సాక్షి, హైదరాబాద్: ప్రజాపాలన – ప్రజావిజయోత్సవాల్లో భాగంగా ఈనెల 9న ఉదయం 10 గంటలకు అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఆదివారం ఉత్త ర్వులు జారీచేశారు. సజావుగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.


