ఆధార్‌ను పాన్ కార్డుతో లింక్ చేయడానికి చివరి తేదీ దగ్గర పడుతుండటంతో, ప్రజలు రెండు గుర్తింపు కార్డులను లింక్ చేయడానికి తొందరపడుతున్నారు. 2025 డిసెంబర్ 31లోపు తమ పాన్ & ఆధార్ కార్డులను లింక్ చేయని వారికి రూ.1000 ఆలస్య రుసుము విధించనున్నారు.
ఆధార్‌తో పాన్ కార్డులు లింక్ చేసుకోనివారు.. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్‌ను ఫైల్ చేయలేరు. ట్యాక్స్ రిఫండ్‌ను అందుకోలేరు. అలాగే ఇతర బ్యాంకింగ్, షేర్ మార్కెట్ ట్రేడింగ్, ఇతర ఆర్థిక కార్యకలాపాల్లోనూ ఇబ్బందులు తప్పవు. పన్ను ఎగవేతలను.. అక్రమాలను అరికట్టడానికి ఆధార్, పాన్ కార్డులను లింక్ చేసుకోవాలని ప్రభుత్వం ఎప్పుడో నిబంధన తెచ్చింది. కాబట్టి అందరూ తమ పాన్, ఆధార్ కార్డులను తప్పకుండా లింక్ చేసుకోవాలి.
ఆన్‌లైన్‌లో పాన్-ఆధార్ లింక్ చేసుకోవడం ఎలా
అధికారిక ఇన్‌కమ్ ట్యాక్స్ ఈ-ఫైలింగ్ వెబ్ సైట్ ఓపెన్ చేయండి.
"లింక్ ఆధార్"పై క్లిక్ చేసి మీ పాన్, ఆధార్ నంబర్, మొబైల్ నంబరును నమోదు చేయండి.
ఇప్పుడు మీ ఫోన్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి వివరాలను వెరిఫై చేయండి.
లింకింగ్ పూర్తయిందో లేదో తెలుసుకోవడానికి, వెబ్‌సైట్లో ‘క్విక్ లింక్స్’కు వెళ్లి ఆధార్ స్టేటస్ లింక్‌పై క్లిక్ చేయండి.


