
ప్లాస్టిక్ కంపెనీలో అగ్ని ప్రమాదం
విజయవాడలోని ఓ ప్లాస్టిక్ కంపెనీలో ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది.
భవానీపురం: విజయవాడలోని ఓ ప్లాస్టిక్ కంపెనీలో ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యాధరపురం కబేళారోడ్డులోని ఓ ప్లాస్టిక్ కంపెనీలో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు వ్యాపించాయి.
స్థానికంగా శ్రీనివాసరావు అనే వ్యాపారి ప్లాస్టిక్ వస్తువుల ప్యాకింగ్ చేసి విక్రయిస్తుంటారు. ఆదివారం ఉదయం ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఫైర్ సిబ్బందికు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో శ్రీనివాసరావుకు స్వల్ప గాయాలు, కాగా భవనం కొంతమేర దెబ్బతింది. సుమారు రూ.15 లక్షల మేర నష్టం వాటిల్లిటినట్టు తెలుస్తుంది.