మూగజీవి వేదన.. కడుపులో 15 కిలోల ప్లాస్టిక్‌

Surgery shows 15 KG Plastic Bags Removed From Cow Stomach Srikakulam - Sakshi

టెక్కలి రూరల్‌: కోటబొమ్మాళి నివాసి తాళాసు కృష్ణకు చెందిన ఆవు కడుపులో 15కిలోల ప్లాస్టిక్‌ సంచులున్నట్లు వై ద్యులు గుర్తించారు. ఆవుకు పరీక్షలు నిర్వహించిన తిలారు పశువైద్యాధికారి డాక్టర్‌ లఖినేని కిరణ్‌కుమార్‌ శుక్రవారం శస్త్రచికిత్స చేసి 15కిలోల ప్లాస్టిక్‌ సంచులు, దారాలు, ప్లాస్టిక్‌ తాళ్లను తొలగించారు. అరుదైన శస్త్రచికిత్స చేసి ఆవును రక్షించిన డాక్టర్‌ను పలువురు అభినందించారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగిస్తున్న వైద్యుడు

దేశీయ పశుజాతులతో లాభాలు 
శ్రీకాకుళం రూరల్‌: దేశీయ పశు జాతులతో అ నేక లాభాలు ఉన్నాయని, వాటిని రైతులు అందుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పశుగణాభివృద్ధి ముఖ్య కార్యనిర్వహణ అధికారి దామోదరనాయుడు పిలుపు నిచ్చారు. మండల పరిధి లోని తండేవలస గ్రామంలో శుక్రవారం జాతీ య కృత్రిమ గర్భోత్పత్తి పథకంలో భాగంగా పుట్టిన దేశీయ పశు దూడలను వారు పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశీయ పశుసంపదలైన గర్, సాహివాల్, రెడ్‌సింధి, పుంగనూరు, ఒంగోలు మొదలైన జాతుల ఆవశ్యకతను, లాభాలను పాడి రైతులకు ఆయన వివరించారు. దేశీయ జాతులు రోగనిరోధక శక్తిని కలిగి ఉంటాయని, పాల ఉత్పత్తి అధికంగా ఉంటుందని, రైతులు వీటిని పెంచేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా స్థానికంగా గల రైతు భరోసా కేంద్రాలను సందర్శించి సిబ్బందికి తగు సూచనలు అందించారు. కార్యక్రమంలో పశుసంవర్దక సంచాలకులు ఎం.కృష్ణ, ఉప సంచాలకులు జగన్నాథం, రాగోలు పశువైద్యాధికారి దిలీప్‌ తండేవలస సర్పంచ్‌ పొన్నాన కూర్మారావు, తదితరులు పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top