోనే రూ. 3.20 లక్షల కోట్ల అప్పుకు లెక్క చెప్పాలి
- అనిత తన శాఖను వదిలేసి జగన్ దూషణ శాఖామంత్రిగా పని చేస్తున్నారు
- సొంత పార్టీ ఎమ్మెల్యేనే మోంథా తుపాను పరిహారం రైతులకు ఇవ్వలేదని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు
- మైకులు పని చేయక అసెంబ్లీని వాయిదా వేసిన ఘనత ఈ ప్రభుత్వానిది
- అసెంబ్లీ నడపటం చేతగానీ ప్రభుత్వ పెద్దలు తుపాను తీవ్రతను తగ్గించామని బడాయి మాటలు చెప్పారు
- ప్రతి జనవరిలో జాబ్ కేలండర్ అంటూ లోకేష్ పిట్టలదొర మాటలు చెప్తున్నారు
- కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్క ఇంటి నిర్మాణం కూడా చేయలేదు
- జగన్ కట్టించిన ఇళ్లని చంద్రబాబు ఉగాదికి ప్రారంభించబోతున్నారు
- విమానయాన శాఖ మంత్రి కార్పొరేట్ సేవకుడు
- సొంత జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఎయిర్ పోర్ట్ ను కనీసం పట్టించుకోవటం లేదు
- భోగాపురం ఎయిర్ పోర్టు జీఎంఆర్ కడుతుంటే రామ్మోహన్ నాయుడు హడావుడి చేస్తున్నారు
- ప్రభుత్వ ఎయిర్ పోర్ట్ అయిన గన్నవరం ఎయిర్ పోర్టును ఎందుకు పట్టించుకోవటం లేదు?
- రాగద్వేషాలకు అతీతంగా పని చేస్తామని ప్రమాణం చేసిన మంత్రులు మతవిద్వేషాలు రెచ్చగొడుతున్నారు
- హిందూ ఆలయాలను ధ్వంసం చేసిన మహమ్మద్ ఘోరీ తర్వాత చంద్రబాబే
- ఆయన హయాంలోనే తిరుమల వెయ్యి కాళ్ల మండపాన్ని కూల్చారు
- చంద్రబాబు హిందూ మతాన్ని పాటించే వాడైతే ఆ మంటపాన్ని కూల్చుతారా?
- జంతువుల తోలుతో చేసిన బూట్లు వేసుకుని పూజలు చేసే ఏకైక వ్యక్తి చంద్రబాబు
- తల్లి, తండ్రి చనిపోతే కనీసం పిండప్రదానమైనా చేశారా?
- మరి ఏ రకంగా చంద్రబాబు హిందువు?
- జంతువుల కొవ్వు, టాయిలెట్ యాసిడ్ లను లడ్డూలో కలిపితే జనం బతికేవారా?
- తిరుమల కొండ మీద కూడా అన్యమత ప్రచారం చేసుకోవచ్చని చంద్రబాబు హామీ ఇవ్వలేదా?
- రైతులకు రుణమాఫీ అని చెప్పి మోసం చేశారు
- సూపర్ సిక్స్ అని ఇప్పుడు మోసం చేశారు
- ఇక ఆయన మాటలు విని ఎక్కువ మంది పిల్లల్ని కంటే వారికి పోషణ పరిస్థితి ఏంటి?
- చంద్రబాబు లాంటి బడాబాబుల ఇళ్లలో పని చేయించుకోవడానికి సామాన్యులు ఎక్కువ మంది పిల్లల్ని కనాలా?
- 11 మంది ఎమ్మెల్యే మాకు ఉన్నా 11వేల మందిలాగా పోరాడుతున్నాం
- నిజాయతీనే మాకు ధైర్యం
- లడ్డూ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందునే హెరిటేజ్ అతలాకుతలం అయింది
- చంద్రబాబు ఎన్ని పాపాలు చేస్తున్నారో అన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు
- అసలు లడ్డూలో కల్తీ జరిగితే అది చంద్రబాబు హయాంలోనే
- అందుకు చంద్రబాబే క్షమాపణ చెప్పాలి
- కాగ్ నివేదికలు ఎక్కడ దొరుకుతాయో కూడా తెలియని మంత్రులు ఏపీలో ఉన్నారు


