షీల్డ్ 2.0 కాన్‌క్లేవ్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు
సాక్షి, హైదరాబాద్ : పాలన, ప్రజా సేవలు ,కీలక మౌలిక సదుపాయాలపై ప్రభావం చూపే సైబర్ ప్రమాదాలను ఎదుర్కోవడానికి బలమైన విధానపరమైన సమన్వయం, పరిపాలనా సంసిద్ధత, శాఖల మధ్య సమన్వయం అవసరమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు అన్నారు. ప్రభుత్వ పరిపాలనలోని అన్ని స్థాయిలలో సైబర్ భద్రతను అంతర్భాగం చేయాలని ఆయన సూచించారు. సైబర్ నేరాల నివారణ, దర్యాప్తు, బాధితులకు సహాయం అందించడమే లక్ష్యంగా తెలంగాణ సైబర్ సెక్యురిటీ బ్యూరో ఆధ్వర్యంలో షీల్డ్–2026 నిర్వహించారు.
గురువారం బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డితో పాటు కేంద్ర, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు, పరిశ్ర మల ప్రతినిధులు, సైబర్ భద్రత నిపుణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎస్ రామకృష్ణారావు మాట్లాడుతూ, మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా పోలీసింగ్‌లోను మార్పులు వస్తున్నా యన్నారు.
గతంలో ఫిజికల్ పోలీసింగ్ నిర్వహించేవారని.. ప్రస్తుతం పూర్తిగా టెక్నాలజీ ఆధారిత వర్చువల్ పోలీసింగ్ నిర్వహిస్తున్నా రన్నారు. డీజీపీ బి.శివధర్ రెడ్డి మాట్లాడుతూ, వేగంగా మారుతున్న సైబర్ నేర విధానాలు, పెరుగుతున్న కేసుల సంఖ్య లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు పెద్ద సవాలుగా మారాయని చెప్పారు. ఆధునిక సాంకేతికత, ప్రత్యేక శిక్షణ, అంతర్జాతీయ సహకారం అత్యవసరమని పేర్కొ న్నారు.
టీజీ సీఎస్‌బీ డైరెక్టర్ శిఖా గోయెల్ మాట్లాడుతూ, పరిశ్రమలు, విద్యా సంస్థలతో కలిసి భవిష్యత్‌కు సిద్ధమైన సైబర్ భద్రతా వ్యవస్థ ను నిర్మించడమే టీజీ సీఎస్‌బీ లక్ష్యమని తెలిపా రు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం కీలక డిజిటల్ కార్య క్రమాలను ప్రారంభించింది. షీల్డ్– 2026లో ప్రధాన ఆకర్షణగా నిలిచిన టెక్నాలజీ ఎక్స్‌పీరియన్స్ జోన్‌లో రోబోటిక్ డాగ్స్, హ్యూమ నాయిడ్ రోబోలు, డ్రోన్లు, కౌంటర్– డ్రోన్ టెక్నాలజీలు, ఏఐ ఆధారిత భద్రతా పరిష్కారా లను ప్రద ర్శించారు.
బృంద చర్చలో పాల్గొన్న సినీ హీరో నాని మాట్లాడుతూ, ఉచి తంగా వస్తుందికదా అని పైరసీలో సినిమాలు చూడడం వల్ల ఇండస్ట్రీకి నష్టం అన్న విషయం ప్రేక్షకులు గుర్తించాలని, పైరసీలో సినిమాలు చూడడం కూడా దొంగతనం కిందకే వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. జాతీయ స్థాయి సైబర్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ‘సైఫర్ స్ప్రింట్‌కు దేశవ్యాప్తంగా 500కు పైగా బృందాలు దరఖాస్తు చేసుకోగా, 17 ఫైనలిస్ట్ బృందాలు తమ పరిష్కారాలను ప్రదర్శించాయి. విజేతలకు రూ. 5 లక్షల గ్రాంట్‌తో పాటు టీజీసీఎస్‌బీతో కలిసి పని చేసే అవకాశం కల్పించారు.


