కౌన్సిల్ హాల్ ప్రారంభించిన సీఎం రేవంత్ | Revanth Reddy inaugurated the Council Hall | Sakshi
Sakshi News home page

కౌన్సిల్ హాల్ ప్రారంభించిన సీఎం రేవంత్

Mar 8 2026 10:55 AM | Updated on Mar 8 2026 12:14 PM

Revanth Reddy inaugurated the Council Hall

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవలే పునరుద్ధరించిన అసెంబ్లీ ప్రాంగణంలోని శాసన మండలి భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు( ఆదివారం) ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్తగా పునరుద్ధరించిన భవనాన్ని పరిశీలించారు. అసెంబ్లీ సమావేశాలు  నూతన భవనంలోనే జరపనున్నట్లు  సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ ప్రసాద్ కుమార్‌లతో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. 

కాగా తెలంగాణ చారిత్రక వారసత్వానికి చిహ్నంగా ఉన్న శాసనమండలి భవనాన్ని అధునాతన వసతులతో తీర్చిదిద్దారు. ఈ భవనంలో అధునాతన, సౌండ్‌ లైటింగ్‌ వ్యవస్థలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మండలిలో 40 మంది సభ్యులు ఉండగా, 50 మంది కూర్చునేలా ఏర్పాట్లు ఉన్నాయి. దీంతోపాటు ముఖ్యమంత్రి, చైర్మన్, డిప్యూటీ చైర్మన్, వైస్‌చైర్మన్, చీఫ్‌ విప్, కార్యదర్శి, మంత్రులు, సభ్యుల కోసం ప్రత్యేక లాంజ్‌లు సిద్ధం చేశారు. భవిష్యత్తు అవసరాలు దృష్టిలో పెట్టుకుని అధునాతన డిజిటల్‌ టెక్నాలజీతో సీటింగ్‌ ఏర్పాట్లు చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement