ప్లాస్టిక్ ఆధార్ అవసరం లేదు | smart aadhar cards is better, says central government | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్ ఆధార్ అవసరం లేదు

Apr 14 2016 3:42 AM | Updated on Sep 18 2018 6:38 PM

ప్లాస్టిక్ కార్డు మీద ఆధార్ ముద్రణ, స్మార్ట్ ఆధార్ కార్డుల పేరిట కొందరు ప్రైవేటు వ్యక్తులు చేస్తున్న ప్రచారం మోసపూరితమని, ఇలాంటి వారి మాటలు నమ్మి

సాధారణ కాగితంపై ఉంటే సరిపోతుంది: కేంద్రం
సాక్షి, హైదరాబాద్: ప్లాస్టిక్ కార్డు మీద ఆధార్ ముద్రణ, స్మార్ట్ ఆధార్ కార్డుల పేరిట కొందరు ప్రైవేటు వ్యక్తులు చేస్తున్న ప్రచారం మోసపూరితమని, ఇలాంటి వారి మాటలు నమ్మి వ్యక్తిగత సమాచారం ఇవ్వొద్దని ప్రజలను కేంద్రం హెచ్చరించింది. ఆధార్ లేఖ/కత్తిరించిన భాగం/సాధారణ కాగితంపై డౌన్‌లోడ్ చేసుకున్న ఆధార్ వివరాలు సమగ్రంగా ఉంటే చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేసింది. ప్లాస్టిక్ ఆధార్ కార్డులు, స్మార్ట్ ఆధార్ పేరుతో ప్రజల నుంచి రూ.50 నుంచి రూ.200ల వరకు వసూలు చేస్తున్న వారితో కేంద్రానికి సంబంధం లేదని పేర్కొంది.

స్మార్ట్ ఆధార్ అంటూ ఏదీ లేదని యూఐడీఏఐ మిషన్ డెరైక్టర్ అజయ్ భూషణ్ పాండే బుధవారం ఓ ప్రకటనలో చెప్పారు. ఆధార్ కార్డు పోగొట్టుకున్న వారు https://eaadhaar.uidai.gov.in/ వెబ్‌సైట్ నుంచి ప్రింట్ తీసుకోవచ్చని తెలిపారు. ప్లాస్టిక్ ఆధార్‌కార్డులు, లామినేషన్ చేయడం వంటివి అవసరం లేదన్నారు. ప్లాస్టిక్ కార్డుపై ఆధార్, లామినేటెడ్ ఆధార్ కార్డును అధికారిక ఆధార్ కేంద్రాల నుంచి రూ.30 కంటే తక్కువ ధరకు పొందవచ్చని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement