రంగారెడ్డి జిల్లా: రాజేంద్రనగర్‌లోని ద్రాక్ష పరిశోధన కేంద్రంలోని గ్రేప్ ఫెస్టివల్ శనివారం ప్రారంభమైంది. ప్రజలు నేరుగా తోటల్లోకి వెళ్లి స్వయంగా పరిశీలించి కట్ చేసుకొని కొనుగోలు చేసే సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ హారి్టకల్చర్ వర్సిటీ ప్రాంగణంలోని ద్రాక్ష పరిశోధన కేంద్రంలో ఈ వెసులుబాటు ఉంది.
52 రకాల ద్రాక్ష చెట్ల నుంచి ఇష్టమైన పండ్లు కోసుకోవచ్చు. ప్రతి రోజు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఈ క్షేత్రానికి సందర్శకులు రావచ్చని నిర్వాహకులు వెల్లడించారు. రకాన్ని బట్టి రూ.250 నుంచి 700 ధర నిర్ణయించారు. కార్యక్రమంలో పరిశోధన కేంద్రం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


