‘ప్లాస్టిక్‌’ పరిష్కారం ఇదే!

International Plastic Bag Free Day 2021 - Sakshi

ప్లాస్టిక్‌కి సరైన ప్రత్యామ్నాయం ఏదీ

కార్పొరేట్‌ కంపెనీలపైనే బాధ్యత

వెబ్‌డెస్క్‌: న్యూ క్లియర్‌ వెపన్స్‌, గ్లోబల్‌ వార్మింగ్‌ స్థాయిలో ప్రపంచాన్ని భయపెడుతున్న మరో పెద్ద అంశం ప్లాస్టిక్‌. పర్యావరణ సమతుల్యత ప్లాస్టిక్‌ బ్యాగ్‌లతో దెబ్బతింటోంది. ముఖ్యంగా జంతువులు, పక్షులు ప్లాస్టిక్‌ కారణంగా తీవ్రంగా నష్టపోతున్నాయి. దీంతో ప్లాస్టిక్‌పై అవగాహన కల్పించేందుకు జులై 3న ఇంటర్నేషనల్‌ ప్లాస్టిక్‌ డేని నిర్వహిస్తున్నారు. 

ప్లాస్టిక్‌.. ప్రమాదాలు
నిత్య జీవితంలో ప్లాస్టిక్‌ వాడకం తప్పనిసరి అవసరంగా మారింది. అయితే​​​ ​ ప్లాస్టిక్‌తో ఉన్న అతి పెద్ద ప్రమాదం వాటి మన్నిక ​కాలం. ప్లాస్టిక్‌ బ్యాగులు సహజ పద్దతిలో తిరిగి భూమిలో కలిసి పోవాలంటే 100 నుంచి 500 ఏళ్ల సమయం పడుతుంది. అప్పటి వరకు అది భూమి మీద అలాగే ఉంటుంది. అంతేకాదు ప్లాస్టిక్‌ వ్యర్థాల కారణంగా నాలాలు మూసుకుపోయి... వరదలకు కూడా కారణం అవుతోంది. 

ప్రమాదంలో పశువుల ప్రాణాలు
పెద్దపెద్ద నగరాలన్నీ సముద్ర తీరాల చుట్టే వెలిశాయి. ఈ నగరాల్లో ఉత్పత్తి అవుతున్న చెత్త కారణంగా సముద్ర జీవుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి. ఇక పల్లె నుంచి మెట్రో సిటీ వరకు చెత్త కుప్పల్లో పేరుకు పోతున​ ప్లాస్టిక్‌ని తిని పశువులు మృత్యువాత పడుతున్నాయి. 

మొదట యూరప్‌లో
ప్లాస్టిక్‌ బ్యాగులకు బదులు ఏకో ఫ్రెండ్లీ బ్యాగులు వాడాలనే ప్రచారం మొదట యూరప్‌లో మొదలైంది. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఇతర దేశాల్లోనూ ప్లాస్టిక్‌ వ్యతిరేక ఉద్యమాలు, ప్రచారాలు, అవగాహన కార్యక్రమాలు మొదలయ్యాయి. 

‘ఏకో’ ధర తగ్గాలి

ఎకో ఫ్రెండ్లీ బ్యాగులు వాడాలంటూ భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నా... క్షేత్రస్థాయిలో ఫలితాలు ఆశించిన స్థాయిలో రావడం లేదు. ప్రస్తుతం మార్కెట్‌లో ఏకో ఫ్రెండ్లీ బ్యాగులు ఉన్నా .. వాటి ఖరీదు ఎక్కువగా ఉండటంతో చాలా మంది తిరిగి ప్లాస్టిక్‌ బ్యాగుల వైపుకే మొగ్గు చూపుతున్నారు.

కార్పొరేట్‌ బాధ్యత
ప్లాస్టిక్‌ వాడకం తగ్గించడంపై మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉంది. స్టార్టప్‌లు ఈ దిశగా పని చేయాల్సి ఉంది. కార్పొరేట్‌ కంపెనీలు, భారీ వాణిజ్య సంస్థలు తమ వంతు బాధ్యతగా ప్లాస్టిక్‌ పరిశోధనలకు దన్నుగా నిలవాల్సిన సమయం వచ్చింది. వ్యాపారంలో కోట్లు గడిస్తున్న సంస్థలు ఇప్పటి వరకు ప్లాస్టిక్‌ నివారణపై పెద్దగా దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. బడా సంస్థలు ప్లాస్టిక్‌పై దృష్టి సారించి... నూతన ఆవిష్కరణలకు ఊతం ఇస్తే మార్పులు త్వరగా వచ్చేందుకు ఆస్కారం ఉంది. అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం మన్నిక ఉండేలా ఏకో ఫ్రెండ్లీ బ్యాగులు మార్కెట్‌లోకి తేవడం‍ ద్వారా ప్లాస్టిక్‌ ఉపయోగాన్ని తగ్గించవచ్చు.

చదవండి : అంతరిక్షంలో అద్భుతం.. తొలిసారిగా

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top