అంతరిక్షంలో అద్భుతం.. తొలిసారిగా

Astrophysicists Detect Black Hole Neutron Star Mergers For The First Time - Sakshi

వాషింగ్టన్: రోదసిలో అంతుచిక్కని దృగ్విషయాలు  ఎన్నో జరుగుతుంటాయి. అంతుచిక్కని రహస్యాలను ఛేదించడానికి మానవుడు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. తాజాగా పరిశోధకులు అంతరిక్షం లో జరిగిన దృగ్విషయాన్ని  తొలిసారిగా గుర్తించారు. రోదసిలో న్యూట్రాన్ స్టార్, బ్లాక్ హోల్ ఢీ కొట్టుకున్నాయి. ఈ సంఘటన సుమారు 900 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో  జరిగింది. న్యూట్రాన్ స్టార్ , బ్లాక్ హోల్ ఢీ కొట్టుకోవడాన్ని పరిశోధకులు తొలిసారిగా గమనించారు. 

జూన్ 5 2020 నుంచి జూన్ 15 2020 మధ్యలో ఏకంగా సుమారు పది సార్లు ఢీ కొట్టుకున్నాయని నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. న్యూట్రాన్ స్టార్, బ్లాక్ హోల్ ఢీ కొట్టుకోవడం తో బలమైన గురుత్వాకర్షణ తరంగాలు ఉధ్బవిం చాయని పరిశోధకులు తెలిపారు. ఈ అరుదైన రెండు దృగ్విషయాలు ఢీ కొట్టుకోవడం తో  బైనరీ వ్యవస్థల మూలాలు, అవి ఎంత తరచుగా విలీనం అవుతాయనే విషయాలను తెలుసుకోవడంలో, ఉపయోగ పడతాయని పరిశోధకులు పేర్కొన్నారు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top