సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి దివాన్ చెరువు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై అడ్డువచ్చిన గేదెను తప్పించబోయి వెనుక వచ్చి మూడు బస్సులు ఢీకొన్నాయి. బస్సులో తెలంగాణ పీఎంసీ మోడల్ స్కూల్‌కి చెందిన 109 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. బస్ డ్రైవర్లకు గాయాలు కావడంతో రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ప్రమాదం నుంచి విద్యార్థులంతా సురక్షితంగా బయటపడ్డారు. కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఈ నెల 17వ తేదీన అరకు వెళ్ళి స్వగ్రామం నల్గొండ జిల్లా దిండికి తిరిగి వస్తుండగా.. ఘటన జరిగింది.



