సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: టీడీపీ నేత, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి వాహనం బీభత్సం సృష్టించింది. ధర్మవరం మండలం ఎర్రగుంట వద్ద పల్లె రఘునాథరెడ్డి వాహనం బైక్‌ను ఢీ కొట్టింది. దంపతులకు తీవ్రగాయాలు కాగా.. వారిని ఆసుపత్రికి తరలించారు. కనీస మానవత్వం లేకుండా పల్లె రఘునాథరెడ్డి వ్యవహరించారు. క్షతగాత్రులను పట్టించుకోలేదు. దీంతో రఘునాథరెడ్డిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికులపై మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి గన్‌మెన్ల దౌర్జన్యం చేశారు.



