సాక్షి,విజయవాడ: వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు క్వాష్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. అంబటి రాంబాబుపై కేసును క్వాష్ చేయాలని రిమాండ్ చట్ట విరుద్ధమని అంబటి న్యాయవాది కోర్టులో వాదించారు.పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తదిపరి విచారణ ఈనెల 11కు వాయిదా వేసింది.
అంబటి రాంబాబు అరెస్టు
అంతకుముందు అంబటి రాంబాబును పోలీసులు గుంటూరులోని తన నివాసం వద్ద అరెస్టు చేశారు. గత శనివారం రాత్రి గం. 10.30 ప్రాంతంలో అంబటి రాంబాబును అరెస్ట్ చేశారు. ఆయనను నల్లపాడు పీఎస్‌కు తరలించారు. అంబటి రాంబాబు కేసును సమోటోగా తీసుకొని బీఎన్‌ఎస్ 126(2),132, 196(1), 352, 351(2),292 రెడ్‌విత్ 3(5),-BNS సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
హైకోర్టులోఅంబటి సతీమణి హౌస్ మోషన్ పిటిషన్
అరెస్టుపై అంబటి సతీమణి విజయలక్ష్మి హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తనతోపాటు 60 మందిని పోలీసులు అక్రమంగా నిర్భందించారని ఆమె అందులో పేర్కొన్నారు. తనకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని, శాంతి భద్రతల సమస్య ఉందని పిటిషన్‌లో వివరించారు. తనకు 24 గంటలు భద్రత కల్పించాలని, అందుకు అనుగుణంగా తక్షణమే చర్యలు తీసుకోవాలని విజయలక్ష్మి కోరిన విషయం తెలిసిందే.


