ఆధార్ కార్డును ప్రతీచోటుకి తీసుకెళ్లడం బహుశా కష్టం అవ్వొచ్చు లేదా మర్చిపోవచ్చు. దీనిని దృష్టిలో ఉంచుకుని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కొత్త ఆధార్ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఇది గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ స్టోర్ వంటివాటితో అందుబాటులో ఉంది. ఈ విషయాన్ని ఉడాయ్ తన ఎక్స్ ఖాతాలో అధికారికంగా వెల్లడించింది. పేపర్‌లెస్ ఎక్స్‌పీరియన్స్ పొందటానికి ఈ యాప్ ఉపయోగపడుతుందని పేర్కొంది.
ఆధార్ వినియోగాన్ని మరింత సురక్షితం చేయడానికి ఉడాయ్ ఈ కొత్త యాప్ తీసుకొచ్చింది. ఈ యాప్ ఉంటే.. ప్రత్యేకంగా పిజికల్ ఆధార్ కార్డును వెంటపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఉడాయ్ ఎంఆధార్ పేరుతో ఒక యాప్ పరిచయం చేసింది. ఇప్పుడు తాజాగా.. ఈ కొత్త యాప్ ప్రవేశపెట్టింది. ఇది మీ ఆధార్ వివరాలను భద్రపరచుకోవడానికి, దానిని ఇతరులతో పంచుకోవడానికి ఉపయోగపడుతుంది.
ఎలా ఉపయోగించాలంటే?
యాపిల్ యూజర్లు యాపిల్ స్టోర్ నుంచి, ఆండ్రాయిడ్ యూజర్లు ప్లేస్టోర్ నుంచి ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న తరువాత.. అవసరమైన టర్మ్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయాలి.
ఇప్పటికే ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.
మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ పూర్తయిన తరువాత.. పేస్ అథంటికేషన్ చేయాల్సి ఉంటుంది.
అవసరమైన వివరాలు అన్నీ ఎంటర్ చేసాక, ఒక సెక్యూరిటీ పిన్ సెట్ చేసుకోవాలి. ఈ తరువాత యాప్ ఉపయోగించుకోవచ్చు.
Experience a smarter way to carry your digital identity!
The new Aadhaar App offers enhanced security, easy access, and a completely paperless experience — anytime, anywhere.
Download now!
Android: https://t.co/f6QEuG8cs0
iOS: https://t.co/RUuBvLwvsQ#Aadhaar #UIDAI… pic.twitter.com/gOwI6jH6Lu— Aadhaar (@UIDAI) November 9, 2025


