ఒక కంపెనీ అధిపతి క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఏకంగా 2 వేల కోట్ల రూపాయలను బోనస్‌ను ప్రకటించారు. దీంతో సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బవ్వడం ఉద్యోగుల వంతైంది. సోషల్ మీడియాలో ఎన్నో ప్రశంసలందుకున్నారు. ఎవరా అధిపతి, ఏమా కథ నిజ జీవితంలో శాంతా క్లాజ్ గురించి తెలుసుకుందాం పదండి
వాల్ స్ట్రీట్ జర్నల్‌లోని ఒక నివేదిక ప్రకారంతన కుటుంబ కంపెనీ అమ్మకం తర్వాత ఒక వ్యాపార యజమాని తన కార్మికులకు లక్షలాది బోనస్‌లను బహుమతిగా ఇచ్చాడు. ఫైబర్‌బాండ్ సంస్థ (Fibrebond) సీఈవో 46 ఏళ్ల గ్రాహమ్ వాకర్ 540 మంది ఉద్యోగులకు సుమారు రూ.2,155 కోట్లు బోనస్ పంపిణీ చేశారు.ఈ సంవత్సరం ప్రారంభంలో తన కంపెనీని ఈటన్ కార్పొరేషన్‌కు (రూ.15,265 కోట్లు) విక్రయించాడు. అయితే ఉద్యోగుల కోసం ఆదాయంలో 15 శాతం కేటాయించే వరకు వాకర్ తన కంపెనీని విక్రయించడానికి అంగీకరించలేదు. ఈ కొనుగోలు ఒప్పందం ప్రకారం రానున్న ఐదేళ్ల కాలంలో ఆ సిబ్బంది ఒక్కొక్కరికీ సుమారు రూ.4 కోట్ల మేర అందుతుంది. ఉద్యోగులలో ఎవరికీ స్టాక్ లేనప్పటికీ దానిలో కొంత భాగాన్ని ఇవ్వాలను నిర్ణయించాడు. అతని దాతృత్వం విశేష ప్రశంసలను దక్కించుకుంది.ఫైబర్‌బాండ్ ఎలక్ట్రికల్ పరికరాల కోసం ఎన్‌క్లోజర్‌లను తయారు చేసే కంపెనీ.
ఫైబర్‌బాండ్
ఫైబర్‌బాండ్‌ను 1982లో వాకర్ తండ్రి క్లాడ్ వాకర్, మరో 11 మందితో కలిసి ప్రారంభించారు.1998లో ఫ్యాక్టరీ కాలిపోవడం నుండి డాట్-కామ్ బబుల్ సంక్షోభం వరకు, ఫైబర్‌బాండ్ ఉద్యోగులు ఒడిదుడుకులను ఎదుర్కొని విధేయతతో మనుగడ సాగించగలిగింది. 2020లో క్లౌడ్ కంప్యూటింగ్ కోసం డిమాండ్ పెరగడంతో 150 డాలర్లు మిలియన్ల పెట్టుబడి ఫలించింది.ఐదు సంవత్సరాలలో అమ్మకాలు దాదాపు 400శాతం పెరిగాయి.
వ్యాపారం దాదాపుగా కుప్పకూలినప్పటికీ, వ్యాపారాన్నికొనసాగించడానికి ఉద్యోగులుదశాబ్దాలుగా పని చేశారని, వారి అంకితభావానికి గుర్తింపు లభించకపోతే, వారికి ప్రతిఫలం లభించకపోతే చాలా మంది వెళ్లిపోతారని తాను నమ్ముతున్నానని వాకర్ ది జర్నల్‌తో వాకర్ వ్యాఖ్యానించారు.
ఆశ్చర్యపోయిన ఉద్యోగులు
బోనస్ అందించిన రోజు ఉద్యోగులు కొంతమంది దీన్ని నమ్మలేకపోయారు. మరికొందరు ఇదేదో జోకేమో అనుకున్నారట. తీరా అసలు విషయం వారి ఆనందానికి అవధుల్లేవు. ఉద్వేగానికి గురయ్యారు. కొందరు ఆ డబ్బును అప్పు తీర్చడానికి, కార్లు కొనడానికి, కాలేజీ ట్యూషన్ ఫీజు చెల్లించడానికి లేదా పదవీ విరమణ కోసం ఆదా చేయడానికి ఉపయోగించారు.
ఉద్యోగినులలో ఒకరైన లెసియా కీ ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. 1995లో 21 సంవత్సరాల వయస్సులో ఫైబర్‌బాండ్‌లో ఆమె కరియర్ ఆరంభమైంది. అప్పుడు ఆమె జీతం 5.35 డాలర్లు మాత్రమే. క్రమంగా ఉన్నత పదవులకు ఎగబాకింది. ఈ ఏడాది నాటికి, 18 మంది వ్యక్తుల బృందానికి నాయకత్వం వహించింది , 254 ఎకరాలలో కంపెనీ సౌకర్యాలను నిర్వహించేలా కృషి చేశారు.
'క్యారెక్టర్ ఆఫ్ మ్యాన్'
బోనస్‌ల వార్తలు వైరల్ కావడంతో, సోషల్ మీడియాలో వాకర్ , దాతృత్వాన్ని, ఉద్యోగుల పట్ల అతన ప్రేమను కొనియాడారు నెటిజన్లు. వావ్, నిజంగా దయగల, ఉదారమైన వ్యక్తి, అద్భుతం అంటూ ఆయనకు అభినందనలు తెలిపారు.


