రేపు జోగి రమేష్‌ కుటుంబానికి వైఎస్‌ జగన్‌ పరామర్శ | Ys Jagan To Visit Jogi Ramesh Family On February 6th | Sakshi
Sakshi News home page

రేపు జోగి రమేష్‌ కుటుంబానికి వైఎస్‌ జగన్‌ పరామర్శ

Feb 5 2026 1:15 PM | Updated on Feb 5 2026 1:26 PM

Ys Jagan To Visit Jogi Ramesh Family On February 6th

సాక్షి, అమరావతి: టీడీపీ గూండాల చేతిలో దాడికి గురైన మాజీమంత్రి జోగి రమేష్‌ కుటుంబాన్ని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 6న పరామర్శించనున్నారు. ఆ రోజు ఉ.10.30 కు తాడేపల్లి నివాసం నుంచి జగన్‌ ఇబ్రహీంపట్నం బయల్దేరుతారు.

కనకదుర్గ వారధి, ఆర్టీసీ బస్టాండ్, భవానీపురం, గొల్లపూడి, గుంటుపల్లి, తుమ్మలపాలెం మీదుగా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్‌ నివాసానికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శి­స్తారు. వైఎస్‌ జగన్‌ మధ్యాహ్నం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారని పార్టీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement