'ఎప్‌స్టీన్ ఫైల్స్' ఎఫెక్ట్.. బ్రిటన్‌ తదుపరి ప్రధానిగా ముస్లిం మహిళ? | Shabana Mohammed May Be United Kingdom First Muslim President | Sakshi
Sakshi News home page

Shabana Mohammed: పాక్ మూలాలున్న ఆమె.. యూకే ప్రధాని అవుతారా?

Feb 10 2026 1:18 AM | Updated on Feb 10 2026 1:21 AM

Shabana Mohammed May Be United Kingdom First Muslim President

ఎప్‌స్టీన్ ఫైల్స్ ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన కొన్ని అంశాలు.. యూకేలో రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తద్వారా అధికార సమీకరణాల్లో పలు గణనీయమైన మార్పులు రాబోతున్నట్లు తెలుస్తోంది. బ్రిటీష్ ప్రధానమంత్రి పదవికి కియర్ స్టార్మర్ రాజీనామా చేసే అవకాశముందని అంచనా. దీంతో ఆయన స్థానంలో ఓ ముస్లిం మహిళ.. ప్రధానిగా బాధ్యతలు చేపట్టే ఛాన్స్ ఉందని మాట్లాడుకుంటున్నారు.

ప్రస్తుతం కియర్ స్టార్మర్‌పై వ్యక్తిగతంగా ఎలాంటి ఆరోపణలు లేవు. కాకపోతే ఈయనతో సన్నిహిత సంబంధాలున్న కొందరు నేతలకు ఎప్‌స్టీన్‌తో సంబంధాలు ఉన్నట్లు బయటపడిన దగ్గర నుంచే స్టార్మర్ రాజీనామా డిమాండ్స్ తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలోనే ఎంపీ షబానా మహమ్మద్.. తదుపతి బ్రిటీష్ ప్రధాని అయ్యే అవకాశముందంటున్నారు. ఈమె ప్రస్తుతం.. యూకే హోంశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఒకవేళ ఈమె ప్రధాని అయితే.. ఈ ఘనత సాధించిన తొలి ముస్లిం మహిళగా నిలుస్తారు.

షబానా మహమ్మద్ ఎవరు?
45 ఏళ్ల షబానా.. స్వతహాగా న్యాయవాది. తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. ఈమె తల్లిదండ్రులు జుబైదా, మహమ్మద్ అహ్మద్‌కి పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని మీర్పూర్‌లో మూలాలున్నాయి. బర్మింగ్‌హామ్‌లో షబానా పుట్టింది. 2002లో ఆక్స్‌ఫర్డ్‌లోని లింకన్‌ కాలేజీ నుంచి లాయర్ పట్టా అందుకున్నారు. తర్వాత ఇన్స్‌ ఆఫ్‌ కోర్టు స్కూలు ఆఫ్‌ లాలో బార్‌ వొకేషనల్‌ కోర్సు పూర్తి చేసి బారిస్టర్‌ కూడా అయ్యారు. 2010లో యూకేలో తొలిసారి ఎంపీలుగా గెలుపొందిన ముస్లిం మహిళలైన రుషానానా అలీ, యాస్మిన్‌ ఖురేషీలలో ఒకరిగా నిలిచారు.

కియర్ స్టార్మర్ కేబినెట్‌లో షబానా ప్రస్తుతం హోంశాఖ చూసుకుంటున్నారు. పార్టీలో మంచి వక్తగా పేరు సొంతం చేసుకున్నారు. లేబర్ పార్టీ నిర్ణయిస్తే ఈమె.. తదుపతి యూకే ప్రధానమంత్రి అయ్యే అవకాశముంది. అయితే స్టార్మర్ రాజీనామా డిమాండ్స్ దృష్ట్యా షబానా చేసిన ట్వీట్ ఆసక్తికరంగా అనిపిస్తోంది.

'బ్రిటిష్ ప్రజలు.. 18 నెలల క్రితమే ప్రధానమంత్రికి ఐదు సంవత్సరాల పాలించే అధికారం అప్పగించారు. లేబర్ ప్రభుత్వాలు తరచూ ఏర్పడవు. అలాంటి ప్రభుత్వంలో సేవ చేయడం ఒక గౌరవం, ఒక్క క్షణం కూడా వృథా చేయకూడదు. ప్రధాన మంత్రికి నా పూర్తి మద్దతు ఉంది. దేశాన్ని మెరుగైన దిశలో మార్చేందుకు ముందుకు సాగుదాం' అని షబానా.. ట్విటర్‌లో రాసుకొచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement