breaking news
diwan cheruvu
-
రాజమండ్రిలో మూడు బస్సులు ఢీ..
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి దివాన్ చెరువు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై అడ్డువచ్చిన గేదెను తప్పించబోయి వెనుక వచ్చి మూడు బస్సులు ఢీకొన్నాయి. బస్సులో తెలంగాణ పీఎంసీ మోడల్ స్కూల్‌కి చెందిన 109 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. బస్ డ్రైవర్లకు గాయాలు కావడంతో రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.ప్రమాదం నుంచి విద్యార్థులంతా సురక్షితంగా బయటపడ్డారు. కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఈ నెల 17వ తేదీన అరకు వెళ్ళి స్వగ్రామం నల్గొండ జిల్లా దిండికి తిరిగి వస్తుండగా.. ఘటన జరిగింది. -
వోల్వో బస్- లారీ ఢీ: ఒకరి మృతి
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దివాన్ చెరువు వద్ద హౌవేపై శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా ప్రయాణిస్తున్న వోల్వో బస్సు పాలమూరు 4 లేన్ల వంతెనపై ఆగిఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో బస్సులోని ప్రయాణికుడు ఒకరు దుర్మరణం చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు తిరుపతికి చెందిన శ్రీరామ్ ఆదిత్య(18) గా గుర్తించారు. శ్రీరామ్ విశాఖపట్నం గీతం కాలేజీలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న రాడ్డు ఆదిత్య శరీరంలోకి దూసుకెళ్లింది. దీంతో తీవ్రంగా గాయపడిన శ్రీరామ్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ప్రమాదానికి గురైన బస్సు విజయనగరం నుంచి ఒంగోలుకు వెళుతోంది.


