అర్ధరాత్రి వేళ కొందరు యువకులు తమ ద్విచక్రవాహనాలతో హల్చల్ చేస్తున్నారు. వాహనాలపై విచిత్ర విన్యాసాలు..సర్కస్ ఫీట్లు చేస్తూ ఆందోళనకు గురిచేస్తున్నారు. వారు చేసే విన్యాసాల కారణంగా రోడ్లపై వెళ్లే వారు భయపడాల్సి వస్తోంది. ఏదైనా ప్రమాదం జరిగితే వారితో పాటు పక్కన వెళ్లే వాహనచోదకులకు ప్రాణాపాయముప్పు పొంచి ఉంటుంది.
పోలీసులు హెచ్చరికలు చేస్తున్నా కొందరు మారడం లేదు. ఆరాంఘర్ నుంచి శివరాంపల్లి వెళ్లే మార్గంలో నిత్యం ఇటువంటి విన్యాసాలు కనిపిస్తాయి. మూడు రోజుల క్రితం ఓ యువకుడు తన ద్విచక్ర వాహనంపై ఇలా ప్రమాదకర విన్యాసాలు చేయడాన్ని కొందరు తమ సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. వీటిని సోమవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారాయి. - రంగారెడ్డి జిల్లా


