ఎంపీగా సిగ్గుతో తలదించుకుంటున్నా | MP Etela Rajender Over Protest On Double Bed Room House | Sakshi
Sakshi News home page

ఎంపీగా సిగ్గుతో తలదించుకుంటున్నా

Feb 6 2026 1:34 AM | Updated on Feb 6 2026 1:34 AM

MP Etela Rajender Over Protest On Double Bed Room House

ధర్నాలో మాట్లాడుతున్న ఎంపీ ఈటల రాజేందర్‌

నా 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత దిక్కుమాలిన పరిస్థితి ఎప్పుడూ చూడలేదు 

మారేడుపల్లి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల సముదాయం వద్ద ధర్నాలో ఎంపీ ఈటల

సాక్షి, హైదరాబాద్‌ / కంటోన్మెంట్‌: ప్రజల కు మాటి చ్చి.. ఏడాది న్నరగా చేయలేకపో యినందుకు ఎంపీగా సిగ్గుతో తలదించు కుంటున్నా.. అంటూ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మారేడు పల్లిలో నిర్మాణం పూర్తయిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వా లంటూ స్థానిక కార్పొ రేటర్‌ కొంతం దీపిక చేపట్టిన దీక్షకు ఆయన హాజరై మాట్లాడారు. మారేడు పల్లిలోని హౌసింగ్‌ బోర్డు స్థలంలో ఎనిమిదేళ్ల క్రితం ఇళ్లు కూల్చేసి, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు చేపట్టారన్నారు. 2022లో సుమారు 250 మందికి ఇళ్లు కేటాయించినా, మరో 150 మందికి ఇప్పటికీ ఇళ్లు ఇవ్వకపోవడం దారుణమన్నారు.

డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఎవరి జాగీరు కాద ని, ఈ విషయంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని నిందించిన కాంగ్రెస్‌ నేతలు, వారు అధికారంలోకి వచ్చి ఒరగబెట్టిందేంటని నిలదీశారు. ఈ అంశంపై ఏడాదిన్నరగా తాను ప్రయ త్నాలు చేస్తున్నా ఈ ప్రభుత్వంలో చలనం లేద న్నారు. అధికారులకు సైతం ఎంపీ అన్నా లెక్కలేకుండా పోయిందన్నారు. గత డిసెంబర్‌లో కలెక్టరేట్‌ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో తాను స్వయంగా పాల్గొన్నానని గుర్తు చేశారు. జనవరి ఒకటో వారంలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను లబ్ధిదారు లకు ఇస్తామని అధికారులు హామీ ఇచ్చినా, నేటికీ పని పూర్తికాలేదన్నారు. ఇన్‌చార్జ్‌ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే శ్రీగణేశ్‌లతో పదేపదే మాట్లాడినా ఎలాంటి స్పందన లేదన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement