రేవంత్‌ సర్టిఫికెట్‌ను వెనక్కి తీసుకోండి | BRS leader RS Praveen Kumar has written to Harvard University | Sakshi
Sakshi News home page

రేవంత్‌ సర్టిఫికెట్‌ను వెనక్కి తీసుకోండి

Feb 6 2026 1:16 AM | Updated on Feb 6 2026 1:16 AM

BRS leader RS Praveen Kumar has written to Harvard University

హార్వర్డ్‌ యూనివర్సిటీకి బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ లేఖ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి నాయకత్వ కోర్సులో ఇచ్చిన సర్టిఫికెట్‌ను వెనక్కి తీసుకో వాలని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ హార్వర్డ్‌ యూనివర్సిటీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన హార్వర్డ్‌ వర్సిటీ అధ్యక్షుడు అలన్‌ గార్బర్, డీన్‌ వెయిన్‌స్టీన్‌కు గురువారం ఈ–మెయిల్‌ పంపించారు. దేశంలో రేవంత్‌ మినహా ఏ ఇతర ముఖ్యమంత్రిపైనా 89 క్రిమినల్‌ కేసులు లేవన్నారు. ఓటుకు నోటు కేసులో ఏసీబీకి పట్టుబడి సుమారు 50 రోజులు రేవంత్‌ జైలులో గడిపిన విషయాన్ని అందులో ప్రస్తావించారు.

‘సీఎంగా కుల, మత విభజనలపై ఆధార పడి రాజకీయాలు చేస్తూ, ప్రత్యర్థులు, వారి కుటుంబ సభ్యులపై అనుచితమైన, అసభ్యకరమైన వ్యా ఖ్యలు చేస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు తప్పుడు కేసులను ఆయుధాలుగా వినియోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 400 సంవత్సరాలుగా నైతికత కలిగిన నాయకు లను తయారు చేస్తోందని చెప్పుకునే హార్వర్డ్‌ కెన్నెడీ స్కూల్, ఇంత వివాదాస్పదమైన నేపథ్యం ఉన్న రాజకీయ నాయకుడికి సర్టిఫికెట్‌ ఇవ్వడం ఎలా సాధ్యమైంది.

రేవంత్‌రెడ్డికి ఈ కోర్సులో ప్రవేశం కల్పించే సమయంలో ఎలాంటి నేపథ్య పరిశీలన జరగనట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఫీజుల కోసం వివాదాస్పద వ్యక్తులకు ఎగ్జిక్యూటివ్‌ కోర్సులను ‘‘అమ్ముకుంటూ’’, ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఈ స్థాయికి దిగజారడం నాకు సిగ్గుగా అనిపిస్తోంది. రేవంత్‌రెడ్డికి ఇచ్చిన నాయకత్వ కోర్సు సర్టిఫికెట్‌ను తక్షణమే రద్దు చేయాలని నేను డిమాండ్‌ చేస్తున్నాను’ అని ప్రవీణ్‌కుమార్‌ తన మెయిల్‌లో పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement