ఆధార్‌ లేకుంటే ఆస్పత్రికి తరలించరా? | The High Court questioned the government | Sakshi
Sakshi News home page

ఆధార్‌ లేకుంటే ఆస్పత్రికి తరలించరా?

Feb 6 2026 4:19 AM | Updated on Feb 6 2026 4:19 AM

The High Court questioned the government

ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు 

సాక్షి, హైదరాబాద్‌: అత్యవసర వైద్య సాయం అవసరమైన వ్యక్తిని సమీప ఆసుపత్రికి తరలించడానికి ఆధార్‌ కార్డు తప్పనిసరా అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రెండు వారాల్లోగా కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయా లని ప్రతివాదులను ఆదేశించింది. తదుపరి విచా రణ 3 వారాలకు వాయిదా వేసింది. రాష్ట్రంలో అత్యవసర వైద్య సేవల్లోనూ తీవ్రమైన లోపాలు ఉన్నాయంటూ హైదరాబాద్‌కు చెందిన కె.రాజు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. 

ఆధార్‌ కార్డు లేకపోవడంతో 108 సిబ్బంది సేవలకు నిరాకరించిన ఘటనను ప్రస్తావించారు. స్థిరమైన చిరునామా లేకుండా సంచార జీవనం కొనసాగించే బుడగజంగం కమ్యూనిటీకి చెందిన వారికి తగినంత ఆశ్ర యం, మనుగడ కోసం భూమి, జీవనోపాధి అవకాశాలు, సామాజిక భద్రతా పెన్షన్లు వంటి సాయాన్ని అందించడంలో జిల్లా అధికారులు విఫలమవడం చట్టవిరుద్ధమన్నారు. ఈ పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేష్‌ కుమార్‌ సింగ్, జస్టిస్‌ మొహియుద్దీన్‌ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. 

చట్టంలో అలా ఉందా?
పిటిషనర్‌ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘2024, డిసెంబర్‌లో బుడగ జంగం వర్గానికి చెందిన ఓ బాలిక ప్రమాదానికి గురైంది. ఆధార్‌ కార్డు లేనందున 108 అంబులెన్స్‌లో తరలించేందుకు సిబ్బంది నిరాకరించారు. ఎలాంటి పత్రాలతో సంబంధం లేకుండా అందరికీ సకా లంలో అత్యవసర వైద్య సేవలు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారు లను ఆదేశించాలి’ అని కోరారు. 

ఈ సందర్భంగా ప్రమా దానికి గురైన వ్యక్తిని అంబులెన్స్‌లో తరలించడానికి ఆధార్‌ కార్డు తప్పనిసరా అని ధర్మా సనం ప్రశ్నించింది. ‘రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తి లేదా ఏదైనా వైద్య అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటున్న వ్యక్తి వద్ద ఆధార్‌ కార్డు లేకపో తే, అత్యవసర సేవ ప్రయోజనం లభించదా? ఆధార్‌ చూపించే వరకు ఆ వ్యక్తిని సమీప ఆసుపత్రికి తరలించరా? చట్టంలో అలా ఉందా?’ అని అడిగింది. 

ఆధార్‌ కార్డు లేకపో యి నా రోగులకు చికిత్స అందిస్తున్నా మని ఏజీపీ బదులిచ్చారు. సమస్య చికిత్స గురించి కాదని, అత్యవసర పరిస్థితుల్లోని వ్యక్తులను వారి పత్రాలపై పట్టుబట్టకుండా సమీప ఆసుప త్రికి తరలించడంపై అని ధర్మాసనం పేర్కొంది. 

Advertisement
 
Advertisement
Advertisement