ఓయూ ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు పరీక్ష 22న | OU MBA and MCA Entrance Exams on February 22nd | Sakshi
Sakshi News home page

ఓయూ ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు పరీక్ష 22న

Feb 6 2026 1:54 AM | Updated on Feb 6 2026 1:54 AM

OU MBA and MCA Entrance Exams on February 22nd

ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ దూరవిద్య ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2025–26 విద్యా సంవత్సరానికి రెండో విడత ప్రవేశాలకు ఈ నెల 22న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు పీజీ అడ్మిషన్స్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ పాండురంగా రెడ్డి గురువారం తెలిపారు.

ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 18, రూ.500 అపరాధ రుసుముతో 21 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవాలన్నారు. టీజీ ఐసెట్‌–2025 అర్హత గల విద్యార్థులకు నేరుగా ప్రవేశాలు కల్పించనున్నారు. పూర్తి వివరాలకు ఉస్మానియా వెబ్‌సైట్‌ చూడాలని సూచించారు.   

Advertisement
 
Advertisement
Advertisement